7 జూన్, 2014

మహా భారత విమర్శనము

  


మహా భారతము
పంచమ వేదము గా పరిగణించబడే భారత ఇతిహాసము. 

 ఈ మహాకావ్యాన్ని వేదవ్యాసుడు చెప్పగా
 గణపతి రచించాడు. 
18 పర్వములతో, లక్ష శ్లోకములతో 
(74,000 పద్యములతో 
లేక సుమారు 18 లక్షల పదములతో)
 ప్రపంచము లోని అతి పెద్ద పద్య కావ్యములలో 
ఒకటిగా అలరారుచున్నది. 

సంస్కృతములో ఉన్న ఈ మహా కావ్యాన్ని, 
కవిత్రయము గా పేరు పొందిన 
నన్నయ, తిక్కన, ఎర్రన (ఎఱ్ఱాప్రగడ)లు 
తెలుగు లోకి అనువదించారు

 దీనిని ధర్మ తత్త్వజ్ఞులు ధర్మశాస్త్రమనీ, 
ఆధ్యాత్మవిదులు వేదాంతమనీ, 
నీతి విచక్షణులు నీతి శాస్త్రమనీ, 
కవులు మహాకావ్యమనీ అంటారు. 
లాక్షణికులు సర్వ లక్షణ సంగ్రహమనీ, 
ఐతిహాసికులు ఇతిహాసమనీ, 
పౌరాణికులు బహుపురాణ సముచ్ఛయమనీ కొనియాడుతారు

 ఇటువంటి మహా భారతానికి 
ఒక విమర్శనాన్ని పుట్టపర్తి వ్రాసారు
అందుకు ఆయన పలు భారతాలను స్పృశించారు
 

కొన్ని విషయాలు వారిని విస్మయపరిచాయి
కొన్ని ప్రతులలో కొన్ని శ్లోకాలు చూస్తే
మరికొన్ని ప్రతులలో మరిన్ని కొత్త శ్లోకాలు దర్శనమిచ్చాయి
 
అందువలన తన దగ్గరున్న ప్రతులను బట్టే వారు విమర్శనను కొనసాగించారు
''అన్ని ప్రతులను తెప్పించుకుని పరీక్షించు 
ఆర్థిక స్థొమత నాకు లేదు..
ఆయువు కూడా లేదు..'' 
అని అన్నారు వారు
 
''నాకే కాదు అన్ని ప్రతులనూ పరీక్షించడం 
మరెవరికీ సాధ్యం కాకపోవచ్చును ..
యేదో నా శక్తి కొలది ఉపాసించినాను ..
క్షమింపుడు ..''
అంటారు వినమ్రంగా పుట్టపర్తి

కొన్ని ప్రతులలో ద్రౌపతీ వస్త్రాపహరణ ఘట్టమే లేదట
''యీ నా విమర్శనములు 
సర్వసమ్మతములుగా వుండవలెనను 
పేరాశనాకులేదు..
 

 ఇందులో 
నా రాగ ద్వేషములు ప్రతిఫలించివుండవచ్చును
కొన్నింటిలో 
నా దృష్టి సంకుచితమీపోయి వుండవచ్చును
పాఠకులు నాయీ దౌర్భల్యములను 
సహృదయతతో క్షమింపవలె''నన్నారు
 
''శ్రీ ఆచార్యులవారు 
సంస్కృతం ఇంగ్లీష్ ఇతర భారతీయ భాషల లో వచ్చిన మహాభారత వ్యాఖ్యానాలు విమర్శలూ 
అన్నీ అవలోకనం చేసి 
యీ గ్రంధాన్ని రచించినట్లు తెలుస్తున్నది..
 
మహాభారత కాలం నాటి 
రాజకీయ సాంఘీక మత నైతిక పరిస్తితులను ప్రతిభావంతంగా యీ గ్రంధంలో సమీక్షించారు ఆచార్యులవారు
 
హిందూ ధర్మ ఉత్కృ ష్టతను తెలుసుకోదలచినవారు 
యీ గ్రంధాన్ని తప్పక చదవాలి ''
అన్నారు డాక్టర్ అక్కిరాజు రమాపతిరావ్ గారు








6 జూన్, 2014

చివరి కోరిక..

''అమ్మా మీ తోటలో నేను పనిచేస్తాను..
మీ చెట్లకు పాదులు పెడతాను ..
వాటికి నీళ్ళు మళ్ళిస్తాను..
నాకుయేమీ వద్దు..
ఇంత పప్పూ చారూ అన్నం చిన్న క్యారేజీలో పంపమ్మా..
హంపీ అంటే నాకు ప్రాణం..
అక్కడే ఊపిరి విడవాలన్న ఆశ..
ఆ మట్టిలో కలిసిపోవాలన్న తపన..''
ఇదీ పుట్టపర్తి చివరి కోరిక..
 

మా రెండవ అక్కయ్యతరులత ను అడిగారట..
 

మా అక్కయ్య
''యేమయ్యా.. నీకే తక్కువవుతుందా..
దానికి నువు పనిచేయాల్నా రాయ్యా ..''
అన్నా నని
కన్నీళ్ళతోతన  అనుభవాన్ని పంచుకుంది..

19 మే, 2014

నిండు నదులు పాఱు నిల్చి గంభీరమై


మా కడపలో సాహిత్య సభ జరిగితే..
జనంతో ప్రాంగణం కిట కిట లాడిపోయేది..
పైగా రెండు మూడు గంటలు నిలుచుని 
కార్యక్రమం చూసే వాళ్ళు
 
హైదరాబాద్ లో సాహిత్య సభలను చూస్తే
 ఆశ్చర్యం వేస్తుంది
ఒక ఇరవై మంది ఉంటే గొప్ప..
వాళ్ళు కూడా టైమవుతున్నకొద్దీ చల్లగా జారిపోతుంటారు..
 
చివరికి..
అధ్యక్షుడూ వక్తలూ మైక్ సెట్ వాళ్ళూ మిగులుతారు
మైక్ సెట్ వాళ్ళూ చిట చిట లాడుతుంటారు 
త్వరగా కానివ్వండని 
నన్నయ తిక్కనాదులు ఏమంటే వాళ్ళకెందుకు .. 
వ్యాస కాళి దాసాదులు ఎటు పొతే వాళ్లకేమిటి .. 
ఎనిమిదిన్నరకి వాళ్ళ డ్యూటీ అయిపోవాలన్తే
 
 యేడు యేడున్నరదాకా మొదలవనే అవదూ
 ఎంత గొప్ప సభ అయినా ఎనిమిదిన్నర లోగా అయిపోవాలి..వాళ్ళు కూడా వాచీ చూసుకుంటూంటారు..

అంత పస వున్న వాళ్ళూ లేకపోవటమూ కారణం కావచ్చు..
మావూరికి  ఎందరెందరో సాహితీ  మేరువులు వచ్చారు
పురమూ పురజనులూ పులకించిపోయారు
పుట్టపర్తి సభల్లోని పేపర్ కటింగ్స్ చూస్తే మీకే అర్థమౌతుంది..