17 జులై, 2013

"రామ చరిత మానసామృతము" --పుట్టపర్తి మరో అద్భుత గ్రంధ సమీక్ష





నేల నూతల కృష్ణమూర్తి గారి భార్య యైన పార్వతమ్మ గారు వ్రాసిన 
"రామ చరిత మానసామృతము" 
అను గ్రంధమునకు ఆశీర్వచనము 
అను పేర వ్రాసిన పీఠిక ఇది

పుట్టపర్తి పీఠికలతో ఆయా గ్రంధములకు విలువ పెరిగేది
పార్వతమ్మ గారి భర్త అయిన 
నేల నూతల కృష్ణమూర్తి గారు 
శ్రీమద్రామాయణమును ఇంగ్లీషునకనువదించినారట

వారి సతీమణి తులసీదాసుని అర్చించినది
పుట్టపర్తి గారు నెల్లూరునకు
ఆ పరిసర ప్రాంతములకు సన్మానములకు వెళ్ళినప్పుడల్లా 
వారింటనే దిగేవారట..

అప్పుడు 
శ్రీ రామావఝుల శ్రీశైలం గారు 
నేలనూతల వారింటికి వెళ్ళి పుట్టపర్తిని దర్శించేవారట

"ఇది మూలమునకు 
యధాతధముగా సాగిన రచన కాదు
తనకింపుగ తోచినచోటనే అనువదించును
ఇట్టివచనములు 
పాఠకులలో మూలగ్రంధమును 
జదువవలెనను ఆశను రేకెత్తించును "
అంటారు పుట్టపర్తి 
పార్వతమ్మ గారి రచనను పరిచయం చేస్తూ

ఇంకా
వాల్మీకి రామ తత్త్వము పూర్తిగా అర్థమవలేదట
అందువలననే కలియుగమున తులసీ దాసుగా అవతరించెనట
ఉత్తర హిందూస్థానములో 
ప్రజల నమ్మకమిది
"అయోధ్య కాశీ మొదలైన ప్రదేశములలో 
దీని ప్రశస్తి అంతా ఇంతా గాదు
రెండు శాస్త్రములలో సమగ్ర పండితుడైననూ
ఆదేశమున తులసీదాసునే పారాయణమొనర్చును..

బైరాగులు వీధులలో 
వ్యాసపీఠముపై తులసీరామాయణముంచికొని 
దానిపై రెండుపువ్వులనుంచి కూర్చొనెదరు

వారి యెదుట కాసులు కుప్పలుగా పడియుండును అంటారు..
ఇది 1961 న వ్రాసిన పీఠిక 
శ్రీశైలం గారు నెల్లూరు వెళ్ళి
కష్టపడి సంపాదించినది..


పుట్టపర్తి జీవితానికి కొత్త దర్శకులు






పుట్టపర్తి చరిత్రను 

పలువురు పలు రకాలుగా వక్రీకరిస్తున్నారు అభిమానులు శిష్యులు అనేపేరుతో 
వారి నిజ జీవిత విశేషాలను కనీసం సరిగ్గా విచారించకుండానే 
పెద్ద పెద్ద పుస్తకాలు వ్రాసి 
పదుగురితో ప్రశంసలందుకుంటున్నారు  

ఇటీవల శశిశ్రీ వ్రాసిన 

 కేంద్ర సాహిత్య అకాడమీ ప్రచురించిన 
మోనోగ్రా ఫ్ లో నూ  
భయంకరమైన 
క్షమించరాని తప్పులు దొర్లాయి 

విద్వాన్ పరీక్షకు పుట్టపర్తి తన పాఠ్యభాగాన్ని 

తానే పరీక్ష వ్రాయవలసి వచ్చింది 

ఇది యే కవి జీవితంలోనూ సంభవించని 

అరుదైన సంఘటన
 శశిశ్రీ విద్వాన్ ను ఇంటర్ మీడియట్ గా మార్చారు 

జిల్లెళ్ళమూడి అమ్మ తానే స్వయంగా 

ఒక ఇల్లు ఖరీదు చేసి పుట్టపర్తికి అందించినట్లు వ్రాసారు 
కానీ జరిగింది వేరొకటి 

ఇంకా పుట్టపర్తి 

ఆకాశవాణికోసమే కృతులను రచించినట్లు వ్రాసారు

 పై విషయాలకు స్పందించిన శ్రీ శ్రీశైలం గారు 

"సరస్వతీపుత్రుని శతజయంతికి నిజమైన నివాళి ఇదేనా..?"
 అని వ్రాసారు 

కేంద్ర సాహిత్య అకాడమీ 

 ఈ పుస్తకంలోని తప్పులను సరిదిద్దాలి 
లేకపోతే 
 ఈ పుస్తకం మిగతా ఇతర భాషలలోకి అనువదించబడి

 పుట్టపర్తి జీవితానికి వక్ర భాష్యంగా నిలచిపోతుంది 






14 జులై, 2013

13 జులై, 2013

"తీరని బాకీ " ప్రసిద్ధ మళయాళ నాటకములకు పుట్టపర్తి అనువాదం


పుట్టపర్తి కేరళలో మళయాళ డిక్ష్నరీ రూపొందించడానికి 
ఆనాటి మళయాళ పండితుల ఎంపికతో 
అప్పటి కేరళ ప్రభుత్వముచే పిలువబడి
తిరువాన్కూరులో పనిచేస్తున్న కాలంలో 
మళయాళ ప్రసిధ్ధ నాటకాలను తెలుగుకు అనువదించారు. 
అదే యీ "తీరని బాకీ"

అలానే మన విశ్వనాధ సత్యనారాయణగారి ఏకవీరనూ  
మళయాళ భాషలో అనువదించి 
వారికి మన తేటతెనుగు కమ్మదనాన్ని రుచి చూపించారు

కేరళ ప్రభుత్వమూ

మీ తెలుగువారు మీ ప్రతిభను గుర్తించలేదు 
మేము మిమ్మల్ని మా కేరళ ప్రభుత్వము తరఫున 
ఢిల్లీ కేంద్ర గ్రంధాలయానికి మా ప్రతినిధిగా పంపుతున్నాము 
అని ప్రకటించింది


వీనిని అనువదించిన కాలంలోని పరిస్తితులూ
నాటి సంఘటనలను తెలుసుకొనే ప్రయత్నం చేసాను
కానీ
పుట్టపర్తిని తను సంపాదిస్తేనే కానీ గడవని 
కుటుంబ పరిస్థితులూ కానీ
ఆర్థిక పరిస్థితులు కానీ
కేరళ వాతావరణము కానీ
అక్కడ స్థిరంగా నిలుపలేక పోయింది
వారి ఆదరణ
అందివస్తున్న అవకాశాలకంటే
సాధనా మార్గమే ఆయనకు అమూల్యమైనదిగ తోచింది
అందుకే బ్రతుకునకు బడిపంతులు ఉద్యోగమే తనకు సరైనదిగా ఎంచి
తిరిగి కడప గడప తొక్కి
జీవితంలోని ప్రతిక్షణాన్నీ అటు సాహిత్యానికీ

ఇటు ఆధ్యాత్మికానికీ పంచి పెట్టారు.

భగవంతుడు నాకీ అవకాశాన్నిచ్చి 
నన్ను తరింపజేసినందుకు
మా అయ్య నా గురువు 
శ్రీమాన్ పుట్టపర్తి వారి ఆశీస్సులు నాకు లభిస్తాయని 
నా విశ్వాసము.

పుట్టపర్తి అనూరాధ



7 జులై, 2013

బాపురెడ్డి



J.బాపురెడ్డి
వీరి పుస్తకాలు మా ఇంట్లో ఉండేవి
రచయితలు కవులు 
తమ పుస్తకం వెలువడిన తరువాత 
ప్రముఖులకు కాపీలు  పంపుతుంటారు కదా 
అలా 
మా ఇంటికి చాలా  పుస్తకాలు వచ్చేవి
















5 జులై, 2013

పుట్టపర్తి స్నేహితుడీయన









అది 1941 వ సంవత్సరము
ధర్మవరంలో సరస్వతీ నిలయము 
అనే గ్రంధాలయ మూడురోజుల వార్షికోత్సవాలు

చివరిదినమది..
గుఱ్రం జాషువా కవి ఉపన్యసిస్తున్నారు..
పుట్టపర్తి "షాజీ" కావ్య ప్రసక్తి వచ్చింది
షాజీ కావ్య రచన అంతా 
నా రచనా విధానానికీ 
భావావేశానికీ ప్రతిబింబమే కానీ
దానిలో కవి ఉపజ్ఞ తక్కువ 
అన్నారు జాషువా..

సభ నేర్పాటు చేసిన వాడు
స్వయానా పుట్టపర్తి స్నేహితుడు ఆప్తుడు
తన  ఆప్తుని పైనా
అందునా 
స్వయం ప్రజ్ఞా ధురీణునిపైనా 
చేసిన నిందారోపణలను సహించలేకపోయినాడు..

జాషువా గారి ఆరోపణలకు ఆధారాలేవో 
సభాముఖంగా వివరించమని కోరినాడు
ఆయన కొంత కోపంగా సమాధానం చెప్పే ప్రయత్నం చేసే సరికి 
సభ గగ్గోలయ్యే పరిస్థితి వచ్చింది
అందరూ సర్దుబాటు చేసినారు

ఇది ఎవరి అనుభవమనుకొంటున్నారా
పుట్టపర్తి స్నేహితుడు సహపాఠీ
 కలచవీడు శ్రీనివాసాచార్యులు గారివి

ఒక పదహారేండ్ల యువకుడు
తిరుపతి వేంకటేశ్వర సంస్కృత కళాశాలలో 
ప్రవేశాన్నర్థించేందుకై వచ్చినాడు
ప్రవేశం నిరాకరింపబడింది
ఎర్రబడిన ముఖంతో 
భావి కర్తవ్యాలోచనతో 
ఆఫీసు గడప దాకా వస్తూ వస్తూ ఏవో కొన్ని పద్యాలు చెప్పటం
ప్రిన్సిపాలు గారు వినటం తటస్థించించింది 
వారూ సామాన్యులు కాదు 
సంస్కృతాంధ్రాంగ్ల భాషలలో దిట్టమైన పండితుడు


అవి వేడుకోలు పద్యాలు కావు
హృదయావర్థకమైన భావపుష్టితో 
ఆత్మాభిమానాన్ని వెల్లడించేవి

మనస్సునందే వెలుగు వెలిగిందో 
వెంటనే
ప్రిన్సిపాలు గారు పిలిచారు మళ్ళీ వెనుకకా బాలుణ్ణి
మళ్ళీ ఆపద్యాలు చెప్పించుకున్నారు
ప్రిన్సిపాలు గారి ముఖంపై 
చిరునవ్వు..
ఆశ్చర్యం ..
వాత్సల్యం.. తొణికిసలాడాయి
వెంటనే నీ ఇష్టం వచ్చిన క్లాసులో చేరవచ్చునని సెలవిచ్చారు

ఈ అనుభవాన్నీ ప్రత్యక్షంగా పంచుకున్నారు 
కలచవీడు శ్రీనివాసాచార్యులు గారు

ఏకసంథాగ్రాహిత్వమూ
తీక్ష్ణమైన బుధ్ధీ గల పుట్టపర్తికి
నత్త నడక నడిచే ఆ విద్యా విధానం బొత్తిగా నచ్చలేదు

అందుకే
క్లాసులో పాఠం చెప్పే అయ్య వారికే అర్థం గాని
 ప్రశ్నలను సందేహాలనూ వదిలి
వారు తికమక పడితే పగలబడి నవ్వుకునే వారట

ప్రతిక్లాసునూ సాగనివ్వక ఇబ్బంది పెట్టే విద్యార్థిగా 
'get out from the class'
అనిపించుకొని దినమంతా లైబ్రరీలో గడిపేవారు
వున్న పుస్తకాలన్నిటినీ చదువుతూ

ఇంకా
జాషువా ఖండ రచనలూ.. 
రాయప్రోలు తృణకంకణమూ .. 
విశ్వనాధ వారి దీర్ఘ సమాసోపేత రచనలనూ ..
చదివి తోటి విద్యార్థులకు వినిపించేవారు

మా అంతట మేము చదువుకుంటే
అంత రమ్యంగా వుండేవి కావు
ఆయన చదివితే అదేదో మైమరచి వినేవాళ్ళం
ఆ హృదయానికీ ఆ కంఠానికీ
అంత పొత్తున్నది
అంటారు శ్రీనివాసాచార్యులు గారు

ఈ విషయాలన్నీ మా అయ్య మాటల్లో 
మేము వినే వాళ్ళం
నవ్వి నవ్వి ఎర్రబడిన ఆ ముఖం
ఇంకా గుర్తే..