21 నవం, 2013
కాలినడకన హృషీకేశ్ ప్రయాణం సరస్వతీపుత్ర గా తిరిగి రావడం
ఎన్.టీ.ఆర్.పుట్టపర్తి
లేబుళ్లు:
ఫోటోలు
పుట్టపర్తిపై పరిశోధనలు
పుట్టపర్తి పై ఇంతవరకూ లభ్యమైన వివరాల ననుసరించి వివిధ యూనివర్శిటీలలో జరిగిన పరిశోధనలు. గ్రంధకర్తల గైడ్లను తెలిపే వివరాలివి
సహకారం అక్కయ్య నాగపద్మిని
1. పుట్టపర్తి నారాయణాచార్యుల కృతులు, S. సోమలింగారెడ్డి , 1986 నాగార్జున యూనివర్శిటీ , గైడ్ T.దోణప్ప
2. పుట్టపర్తి ఖండకావ్యాలు, V.రంగాచార్యులు , 1988, కాకతీయ యూనివర్శిటీ, గైడ్ K.సుప్రసన్నాచార్య
3. పుట్టపర్తి లఘుకృతులు, S.లక్ష్మీకాంతరెడ్డి , 1988 , ఉస్మానియా యూనివర్శిటీ , గైడ్ M. రామారెడ్డి
4. పుట్టపర్తి విశ్వనాధ గేయకవిత్వముల తులనాత్మక పరిశీలన, M.పద్మినీకాంత, 2005, ఉస్మానియా యూనివర్శిటీ, గైడ్ N.నిర్మలాదేవి
5. పుట్టపర్తి దేశభ క్తి కవిత్వం, Mపోతిరెడ్డి, 1982,
శ్రీ కృష్ణదేవరాయ యూనివర్శిటీ, గైడ్ M.K. దేవకి
6. పుట్టపర్తి జనప్రియ రామాయణం-ఒక పరిశీలన,
G. శేషాచలం, 1995, శ్రీ కృష్ణదేవరాయ యూనివర్శిటీ, గైడ్ M.Kదేవకి 7. పుట్టపర్తి సాక్షాత్కారము -ఒకపరిశీలన ,
K. మురళీకృష్ణారెడ్డి , 1991, మద్రాసు యూనివర్సిటీ, గైడ్ P.ఉమ
8. పుట్ట పర్తి మేఘదూతం-ఒక పరిశీలన , K. ప్రార్థన, 1999 , ఉస్మానియ యూనివర్శిటీ , గైడ్ నెల్లురి శివారెడ్డి
9. పుట్టపర్తి జీవితము- వాఙ్మయ సూచి , G.సుకన్య 1994 , ఉస్మానియ, గైడ్ S.శరజ్జ్యోత్స్నారాణి
10. విమర్శకుడుగా పుట్టపర్తి నారాయణాచార్యులు, J.విఠలేశ్వరశర్మ, 1999 , ఉస్మానియ యూనివర్శిటీ, గైడ్ N.Kవెంకటేష్
లేబుళ్లు:
వ్యాసాలు
20 నవం, 2013
గొప్పకవి ఖాతాలో చెత్త
లేబుళ్లు:
చిత్ర కవితలు
,
పుట్టపర్తి చమత్కార విన్యాసం
,
పుట్టపర్తి భావ లహరి
పురాణ కవుల రహస్యమిదేనట..
లేబుళ్లు:
చిత్ర కవితలు
,
పుట్టపర్తి చమత్కార విన్యాసం
,
పుట్టపర్తి భావ లహరి
17 నవం, 2013
భాగవతమతనికి కవిత్వము గాదు. కనువిప్పు
పోతన శైలి నన్నయ రచనవలె ఋషివాణి.
ఆ శయ్య ..
ఆ రచన..
అతనికే చెల్లింది.
అంటారు పోతన భాగవతము అనే
జక్కా సుబ్బరాయుడు గారు ముద్రించిన భాగవతమునకు ముందు మాట వ్రాస్తూ
పుట్టపర్తి వారు
పుట్టపర్తి తండ్రి
పుట్టపర్తి శ్రీనివాసాచార్యులవారు (మా తాత)
తిక్కన భక్తులు.
ఆయనతోపాటీ కట్టమంచి రామలింగారెడ్డి
రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ
ఇలా దాదాపు పది పదిహేను మంది
శ్రీనివాసాచార్యులవారికి
దాదాపు పదహైదు పర్వాలు నోటికి వచ్చేవి
అందువలన వచ్చిన ఆశు కవితా ధోరణి
తండ్రి ప్రభావం
పుట్టపర్తి పై సహజంగా పడింది.
ఆరోజుల్లో పదేండ్ల వయసున్న పుట్టపర్తి చదువుతుంటే శ్రీనివాసాచార్యులు పురాణం చెప్పేవారట..
ఇంట్లో ఎప్పుడూ సాహిత్య గోష్టులూ చర్చలూ
తిక్కనపై పుట్టపర్తి కీ ఆరాధన ఏర్పడింది..
తిక్కన శైలిలోనూ పుట్టపర్తి మునకలు వేశాడు
తిక్కనను తప్ప ఎవరినీ ఇష్టపడే వారు కాదు
పోతన కవిత్వం పై కూడా ఆకర్షణ అంతగా లేదు
అందువలన
పోతన కవిత్వమూ పుట్టపర్తి ఆరోపణలకు
గురి అయ్యింది
తర్వార్వాత్త పరిణతి చెందిన జీవితం
పోతనలోని భక్తి ఋషిత్వం వైరాగ్యం పట్ల
ఆరాధన పెరిగింది
అప్పుడొక పిల్ల విమర్శకుడు
పుట్టపర్తి యెదుట పోతన కవిత్వం బాగుండదన్న అభిప్రాయాన్ని చెప్పాడు
పుట్టపర్తి యేమీ మాట్లాడలేదు
ఒక్కసారి గతాన్ని పరికించారు..
ఒకప్పుడొక పిల్ల విమర్శకుడు సందర్భ వశమున నాతో 'భాగవతపు శైలి యేమియు బాగుండదు.
తిక్కన ధార దీసినట్లుండును.
పోతన్న దట్లు గాక
పాదపాదమునకు దునిగిపోవును.
యతి ప్రాస వీనిని బూరింపవలసి వచ్చినపుడు
క్రొత్త క్రొత్త పదములను వెదకి కొనుటలో
నతడు పడు బాధ జూచిన 'యయ్యో 'యనిపించును. అని నిరాఘాటముగ తిక్కన పోతన్నలలోని తారతమ్యములను తీర్పు జెప్పివేసెను
నేనప్పుడేమియు మాట్లాడలేదు.
కారణమేమగా
నా బాల్యములో నేను గూడ
పోతన్నపై నిట్టి యభాండముల నెత్తితిని.
తీగె దిగిచినట్లు వ్రాసిననే ధారా శుధ్ధియగును
కాకున్న కాదు
అని మొదలు స్థిరపడవలెను
అటు తరువాత
నీ విమర్శకు నడుముల బలము నిల్చును.
భారత కవులలో తీగె దిగిచినట్లు రచన యున్నమాట నిజమే.
ఆ ధార యొక్క ద్రుతగతి ఎర్రన కంటెను
తిక్కన కంటెను
నన్నభట్టులో నింకను గొంత మీరినది.
కాని భారతము వీర కావ్యము.
ఆ పాత్రలకు ద్రుతగతి
ప్రబలమైన యుద్రేకము
ఉ త్తాలములైన భావములు
యివి సహజములైన ధర్మములు.
అందుచేనా కావ్యములను రచించునపుడు
శయ్య యెంత తొందరగ నడపిన మనకంత యానందము గలుగును.
కాని
భాగవతము యొక్క ధర్మము వేరు.
శాంతి దాని ప్రదానమైన రసము.
ఆ పాత్రలకు నిలుకడ సమ్యమనము
యివి నైజములైన గుణములు.
అట్లే వానిని సృష్టించు కవికి గూడ
నీ గుణములు లేకున్నచో
నా సన్నివేశములు
క్రోతి చేతికి దొరకిన యద్దము వంటిదగును.
భారతములోని వారికి ముఖ్యముగ రజోగుణ ప్రదానము.
అందుచే మాటలలో వాడిమి
భావములలో తీండ్ర
యీ గుణములుండి తీరవలెను.
పోతన్న పాత్రలు సత్వగుణ ప్రధానములు. భారతములో
ప్రతిచోటను తీగె దిగిచిన శైలెయే లేదు
నిలిచి నిలుకడగ వలికిన పట్టులును నుండనే
యున్నవి.
అట్లే భాగవతమున గూడా
హృదయ భావములకు విశృంఖల స్వైరగతి నావిష్కరింప వలసిన చోట
పదములు పాదరసమువలె బర్వెత్తును.
అక్కడ అతని ధార
వర్షాకాలమునందలి ప్రవాహమువలె
తెగదూకులు దూకినది.
కాని ..
సామాన్యముగ నా తడు శయ్యను
నిరంతరమును గళ్ళెమును చేతబట్టుకొనియే నడపును.
పోతన్న భాగవతపు తెనిగింపు
నేడు గొందరనుకొనునట్లు
పుస్తకమును ముందు పెట్టుకొని
మూడు నాళ్ళలో దీర్చిన ముచ్చటగాదు.
ఆతడు సంస్కృత భాగవతమునెన్నియో యేడులు
పరాయణముగ బారాయణమొనర్చెను.
చదివి ..చదివి..
వ్యాసభగవానులు సృష్టించిన ప్రతి సన్నివేశమును
ప్రతి పాత్రను
ప్రతి పద్యమును
ప్రతి పదమును
భావించి భావించి వివర్జిత చేష్టుడైనాదు.
ఈ తపస్సు జన్మమంతయు సాగుటచే
నా భక్తులలోని యనేక గుణములు పోతనామాత్యులకు స్వభావములైపోయినవి.
ఆతని జీవితమునందు
పరమ భాగవతులు తొంగిచూచినట్లు
భాగవతములోని ప్రతి భక్తునిలోను
పోతన్న బ్రతుకు తొంగిచూచును.
భాగవతమతనికి కవిత్వము గాదు.
కనువిప్పు...
ఆంధ్రీకరణ మతని కానందమేగాదు.
నిష్ఠ ...
లేబుళ్లు:
వ్యాసాలు
14 నవం, 2013
తోచని మాటలకు ప్రత్యామ్నాయం 'ఇదే' నంటే మీరు యేమంటారు..?
నువ్వంటే నాకెందుకో ఇంత 'ఇదీ'
నువ్వంటే నాకేమిటో అదే 'ఇదీ'
అని ఒక కథా నాయిక నాయకులు
యుగళ గీతం పాడుకున్నారు
ఇదీ.. ఇదీ..
ఆ 'ఇది' అంటే యేమిటో
ఇద్దరి మనసులకూ తెలిసినా
ఆ 'యిది'ని మాటల్లో చెప్పాలంటే వాళ్ళకీ
ఒకలాంటి 'యిది' కాబోలు
'యిది' మీ వంశపారంపర్యంగా వచ్చిందయ్యా
ఆపరేషన్ చేస్తే పోతుంది
అమ్మయ్య ..
అదేదో మా తాతయ్యకి చేసెయ్యండి
ఈజవాబులోని ఆ 'యిది' ఓ జబ్బు
ఇలా 'అదీ ..యిదు'లతో మనము ఏదేదో చెప్పేస్తుంటాం
మరి కావ్యాలు రాసే కవులూ తోచని చెప్పలేని భావాలను 'అదీ.. యిదు'లతో పూరిస్తారా..
పోతనామాత్యులు ఆ 'యిది'ని
' మంచి' అనే మాటతో సర్దేస్తారట..
'అదె'విటో చూద్దామా..

మనము మాటలాడునపుడు
ఒక్కొక్కసారి
ఇది చాల 'యిది' గానున్నదందుము.
అక్కడేదో భావస్ఫోరకమైన మాట
మనకు తట్టుటలేదు.
ఆ కొరతను 'యిది' యను సర్వనామము పూరింపవలెనని మన యాశ
ఇట్టి 'యిదు'లతో పూరించుకొనవలసిన చోటులు తిక్కనామాత్యులలో చాల వచ్చును.
ఆ యలవాటు
అప్పుడప్పుడు పోతన్నకు కూడ నున్నది. భావములలోని 'నత్తి'నాయన
'మంచి' యను పదముతో పూరించుకొనుచుండును .
పాల సముద్రమున బుట్టిన లక్ష్మీదేవికి
దేవతలేవేవో యుడుగరలిచ్చిరి
ఆ నడుమ
భారతీదేవి యొక మంచి తారహార మొసగెనట. (అ.స్క.271)
ఈ తారహారములోని మంచితనమేమో
వివరంచుట కతనికి మాటలురాలేదు గాబోలు
ఈ 'మంచి 'మరియొకసారి వచ్చును.
యశోదకు కొడుకు పుట్టినాడని గోపికలకు దెలిసినది. అపుడు వారందరు 'మంచి' పదార్థములు
కొనుచు వచ్చినారట
కం. "కంచుకములు దలచుట్లును
గాంచన భూషాంబరంబులు కడుమెరయగ నే తెంచిరి గోపకులందరు
'మంచి' పదార్థములు గొనుచు మాధవునకున్"
ఇక్కడ 'మంచి'తనము గూడ
పోతన్నకు సంభవించిన మాటలలోని నత్తియే.
నువ్వంటే నాకేమిటో అదే 'ఇదీ'
అని ఒక కథా నాయిక నాయకులు
యుగళ గీతం పాడుకున్నారు
ఇదీ.. ఇదీ..
ఆ 'ఇది' అంటే యేమిటో
ఇద్దరి మనసులకూ తెలిసినా
ఆ 'యిది'ని మాటల్లో చెప్పాలంటే వాళ్ళకీ
ఒకలాంటి 'యిది' కాబోలు
'యిది' మీ వంశపారంపర్యంగా వచ్చిందయ్యా
ఆపరేషన్ చేస్తే పోతుంది
అమ్మయ్య ..
అదేదో మా తాతయ్యకి చేసెయ్యండి
ఈజవాబులోని ఆ 'యిది' ఓ జబ్బు
ఇలా 'అదీ ..యిదు'లతో మనము ఏదేదో చెప్పేస్తుంటాం
మరి కావ్యాలు రాసే కవులూ తోచని చెప్పలేని భావాలను 'అదీ.. యిదు'లతో పూరిస్తారా..
పోతనామాత్యులు ఆ 'యిది'ని
' మంచి' అనే మాటతో సర్దేస్తారట..
'అదె'విటో చూద్దామా..

మనము మాటలాడునపుడు
ఒక్కొక్కసారి
ఇది చాల 'యిది' గానున్నదందుము.
అక్కడేదో భావస్ఫోరకమైన మాట
మనకు తట్టుటలేదు.
ఆ కొరతను 'యిది' యను సర్వనామము పూరింపవలెనని మన యాశ
ఇట్టి 'యిదు'లతో పూరించుకొనవలసిన చోటులు తిక్కనామాత్యులలో చాల వచ్చును.
ఆ యలవాటు
అప్పుడప్పుడు పోతన్నకు కూడ నున్నది. భావములలోని 'నత్తి'నాయన
'మంచి' యను పదముతో పూరించుకొనుచుండును .
పాల సముద్రమున బుట్టిన లక్ష్మీదేవికి
దేవతలేవేవో యుడుగరలిచ్చిరి
ఆ నడుమ
భారతీదేవి యొక మంచి తారహార మొసగెనట. (అ.స్క.271)
ఈ తారహారములోని మంచితనమేమో
వివరంచుట కతనికి మాటలురాలేదు గాబోలు
ఈ 'మంచి 'మరియొకసారి వచ్చును.
యశోదకు కొడుకు పుట్టినాడని గోపికలకు దెలిసినది. అపుడు వారందరు 'మంచి' పదార్థములు
కొనుచు వచ్చినారట
కం. "కంచుకములు దలచుట్లును
గాంచన భూషాంబరంబులు కడుమెరయగ నే తెంచిరి గోపకులందరు
'మంచి' పదార్థములు గొనుచు మాధవునకున్"
ఇక్కడ 'మంచి'తనము గూడ
పోతన్నకు సంభవించిన మాటలలోని నత్తియే.
13 నవం, 2013
పతంగము గూడ పతంగునితో పందెము
లేబుళ్లు:
చిత్ర కవితలు
,
పుట్టపర్తి భావ లహరి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు
(
Atom
)







