11 మార్చి, 2016

పామిడి తురగపు పాదము

పామిడి తురగపు పాదము అన్న అన్నమయ్య ప్రయోగంపై జరుగుతున్న చర్చ చూచాను. అన్నమయ్య కీర్తనలకు వ్యాఖ్యాతగా పేర్గాంచిన కామిశెట్టి శ్రీనివాసులు గారిని ఒక మాట అడిగాను
ఇది వారు వెలిబుచ్చిన అభిప్రాయం
ప్రతిదీ వీడియో యేమిటి అనుకోకండి.. 
నాకొచ్చిన విద్య ఇదొక్కటే


8 మార్చి, 2016

ఏకవీర నవల కేవలం మూడు రోజులలోనే మళయాళం లోకి

శ్రీరంగాచార్యులు గారు పుట్టపర్తి గురించి చెప్పిన విశేషాలు..
పుట్టపర్తి ఏకవీర నవలలు కేవలం మూడు రోజులలోనే మళయాళం లోకి అనువదించారట..
ఈ రికార్డింగులో నాకు తోడ్పడిన మా అక్కయ్య నాగపద్మిని కి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు..
శ్రీరంగాచార్యులుగారు తెలంగాణాకు చెందిన పండితులు.. సాహితీవేత్తలు..
పుట్టపర్తి వారితో  అరవైలనుంచీ అనుబంధం కలిగినవారు
వారు పుట్టపర్తిని గూర్చి ఎన్నో విషయాలు నిర్భయంగా విశదంగా మాపై ఎంతో ప్రేమతో వినిపించారు
తమ సొంత పిల్లలాగే మమ్మల్ని చూసిన వారిని పిన్నయ్యా అని పిలవాలనిపించింది..
మా తండ్రిని గురించి ఇన్ని విషయాలు మాకందించిన వారు మాకు పినతండ్రి కాక మరేమవుతారు..


1 మార్చి, 2016

శిల్పాలలో నవరసాలు



శృంగారం హాస్యము కరుణ 
రౌద్రం వీరం భయానకం 
భీభత్సం అద్భుతం శాంతం..
ఇవీ నవరసాలు
నటులు నవరసాలు పలికించటం తెలుసు.. 
మరి శిలలు నవరసాలు పలికించటం విన్నారా.. 
ఈ నల్లని రాలలో .. ఏ కన్నులు దాగెనో .. ఈ బండల మాటున ఏ గుండెలు మొగెనో అన్నది సినిమా పాట 
 కదల లేని మెదల లేని ఆ శిలలు 
ఉలి అలికిడి వినగానే జల జలా భావాలను ప్రవహింప జేస్తాయి .. అని కవి వాక్కు 

'ఎట్లు పైకెత్తిరో..  ఏన్గు గున్నలకైన తలదిమ్ము గొలుపు 
ఈ శిలల బరువు '
అని బాల పుట్టపర్తి ఆశ్చర్యపడ్డారు..

'శిలలు ద్రవించి యేడ్చినవి.. '
కొడాలి సుబ్బారావు గారు 
శిలలకు మనసుంటుందని 
వాని హృదయమూ ద్రవిస్తుందని 
అవి కన్నీరు పెట్టుకుంటాయని చెబుతున్నారు

'ఉలి చేరాలకు చక్కిలింతలిడి ..
ఆయుః ప్రాణములు' శిల్పి పోస్తాడని 
పుట్టపర్తి తన పధ్నాలుగో యేట పెనుగొండలక్ష్మిలో వ్రాసుకుంటే.. 
అబ్బురపడ్డారు రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మ వంటి పెద్దలు. 

పుట్టపర్తి పెనుగొండలక్ష్మి లో 
ఇటువంటి అద్భుతమైన వర్ణన లున్నాయి  .. 

మనమూ కొన్ని వందల వేల సంవత్సరాలు 
శిలలై పడివుండి..
ఎవరో మహాత్ముడు మనపై పాదం మోపిన పుణ్యానికి .. మన కర్మ నశించి .. 
జన్మల నడక మొదలై..
ఇదిగో మనిషి వరకూ వచ్చామట..


మరి ఆ శిలల నవరసావిష్కరణ 
పుట్టపర్తి నోటి వెంట వింటే ఎలా వుంటుంది .. 
విజయ నగర సామాజిక చరిత్ర నుంచీ .. 




































విరుపాక్ష స్వామి గోపురములు


విఠలాలయం సమీపం లోనే రాతిరధం వుంది ..
ఇది ఒకే శిల
దీని చక్రాలు తిరుగుతాయి.. కదులుతాయి కూడా..


28 ఫిబ్ర, 2016

యువ రేడియో లో పుట్టపర్తి శివ తాండవం


యువ రేడియో లో పుట్టపర్తి శివ తాండవం 







మరి పుట్టపర్తి గళం లో శివతాండవం 
మరోసారి వింటే ఎలా వుంటుంది .. 








27 ఫిబ్ర, 2016

కుహు .. కు హూ ..



ప్రాచీన కావ్య సాహిత్యములు జెప్పెడి కొన్ని ఆచారములు మనకర్థమేగావు.
జీవన విధానమే మారిపోయినవి కదా..
నాచనసోముడు మొదలైన వారు ఇట్టి ప్రయోగము లెన్నిటినో చేసినారు.
కీర్తిశేషులు సురవరం ప్రతాపరెడ్డిగారు .. 
వేటూరి ప్రభాకరశాస్త్రి గారి వంటి విద్వాంసులెంతయో శ్రమకోర్చి కొన్నింటి కర్థములను వివరించిరి.
కాని .. ఇంకను దెలియని వెన్నో గలవు.
అన్నమయ లోనిట్టివి వేలకు..
నలుగురు చెప్పని రీతిగా జెప్పవలె ననునాస వరాహపురాణములో నెక్కువ..
ఈ గుణము హర్షింపదగ్గదే..
కాని.. సాధించుట కష్టము..

ఆంధ్ర సాహిత్యములో నీ ''మురారే స్త్రుతీయః పంధా' ను సమర్థముగా నెగ్గించి కొన్నవారిద్దరే..
రాయలు.. తెనాలి రామకృష్ణుడు..
ఈ క్రిందిది వీరి వసంత వర్ణనములోనొకటి..

కం. తన పగతు కంఠమును బో
లె నటించురతీశ్వరుండలిగి కత్తుల బో
నున బెట్టిన మూల్గెడి విధ
మున పికము ప్రవాళ మధ్యమున నెలుగించెన్..

వసంత కాలములో కోకిల కూసిన స్వారస్యమిది 
మనకవులు కోకిల స్వరమును పంచమ స్వరముతో బోల్చి యెంతయో మురిసిరి..
దాని కషాయ  కంఠమున కేమేమో మేత లు ..
వీరి కోకిల మూల్గినదట..

వరాహ పురాణము పీఠిక నుంచీ..