23 జన, 2012



ప్రజలకందరికీ అర్థమవ్వాలని ఆరంభించిన..
ప్రజాకవిత్వంలో ..
ప్రస్తుతం వస్తున్న కొత్త పోకడలు..
పూర్తి అస్పష్టంగా..
అర్థంగాని రీతిలో ఉంటున్నాయని..
ఓ విమర్శ వుంది. 
ప్రాచీన కవిత్వాన్ని అర్థం చేసుకోవడానికి..
ఓ వ్యాకరణమనో ..
చందశ్శాస్త్రమనో ..
పధ్ధతులున్నాయి..

కానీ ..
నేటి కవిత్వం అర్థం కావడానికి..
ఓ విధానం అంటూ లేదు ..
మరి..
ఈ అస్పష్ట కవిత్వం వల్ల..
ప్రయోజనం ఏమైనా వుందా..?
 
ప్రజాకవిత్వమనే మాట..
సామాజిక స్పృహకు పుట్టిన మరొక కొమ్మ.
కవిత్వమని ఎప్పుడన్నామో ..
అప్పుడే దాని ఫీల్డ్ పరిమితమని అర్థమౌతుంది. 

గిరిజనులకు ..
హరిజనులకు ..
తండాలకు ..
చెంచులకు..
అందరికీ ప్రజా కవిత్వం అర్థం కాదు కదా.. 

కనుక ..
అందరికీ కవిత్వం అర్హమౌతుందనుకోవడం..
ఒక పిచ్చి విశ్వాసం..
పైగా ..
నాకు ఎక్కువ బాధ కలిగించే విషయం ఏమిటంటే ..
ఈ సభల్లో కవిత్వాలు చదవడం..
అనధికారులంతా చప్పట్లు కొడితే..
తన జన్మ కృతార్థమయ్యిందని కవి అనుకోవడం..

నేను సభల్లో ఎక్కువగా కవిత్వం చదవను. 
కవిత్వం ఏకాంతంగా చదువుకుని..
మనసులో భావింపవలసిన పదార్థం. 
దానిని సంతలో పెట్టడం నాకిష్టం లేదు. 
పైగా శ్రోతలు తన వైపుకు అభివృధ్ధి చెందాలని..
రచయిత ప్రయత్నించాలి గానీ ..
వారి స్థాయిని దిగజార్చాలని ప్రయత్నించగూడదు.
 
ఇక కవిత్వంలో అస్పష్టత గురించి..
ఈ రోగాలన్నీ మొదట పాశ్చాత్య దేశాల్లో మొదలౌతాయి. దాన్ని వాళ్ళు ముద్దుగా సింబాలిజం ..
మిల్టన్ ..
అని పిలుచుకుంటారు.

TS ఇలియట్ కూడా..
సింబాలిజం కు చెందిన కవే ..
కానీ ..
అతని పైన భారతీయ అధ్యాత్మిక ప్రభావం వుంది. 
అతడు కొంతవరకు అర్థమౌతాడు. 

 తర్వాత ..
C .డెలిగీస్ ..
W. D. ఆడం 
ఇంకా ..
TS ఇలియట్ 
ఫ్రాయిడ్ ..
అనుయాయులు మరికొందరు ..
రంగంలోకి వచ్చారు 

ఈ నడుమ ..
ఇంగ్లీష్ కవిత్వం చదువుతూ వుంటే ..
మనకు తెలియని పదం ఒకటీ వుండదు. 

కానీ..
వాడేమి చెప్తున్నాడనేది అర్థం కాదు. 
ఈ రోగమే ..
తెలుగుకు పట్టుకుంది. 

ఈ తెగకు చెందినవే ..
క్యూబిజం ..
డాడాయిజం ..
మొదలైన కేకలన్నీ. ..
అవి పాశ్చాత్య దేశాల్లోనే..
ఇప్పుడిప్పుడే చచ్చిపోతున్నాయి..
మన దేశంలో చచ్చిపోవడానికి ..
ఇంకొంచం సమయం పడుతుంది. 

క్యూబిజం అనేది..
చిత్రలేఖనం నుంచీ తీసుకున్న సిధ్ధాంతం..
డాడాయిజం .. 
రెండు యుధ్ధాల తర్వాత.. 
ఆదర్శాలన్నిటినీ గేలి చేయడమే..
ప్రధానంగా పెట్టుకున్నది. 

అసలు వాళ్ళ మనసుల్లోనే ..
షెల్లీ
తాత్కాలిక ప్రయోజనాలు పెట్టుకున్నారు.
 
ప్రాచీన కవిత్వం ఎందుకు అర్థం కాదు...?

ఒక పదం అర్థం కాకపోతే డిక్షనరీ చూసుకుంటాం...
నేను ఫారిన్ లాంగ్వేజెస్ రేడియో వినేవాణ్ణి. 

మిల్టన్ ..
షెల్లీ ..
కీట్స్ ..
మొదలైన వాళ్ళలో ఈ అస్పష్టత వున్నదా..?
లేదు కదా ..?

కీట్స్
దీనికి వాళ్ళు యేవేవో కారణాలు చెప్తారు. 
ఇటువంటి వాటన్నిటికీ ఆయుష్షు వుండదు. తెలుగులోనూ ..


ఇదే పధ్ధతి అయిపోయింది. 
ఒకడు వ్రాసినది.. ఇంకొకడు చదవడు. .
కారణం ..
పరస్పర గౌరవాలు లేవు...
ఎందుకు లేవు...?
ఇద్దరికీ ఏమీ రాదు కనుక ..

కానీ ..
నాకు భవిష్యత్తు పైన నమ్మకం వుంది. 
ఇది ఇలాగే చాలా కాలం కొనసాగుతుందని అనుకోను.
నాకు అనేక మంది ..
పీఠిక రాయమని ..
పుస్తకాలు పంపుతుంటారు. 
నేను రాయను ..
కాకపోతే వాళ్ళు "పొగరుబోతు.."
అని ఓ బిరుదు ఇచ్చుకుంటారు. ..
ఇచ్చుకోనీ ..

మా తట్టు ఒక సామేత వుంది. ..
"కట్టె తిప్పే వాని శక్తి ..
కట్టె నేలకు కొట్టడంలోనే" తెలిసిపోతుందట..

అలాగే మొదటి పేజీలోనే ..
అయ్యగారి సత్తా తెలిసిపోతుంది. 
ఇంక నేనేం రాయను. ..?

అభ్యుదయ కవుల్లో ..
అదందరూ వ్యర్థులని ..
నేనడం లేదు. 
కొందరు బాగా రాసే వాళ్ళున్నారు. 
వాళ్ళు నిలిస్తే నిలవ్వచ్చు.
తక్కిన వాళ్ళంతా షరా..

22 జన, 2012

 
 
సామాజిక స్పృహ ..
ఈ మాటను ఏ మహానుభావుడు..
వాడుకలోకి తెచ్చినాడో కానీ.. 
అప్పటినుండీ ..
ఈ మాట.. స్వైర విహారం చేస్తూ ఉంది..
 
వాళ్ళకు తోచిందంతా వ్రాసి..
సామజిక స్పృహ తెర వెనుక ..
ఎందరో అనక్ష రాక్షసులు ..
సారీ ..
 
అనక్ష  రాశ్యులు..
అల్పాక్ష రాశ్యులు ..
యధేచ్చా విహారం చేస్తూ ఉన్నారు..
 
సాహిత్యం లోకి రాజకీయాలు చొచ్చుకొని వచ్చి..
ప్రతిభ లేని వారికి ..
కల్పవృక్షంలా తయారయ్యింది..
 
ప్రతి ఒక్కడూ ..
ఏదో ఒక రాజకీయ గొడుగు కింద దూరటమూ ..
ఇదంతా కవిత్వమని ప్రజల నెత్తిన రుద్దటమూ.
ఆధునిక కవిత్వమంటే.. 
రాజకీయ కవిత్వమే.
 
 శ్రీ శ్రీ తర్వాత..
ప్రస్థుతం తెలుగు సాహిత్యంలో..
అంతటి ఉత్కృష్ట భావాలు చెప్పేవారు లేకపోవటంతో..
ఆ స్థానం ఖాళీగా ఉందనేది నిజమా..?

నిజమే ..
కానీ ..
ఎందుకు ఎవరూ రాలేదు ..?
దానిక్కారణం సిన్సియారిటీ లేకపోవడమే..

కొందరు మన దేశానికి ..
మన సభ్యతకు దూరంగా ఉండే ..
విదేశీ భావలను జొప్పించి ..
మెస్మరిజం చేయడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. 

కానీ ..
అవి నిలవవు..
ఎందుకంటే ..
ఆ భావం ..మన హృదయాల నుంచీ పుట్టింది కాదు 

తిలక్
శ్రీ శ్రీ కవిత్వం చూసామంటే ..
ఇటువంటివి కనపడవు
ఉదా ..
రాబందుల రెక్కల చప్పుడు ..
పొగ గొట్టపు భూంకారం ..
అరణ్యమున హరీంద్ర గర్జన..
అన్నాడు.

ఇందులో ప్రతి భావం ..
మనం అనుభవించిందే.. 
చూసిందే.. 
అందుకే ..
మనసుకు సంపూర్తిగా హత్తుకుపోతుంది..

అధునాతనుల్లో ..
ఒక్క తిలక్ మాత్రం ..
అతని త్రోవలో ..
అతను పరిణతుడుగా నాకు తోస్తాడు..
కానీ పధ్ధతి వేరు.


చందస్సు అంటే ..
గణ యతి ప్రాసలతో ..
కూడుకున్నదేనా ..?
లేక మరేమైనా అర్థం వుందా..?
కవిత్వానికి చందస్సు ఎంతవరకు అవసరం..?


చందస్సు అంటే నా దృష్టిలో ..
ఒక లయ ..
తర్వాత ఎన్నో రీతులుగా ..
దానికి కొమ్మలు రెమ్మలు పుట్టినాయి 
లా కంటే భిన్నమైనదిగా చందస్సు నాకు తోచదు. 
యతి ..ప్రాస ..
అన్ని కూడా ..
శ్రవణ సుఖానికి ఏర్పడ్డవి. ..

తర్వాత శాస్త్రకారులు ప్రవేశించి ..
ఏవేవో వింత వింత పోకడలు పోయినారు.

చందస్సులు ఎన్నని ..?
నువ్వు ఏది రాసినా..
అటో మాటిక్ గా .. 
ఏదో ఒక చందస్సులోకి వస్తుంది
దానికి పేరు పెట్టకపోవచ్చు ..
అది వేరే మాట ..

చందస్సు ప్రస్తారం చేస్తూ పోతే..
అనేక చందస్సులు ఏర్పడతాయి..

వాటినన్నిటినీ నువ్వు వాడకపోవచ్చు..
పేర్లు కూడా లేకపోవచ్చు. ..
సంగీతం కూడా అంతే ..
అనంతావై రాగాః...
అంటారు ..
రాగాలు ఎన్ని..?
అనంతం వాడుకలో వుండేవి ఏ కొన్నో ..

చందస్సులు కూడా అంతే..
చందస్సుకు లయ ప్రాణం..
కనుక..
ఆ లయ ఏ రీతిగా నడచినా ..
ఏదో ఒక చందస్సు అవుతుంది.
శ్రీ శ్రీ చందస్సుల నడుము విరగ్గొడతా అన్నాడే కానీ..
అతడు రాసినదంతా ఏదో ఒక చందస్సులోనిదే.. 


చందో బందో బస్తులన్నీ చట్ ఫట్మని తెంచి ..
అని అన్న శ్రీ శ్రీ రచనలో ..
యతి లేదూ..?
లయ లేదూ..?
స్పష్తంగా దీన్లోనే చందస్సు కనిపిస్తోంది..
 

18 జన, 2012

పుట్టపర్తి నారాయణాచార్యులు-పది కాలాలు నిలిచే కవిత్వం ఏది..?-- పుట్టపర్తి అనూరాధ



పది కాలాలు నిలిచే కవిత్వం ఏది..?
ఒకో దశలో ఒకో రకమైన భావోద్వేగాలు చుట్టుముట్టినపుడు..
తదనుగుణంగా సాహిత్య సృష్టి జరుగుతుంది..
ఆ భావోద్వేగాల తీవ్రత తగ్గిన తరువాత ..
వాని ప్రాధాన్యమూ తగ్గిపోతుంది..
కానీ కొన్ని ..
కాలాలు ఎన్ని మారినా ..
అజరామరమై.. 
మనవులకు దిశా నిర్దేశనం చేస్తూ..
నిలచి వుంటాయి..

అవే మన రామాయణమూ..
భారతమూ..
భాగవతమూ..
తదితరాలు..
రామచంద్ర మూర్తి నడకకు రెండు కాళ్ళు
సత్యం ధర్మం..
ఎంత కష్టం రానివ్వండి ..
సత్యమూ ..ధర్మమూ..
రెంటినీ జీవితంలో విడిచిపెట్టలేదు.
 
సత్యధర్మములను నమ్ముకున్న వానిని ..
ఆ రెండూ ఎలా కాపాడతాయో ..
రామాయణం మనకు చూపిస్తుంది..
సత్యమూ ..ధర్మమూ ..
ఎంతకాలం భూమి పై వుంటాయో ..
అంతకాలం రామాయణం నిలచి వుంటుంది.
ఒక మాట ఎలా మాట్లాడాలో ..
రాముడు నేర్పుతాడు..
ఆమాటకు కట్టుబడటమెలాగో.. 
రాముడు నేర్పుతాడు..
ఇది రామాయణానికి వున్న గొప్పదనం ..
అందుకే మన పెద్దలు రామాయణాన్ని ఎన్నడూ విడిచిపెట్టలేదు..
విశ్వనాధవారు రామాయణ కల్పవృక్షం వ్రాస్తూ అంటారు..
మళ్ళీ అందరూ వ్రాసే రామాయణం వ్రాయటమెందుకు..
అంటే ..
ప్రతిపూట తిన్న అన్నమే మళ్ళీ ఎందుకు తింటున్నావ్ అన్నం తినకపోతే వుండలేవు కనుక..
 
రామాయణం లేని నాడు మనిషికి జీవితమే లేదు..
మనిషి జీవితాన్ని..
మనిషి జీవితంగా నిలబెట్ట గలిగిందీ..
 
మనిషిని మనిషిగా ప్రవర్తింప జేయగలిగిందీ..
సృష్టిలో రామాయణమొక్కటే..
 
ఐన్ స్టీన్ ..
కలవడానికెళ్ళాడొకడు....
ఆయన సంస్కృతంలో ఆహ్వానించాడట ..
మన వాడికి అది అర్థం కాలేదు..
ఇది మీ సంస్కృతమే..

నీకు రాదా ..? అని అడిగాడు..
లేదు విన్నాను..

అది మన జవాబు..
 
మీ విజయ రహస్య మేమిటని అడిగితే ..
తన లైబ్రరీకి తీసుకెళ్ళి ..
ఒక పుస్తకం తీసి చేతిలో పెట్టాడుట..


అది మన భగవద్గీత..
తనకు మార్గ దర్శకత్వాన్నిచ్చినదీ గ్రంధమని చెబుతాడాయన..
పరిశోధన .. 
విశ్లేషణ ..
విచారణా .. 
దీర్ఘ దివ్య దృష్టీ ..
ఇచ్చింది ఇదే.. అన్నాడు..


చేసే కర్మను సద్భావనతో చేయి ..
సత్ జ్ఞానంతో చేయి అంటుంది..గీత..
ఏ సంస్కృతిలోని మంచినైనా ..
అంగీకరించడం సంస్కారవంతుల వల్లనే అవుతుంది..

మీ దృష్టిలో ఆధునిక సాహిత్యంలో పదికాలాల పాటు నిలబడగల రచనలేమైనా ఉన్నాయా..
మీవి ఉన్నాయా..
లేవంటే ..ఇంత సాహిత్య కృషీ.. వ్యర్థమైపోయిందనుకోవటానికి ప్రత్యేక కారణాలున్నాయా..
పది కాలాల పాటు నిలిచే కవిత్వాలు లేవని నేనెట్లా చెప్పేది..

ఒకానొకనాడు..
దేశభక్తి కవిత్వాలు ప్రముఖంగా ఉండేవి.. 
అటు తరువాత ..
ఏవో మత కలహాలకు సంబంధించిన గ్రంధాలు.. 
ఈ భావాలన్నీ ..
ఎప్పుడూ తాజాగా ఉంటాయని నాకు నమ్మకం లేదు.
 
ఇలాంటి రచనలన్నీ ..
వాటి అవసరం తీరిపోతూనే ..
మరుగులో పడిపోతాయ్ ..
శ్రీ శ్రీ కవిత్వం కూడా అంతే నేమో ఎవరికి తెలుసూ.. 


కానీ..
రామాయణ భారతాల ఆవశ్యకత ..
ఎప్పుడూ ఉంది.
భారత కథలో సన్నివేశ గాంభీర్యం ఉంది. 
రామాయణ కావ్యంలో రచనా శిల్పం ఉంది. 
సంస్కృత భారతం మన విజ్ఞాన సంపుటి. 
అందువల్ల ..
ఏ కాలంలోనైనా దాన్ని చదువుతాం..
సంస్కృతం పనికిరాదు ..
అది బ్రాహ్మణుల భాష ..
ఇలాంటి పిచ్చి పిచ్చి వాదన లు శాశ్వతంగా నిలవవు. 
ఏనాటికైనా..
ఎందరు ద్వేషించినా ..
అగౌరవించినా..
సంస్కృతానికున్న మర్యాద తొలగదు. 

తమిళం కూడా మొదట సంస్కృతాన్ని బహిష్కరించడానికి ప్రయత్నించింది. 
ద్రావిడ నాగరికత కొంత ప్రత్యేకత ఉన్నదని..
వారి వాదంగా ఉండేది. 
వేదాల్లోనే ..
కొన్ని ద్రావిడ పదాలు చొచ్చుకొని పోయినాయని ..
వారు ఈనాటికీ వాదిస్తారు. 
ఏదెట్లున్నా..,
సంస్కృతం తరువాత.. 
తమిళం అంత ప్రాచీన భాష మరొకటి లేదు ..
ఈ దృష్టితో ..
రామాయణం ఆర్య ద్రావిడ నాగరికతల సమ్మేళనాన్ని మనసులో ఉంచుకొని చేసిన కల్పనగా..
కొందరు వాదిస్తారు. 
రామాయణమేమిటి..?
అంతకు ముందే ఆర్యులు ద్రావిడులు కలిసిపోవటం బహుళ ప్రచారంలో ఉంది.
ఇంతకూ చెప్పొచ్చేదేమిటంటే..
సంస్కృతానికి లోబడని ..
అనంత శబ్ద సంచయం వారికున్నా సంస్కృతాన్ని బహిష్కరించడం వారికినీ సాధ్యమవలేదు 
ఇలాగా ఎన్ని భావాలు మారినా..
భారతదేశంలో ఆస్థికతా బుధ్ధి పోదేమో ..
అనే విశ్వాసం నాకుంది. 
దానికి సంబంధించి ..
దానికి సంబంధించిన ఉత్తమ శిల్పంతో కూడిన కావ్యాలు నిలుస్థాయేమో నని నా ఆశ. 
నా రచనలేమైనా ఉన్నాయా ..?
అంటే నేనేమీ చెప్పలేను ..
దానిని కాలమే నిర్ణయిస్తుంది.
నా సృష్టి వ్యర్థమైపోయిందని నేనెట్లా అనుకోను..?
నేను కాలంలో నిలుస్తాననే అహంకారం నాకుంది.
మీరు కవిత్వం రాయటం ప్రారంభించిన నాటి నుంచీ..
నేటి వరకూ చూస్తే ..
ఎన్నో మార్పులు వచ్చాయి.

మీరిప్పుడే కవిత్వ రచన ప్రారంభించే దశలో ఉన్నట్లయితే మీరెటువంటి కవిత్వం రాస్తారు..
 
ఈ ప్రశ్న ..
సంస్కారి అయిన వారి విషయంలో వేయదగ్గది కాదు. 
ప్రతిభావంతుడైన కవి ఎవర్నీ గుడ్డిగా అనుసరించడు. 

తన్నితరులు అనుసరించేలా చేసుకుంటాడు.
వాని మార్గాన్ని ..
వాని ప్రతిభ నిర్ణయిస్తుంది. 
ఇప్పుడు ..
నేను రచనను మొదలు పెట్టి ఉండినట్లయితే ..
నా మార్గాన్ని నేను అనుసరించి ఉండేవాణ్ణి..


16 జన, 2012





సంప్రదాయానికి విరుధ్ధంగా రాసిందే ఆధునిక మవుతుందా..
రామాయణాలు లెక్కలేనన్ని
మరి విష వృక్షం ఒక్కటే..
  
రంగనాయకమ్మ బాపుకి బ్లాంక్ చెక్ పంపారంట .. 
ఆ పుస్తకానికి అట్ట పై బొమ్మ వేసిపెట్టమని
అది తిరిగి వచ్చింది..
దాని పై "శ్రీరామ" అని రాసి వుంది...


కేవలం రాక్షస సంహారం చేయటానికే ..
రామావతారం వచ్చివుంటే ..
రావణాసుర సంహారం జరిగిన వెంటనే ..
రామావతార పరిసమాప్తి జరగాలి..
 
కానీ  అలా అవలేదు..
ఒక ప్రతిజ్ఞ చేసారు బాలకాండలో..
దశవర్ష సహస్త్రాణి..దశవర్ష
శతానిచ  అన్నారు ..
నేను 11,000 సంవత్సరాలు ..
భూమండలం మీద వుండి..
భూమండలాన్నంతటినీ పరిపాలిస్తాను..
దేనికొరకూ..
ఒక మనుష్యుడు మనుష్యుడుగా బ్రతకటమెలాగో నేర్పడం కొరకు..
చదవండి..


సంప్రదాయానికి విరుధ్ధంగా రాసిందే ఆధునికమవుతుందా..?

మన దేశంలో సంప్రదాయమూ ..ధర్మమూ..
రెండూ ముడిపడి వున్నాయి. 
కవిత్వం యొక్క ప్రధాన లక్షణం 
ధర్మాన్ని బోధించడమే కాదు ..

ముప్పాళ్ళ రంగనాయకమ్మ
ఆ కార్య నిర్వహణానికి  
ధర్మశాస్త్రాలూ ..స్మృతులూ ..
మొదలైన ఉపకరణాలున్నాయి

కనుక ..
కవిత్వం అనేది..
ధర్మ నిర్వహణలో పెద్ద ఉపకరణమేమీ కాదు. 

అట్లానే ..
ధర్మాన్ని పూర్తిగా ఉల్లంఘించడం కూడా ..
యోగ్యతను మీరిన అధిక ప్రసంగమౌతుంది.
కవిత్వం యొక్క ప్రధాన లక్ష్యం ..
దానిని చదివే సమయంలో..
బాహ్యములను మరచిపోయి ..
దానిలో లీనమయ్యేటట్లు చేయడం ..
ఆ రీతిగా చదివినప్పుడు. ..
ఒక సంస్కారం మనకు ఏర్పడుతుంది. 
దానితో మనసు విశాలం కావటానికి అవకాశం ఉంటుంది.
కావ్యంలో నాయికా లక్షణాలున్నాయి. 
పరకీయ నాయికలనే తీసుకున్నారు.
అభిసారికా వర్ణనలు
 అక్కడక్కడా కావ్యాల్లో వస్తాయి. 
అందులో కొంత "అనీతే" అంతర్గర్భితమై ఉందనుకుందాం. 
ఇవి ఏవో సామాన్య విషయాలు.
లోకంలో సర్వత్రా కాకపోయినా ..
ఎక్కడో ..ఒకచొట జరిగితే జరుగవచ్చు..

అటులనే సంప్రదాయాన్ని 
సమూలంగా ఖండించి.. 
విశృంఖలత్వాన్ని ప్రేరేపించే రచనల్ని చేసి..
ఇది ఆధునికత ..
అని ఎద గుద్దుకోవటం..
 బుధ్దిలేని పని. .
చాలా దినాల క్రిందనుకుంటాను ..
ఏదో ఒక కావ్యమో ..కధో ..చదివాను. 
అందులో అశోకవనం లో ఉన్నసీత ..
రావణాసురుని ప్రేమను చూచి జాలిపడి..
అతనిని కౌగిలించుకోవడానికి తయారవుతుంది. 
నా మనస్సుకు చాలా నొప్పి కలిగింది. 
మన మనస్సే.. 
మన రచనల్లో అభి వ్యక్త మవుతుంది. 

ఎక్కడో ..ఎవ్వరో..
వ్రాస్తే చదివానో ఘట్టం..
భరతుడు శ్రీరాముని పాదుకలను నెత్తిమీద పెట్టుకుని వచ్చేది. 
చెప్పులు మోసేవాడు ..
వీడేం మనిషి అన్నాడాయన ..
రచయిత మనస్సలాంటిది.
మరి రాముని చెప్పులపైనే ..
దేశికులు "పాదుకా సహస్రము" వ్రాసినారు.
ఆ పాదుకలను మనం పూజిస్తున్నాం.
ఇలా మాట్లాడే వాళ్ళంతా 
ఆటవిక మనస్తత్వులని నాకనిపిస్తుంది. 
వారు మమ్మల్నీ అదే మాటంటారనుకుంటాను. 
అస్తు.. 
నాకేమీ నొప్పి లేదు..
కానీ దీన్నంతా ఆధునికత ..
అని వాదిస్తే మాత్రం మా మనస్సంగీకరించదు.

13 జన, 2012

బాగా చదువు కోవటం ..

                     


బాగా చదువు కోవటం గొప్ప విషయమైతే ..
ఆ గొప్పను గొప్పవారు ఒప్పుకొనేలా చేయటం 
ఇంకా గొప్ప విషయం
అందరూ పండితులే 
అందరూ శాస్త్ర కోవిదులే..
ఒక పసివాడు 
నేను మీ అందరితో సమానుణ్ణి 
లేదా మీ కంటే గొప్ప వాణ్ణి ..
కావాలంటే పరీక్షించుకోండి..
సంగీతమా..
సాహిత్యమా..

నాట్యమా..
సంస్కృతమా..
వ్యాకరణమా..
రామాయణ మహాభారత భాగవత గ్రంధాలా..

ఇతరభాషలంటారా..
మళయాళం.. తమిళం.. కన్నడమూ..
తెలుగూ ..సంస్కృతం ..
ఉత్తర హిందుస్థానీ భాషలు ..అవధీ ..వ్రజభాష..
ప్రాకృత భాషలు..
అర్థ మాగధి ..మాగధి..పైశాచీ..
లాటిన్ ..గ్రీకు ..రష్యన్..

అని బరిలోకి దిగితే మిగుడు పడటానికి అది మందు బిళ్ళా..
మీరే చెప్పండి..??
అందులోనూ ప్రాంతీయ భేదాలూ..మత భేదాలూ..
అహంభావ సమస్యలు..
వీటన్నిటినీ ఆ చిన్నవాడు..
ఎలా ఎదిరించాడు..?
వారు అతనికి నీరాజనాలిచ్చేలా ఎలా ఎదిగాడు..?
ఇదిగో  చదవండి..
 
మీ సాహిత్య జీవితంలో మరపురాని సంఘటనలు ఉంటే చెప్పండి..                 
                         
ఎన్నో ఉన్నాయ్..
మరపురాని సంఘటనలు...
చెళ్ళపిళ్ళ
అహమేవ పండితాహ ..
అనే భావనతో మొదలు పెట్టినవాణ్ణి ..
ఇప్పుడు నా అహం పండితాహ అనే స్థితికి వచ్చినాను. 

ఈ స్థితికి రావటానికి ..
కొన్ని నూర్ల సన్నివేశాలు జరిగివుంటాయి..
వయసు ..
దానితో బాటు పరిపక్వత చెందుతుండే మనసు..
నన్ను మార్చివేశాయ్ ..
నా కాలంలో ..
పెద్దవాళ్ళనిపించుకున్న ఎందరితోనో.. 
 పేచీలు పడ్డాను. 
మల్లంపల్లి

ఈనాటికీ నా భావాలట్లే ఉన్నాయ్...
కానీ ..
వానిని వెల్లడించే పధ్ధతిలో మార్పు వచ్చిందంతే.
చెళ్ళపిళ్ళవారూ ..
శ్రీ పాద వారూ ..
వీరితో పెద్ద రగడలే జరిగిపోయాయ్..
చిన్న వయసున ..
పెద్ద పరిశ్రమ కావడంతో..
చాలా మందితో పోట్లాడవలసింది. 

ఒక చిన్న ఉదాహరణ చెప్తాను..
నేను నా 19 వ  సంవత్సరంలో ..

శ్రీ పాద 
భారతిలో ప్రాకృత కావ్యాల్ని గూర్చి కొన్ని వ్యాసాల్ని వ్రాశాను. 
అప్పుడు మల్లంపల్లి వారు భారతి ఎడిటర్గా ఉండేవారు. నేనొకసారి భారతి ఆఫీసుకు పోయినాను. 
మల్లంపల్లి వారు అఫీసులో ఉన్నారు.
నన్నెవరో చిన్న పిల్లవాడనుకున్నారు.
నేనే పుట్టపర్తి నారాయణాచర్యులంటే ఆయన నా వైపు ఆశ్చర్యంగా చూశారు. 
ఆయన అన్నారు ..
నీ వయస్సేదో అరవయ్యో.. డెభ్భ్య్యో .. 
పెద్ద నామాలు ఇట్లా ఊహించానండీ..
అన్నాడు..

ఆయన మరణించేవరకూ నన్నెంతో గౌరవంగా చూసేవారు..
ఆయన చారిత్రికుడిగా నన్ను చూసేవారు.
శ్రీపాద వారితో నేను కలిసినప్పుడు పెద్ద రంధే అయిపోయింది.

చెళ్ళపిళ్ళ వారు..
విశ్వనాధ
నీ తెలుగు కవిత్వం కంటే నీ సంస్కృత కవిత్వమే నాకు బావుంది నాయనా అన్నారు.
ఎన్నో ఇలాంటివి..
నేనేమని చెప్పేది.. 
విశ్వనాధ వారితో సవాలక్ష సార్లు కొట్లాట.

కానీ ఆయన మహా రసికుడు...
మహా మనస్వి...
బెజవాడలో ..
ఒకసారి నా శివతాండవం విని..
నన్ను భుజాలపై వేసుకుని ఎగిరాడు. 
అంతటి రసలుబ్ధుడాయన. 
ఇలాంటి సందర్భాలు ఇంకా నూర్లకు వున్నాయి..