9 మార్చి, 2014
రుష
లేబుళ్లు:
చిత్ర కవితలు
,
సరస్వతీపుత్రుని పాద్యము
5 మార్చి, 2014
బూదాటి వెంకటేశ్వర్లు గారి ప్రారంభోపన్యాసం
ద్రావిడ విశ్వవిద్యాలయం జరిపిన శతవసంత సాహితీకీర్తి పుట్టపర్తి సభలలో మొదటిరోజు బూదాటి వెంకటేశ్వర్లు గారి ప్రారంభోపన్యాసం
కృతాకృత చింతలు
లేబుళ్లు:
చిత్ర కవితలు
,
సరస్వతీపుత్రుని పాద్యము
వేమనపై రూమరులా
కట్టుకథలు ..
అనగా కల్పించి దానికి కొంచెం మసాలా తగిలించి
చెప్పే కథలు
యీ కథలు సినిమా వాళ్ళకూ రాజకీయ నాయకులకూ ఆఖరికి పైకొచ్చిన ఎవరిపైనైనా అల్లుతుంటారు
అల్లూరిసీతారామరాజు విప్లవ యోధుడు
ఆయన పై కృష్ణ సినిమా సూపర్ హిట్టు
వాస్తవంలో ఆయన సీతారామరాజు కాదు
శ్రీ రామరాజు
ఆయనకు సీత అనే చెల్లెలు
ఆమెకు బాల్యంలో భర్త పోతే రామరాజు బాధపడి
తన శ్రీ ని సీతా అని మార్చి చెల్లెలి పేరునూ
తనతో కలుపుకున్నాడు
మరి అంత విప్లవ నాయకుని జీవితం చప్పగా వుంటే
సిని మా ఎలా ఆడుతుందీ
అందుకు వాళ్ళు చెల్లిని ప్రియురాలిగా మార్చేసారు..
సినిమా వాళ్ళకు వాళ్ళ సినిమా సక్సెస్ కావాలంతే..
హాస్యానికి కేరాఫ్ అడ్రెస్స్ గా చెప్పబడే
తెనాలి రామలింగనిపై కూడా బోలెడు కట్టుకథలు పుట్టుకొచ్చాయట
కట్టుకథలేగాక ఎవరో నడిపిన కథలనూ కూడని పద్యాలనూ పెద్దవారికంటగట్టి కొందరు వినోదం చూస్తారట..
పదునైదవ శతాబ్దంలో కవయిత్రులెవ్వరో మనమెరుగము
రామాయణము వ్రాసిన మొల్ల రాయలకాలమునాటిదందురు..
ఎంతవరకు నిజమో..
యీ కవయిత్రితో కొంటెకోణంగి తెన్నాలి రాముడు
కొంత పిల్లా టలాడెనని కొన్ని కట్టుకథ లు
రామకృష్ణుని నెత్తిపై కెత్తబడినపుక్కిటిపురాణముల జూచినచో నయ్యో ననిపించును..
మనకు సాహిత్యములో నెక్కవగా అదవకు దొరకిన వ్యకులు ముగ్గురు
మొదటివాడు శ్రీనాధుడు
రోతపుట్టించు బూతు శృంగార పద్యములన్నియు
చచ్చిన శ్రీనాధునిపై వేసి సవరించుకొందుము
ఇక అసహ్యకరమైన హాస్యమునకు
మనకు దొరకిన దృష్టిబొమ్మ తెన్నాలివాడు
ఈతని జతలో చేర్చి తిరుమల తాతయ్య వంటి
పవిత్ర మూర్తిని గూడ పాడుచేసితిమి
ఇక శని వక్రించిన మూడవ వాడు వేమన్న.
అందచందములేని వేదాంతమంతయు నాతని నెత్తిపై వేసి
పద్యము కడపట వేమా అని తగిలించినచో
మనపీడ వదలి పోవును
లేబుళ్లు:
వ్యాసాలు
పుట్టపర్తి వారి శతవసంత సాహితీ కీర్తి పుట్టపర్తి శ్రీ దామోదర నాయుడు గారి ప్రసంగం
కుప్పం లోని ద్రావిడ విశ్వవిద్యాలయంలో
పుట్టపర్తి వారి శతవసంత సాహితీ కీర్తి పుట్టపర్తి
ఎంతో బ్రహ్మాండంగా జరిగింది.
అందులో నాకు నచ్చినవి పెద్దల వీడియోలు
కొన్ని విద్యార్థులు వ్రాసిన వ్యాసాలు కొన్ని తీసుకొచ్చాను.
మీకోసం
ఇదిగో ప్రొఫెసర్ శ్రీ బూదాటి వేంకటేశ్వర్లు మరియు
శ్రీ గొల్లాపిన్ని శేషాచలం గార్ల ప్రసంగం
పుట్టపర్తి వారి శతవసంత సాహితీ కీర్తి పుట్టపర్తి
ఎంతో బ్రహ్మాండంగా జరిగింది.
అందులో నాకు నచ్చినవి పెద్దల వీడియోలు
కొన్ని విద్యార్థులు వ్రాసిన వ్యాసాలు కొన్ని తీసుకొచ్చాను.
మీకోసం
ఇదిగో ప్రొఫెసర్ శ్రీ బూదాటి వేంకటేశ్వర్లు మరియు
శ్రీ గొల్లాపిన్ని శేషాచలం గార్ల ప్రసంగం
లేబుళ్లు:
వీడియోలు
28 ఫిబ్ర, 2014
క్షీర కళలు
లేబుళ్లు:
చిత్ర కవితలు
,
పుట్టపర్తి పై ప్రముఖుల అభిప్రాయం
25 ఫిబ్ర, 2014
శ్రీ కైవల్య పదంబు జేరుటకునై.. అష్టాక్షరి నాధునిపై పుట్టపర్తి పద పల్లవాలు
పుట్టపర్తి కృతుల పని ఎలా జరుగుతుందో చూద్దామా
కొమండూరి శేషాద్రి గారు సంభాషణ మీకోసం
ఇందులో కొమండూరి ప్రతికీర్తనను విశ్లేషిస్తూ సరిచూస్తున్నారు..
క్రింద వారు వ్యాఖ్యానించిన ఒక రెండు మూడు కీర్తనలనే ఇస్తున్నాను..
ద్విజావంతి- అట తాళము
హిందుస్థానీ రాగం
సరిగమ పమదపా నిదనిసా
సనిదపామమగరిసమగస
మాటలలొ నేమిలేదే మనసా
మనసు రంగులు మటుమాయ చిత్రమ్ములు
సంస్తుతి నిందలు శబ్ద సంతతి సుమ్ము
శబ్ద సంతతి బట్టి బాధ జెందెదవే
ఉపకార మపకార మొక్కటే క్రియసుమ్ము
ఉపకారమునబొంగి అపకారమునకేడ్తు
అష్టాక్షరీ రూపుడై కలియుగమున
నలరెడు దేవుని యడుగులు బట్టితె
శంకరాభరణము-అట తాళము
ఆరోహణ స రి గ మ ప ద ని స
అవరోహణ స ని ద ప మ గ రి స
పల్లవి. ఎక్కడొచ్చినావూ తెరువరి
అను పల్లవి. దిక్కూమొక్కూలేని డొంకలలోని
చరణము. వచ్చిన దెసబట్టి-వెనుకకు వోవోయి
అచ్చోటనే బ్రహ్మానంద శీతల జలమూ
చరణము. పులుల మచ్చికజేసి- మలయ యోచించెడు
ఆరు కాచుకొన్న-వాఱ డిబెట్టూనే
చరణము. అష్టాక్షరీస్వామి అది పండరినాథు డాతడు చూపిన అమృత సౌధమువీడి
గౌళ రాగము-అట తాళము
ఆరోహణ . సరిమ పనిస
అవరోహణ. నిపమరిగమరీసా
చేదుకోవయ్యా నీ దరికీ రంగా
చేదుమేసీ బ్రదుక బాధాయెనయ్యా
సుఖము సుఖంబని సోలి చచ్చుటె గాని
సుఖమంటె దుఃఖము శుధ్ధిగ జూచితె
నీ క్రీడ నా క్రీడ నీ జగతిలో జూచి
హర్షించి మెచ్చేటి ఆఢ్యులెవ్వరులేరు
అష్టాక్షరీదైవమా యెన్ని జన్మాల
నాడింతువయ్యా నా మెడకూ
నాటకురంజి రాగం -అట తాళం
ఆరోహణ సరిగమ నిదని పదనిస
ఆరోహణ సరిగమ నిదని పదనిస
అవరోహణ సనిదమగస
పల్లవి. వజ్రఖచిత మకుటా విఠ్థలా
అను పల్లవి. వాసుదేవా సర్వ భాసమానరూపా
చరణము. మకుట కుండలములు మాటికి చలియింప
శిరసార్చి నాతోడ చెలువుగ మాటాడు
చరణము. కడగన్నులా కాంతి కలువలు సృజియింప
కనకాంబరా నన్ను గారాముతో జూడు
చరణము. అష్టాక్షరీ మోహనా లోక సౌందర్య
మధమము నీ చెన్నుటడుగులు జూచితె
చక్రవాక రాగం-అట తాళం
సరిగమపదనిస
సనిదపమగరిస
ఏమి చేసెదవూ ఇంకా స్వామీ
నీ లీల దలచితె నిలుచునయ్యా భయము
కలిపితి సంబంధ మలరులకునువోలె
కలగించుచుంటి ముఖంబు జూడగనీక
కరుణాకరుండన్న బిరుదు దాల్చుటెగాని
కరుణలేకా యెరుక కరణిని చరియింతు
అష్టాక్షరి సుందరా సర్వకాలంబు
లందు నీ పదముల నాలపించినదాని
పల్లవి. వజ్రఖచిత మకుటా విఠ్థలా
అను పల్లవి. వాసుదేవా సర్వ భాసమానరూపా
చరణము. మకుట కుండలములు మాటికి చలియింప
శిరసార్చి నాతోడ చెలువుగ మాటాడు
చరణము. కడగన్నులా కాంతి కలువలు సృజియింప
కనకాంబరా నన్ను గారాముతో జూడు
చరణము. అష్టాక్షరీ మోహనా లోక సౌందర్య
మధమము నీ చెన్నుటడుగులు జూచితె
చక్రవాక రాగం-అట తాళం
సరిగమపదనిస
సనిదపమగరిస
ఏమి చేసెదవూ ఇంకా స్వామీ
నీ లీల దలచితె నిలుచునయ్యా భయము
కలిపితి సంబంధ మలరులకునువోలె
కలగించుచుంటి ముఖంబు జూడగనీక
కరుణాకరుండన్న బిరుదు దాల్చుటెగాని
కరుణలేకా యెరుక కరణిని చరియింతు
అష్టాక్షరి సుందరా సర్వకాలంబు
లందు నీ పదముల నాలపించినదాని
లేబుళ్లు:
వ్యాసాలు
24 ఫిబ్ర, 2014
తెలుగు వెలుగు
లేబుళ్లు:
వీడియోలు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు
(
Atom
)




