14 ఫిబ్ర, 2012

పుట్టపర్తి నారాయణాచార్యులు అయ్యగా

అయ్య సాహిత్య జీవితాన్ని..
ఆధ్యాత్మిక జీవితాన్ని ..
ఇప్పటికి ఎన్నో పోస్ట్ లల్లో చెబుతున్నాను.
ఇప్పుడు ఒక కూతురుగా..

 అయ్యతో నా అనుబంధాన్నీ ప్రేమనూ చెప్తాను.
అవి నా జీవితంలోనే మధురానుభూతులు..
అంత గొప్ప అయ్యకు..
చిట్ట చివరి కూతురుగా పుట్టడం..
ఒక విధంగా అదృష్టమూ..
మరో విధంగా దురదృష్టమూ..
నేను చూసిన అయ్య ..
పూర్తిగా ఒక మహా పండితుడుగా..
సాహిత్య వేత్త గా..
సంగీత నిధి గా..
పరిపూర్ణత్వాన్ని పొందిన వ్యక్తి..
 
కానీ ..
ఒక విధంగా ..
అక్కయ్యలు అదృష్ట వంతులు..
వారు అయ్య క్రమ క్రమాభివృధ్ధినీ 

అయ్య సంఘర్షణనూ చూసిన వాళ్ళు..
అయ్య వేసిన ప్రతి అడుగు వెనక..
కష్ట సుఖాలను అనుభవించిన వాళ్ళు..
అయ్య హిమాలయాలకు పోయిన రోజులలో ..
అమ్మ ముగ్గురు పిల్లలను పెట్టుకుని ..
ఈ కఠిన జగత్తులో ఎలా ఈదిందీ..
తిరుచానూరులో ఉన్నప్పుడు..

అయ్య రాక కోసం డబ్బు కోసం ..
ఎలా ఎదురు చూసిందీ..
నా కంటే ఎక్కువ ..
వారి కన్నీరు చారికలు చెబుతాయి ..
ఆ ఎడబాటు లోని వేదనను..
ఒక అదృష్టమేమంటే..
అయ్య నారాయణ మంత్రాన్ని..
ఇప్పుడు అమ్మ
 ఎంత గట్టిగా పట్టుకున్నారో ..
ఇంట్లో అమ్మ రామాయణాన్నీ..
 రామయ్యనూ ..
అంత గట్టి గానూ తన పట్టులో బిగించింది..

అయ్యకు ఢిల్లీ లో పసిరికలు ..
జాబు లేదు జవాబు లేదు..

తన సంగీతమూ..
 తన సాహిత్యమూ..
 తన సాధనా ..
అయిన తరువాత ..
ఎప్పుడైనా గుర్తుకు వస్తే..
అప్పట్లో అమ్మ
భార్యా పిల్లలు అయ్యకు గుర్తుకు వస్తారు..
 
పంపితే డబ్బు పంపుతారు..
లేక పోతే లేదు..
అమ్మ ఆ రోజులలో..
 సంవత్సరాలు ..
సంవత్సరాలు ..
బొరుగులు తిని..
మంచినీళ్ళు తాగి బ్రతికిందట..
అన్నం గిన్నం పిల్లలకు పెట్టి..
ఒక రోజు..

ఈన యెప్పుడు వస్తారో ..
లేక డబ్బులు ఎప్పుడు పంపుతారో..
అని దిగులుగా ఆలోచిస్తూ వుందట..

అయ్యకు ఢిల్లీ లో పసిరికలు ..
జాబు లేదు ..
జవాబు లేదు..
తన సంగీతమూ..
 తన సాహిత్యమూ..
 తన సాధనా ..
అయిన తరువాత..
 ఎప్పుడైనా గుర్తుకు వస్తే..
భార్యా పిల్లలు అయ్యకు గుర్తుకు వస్తారు..
పంపితే ..డబ్బు పంపుతారు..
లేక పోతే లేదు..
 
ఒక రోజు తెల్ల వారు ఝాము ..
నాలుగూ నాలుగున్నర..
అమ్మ ముంగిటిలో కళ్ళాపి చల్లుతూ..
 దిగులుగా ఆలోచిస్తూ ఉంది.
ఈనకు పసిరికలు ..ఎలా ఉన్నారో ..?
అని.
ఇంతలో..
తెల్లని జుబ్బా ..
తెల్లని పొడవాటి గడ్డం..
ఒకాయన చీకట్లోంచీ నడచి వచ్చాడు..
అమ్మ దగ్గర ఆగాడు.
 
ఎందుకమ్మ దిగులు పడతావ్ ..?
ఆయన అక్కడ..
బాగానే ఉన్నాడు..
వస్తాడులే.. బాధ పడకు ..
అని చెప్పి
మళ్ళీ చీకటిలో కలిసి పోయాడు..
 
కాసేపటికి అమ్మ ఉలిక్కి పడింది.
ఎవరతను..
ఇంత తెల్ల వారి వేళ
నేను చెప్ప కుండానే
నా మనసు లోని విషయాన్ని గ్రహించి
స్వాంతన చెప్పి వెళ్ళి పోయాడు..
అసలు ఎవరబ్బా ..ఆయన..?
అని ..
అక్కడే ఉన్న ..
మా మూడవ అక్కయ్యను చూసి రమ్మని తరిమింది..
 
అప్పటికి అక్కయ్య ఏడేళ్ళ పిల్ల..
వెంటనే పరిగెత్తిన అక్కయ్యకు ..
ఆంత దూరం వెళ్ళినా..
ఆ తెల్ల బట్టలు..
తెల్లని గడ్డమూ 
ఆ అపురూపవ్యక్తి కనిపించలేదు..
ఇలాంటివి ఎన్నో..
మనం భగవన్నామం చేయాలంతే..
ఆయన మన వెంటే ఉంటాడు..
అంటుంది అమ్మ.

రాధమ్మ
నేను మా నాగక్కయ్యా ల టయానికి ..
ఇల్లు కొంత స్థిర పడింది..
అయ్య మానసికంగా జీవితంలోనూ కాస్త స్థిర పడ్డారు..
మా అమ్మ ముఖం లో నవ్వులొచ్చాయ్..
 
కానీ..
మనకా కష్టాల్లేవ్..
నేను అయ్య ముద్దుల కూతుర్ని..
నా ప్రతి మాటా ముద్దే..

ప్రతి చేష్టా ముద్దే..

కృష్ణుని రాధమ్మ పేరు నా కొచ్చింది.
అయ్య నా కోసం ఒక కీర్తన కూడా వ్రాసారు..
 ఏమమ్మ రాధా..
ఎన్నడు కరుణింతువమ్మ..
ఈ మాయా బంధమ్ముల
నెన్నడు వదిలింతువమ్మ..
నా ముందు తాళం వేస్తూ అయ్య ప్రేమగా పాడేవారది..

 

3 కామెంట్‌లు :

  1. ఎంతో సంతోషంగా వుంది..
    అయ్య శివతాండవాన్ని కంచి పెద్ద స్వామి వారు నిత్య పారాయణ గ్రంధంగా స్వీకరించారని మీ ద్వారా తెలిసి మా జీవితాలూ చరితార్థం అయినట్లు అనుభూతి చెందుతున్నాము..
    ఇంత విలువైన శివతాండవ వివరణ పంపినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు

    రిప్లయితొలగించండి
  2. puttaparthi vari tho parichayabhagayam adrustham. ayana oka meru sikharam. tana sishyakotini tanaanta variniga chesina khyati varidi. nirantara pathanasakti varidi. ayana kavi rakshasudani anavachu. nitya kavita silpi varu

    రిప్లయితొలగించండి
  3. visishta vykti puttaparthi. ayana na ashtavadhananaiki adhyakshta vahinchi kadadpa lo 1977 lo "ore inka avaadhanlu ma neeyii annaru. Nenu manesanu. pustakalu vrayi avaadhanalu kshanika anandam kaligistayi annaru. nenu vari mata follow ayyanu. 65 pusstakalu varasasnu. vari daya

    రిప్లయితొలగించండి