11 మార్చి, 2014

విశ్వనాధ రామాయణాన్ని గురించి



ఒకసారి ఒక సభలో విశ్వనాధ రామాయణాన్ని గురించి 
పుట్టపర్తి యేంచెప్పారో పై వీడియో చెబుతుంది


పుట్టపర్తీ విశ్వనాధ ఇద్దరూ రామయణం వ్రాసారు
విశ్వనాధ వ్రాసాడని 

పుట్టపర్తీ రామాయణం వ్రాసాడని అనేవాళ్ళూ
విశ్వనాధ రామాయణం పండితులకే ననీ
పుట్టపర్తి రచన అందరికీ అనీ యేవేవో మాటలు
ముందు రామాయణమనే పేరు పెట్టారనీ తరువాత జనం దానికి జనప్రియ జోడించారనీ కొందరి వాదన
 

కానీ పుట్టపర్తి మాత్రం
తులసిదాసు రామచరిత మానసమటువంటిది 

తెలుగులో రావాలని చేశానన్నారు
మాత్రాఛందస్సులో వ్రాయటానికి 

సంగీతమంటే ఉన్న పిచ్చే కారణమనీ చెప్పుకున్నారు
 

''పద్యాలు కూడా సంగీతంగా చదవవచ్చు..
కన్నడదేశంలో గమక ప్రక్రియలోనే కావ్యాలను చదువుకౌంటూ 

జీవితం గడుపుకుంటూ వుండేవాళ్ళు..
 

శఠగోపాచార్యులని ఒకాయన..
ఆయన యేమీ చేయడు 

కుమార వ్యాసుని భారతం 
గమక ప్రక్రియలో మాత్రమే చదువుతాడాయన
పోయిన చోటల్లా జనాలు ఉదారంగా చందాలు ఇస్తారు 

ఆయన బతికినాడు ''
అంటారు పుట్టపర్తి

రామాయణాలు ఎన్నో

 మళ్ళీ రామాయణమెందుకు
అన్న వాదానికి

 ప్రతీ రోజూ తిన్న అన్నమే 
అని తినడం మానేయడం లేదు. 
సంసారంలో కష్ట సుఖాలున్నాయి కదా అని 
మనం మానేయడం లేదు. 
మన పిల్లల ల్నీ సంసార బంధంలోకి లాగుతున్నం కదా. 
అలాగే ఎవరి అనుభూతులు వారివి. 
ఈ రామాయణం నా అనుభూతి. నా రసాస్పందన
 ఇది విశ్వనాధ భావన
పుట్టపర్తికి సన్నిహితుడైన v.p రాఘవాచార్యులేమంటారో విందాం..  


1954 లో నేనొక నెల రోజులు మైసూరులో ఉన్నాను
అక్షరాస్యులైన వయోజనులకు పనికివచ్చే 

పుస్తకాలు వ్రాయాలనే ఒక పథ కం ప్రకారం
యునెస్కో వారి ఆర్థిక సహాయంతో 

కేంద్ర ప్రభుత్వం వారు
మైసూరులో ఒక రచయితల వర్కు షాప్ నిర్వహించారు
 

తెలుగువా రిలో హైద్రాబాదు రాష్ట్రం నుండి 
నన్ను మరొక ఉపాధ్యాయుని ఎన్నుకొని 
ఈ వర్కుషాప్ కు పంపారు
 

ఆనాటి మైసూరు రాష్ట్రంలో వయోజన విద్యా కార్యక్రమం ఒక స్వచ్చంద సంస్థ చక్కగా నిర్వహించేది 
దానిపేరు వయస్కరణ శిక్షణ సమితి  అని జ్ఞాపకం
ఆ సమితి కోరికపై పుట్టప్ప గారు 

జనప్రియ వాల్మీకి రామాయణం సంగ్రహంగా వచనంలో వ్రాశారు
అక్షరాశ్యులైన వయోజనులు  

తమ జన్మ సఫలం కావడానికి తాము చదువగలిగిన రామాయణం కావాలని కోరారట.
ఆ కోరికని పురస్కరించుకొని 

పుట్టప్పగారు రామాయణం వ్రాసారు
 

నేనెపుడో 1956 ప్రాంతాలలో అనుకుంటాను 
శ్రీ పుట్టపర్తికి చెప్పాను.
ఆయన జనప్రియ రామాయణం అనే పేరు 

నేను చెప్పినాక పెట్టారో 
అంతకు పూర్వమేపెట్టారో నేనెరుగను
 

పుట్టప్ప అప్పుడు వ్రాసినది ఒక చిన్న పుస్తకం
పుట్టపర్తి వ్రాసినది అద్భుతమైన మహా కావ్యం
ఆయన ఎన్నుకున్న ఛంధస్సు
పాడుకోవటానికి అనుకూలమై 

కావ్యానికి ఎంతో శోభను చేకూర్చింది
అచ్చు అయిన తరువాత ఆ పుస్తకాలను నేను తెప్పించుకొని  చదివాను.

5 మార్చి, 2014

బూదాటి వెంకటేశ్వర్లు గారి ప్రారంభోపన్యాసం

ద్రావిడ విశ్వవిద్యాలయం జరిపిన శతవసంత సాహితీకీర్తి పుట్టపర్తి సభలలో మొదటిరోజు బూదాటి వెంకటేశ్వర్లు గారి ప్రారంభోపన్యాసం

కృతాకృత చింతలు


వేమనపై రూమరులా



కట్టుకథలు ..
అనగా కల్పించి దానికి కొంచెం మసాలా తగిలించి 

చెప్పే కథలు
యీ కథలు సినిమా వాళ్ళకూ రాజకీయ నాయకులకూ ఆఖరికి పైకొచ్చిన ఎవరిపైనైనా అల్లుతుంటారు
 

అల్లూరిసీతారామరాజు విప్లవ యోధుడు
ఆయన పై కృష్ణ సినిమా సూపర్ హిట్టు 

వాస్తవంలో ఆయన సీతారామరాజు కాదు 
శ్రీ రామరాజు
ఆయనకు సీత అనే చెల్లెలు 

ఆమెకు బాల్యంలో భర్త పోతే  రామరాజు బాధపడి 
తన శ్రీ ని సీతా అని మార్చి చెల్లెలి పేరునూ 
తనతో కలుపుకున్నాడు
 

మరి అంత విప్లవ నాయకుని జీవితం చప్పగా వుంటే 
సిని మా ఎలా ఆడుతుందీ 
అందుకు వాళ్ళు చెల్లిని  ప్రియురాలిగా మార్చేసారు..
సినిమా వాళ్ళకు వాళ్ళ సినిమా సక్సెస్ కావాలంతే..



హాస్యానికి కేరాఫ్ అడ్రెస్స్ గా చెప్పబడే 
తెనాలి రామలింగనిపై కూడా బోలెడు కట్టుకథలు పుట్టుకొచ్చాయట
కట్టుకథలేగాక ఎవరో నడిపిన కథలనూ కూడని పద్యాలనూ పెద్దవారికంటగట్టి కొందరు  వినోదం చూస్తారట..



పదునైదవ శతాబ్దంలో కవయిత్రులెవ్వరో మనమెరుగము
రామాయణము వ్రాసిన మొల్ల రాయలకాలమునాటిదందురు..
ఎంతవరకు నిజమో..
యీ కవయిత్రితో కొంటెకోణంగి తెన్నాలి రాముడు 
కొంత పిల్లా టలాడెనని కొన్ని కట్టుకథ లు
రామకృష్ణుని నెత్తిపై కెత్తబడినపుక్కిటిపురాణముల జూచినచో నయ్యో ననిపించును..
మనకు సాహిత్యములో నెక్కవగా అదవకు దొరకిన వ్యకులు ముగ్గురు

మొదటివాడు శ్రీనాధుడు
రోతపుట్టించు బూతు శృంగార పద్యములన్నియు 
చచ్చిన శ్రీనాధునిపై వేసి సవరించుకొందుము

ఇక అసహ్యకరమైన హాస్యమునకు 
మనకు దొరకిన దృష్టిబొమ్మ తెన్నాలివాడు
ఈతని జతలో చేర్చి తిరుమల తాతయ్య వంటి 
పవిత్ర మూర్తిని గూడ పాడుచేసితిమి

ఇక శని వక్రించిన మూడవ వాడు వేమన్న.
అందచందములేని వేదాంతమంతయు నాతని నెత్తిపై వేసి
పద్యము కడపట వేమా అని తగిలించినచో 
మనపీడ వదలి పోవును 

పుట్టపర్తి వారి శతవసంత సాహితీ కీర్తి పుట్టపర్తి శ్రీ దామోదర నాయుడు గారి ప్రసంగం



కుప్పం లోని ద్రావిడ విశ్వవిద్యాలయంలో 
పుట్టపర్తి వారి శతవసంత సాహితీ కీర్తి పుట్టపర్తి 
ఎంతో బ్రహ్మాండంగా జరిగింది. 
అందులో నాకు నచ్చినవి పెద్దల వీడియోలు 
కొన్ని విద్యార్థులు వ్రాసిన వ్యాసాలు కొన్ని తీసుకొచ్చాను. 
మీకోసం 
ఇదిగో ప్రొఫెసర్ శ్రీ బూదాటి వేంకటేశ్వర్లు మరియు
 శ్రీ గొల్లాపిన్ని శేషాచలం గార్ల ప్రసంగం


రెండవరోజు సభను నిర్వహించిన శ్రీ దామోదర నాయుడు గారి ప్రసంగం వీరు తెలుగు ప్రొఫెసర్ గా పదవీ విరమణ తరువాత ప్రస్తుతం TTD లో పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రెండవరోజు సభను నిర్వహించిన శ్రీ దామోదర నాయుడు గారి ప్రసంగం వీరు తెలుగు ప్రొఫెసర్ గా పదవీ విరమణ తరువాత ప్రస్తుతం TTD లో పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

25 ఫిబ్ర, 2014

శ్రీ కైవల్య పదంబు జేరుటకునై.. అష్టాక్షరి నాధునిపై పుట్టపర్తి పద పల్లవాలు



పుట్టపర్తి కృతుల పని ఎలా జరుగుతుందో చూద్దామా
కొమండూరి శేషాద్రి గారు  సంభాషణ మీకోసం
ఇందులో కొమండూరి ప్రతికీర్తనను విశ్లేషిస్తూ సరిచూస్తున్నారు..
క్రింద వారు వ్యాఖ్యానించిన ఒక రెండు మూడు కీర్తనలనే ఇస్తున్నాను..
 

                  

ద్విజావంతి- అట తాళము
హిందుస్థానీ రాగం
సరిగమ పమదపా నిదనిసా
సనిదపామమగరిసమగస


మాటలలొ నేమిలేదే మనసా
మనసు రంగులు మటుమాయ చిత్రమ్ములు
 

సంస్తుతి నిందలు శబ్ద సంతతి సుమ్ము
శబ్ద సంతతి బట్టి బాధ జెందెదవే
 

ఉపకార మపకార మొక్కటే క్రియసుమ్ము
 ఉపకారమునబొంగి అపకారమునకేడ్తు
 

అష్టాక్షరీ రూపుడై కలియుగమున
నలరెడు దేవుని యడుగులు బట్టితె
 


                      శంకరాభరణము-అట తాళము
 ఆరోహణ  స రి గ మ ప ద ని స
అవరోహణ స ని ద ప మ గ రి స


పల్లవి.          ఎక్కడొచ్చినావూ తెరువరి       
అను పల్లవి.  దిక్కూమొక్కూలేని డొంకలలోని
 

చరణము.      వచ్చిన దెసబట్టి-వెనుకకు వోవోయి
                    అచ్చోటనే బ్రహ్మానంద శీతల జలమూ
 

చరణము.    పులుల మచ్చికజేసి- మలయ యోచించెడు
                   ఆరు కాచుకొన్న-వాఱ డిబెట్టూనే
 

చరణము.   అష్టాక్షరీస్వామి అది పండరినాథు                   డాతడు చూపిన అమృత సౌధమువీడి


              గౌళ రాగము-అట తాళము
ఆరోహణ .    సరిమ పనిస
అవరోహణ.  నిపమరిగమరీసా

 

చేదుకోవయ్యా నీ దరికీ రంగా
చేదుమేసీ  బ్రదుక బాధాయెనయ్యా
 

సుఖము సుఖంబని సోలి చచ్చుటె గాని
సుఖమంటె దుఃఖము శుధ్ధిగ జూచితె
 

నీ క్రీడ నా క్రీడ నీ జగతిలో జూచి
హర్షించి మెచ్చేటి ఆఢ్యులెవ్వరులేరు
 

అష్టాక్షరీదైవమా యెన్ని జన్మాల
నాడింతువయ్యా నా మెడకూ 

               నాటకురంజి రాగం -అట తాళం
ఆరోహణ       సరిగమ నిదని పదనిస
అవరోహణ    సనిదమగస
 
పల్లవి.          వజ్రఖచిత మకుటా విఠ్థలా
అను పల్లవి.    వాసుదేవా సర్వ భాసమానరూపా
 

చరణము.    మకుట కుండలములు మాటికి చలియింప
                  శిరసార్చి నాతోడ చెలువుగ మాటాడు
 

చరణము.   కడగన్నులా కాంతి కలువలు సృజియింప
                 కనకాంబరా నన్ను గారాముతో జూడు
 

చరణము. అష్టాక్షరీ మోహనా లోక సౌందర్య
               మధమము నీ చెన్నుటడుగులు జూచితె


                  చక్రవాక రాగం-అట తాళం
సరిగమపదనిస
సనిదపమగరిస
 

ఏమి చేసెదవూ ఇంకా స్వామీ
 

నీ లీల దలచితె నిలుచునయ్యా భయము

కలిపితి సంబంధ మలరులకునువోలె
కలగించుచుంటి ముఖంబు జూడగనీక
 

కరుణాకరుండన్న బిరుదు దాల్చుటెగాని
కరుణలేకా యెరుక కరణిని చరియింతు
 

అష్టాక్షరి సుందరా సర్వకాలంబు
లందు నీ పదముల నాలపించినదాని