7 సెప్టెం, 2013

"భవభూతి" నాటక కర్త













శ్రీ  రామ దాసు సినిమా.
ప్రజల సహకారంతో రామ మందిరం కట్టాడు రామదాసు
మందిర ప్రారంభోత్సవ శుభ సందర్భంలో నే
కొడుకు అన్నం వండే పాత్రలో పడి  చచ్చిపోయాడు

వెంటనే
 వెంటనే రాముని వేషంలో ఉన్న సుమన్
హనుమంతుని పంచ ముఖ ఆంజనేయునిగా పంపాడు


 పెద్ద స్వరూపంతో గాలిలోకి ఎగిరిన ఆయన నీడపడి
రామదాసు  కొడుకు మెల్లగా కళ్ళు విప్పాడు

అదే రామదాసు ని

ప్రభుత్వ ధనంతో రామాలయం నిర్మించావన్న నేరంపై
చెరసాలలో వేసి భయంకరంగా హింసిస్తుంటే
ప్రతి దెబ్బకూ రామా రామా అంటున్నా

చిలుకలకు పండ్లు తినిపిస్తూనూ

ధ్యానంలోనూ
విశ్రాంతిలోనూ కాలం గడిపాడు తప్ప పట్టించుకోలేదు

రామదాసు 

రామా రామా అన్న అరుపులు 
దండకారణ్యంలో వనవాసం సెట్టింగ్ లో 
ఉన్న సీత కు వినపడి ఆమె ఆందోళనగా ముఖం పెట్టి
'ఇంకా కాపాడరెందుకు..?'
అని చూపులతో రాముణ్ణి ప్రశ్నిస్తున్నా
రాముడు అక్కణ్ణుంచీ లేచి వెళ్ళాడే తప్ప
కాపాడలేదు

ఎందుకలా..??

తనకు గుడి కట్టిన రామదాసును 
చెరసాలకెందుకు పంపాడు
అసలే లోకం దేవుడూ లేడూ

 ఏడీ వుంటే చూపించండి

అంటూ నాస్తికత్వాన్ని ఆశ్రయిస్తూవుంటే

తనని నమ్ముకున్న తన భక్తులకు 

ముళ్ళకంచెలడ్డు వేసి దారిని 
ఇంకా ఇంకా క్లిష్ట తరం చేసి
బాబోయ్ దేవుణ్ణి ఫొటో లో చూసి దణ్ణం పెట్టుకోవాలేగాని
నిజంగా చూడాలనుకోకూడదు కళ్ళుపోతాయ్ 
అని పారిపోయేలా చేయడం ఏం భావ్యం..?

ఇంతకూ ఆ దేవుణి ఉద్దేశమేమిటి ..?


చక్కని రాజబాటవేసి
వేయి కన్నులతో కనిపెట్టి చూడవద్దూ..?


కాదు కాదు

క్లిష్ట పరిస్థితులడ్డువైచి  నానావైకల్యములచే
మనసును కలంచి వేయుటయే 
అంటారు పుట్టపర్తి

ఇదంతయు దేనికి..?

అంటే


జ్ఞానో పార్జనకు తత్త్వదృష్టికి, 

కాచిన బంగారు దడ దడ పరుగెత్తిపోతుంది..
ఆవేశిత హృదయము శ్రీఘ్రముగా తత్త్వము నందుకొంటుందట..

వేయి యేండ్ల గురుబోధ కన్న 

ఇవి అతి త్వరలో కార్యోన్ముఖులను చేస్తాయట..

మహాత్ముడగు జీససు శిలువ ఎక్కకున్నా

ఆనంద పాంధుడగు సిధ్ధార్థుడు అడవులకు పోకున్నా
దక్షిణాఫ్రికాలో గాంధీ తన్నులు తినకున్నా
వారు సామాన్యులు గానే మిగిలిపోయేవారు


ఇట్టి పరిస్థితులు మహాత్ములందరికీ సంభవించినవే 

అంటారు పుట్టపర్తి
అప్పుడు వారును కష్టములకు జిక్కి తలపోసినవారే
రామభక్తుడగు కబీరు
దేవాలయమును గట్టిన రామదాసు

మొన్న మొన్న 

లేపాక్షిలో సరస సౌందర్యము గల 
శిల్ప విద్యకై ధనము వెచ్చించి 
కన్నులూడబెరికించుకున్న విరుపణ్ణ
ఈ కోటిలోని వారే నట..

చంద్రగిరిలో బిక్షమెత్తిన తిమ్మరుసు మంత్రి

భావి జీవితమున అఖండసామ్రాజ్జ్యమును 
తనచేతిలో ఆడించి మహా మండలేశ్వరుడై
భళిరా
అనిపించుకున్నాడు

మొన్నటివరకు

ఊరుపేరు లేని విశ్వేశ్వరయ్య
అల్లాడి
నేదు సకల సమ్మాన్యులైనారు


మనిషికి కష్టములు దుఃఖ పరంపరలు రావటం వలననే 

ఆత్మ పరిశోధన   సం  యమనము 
మొదలైన మహాపురుష లక్షణాలు వస్తాయట..


భవభూతి నాటక కర్త లో 
పుట్టపర్తి ఈ తెగలోని వాడే భవభూతి మహాకవి 
అంటారు
భవభూతి కరుణ రసాత్మకతను ఆరాధించే రోజులలో 
తన తొలి సంతానానికి 'కరుణ' అని పేరు పెట్టి
భవభూతి ని తన మనసులోనే కాదు
తన ఇంటిలోనూ కట్టేసుకున్నాడు..

ఇందులో 
భవభూతి చదివిన శాస్త్రములలోని జ్ఞానమును 
తన ప్రవర్తనమునకు జోడించుకున్నాడట భవభూతి 
భవభూతి కాలాన్ని 
అతని మనఃప్రవృత్తినీ 
ఆతని రచనలనూ విపులంగా వివరిస్తారు పుట్టపర్తి 

భవభూతి మనస్సు వీణాతంత్రి వంటిది
ముట్టిన వెంటనే ఖంగున మ్రోగును 
సామాన్యుల మైన మనకు 
అతని యావేశము బరువుగ దోచును
మనకంతటి హృదయము లేని దౌర్భాగ్యమేమోగానీ
ఆ మహాకవి కుంచికది కాదు 

ఈ వ్యాసం వ్యాససంపుటి లోనిది 
ఇప్పటికీ గ్రంధం మూడు ముద్రణలు పొందింది.













































6 సెప్టెం, 2013

పుట్టపర్తి వారి శత జయంతి దూరదర్శన్ ఉత్సవం వీడియో



శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యులవారి
శత జయంతి దూరదర్శన్ ఉత్సవం వీడియో ఇది


ఇందులో 
పొత్తూరి వెంకటేశ్వర రావు గారు,
నరాల రామారెడ్డి గారు,
బుధ్ధ ప్రసాద్ గారు,
ఎందరో ప్రముఖులు ప్రసంగించారు
ఇది youtubeలోనిది

పెద్దలు పుట్టపర్తి వారితో తమ పరిచయాన్ని అనుబంధాన్ని  వివరిస్తున్నారు. 



5 సెప్టెం, 2013

తిరుప్పావై




తిరుప్పావై ఉపన్యాసాలు 
నల్లకుంట రామాలయంలో 1976 న జరిగాయి
గొప్ప వక్తగా పేరు గడించిన పుట్టపర్తి
శ్రీ వైష్ణవులకు ఎంతో ప్రీతిపాత్రమైన 
తిరుప్పావై ని హృదయంగమంగా చెప్పారు

దారిద్ర్యాన్ని భరించలేని ఒక భాగవతుడు 
స్పర్శచేతనే బంగారాన్నిగా వస్తువులను మార్చగలిగే 
ఒక మూలికను సంపాదించి 
స్పర్శ భాగవతుడుగా పేరు గడించాడట..

ఒకరోజు నామదేవుని ఇంటిలో 
నిత్యావసర వస్తువులు నిండుకున్నాయట
ఆయన శిష్యులు ఈ స్పర్శ భాగవతోత్తముని అరువడిగి 
ఆమూలికని తెచ్చుకున్నారు

విషయం విన్న నామదేవుడు కోపోద్రిక్తుడై
ఆ మూలికని బావిలో పారేశాడు
గగ్గోలు పెడుతూ వచ్చాడు దాని యజమాని

తుఛ్చమైన బంగారం కోసం 
బంగారం వంటి భక్తిని అమ్ముకున్నావు కదరా 
అని మందలించి
ఈ బావిలో ఎన్ని రాళ్ళు కావాలో ఏరుకో 
ప్రతిరాయీ బంగారమే అన్నాడట నామదేవుడు

అసలు భగవంతుని ప్రీతిని పొందడానికి 
దారిద్రయం ఒక అర్హతేమో
లేక 
భక్తులు భగవంతుని కోసం 
స్వఛ్చందంగా దారిద్ర్యాన్ని కౌగిలించుకున్నారో ..?

అందుకే 
ఎంత కావాలో అంతే సంపాదించి
అవసరాలకు సరిపడా వాడుకుని
మిగిలినదానిని  అతి తేలికగా వదిలి వేయగలగడం ఎవరికి సాధ్యం.. 


ఇది కేవలం ఒక ఉపకథ మాత్రమే..
ధనుర్మాసంలో తెల్లవారు ఝామున తిరుప్పావై 
పారాయణ చేయటం తమిళుల అయ్యంగార్లకు
మన తెలుగు వైష్ణవులకు ఆచారం

గోదాదేవి విష్ణువుని కీర్తిస్తూ తమిళంలో గానం చేసిన 
పాశురాలే ఈ "తిరుప్పవై"
పెళ్ళి కాని అమ్మాయిల చేత ఈ తిరుప్పావై పారాయణ చేయిస్తారు 
వైష్ణవులు శ్రీ మహావిష్ణువు వంటి భర్త దొరకాలని

సేకరణ శ్రీ రామావఝుల శ్రీశైలం 















ప్రొద్దుటూరులో పుట్టపర్తికి నివాళి


Madam
Please see the attached paper clippings 
where tributes were paid tor your father.
Rallapalli Ramasubbarao
Retired Tahsildar & President
Brahmana Maha Sabha,
Nellore,  524003

9908269665
Please visit <www.nellorebrahjmins.com>


సెప్టెంబరు ఒకటవతేదీ పుట్టపర్తి
పరమాత్మలో ఐక్యమైన  రోజు
ప్రొద్దుటూరులో పుట్టపర్తి అభిమానులు 
మా అయ్య శిలావిగ్రహానికి పూలమాల వేసి నివాళు లర్పించారు



దీనిని రామసుబ్బారెడ్డి  మాకు అందించారు

మా అక్కయ్య నాగపద్మిని ద్వారా ఇది నాకు అందింది 





30 ఆగ, 2013

డాక్టర్ గరికపాటి నరసింహ రావ్ గారు యేం చెప్పారు..



త్రిపుటి చాలా విలువైన గ్రంధం..
పుట్టపర్తి వారి పాండిత్యానికీ,
వ్యంగ్య విన్యాసానికి యీ వ్యాసాలు దర్పణాలు








గరికపాటినరసింహారావు గారు 
సుప్రసిధ్ధ అవధానులు
ధారణ  విద్యలో నిష్ణాతులు


ధారణ బ్రహ్మ రాక్షస
శతావధాన గీష్పతి
అవధాన శారద
వీరి బిరుదాలు









18 ఆగ, 2013

"యోగ మూలము" రచన : శ్రీ పి. బాలయ్య శ్రేష్టి పుట్టపర్తి నారాయణాచార్యుల సమీక్ష


During my visit to Nellore on 16.08.2013, 
I have picked up a peetika (on 24.03.1948 @ Proddatur) written by ayyagaru,
 in santhanam old Book Shop @ Nellore.

Original  " - Basis of yoga in English (Aurobindo)
Telugu : translation :- Yoga Mulam by P. Balaiah Sresti
Pages - 172 III Edition Jan 1982
Publication  : Auribindo Ashram, Pondicherry

I am enclosing the scanned copies of the peetika of ayyagaru.


with regards


R. Sreesailam