అది 1990 సెప్టెంబర్ ఒకటవ తేదీ
మహాకవి పుట్టపర్తి పరమపదించిన రోజు.
ప్రముఖ దినపత్రిక విశాలాంధ్ర
తన అనుబంధాన్ని ఇలా వ్యక్తపరిచింది.
ముమ్ముర్తులా విద్వత్కవి-విశాలాంధ్ర.
సాహిత్య సంగీత,నాట్యశాస్త్రాల్లో
పండితులు ఉండవచ్చు
హృద్యమైన రసబంధురమైన శైలి
వైశిష్ట్యం గల కవులూ ఉండొచ్చు.
ఈ రెండూ దండిగా ఉన్నా
తోటి కవి పండితుల పట్ల భర్తృహరి చెప్పినట్లు మాత్సర్యం లేనివారు అరుదు.
ఈ మూడు విశిష్టలక్షణాలను..
తనలో సమన్వయం చేసుకొన్న
అద్వైత మూర్తిగా
సరస్వతీపుత్ర పుట్టపర్తి నారాయణాచార్యులవారిది ఆంధ్ర సాహిత్యంలో అదో అపూర్వ స్థానం.
మహాకవులు తప్ప
మామూలు కవులే కరువైన
ఈనాటి తెలుగు సాహిత్య వినీలాకాశంలో
నిరంతర జాజ్వల్యమాన తేజోవంతమైన
ధృవతారగా ఆయన స్థానం అక్షరాలా అపురూపమైనది.ఆ
మామూలు కవులైన
వాల్మీకి,వ్యాస పరంపరలో
మొన్న కన్నుమూసిన పుట్టపర్తివారు
ప్రాతః స్మరణీయులు.
శతాధిక గ్రంధకర్తృత్వంవల్ల
వీసమెత్తు భేషజం
ఆయన వ్యక్తిత్వానికి సోకలేదు...
శాస్త్ర పరిజ్ఞానం,
ఆధునిక ధోరణులపట్ల
ఉద్యమాల పట్ల
ఏ మాత్రపు తూష్ణీభావానికి తావీయలేదు.
జనప్రియరామాయణాన్ని
పోతన భాగవతాన్ని
తెలుగు పలుకుబళ్ళ తీయదనంతో
ఎంత రసనిష్యందంగా వ్యాఖ్యానించి
కుంచె పట్టారో అంతగా
చందో పరిష్వంగపు బందోబస్తులు
పట పటా తెంచిన శ్రీశ్రీ ప్రభృతి ఆధునిక కవి
ప్రయోగాలను ఆదరంగా పరిశీలించారు.
భక్తి,రక్తి ముక్తి దాయకమైన శివ కేశవ లీలా విలాసాలనెంత తన్మయత్వంతో కీర్తించారో.. సామాన్యుని ఆర్తికి అరుదైన కవితా స్పర్శతో అజరామరమైన కావ్య ప్రతిపత్తి కల్పించారు.
మొదటి లక్షణానికి శివతాండవం..
రెండవదానికి మేఘదూతం ఉదాహరణ.
భారతీయ భాషా ప్రపంచరోచిస్సులకు
దివాంధులైన సగటు కువిమర్శక
కూపస్థ మండూక ప్రవృత్తికి
భిన్నమార్గం ఆయనది
'రాలెడు ప్రతిసుమమేలా నవ్వును..?
హైమవతీ కుసుమాలంకారమునందున
తానొక టౌదునటంచునో..?'
తానొక టౌదునటంచునో..?'
అని శివతాండవ అవతారికలో
ఆకాంక్షించిన సరస్వతీపుత్ర కవిసుమం
ఆ స్థానాన్ని అపేక్షించి
ఈ లోకం నుండీ నిష్క్రమించింది.
ఆ పువ్వు వాడదు,
వడలదు,
వయసు మీరదు-
నాస్తితేషాం యశఃకాయే....
అన్నిటా గీతా ప్రవచనమైన
"పండితాస్సమ దర్శినః"
అన్న ఋజువైన జీవన మార్గం ఆయనది.
తెలుగు కీర్తికిరీటంలో కలికితురాయిగా
ప్రకాశితమైన ఆయన స్మృతికి
విశాలాంధ్ర శ్రధ్ధాంజలి.
సంపాదకీయం 3.9.1990
ఆకాంక్షించిన సరస్వతీపుత్ర కవిసుమం
ఆ స్థానాన్ని అపేక్షించి
ఈ లోకం నుండీ నిష్క్రమించింది.
ఆ పువ్వు వాడదు,
వడలదు,
వయసు మీరదు-
నాస్తితేషాం యశఃకాయే....
అన్నిటా గీతా ప్రవచనమైన
"పండితాస్సమ దర్శినః"
అన్న ఋజువైన జీవన మార్గం ఆయనది.
తెలుగు కీర్తికిరీటంలో కలికితురాయిగా
ప్రకాశితమైన ఆయన స్మృతికి
విశాలాంధ్ర శ్రధ్ధాంజలి.
సంపాదకీయం 3.9.1990
నేను 1977-1982 లో కడప జిల్లా హాస్పిటల్ మెడికల్ సూపర్నెంట్ గా ఉన్నప్పుడు ఆయన కొన్నాళ్ళు పేషెంట్ గా ఉన్నారు.అదే నాకు వారితో పరిచయం.ఆయన గ్రంథాలు కొన్ని చదివాను.జ్ఞాన పీఠ అవార్డ్ ఆయన కు రావలసింది తప్పిపోయిందని అంటుంటారు.నా భార్య హైస్కూల్ లో పొద్దుటూర్లో చదివినప్పుడు ఆయన తెలుగు పండితునిగా ఉండే వారట.ఆయన్ని చిన్న స్వామి అనేవారట.పెద్ద స్వామి గడియారం శేషశాస్త్రి గారట.
రిప్లయితొలగించండిమాకు కూడా అంతా కలలోలానే వుంది..
రిప్లయితొలగించండికానీ అలాంటి వారు పుట్టరని అర్థమై తెలియని గుబులూ దిగులూ..