17 నవం, 2013

భాగవతమతనికి కవిత్వము గాదు. కనువిప్పు




పోతన శైలి నన్నయ రచనవలె ఋషివాణి.
 ఆ శయ్య ..
 ఆ రచన..
 అతనికే చెల్లింది.
 అంటారు పోతన భాగవతము అనే 
జక్కా సుబ్బరాయుడు గారు ముద్రించిన భాగవతమునకు ముందు మాట వ్రాస్తూ 
పుట్టపర్తి వారు

 పుట్టపర్తి తండ్రి 
పుట్టపర్తి శ్రీనివాసాచార్యులవారు (మా తాత)
తిక్కన భక్తులు. 

ఆయనతోపాటీ కట్టమంచి రామలింగారెడ్డి 
రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ 
ఇలా దాదాపు పది పదిహేను మంది
శ్రీనివాసాచార్యులవారికి 

దాదాపు పదహైదు పర్వాలు నోటికి వచ్చేవి 

అందువలన వచ్చిన ఆశు కవితా ధోరణి
తండ్రి ప్రభావం 

పుట్టపర్తి పై సహజంగా పడింది.
 

ఆరోజుల్లో పదేండ్ల వయసున్న పుట్టపర్తి చదువుతుంటే శ్రీనివాసాచార్యులు పురాణం చెప్పేవారట..
ఇంట్లో  ఎప్పుడూ సాహిత్య గోష్టులూ చర్చలూ
 

తిక్కనపై పుట్టపర్తి కీ ఆరాధన ఏర్పడింది..
తిక్కన శైలిలోనూ పుట్టపర్తి మునకలు వేశాడు



తిక్కనను తప్ప ఎవరినీ ఇష్టపడే వారు కాదు
పోతన కవిత్వం పై కూడా ఆకర్షణ అంతగా లేదు
 

అందువలన 
పోతన కవిత్వమూ పుట్టపర్తి ఆరోపణలకు 
గురి అయ్యింది
తర్వార్వాత్త పరిణతి చెందిన జీవితం 

పోతనలోని భక్తి ఋషిత్వం వైరాగ్యం పట్ల 
ఆరాధన పెరిగింది
 

అప్పుడొక పిల్ల విమర్శకుడు
పుట్టపర్తి యెదుట పోతన కవిత్వం బాగుండదన్న అభిప్రాయాన్ని చెప్పాడు
పుట్టపర్తి యేమీ మాట్లాడలేదు
ఒక్కసారి గతాన్ని పరికించారు..




ఒకప్పుడొక పిల్ల విమర్శకుడు సందర్భ వశమున  నాతో 'భాగవతపు శైలి యేమియు బాగుండదు. 
తిక్కన ధార దీసినట్లుండును. 
పోతన్న దట్లు గాక 
పాదపాదమునకు దునిగిపోవును. 
యతి ప్రాస వీనిని బూరింపవలసి వచ్చినపుడు 
క్రొత్త క్రొత్త పదములను వెదకి కొనుటలో 
నతడు పడు బాధ జూచిన 'యయ్యో 'యనిపించును. అని నిరాఘాటముగ తిక్కన పోతన్నలలోని తారతమ్యములను తీర్పు జెప్పివేసెను 

నేనప్పుడేమియు మాట్లాడలేదు. 
కారణమేమగా 
నా బాల్యములో నేను గూడ 
పోతన్నపై నిట్టి యభాండముల నెత్తితిని. 

తీగె దిగిచినట్లు వ్రాసిననే ధారా శుధ్ధియగును 
కాకున్న కాదు 
అని మొదలు స్థిరపడవలెను 
అటు తరువాత 
నీ విమర్శకు నడుముల బలము నిల్చును.

భారత కవులలో తీగె దిగిచినట్లు రచన యున్నమాట నిజమే. 
ఆ ధార యొక్క ద్రుతగతి ఎర్రన కంటెను 
తిక్కన కంటెను 
నన్నభట్టులో నింకను గొంత మీరినది. 
కాని భారతము వీర కావ్యము. 
ఆ పాత్రలకు ద్రుతగతి 
ప్రబలమైన యుద్రేకము 
ఉ త్తాలములైన భావములు 
యివి సహజములైన ధర్మములు. 

అందుచేనా కావ్యములను రచించునపుడు 
శయ్య యెంత తొందరగ నడపిన మనకంత యానందము గలుగును. 

కాని 
భాగవతము యొక్క ధర్మము వేరు. 
శాంతి దాని ప్రదానమైన రసము. 
ఆ పాత్రలకు నిలుకడ సమ్యమనము 
యివి నైజములైన గుణములు. 

అట్లే వానిని సృష్టించు కవికి గూడ 
నీ గుణములు లేకున్నచో  
నా సన్నివేశములు 
క్రోతి చేతికి దొరకిన యద్దము వంటిదగును. 

భారతములోని వారికి ముఖ్యముగ రజోగుణ ప్రదానము. 
అందుచే మాటలలో వాడిమి 
భావములలో తీండ్ర 
యీ గుణములుండి తీరవలెను. 


పోతన్న పాత్రలు సత్వగుణ ప్రధానములు. భారతములో
 ప్రతిచోటను తీగె దిగిచిన శైలెయే లేదు 
నిలిచి నిలుకడగ వలికిన పట్టులును నుండనే
యున్నవి. 

అట్లే భాగవతమున గూడా 
హృదయ భావములకు విశృంఖల స్వైరగతి నావిష్కరింప వలసిన చోట  
పదములు  పాదరసమువలె బర్వెత్తును. 

అక్కడ అతని ధార 
వర్షాకాలమునందలి ప్రవాహమువలె 
తెగదూకులు దూకినది. 

కాని .. 
సామాన్యముగ నా తడు శయ్యను  
నిరంతరమును గళ్ళెమును చేతబట్టుకొనియే నడపును. 

పోతన్న భాగవతపు తెనిగింపు 
నేడు గొందరనుకొనునట్లు 
పుస్తకమును ముందు పెట్టుకొని 
మూడు నాళ్ళలో దీర్చిన ముచ్చటగాదు. 

ఆతడు సంస్కృత భాగవతమునెన్నియో యేడులు 
పరాయణముగ బారాయణమొనర్చెను. 
చదివి ..చదివి..
వ్యాసభగవానులు సృష్టించిన ప్రతి సన్నివేశమును 
ప్రతి పాత్రను 
ప్రతి పద్యమును 
ప్రతి పదమును
భావించి భావించి వివర్జిత చేష్టుడైనాదు. 

ఈ తపస్సు జన్మమంతయు సాగుటచే 
నా భక్తులలోని  యనేక గుణములు పోతనామాత్యులకు స్వభావములైపోయినవి. 

ఆతని జీవితమునందు 
పరమ భాగవతులు తొంగిచూచినట్లు
భాగవతములోని ప్రతి భక్తునిలోను 
పోతన్న బ్రతుకు తొంగిచూచును. 

భాగవతమతనికి కవిత్వము గాదు. 
కనువిప్పు... 
ఆంధ్రీకరణ మతని కానందమేగాదు. 
నిష్ఠ ... 

14 నవం, 2013

తోచని మాటలకు ప్రత్యామ్నాయం 'ఇదే' నంటే మీరు యేమంటారు..?


నువ్వంటే నాకెందుకో ఇంత 'ఇదీ'
నువ్వంటే నాకేమిటో అదే 'ఇదీ'
అని ఒక కథా నాయిక నాయకులు 

యుగళ గీతం పాడుకున్నారు
ఇదీ.. ఇదీ..

 ఆ 'ఇది' అంటే యేమిటో 
ఇద్దరి మనసులకూ తెలిసినా 
ఆ 'యిది'ని మాటల్లో చెప్పాలంటే వాళ్ళకీ 
ఒకలాంటి 'యిది' కాబోలు

'యిది' మీ వంశపారంపర్యంగా వచ్చిందయ్యా 
ఆపరేషన్ చేస్తే పోతుంది
అమ్మయ్య ..
అదేదో మా తాతయ్యకి చేసెయ్యండి
ఈజవాబులోని ఆ '
యిది'  ఓ జబ్బు
ఇలా 'అదీ ..
యిదు'లతో మనము ఏదేదో చెప్పేస్తుంటాం
మరి కావ్యాలు రాసే కవులూ తోచని చెప్పలేని భావాలను 'అదీ..
యిదు'లతో పూరిస్తారా..
పోతనామాత్యులు ఆ 'యిది'ని
' మంచి' అనే మాటతో సర్దేస్తారట..
'అదె'విటో చూద్దామా..

 

మనము మాటలాడునపుడు 
ఒక్కొక్కసారి 
ఇది చాల 'యిది' గానున్నదందుము. 
అక్కడేదో భావస్ఫోరకమైన మాట 
మనకు తట్టుటలేదు. 

ఆ కొరతను 'యిది' యను సర్వనామము పూరింపవలెనని మన యాశ 
ఇట్టి 'యిదు'లతో పూరించుకొనవలసిన చోటులు తిక్కనామాత్యులలో చాల వచ్చును. 

ఆ యలవాటు 
అప్పుడప్పుడు పోతన్నకు కూడ నున్నది. భావములలోని 'నత్తి'నాయన
 'మంచి' యను పదముతో పూరించుకొనుచుండును . 

పాల సముద్రమున బుట్టిన లక్ష్మీదేవికి 
దేవతలేవేవో యుడుగరలిచ్చిరి 
ఆ నడుమ 
భారతీదేవి యొక మంచి తారహార మొసగెనట. (అ.స్క.271) 
ఈ తారహారములోని మంచితనమేమో 
వివరంచుట కతనికి మాటలురాలేదు గాబోలు 
ఈ 'మంచి 'మరియొకసారి వచ్చును. 

యశోదకు కొడుకు పుట్టినాడని గోపికలకు దెలిసినది. అపుడు వారందరు 'మంచి' పదార్థములు 
కొనుచు వచ్చినారట
కం. "కంచుకములు దల
చుట్లును
        గాంచన భూషాంబరంబులు కడుమెరయగ నే         తెంచిరి గోపకులందరు
       'మంచి' పదార్థములు గొనుచు మాధవునకున్"
ఇక్కడ 'మంచి'తనము గూడ 

పోతన్నకు సంభవించిన మాటలలోని నత్తియే.

12 నవం, 2013

భాగవతం ఎలా చదవాలి ?

చీకటి పడిందంటే చాలు
ఊరిజనాలు రాత్రి భోజనాలు ముగించుకొని

 ఏ గుడిలోనో కట్టపైనో చేరేవారు
అక్కడ కథో కాలక్షేపమో జరిగేది
అందరూ శాలువాలు దుప్పట్లు గొంగడీలు కప్పుకుని కూర్చొని శ్రధ్ధగా వినేవారు
వారిలో యే పంతులో పురోహితుడో భాగవతాన్నో రామాయణాన్నో కథలు కథలుగా చెప్పేవాడు
మిగతా అందరూ ఆ క
ను వింటూ తాదాత్మ్యం చెందేవారు
అప్పుడప్పుడూ మధ్యలో వెలిగించిన ఆముదపు దీపం వత్తిని పైకెగదోసేవారు
ప్రహ్లాదోపాఖ్యానం
గజేంద్ర మోక్షం
కృష్ణలీలలు
పదే పదే విన్నా వారికి విసుగయ్యేది కాదు
ఎంత బాగుంది కదూ
టీవీలు ఇంటర్నెట్లూ సినిమాలూ సెల్ ఫోన్ లూ  లేని ప్రశాంత వాతావరణం
వీటి మత్తులో పడి ఎన్నిటినో వదిలేస్తున్నాం
మనిషికీ మనిషికీ మధ్య నిశ్శబ్దం

 మనసుకూ మనసుకూ నడుమ అవగాహనారాహిత్యం




భాగవతమును  జదువుటకు 
పాఠకుడు మనస్సుతో బాటు 
బాహ్యముగను గొంత తయారుగావలెను. 

ప్రొద్దుటినుండి రాత్రివరకు 
నింటిపనులలో గొరతలేక చక్కబెట్టుకొని 
రాత్రి భుజించి ..
పదిమంది తీరికగా కూర్చొనవలయును.
వారి గోష్టిలో మధ్య మధ్య 

లౌకిక విషయముల గొడవ నేనున్నానని ప్రవేశింపరాదు. 
నడుమ ..
ప్రమితలో నాముదము బోసి యంటించిన దీపము కొడిగట్టక యాత్మ జ్యోతివలె వెలుగుచున్నది. 
అపుడు వయసు మళ్ళిన ..
రాగద్వేషాదుల యుద్వేగము తగ్గిన యొకానొక పెద్ద నాటరాగములో..

సీ. ఒక వేయి తలలతో నుండు జగన్నాధు
బొడ్డు దమ్మిని బ్రహ్మ పుట్టె మొదల
నతనికి గుణముల నతనిబోలిన దక్షు
డగు నత్రి సంజాతుడయ్యె నత్రి
కడగంటి చూడ్కుల కలువల సంగడీ
డుదయించి విప్రుల కోషడిలకు
నమర దారాతతి నజుని పంపున నాధు
డై యుండి రాజసూయంబుచేసి
తే. బూడు లోకంబులను గెల్చి మోదకమున
జని బృహస్పతి పెగ్డ్లాము జారుమూర్తి
దార నిలుసొచ్చి కొనిపోయెతన్ను గురుడు
వేడు నందొక నయ్యింతి విడువడయ్యె..

 

యని తిన్నగ నారంభించును..
వాని చుట్టునున్న వారందరు చక్కని పాటకు 
పడగ తాడించు పాములవలె 
హాయిగ దలలాడించుచు వినుచుందురు. 
వారికి నిజముగ భాగవతర్థమైనది. 

ఆ శయ్యలోని సౌలభ్యమును ..
ఆ కథలోని హృదయమును ..
దెలియునదా పుణ్యాత్ములకే 
అంతేగాని ..
పొగగొట్టపు భూంకారధ్వనులలో ..
నానా భావ పంకులములై ..
చిల్లరంగడులబోలు మనస్సులతో ..
భాగవతమును జదివినచో ..
దాని రుచి యర్థము గాదు..
 

ప్రొద్దున లేచిన వెంటనే 
ముఖము కడుగుకొనుమాట యెట్లున్నను 
కాఫీ త్రాగుటకు మనమలతాటు పడితిమి. 

వేడివేడిగా నది కడుపులలోనికి దిగజారినప్పుడు 
కొంత బాధయే యగును 
కాని దానిని మనము గుణించుటలేదు. 
గడ్డపెరుగు వేసికొని హాయిగ చల్ది భుజించినచో కడుపులో నెంతయో చల్లగనుండునే ..
మీకీ శిక్ష యేమని ..?
వయసు మళ్ళీన ముసలమ్మలు
 మాయింటలేరు గాని -
పిల్లలను కసరించుచునే యుందురు. 
దాని చల్వను మనమూహింపగలము. కాని మనయలవాటును మార్చుకొందుమా..?
పిల్లలు మానుకొందురా ..?
 అట్లే భాగవత పఠనముగూడ..
 

ఇది మనకు చక్కగ నర్థము గాకపోయెనే యని యొక్కొకసారి యాసక్తితో జదువనారంభింతుము. 
కాని మన దురదృష్టము..
అది యెంత యర్థము గావలెనో అంత గాదు..
ఎట్లు కావలెనో అట్లు గాదు.
కారణమేమి..?
మన బ్రతుకులలో భావములలో ..

దానికి పూర్వాంగములు లేవు.

భక్తుల దాసుండ -భక్తుల లెంక