12 జులై, 2016
రాళ్ళపల్లి వారి అభిప్రాయం
లేబుళ్లు:
చిత్రాలు
,
పుట్టపర్తి పై ప్రముఖుల అభిప్రాయం
7 జులై, 2016
ఆ మట్టి లో కలిసి పోవాలి
లేబుళ్లు:
చిత్రాలు
,
జీవన చిత్రాలు
,
పుట్టపర్తి భావ లహరి
6 జులై, 2016
సీతా ప తే ..
లేబుళ్లు:
జీవన చిత్రాలు
,
పుట్టపర్తి భావ లహరి
,
వీడియోలు
మధురై మణి అయ్యర్ ఇంగ్లీష్ నోట్
మధురై మణి అయ్యర్ ఇంగ్లీష్ నోట్ అందులోదే..
లేబుళ్లు:
జీవన చిత్రాలు
,
పుట్టపర్తి భావ లహరి
,
వీడియోలు
మా జానకి ..
మా అక్కయ్య రేడియోలో ఉద్యోగంలో చేరిన తరువాత అయ్య కిష్టమైనవన్నీ కేసెట్ లో రికార్డ్ చేసుకువచ్చింది అది అయ్యకు ఒక అద్భుతమైన కానుక
సమయం దొరికినప్పుడల్లా ఎంతో ప్రీతిగా వినేవారు.
హితవు మాటలెంతో బాగ బల్కితివి.. అన్నచోట ఎంత ఎంజాయ్ చేసేవారో..
లేబుళ్లు:
జీవన చిత్రాలు
,
వీడియోలు
2 జులై, 2016
సంహార తాండవము
సం హార తాండవము
ఈ తాండవము ప్రపంచ లయమును సూచించునని నాట్యశాస్త్రము పేర్కొనినది.
మాయా వ్యామోహములనుండి
జీవకోటిని విముక్తము చేసి
తనలో ఐక్యము చేసుకొను తత్వము కలిగినది
నటరాజు ప్రదర్శించిన సం హార తాండవము
"శోకమ్ము సంతోషమేకమ్ము నరకంబు
నాకంబ నేకమ్మనంత మాకాశమ్ము
పరిగతంబగు భూమి నవనిధులు బిల్వములు
తరుణ బీజములు గొవ్విరులు, గసి మొగ్గలును
జఠరాంధకా రంబు పరిణాహి చంద్రికలు
పరమ ఋషుల జ్ఞాన భరితులందరుకునే
డద్వైవైత మద్వైతమని మాటి మాటి
కద్వయముగా నొత్తి, యఖిల లోకము లా ర్వ.. "
సర్వ ప్రపంచము పరమత్మయందు లీనమై
అద్వైత స్థితి ననుభవించినట్లు చెప్పబడుట చేత
నిది సం హార తాండవము.
ఇది
పంచకృత్యములలోని లయభావమును
సూచించును
ఈ విధముగా ఈ శివతాండవ కావ్యము
'తలపైని చదలేటి అలలు తాండవమాడ '
అని సృష్టి భావము ప్రకటించు వర్ణనముతో ప్రారంభించబడి
సం హార తాండవముతో ముగించబడినది.
సృష్టి స్థితి తిరోధాన అనుగ్రహ లయాత్మకమైన ప్రంచకృత్యములు ప్రకటించు సప్త తాండవములు
ఈ కావ్యమునందు వర్ణింపబడినవి.
సంధ్యాసమయమున నటరాజు నృత్తము చేసినట్లు చెప్పబడి సంధ్యాతాండవముగ కని పించు నీ కావ్యము సప్త తాండవ వర్ణనము కలిగి
" శివతాండవము"
అను కావ్య నామమునకు విస్తృతార్థము స్థిరపరచినది
-వఝ ల రంగాచార్య
శివతాండవము ఒక పరిశీలన.
ఈ తాండవము ప్రపంచ లయమును సూచించునని నాట్యశాస్త్రము పేర్కొనినది.
మాయా వ్యామోహములనుండి
జీవకోటిని విముక్తము చేసి
తనలో ఐక్యము చేసుకొను తత్వము కలిగినది
నటరాజు ప్రదర్శించిన సం హార తాండవము
"శోకమ్ము సంతోషమేకమ్ము నరకంబు
నాకంబ నేకమ్మనంత మాకాశమ్ము
పరిగతంబగు భూమి నవనిధులు బిల్వములు
తరుణ బీజములు గొవ్విరులు, గసి మొగ్గలును
జఠరాంధకా రంబు పరిణాహి చంద్రికలు
పరమ ఋషుల జ్ఞాన భరితులందరుకునే
డద్వైవైత మద్వైతమని మాటి మాటి
కద్వయముగా నొత్తి, యఖిల లోకము లా ర్వ.. "
సర్వ ప్రపంచము పరమత్మయందు లీనమై
అద్వైత స్థితి ననుభవించినట్లు చెప్పబడుట చేత
నిది సం హార తాండవము.
ఇది
పంచకృత్యములలోని లయభావమును
సూచించును
ఈ విధముగా ఈ శివతాండవ కావ్యము
'తలపైని చదలేటి అలలు తాండవమాడ '
అని సృష్టి భావము ప్రకటించు వర్ణనముతో ప్రారంభించబడి
సం హార తాండవముతో ముగించబడినది.
సృష్టి స్థితి తిరోధాన అనుగ్రహ లయాత్మకమైన ప్రంచకృత్యములు ప్రకటించు సప్త తాండవములు
ఈ కావ్యమునందు వర్ణింపబడినవి.
సంధ్యాసమయమున నటరాజు నృత్తము చేసినట్లు చెప్పబడి సంధ్యాతాండవముగ కని పించు నీ కావ్యము సప్త తాండవ వర్ణనము కలిగి
" శివతాండవము"
అను కావ్య నామమునకు విస్తృతార్థము స్థిరపరచినది
-వఝ ల రంగాచార్య
శివతాండవము ఒక పరిశీలన.
లేబుళ్లు:
వ్యాసాలు
28 జూన్, 2016
చిత్రం రం రమ్యతే తం త్రిభువన వపుషం విష్ణుమీశం నమామి..
ఆమె పేరు విమల
తండ్రిది చిన్న ఉద్యోగం
సినిమా రీళ్ళు పట్టుకుని ఈ థీయేటర్ కు ఆ థియేటర్ కూ తిరిగే పని
నలభైవేల అప్పు
అప్పు ఇచ్చిన మార్వాడీ కనపడినప్పుడలా విమలను దారిలో పట్టుకుని
నానా దుర్భాషలాడి అసభ్యంగా మాట్లాడేవాడు
తండ్రి అప్పు తీర్చలేడు
ఆమె యేం చేస్తుంది
లైబ్రరీలో పొద్దున సాయంత్రం కూచుంటే
ఒక ముఫై రూపాయలిస్తారు
దాంతో ఇల్లే గడుపుతుందా అవసరాలే తీరుస్తుందా..
తమ్ముణ్ణే చదివిస్తుందా..
అది పుట్టపర్తి ఇల్లు
అంటే మా ఇల్లు
అయిదుగురు ఆడపిల్లలు. ఒక కొడుకు చిన్న స్కూల్ టీచరు ఉద్యోగం
దరిద్ర దేవత తిష్ట వేసుకు కూర్చున్న కాలం
మా మూడవ అక్కయ్య తులజ కు నలుగురు స్నేహితులు
వారిలో ఈ విమల కూడ ఒకతె
ఆ నలుగురు మా అయ్యతో చక్కగా మాట్లాడేవాళ్ళు
మీ ఇంట్లో యేం వంట చేసినారే..
వంటి ప్రశ్నలతో వారితో హాస్యమాడే వారు మా అయ్య
నే ను అప్పటికి సంవత్సరం దాన్నేమో
వాళ్ళు కూడా అయ్యా అయ్యా అంటూ బిడ్డల్లాగే సన్నిహితంగా మసలేవాళ్ళు
ఒకరోజు ఈఅప్పు ప్రస్తావన వచ్చింది
విమల మా తులజక్కయ్య దగ్గరికి వచ్చి కళ్ళనీళ్ళు పెట్టుకుంటుంది
అప్పుడే వచ్చారు అయ్య
యేమైందే అని అడిగారు
తులజక్కయ్య విషయం చెప్పేసింది
ఎంత అప్పు అని అడిగారు
నలభైవేలు
కొంచెంసేపు ఆలోచించారు
సరే నేనిస్తాను తీసుకుపోయి వాణికి ఇచ్చేయ్
అన్నారు
నివ్వెరపోవటం నలుగురు స్నేహితుల వంతైంది
అన్నట్టుగానే నలభైవేలు ఇవ్వటమూ
ఆమె ఆ అప్పు తీర్చడమూ జరిగిపోయాయి
ఆమె జీవితంలో ఒక పెద్ద భారం దిగిపోయింది
1950 లలో నలభైవేలంటే తక్కువేంకాదు
అంత డబ్బును ఒక్క నిమిషం ఆలోచించి ఇచ్చివేసిన
పుట్టపర్తి వ్యక్తిత్వం ఎంత గొప్పదో ఆలోచించండి
మనలాంటి వాళ్ళైతే అసలు ఇవ్వడానికే ఆలోచిస్తారు
ఇచ్చినా ఇంక డప్పు కొట్టుకోవటం మొదలుపెడతారు
ఇచ్చి ఆ విషయాన్ని మరు నిమిషమే మర్చిపోయేవాళ్ళు
ఎంత గొప్పవాళ్ళు..
అటివంటివాళ్ళలో కూడా దోషాలు వెదికే కుమతులను
వాళ్ళ కర్మానికి వదిలేయాలి..
ఈ విషయం మా తులజక్కయ్య ఇప్పుడే ఫోన్ లో మాటల మధ్య చెప్పింది
ఇంకా ఇటువంటి సంఘటనలు ఎన్ని దాగున్నాయో పుట్టపర్తిలో
అందుకే మా అయ్య అంత గొప్పవాడయ్యాడు
ఫ్రెండ్స్ నాకీ రోజు చాలా ఆనందంగా వుంది
నా గురువు చాలా చాలా ఉన్నతుడు
నన్ను ఉధ్ధరించగలవాడు..
అటువంటి గురువు దొరికిన నేను ఎంతో అదృష్టవంతురాలిని..
షం
లేబుళ్లు:
చిత్రాలు
,
జీవన చిత్రాలు
27 జూన్, 2016
ఆతడొక చిత్రపురుషుడు..
![]() | |||||||||||||
''పరమ పదనాధ నిరవధిక కృపాపరిపాక పరిచిన సరస్కవితా సనాధు '' డట..
ఆతని ' పరమ పద నాధుడు' ను అతనివంటి హాస్యప్రియుడే..
ఈ విషయ మాయన వేషమే చెప్పుచున్నది..
ఆ కృష్ణునకు మంచి వెడదలగు కన్నులున్నవి..
వ్రేతల వలపించు వెరవులున్నవి..
మంచి పింఛమును జెరివినాడు
మువ్వంక మురువుతో.. మురళితో ..చూచుటకు ముచ్చటైనవాడు..
ఇన్నియుండియును పాపము దిస్సమొలయేనట..
ఒక్కొక్కసారి ''కడారపటుడై '' గనుపించును..
'చిప్ప కూకటియు'
నాకృష్ణునకు రామకృష్ణుడు నేర్పిన యొక సౌందర్యము..
ఎన్నియేండ్లనుంచి పట్టుకున్నాడో.. యా ప్రాత చిక్కము ..
నొకసారియైనను వదలడా పరబ్రహ్మము..
గచ్చకాయలో.. మద్దికాయలో యా కృష్ణుని సొమ్ములు..
ముక్కున ముంగరముత్యము కదలుచుండవలసినదే..
ఒకవేళ పాండురంగడు నడచినచో ..
'' పుట పుటనైయున చిని బొజ్జయు గదలుచు..
భక్తులతో ..రంగడేగాదు నేనుగూడ నున్నా '' నని హెచ్చరించుచుండును..
ఇట్లీకవి సృష్టించిన కృష్ణమూర్తి నూహించికొన్నప్పుడు
నా భావనలో
రామకృష్ణకవికి నకలు మూర్తియే గోచరించును..
ఇక నాదైవమును కవి సంబోధించు రీతులు గూడ పలుపలు రకములు..
ఒకసారి '' నందులేబట్టి '' యని..
సామాన్యముగ ననును..
ఒకపరి '' దేవకితర్ణక '' మని
గోకులమందున్న దూడలతో గోపాల కృష్ణుని గూడ లెక్కవేసి మాటాడును..
ఇంకొకసారి '' అఖిల నిమౌఘ గిరి గుహా హరి పృధుక '' మని యేమో గంభీరము గ
నతని గొప్పను జెప్పును..
మరల నొకపరి
'' ఎన్ని కల్పంబులరిగిన యేనయేండ్ల - వెలయు ప్రాయంబుగల కొయ్య విఠలయ్య ''
అని కుండ బగులగొట్టినట్లు రహస్యమును విప్పి చూపి
కృష్ణుని పరిహాసము జేయును..
లేక విసుగును జూపించును..
ఆ కృష్ణునివలెనే ఈ రామకృష్ణుడును
'' అవిదితగతి ''
ఈ పరమ పద నాధుని యుపాసనయు
రామకృష్ణుని నాటికి దెనుగుదేశమున నింకను బాగుగ బ్రాకలేదు..
కృష్ణరాయలొక్కమారు పండరికిపోయి వచ్చినటుల చరిత్రయున్నది..
అతనికా దేవునిపై భక్తి ప్రపత్తులుండుటకు గురుతా రాయలు గట్టిన విఠలాలయమే..
రామరాయలకును
పాండురంగనితో సంబంధమున్నట్లేవో కథలున్నవి..
ఎవరికో అక్కడక్కడ నొకరిర్వురికి
పండరినాధునిపై కన్నున్నను
ప్రజా సామాన్యమునకా యుపాసన
తెనాలి కవి నాటికి బాగుగా పా దుకొన్నదిగాదు..
తాతలనుండి రామభద్రుడు
తెనుగులకు నచ్చినదైవము..
కృష్ణరాయలకు '' విఠ్ఠల సంప్రదాయము ''
సోకుటాకు గారణమున్నది..
అతని కాలమునందును ..
అందుకు కొంత పూర్వమును
వైష్ణవముదే ప్రధమతాంబూలమైనను
దానిప్రక్కలో ద్వైతముగుడ ఎదిగినది..
రాయలనాడే
వ్యాసరాయలు.. కనకదాసు.. పురందరులు మొదలగువారుండిరి..
వీరందరు ప్రధానముగ పాండురంగని యుపాసకులే..
వెంకటపతి రాయల కాలమున ద్వైతులలో సామ్రాజ్యముతో నాంతరిక సంబంధముగలవారెవ్వరును గనుపింపరు..
మరి వైష్ణవుల శిష్యుడైన తెన్నాలికవికీ ద్వైతవాసన యెట్లుపట్టెనో
ఆతడొక చిత్రపురుషుడు..
(ఈ ఫొటో లో వున్నది నేను (చిన్నపిల్ల)అమ్మ అయ్య
మూడునాలుగు రోజులున్నాము అక్కడ
ఉన్నన్ని రోజులు అయ్యను ఎంత ప్రేమగా చూసిందో అమ్మ
పక్కన కూచున్నప్పుడు తలపై చేయి వేసి నిమురుతూనే ఉంది
నోట్లో అన్నం తినిపించడం ..
నోరు తుడవడం ..
నాన్నా .. అని పిలవడం..
ఎంత అదృష్టం . . )
లేబుళ్లు:
పుట్టపర్తి చమత్కార విన్యాసం
,
పుట్టపర్తి భావ లహరి
,
వ్యాసాలు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు
(
Atom
)




