27 మార్చి, 2012

పుట్టపర్తి నారాయణాచార్యులు త్రిపుటి ఆవిష్కరణ సభ అందరూ ఆహ్వానితులే..



మా అక్కయ్య ..

అయ్య ..
వివిధ గ్రంధాలకు వ్రాసిన పీఠికలను ముద్రించింది..
 
ఎన్నో యేళ్ళనుంచీ ..
ప్రాణప్రదంగా ..
పట్టుచీరలకంటే ..
బంగారం కంటే ..
పదిలంగా ..
సం రక్షించిన..
విలువైన ..
అయ్య పీఠికలను ..
వెలుగులోకి తెస్తూంది..
 
అయ్య..
ఒక్కో పుస్తకముపై వ్రాసిన అభిప్రాయాలు 
ఎంత నిక్కచ్చిగా..
ని ర్ద్వంద్వంగా ..
నిష్కర్షగా వున్నాయోనే ..
అంటుంది అది...!!
 
కేవలం..
పీఠికలు చదివితేనే ..
మనం ఎంతో సంతృప్తిని పొందుతాం ..
 
ఆరుద్ర వంటి ..
ప్రతిభావంతుల పుస్తకాలలోనూ ..
అయ్య వ్రాసిన పీఠికలు..
వజ్రాల్లా మెరుస్తాయట..!!
 
ఆ పుస్తకం ఆవిష్కరణ ..
త్యాగరాయ గాన సభలో ..
మార్చి 26న జరిగింది.
చదవాలని పిస్తూందా..??
 
ఎప్పటివో అయిన కాగితాలను ..
పసిపాపల్లా పట్టుకుని..
ఫెయిర్ చేసి..
ముద్రణ కిచ్చి..
తప్పులు దిద్ది..
ముద్రణ జరిగి ..
ఫళ ఫళ లాడుతూ బయటికి వస్తే ..
కన్న బిడ్డల్ని చూసుకున్నంత ఆనందంగా..
ఉంటుంది కదూ..
 
ఊహూ..
మాకు..
మా అయ్యనే మళ్ళీ చూసుకున్నంత ఆనందం..
 
ఇరవై సంవత్సరాలనుంచీ..
మా అయ్య సేవను ..
ఓ తపస్సులా చేస్తూందది..!!
 
కాదు..
కన్న తండ్రి ఋణం తీర్చుకుంటూంది.. 

మార్చి 26 నాటి సాయంత్రం 
త్యాగరాయ గానసభలోని 
సుబ్బారావ్ కళావేదిక లో  

పుట్టపర్తి వారి 1930 ల నాటి ..
అపురూప వ్యాసాలు ..
వివిధ గ్రంధాలకు ..
వారు వ్రాసిన పీఠికలు ..
పుట్టపర్తి వారు నిర్వహించిన ..
"పద్యంబొక్కటి చెప్పి.."
 అన్న శీర్షికన వచ్చిన..
 పంచదార గుళికల వంటి పద్య వ్యాఖ్యానాలు..

కలగలిసిన కలబోత ..
నాలుగు నెలలలుగా శ్రమించి..
తీర్చి దిద్దిన  మా అక్కయ్య..
కలల కలహంస "త్రిపుటి"యై ..
వయ్యారంగా..
కె వి రమణ గారి చేతుల మీదుగా..
ఆవిష్కృతమైంది...

సభలో..
"రాధా మాధురి" గారలు..
 పుట్టపర్తి వారి కృతులను మధురంగా ఆలాపించారు. పుట్టపర్తి అనూరాధ వ్యాఖ్యానం..
 అందంగా వానికి  అమరింది..

సర్వశ్రీ రాళ్ళ బండి కవితా ప్రసాద్
గారి అధ్యక్షతన .. 
కె వి రమణ గారు ..
రంగాచారి గారు ..
వాడ్రేవు చిన వీర భద్రుడు గారు ..
వక్తలుగా ప్రసంగించారు..
కె వి రమణ గారు మాట్లాడుతూ..
"విమర్శకులలో ..
ప్రమాణాలు ఉన్నాయో ..?లేదో..?
 ప్రశ్నార్థకమైందీనాడు..
అర్హత ఉన్నా ..
లేకపోయినా.. 
ఆకాశానికెత్తేయటం..
అంతవాడు ..
ఇంతవాడని ..
పొగిడేయటం..
విమర్శ ఎలా రాయాలి..?
మనం వ్రాసే విమర్శ ..
నిష్పక్ష పాతంగా నిష్కర్షగా ఉందా..?
శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యులు గారు వ్రాసిన విమర్శలు..
అసలు విమర్శ ఎలా వ్రాయాలి ..?
ఎలా ఉండాలి..?
అన్న దానికి ప్రామాణికంగా నిలుస్తాయి.."
 
ఈ అభిప్రాయం కె.వి .రమణ గారిది..
ఈయన సీనియర్ ఐ ఏ యస్ ఆఫీసర్
 భక్తి చానల్   TTD కి EO గా వుండినారు 
రక రకాల ఉన్నత పదవులు నిర్వహించారు..
 
పుట్టపర్తి సాహితీ పీఠం పెట్టినప్పుడు.. 
నిధుల సేకరణలో ..
ఈయానా కొంత శ్రమించారట..
"నిధుల సేకరణ కోసం ..
బిక్షా పాత్ర పట్టుకొని..బయలుదేరాం ..
స్వీట్సపుల్లారెడ్డి ..
వద్దకెళ్ళాం 

ఆయన ..
అంత సంపాదించినా ..
ఒక ఇరుకైన చిన్న గదే ఆయన నివాసం. 
ఒక చెక్క బెంచీ పై ఆయన పడక ..
కుండలోని నీరే ఆయన తాగటం..
ఇంత నిరాడంబర సాధారణ జీవితాన్ని ..
అప్పటికీ ఆయన గడిపేవారట..
 
వీరు వెళుతూనే
ఆ గదిలోనికి తీసుకెళ్ళారు..
ఆ బెంచీ పై కూచో పెట్టారు.
ఆ కుండలోని నీరు వీరే ముచుకు తాగారు.
ఎంత సంపాదించానని కాదు..
నేను జీవితాన్ని ఎలా మొదలు పెట్టానో..
 అదే పరిస్థితుల్లో వుండటం నాకిష్టం..
అన్నారట..
ఇది చూచి 
నిరాడంబరతని అందరూ నేర్చుకో వాలని ఆయన చెప్పారు..
 
"శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశినీ.."
దీంట్లో ఒక తప్పుంది..
పుట్టపర్తి వారు 
దీన్ని గురించి ఈ గ్రంధం లో వ్యాఖ్యానించారు..
కానీ ..
ఎన్నో వందల సంవత్సరాలుగా ..
దీన్ని ఇలానే  ..
మనం చెప్పుకుంటున్నాం..
అది యేమిటో.. నేను చెప్పను..
కావాలంటే పుస్తకం కొనండి..
కానీ..
యెలాగో సంపాదించవద్దండి..
అన్నారు వారు.
 
రాఘవన్ గారు మాట్లాడుతూ..
దీన్ని కొన్నా..
లేక.. గౌరవంగా పుచ్చుకున్నా..
బీరువాలకు అలంకార ప్రాయాలుగా..
 వీటిని పెట్టకండి.. 
వీలైతే రోజుకు కనీసం..
ఒక వ్యాసం చొప్పున చదవండి ..
ఎందరో గొప్ప వారి ఇళ్ళల్లో ..
అపురూపమైన పుస్తకాలు..
కనీసం..
 పేజీలు కూడా తిప్పకుండా ..
అలమారల్లో
అలంకార వస్తువులుగా ..
అలా పడున్నాయ్ ..
అని వారు విజ్ఞప్తి చేసారు.


దూరదర్శన్ డైరెక్టర్..
శ్రీమతి శైలజా సుమన్ గారు..
అచ్చం తెలిగింటి ఆడపడుచులా ఒద్దికగా ..
" మా అయ్య మా అయ్య 
అని ఎప్పుడు చెప్పినా 
ఆమె కళ్ళలో తిరిగే నీటిలో 
తండ్రిపై ఆమెకు కల మహత్తరమైన ప్రేమ 
నన్ను ఆమె తండ్రి గారి గురించి 
తెలుసుకొనేలా చేసింది..
 
అసలు "అయ్య" అనే పదమే
 ఎంతో గమ్మత్తుగా ..హాయిగా..
 ఉంటుంది ఆమె మాటల్లో..
ఈ పుస్తకాన్ని మా మామ గారికి ఇస్తాను..
అని ఆమె ముద్దు ముద్దుగ అందంగా చెప్పారు..
 
అక్కయ్య..
మైకు పట్టుకుంటూనే 

అయ్య ప్రపంచంలోకి వెళ్ళి పోయింది..
మా అయ్యండీ..

 ఒకటి కాదు ..రెండు కాదు..
 పధ్నాలుగు భాషలు..
బజార్లో కాళ్ళకు చెప్పులు ఉన్నాయా..? లేవా..?

 అని కూడా పట్టించుకోకుండా ..
భుజంపై ఒక టవలు వేసుకొని తిరిగే..
పధ్నాలుగు భాషలు ఔపోసన పట్టిన..
 ఆ శ్రీ వైష్ణవ బ్రాహ్మడు ..
పండిత ప్రకాండులకు చెమటలు పట్టించిన వాడు..
మా చెల్లెలు బ్లాగులో రాసింది..

 నిర్గంధ కుసుమం అని
 నిజానికి ..
మేమందరూ 
కాదు ..కాదు..
మనందరూ నిర్గంధ కుసుమాలమే..
 

అంతటి మనిషిని ..
సరిగా ఉపయోగించుకోలేదు..
అని ఒక్కసారిగా భావావేశానికి లోనై..
ఏడవటం మొదలు పెట్టింది..
అయ్య అముద్రిత పుస్తకాలను..
బయటికి తీసుకు రావటం..
 నా బాధ్యత ..
అని చిన్నప్పుడే నేను అనుకున్నాను..
 
ఇక్కడ ఒక్కరున్నారు..
ఆయన పేరు శ్రీ శైలం..
 అయ్యకు అపర భక్తుడు..
ఆయన ఏమి ఋణానుబంధమో ..?
మొదటినుంచీ ..
అంటే..గత నలభై.. యాభై ..
సంవత్సరాలనుంచీ.. 
అయ్య గురించి 
ఎక్కడ ఏ రచనలు ..వ్యాఖ్యలు.. సన్మానాలు..
పేపర్లలో వచ్చినా..
భగవంతుని ప్రసాదాల్లా 
వానిని అపురూపంగా దాచి వుంచాడు..
తమ స్వవిషయాలు కూడా
ఇంత పదిలంగా దాచుకోరు..
ఆయన నన్ను నమ్మి
తన ఆస్తిని నాకు ఇచ్చారు..
ఇంకా పోస్ట్ లోనూ..
 నాకు ఎంతో విలువైన సమాచారాన్ని పంపించారు..
శ్రీశైలం గారినుంచీ పోస్ట్ వచ్చిందంటే ..
నాకు నా బాధ్యత మరింత గుర్తు వచ్చేది..
అని చెప్పిందక్కయ్య..
 
శ్రీ శైలం గారు మాట్లాడుతూ..
"ఇంటికి సామాను తెస్తే ..
ఆ పొట్లాలో 
అయ్య సమాచారమేమైనా వుందా..?
 అని చూసేవాడిని..
ఒకసారి హోటలులో ..
కాఫీ తాగుతుంటే ..
ఎవరో చూచిన పేపరులో ..
పుట్టపర్తి వారి సమాచారం చూచాను.. 
వారిని అడిగి తీసుకున్నాను.. 

ఎన్నో లైబ్రరీలకు పోయి ..
ఆ గ్రంధ సంద్రంలో..
 పుట్టపర్తి వారిని గురించిన..
 పుస్తకాలకొరకు శోధించే వాడిని..
అంటూ చెప్పుకొచ్చారు..
 
"అవును లేవయ్యా ..
నీవు రెవెన్యూలో పని చేసావ్ గా ..
అన్నీ గుర్తున్నాయ్"
అని రమన గారు జోక్ చేసారు..


వీడు నా అపర భక్తుడు..
నేను తుమ్మినా రికార్డు చేస్తాడు..
అని పుట్టపర్తి వారు 

అనే వారట సరదాగా..
అక్కయ్య ..
తన కూతురు వంశీప్రియ పేరునా
 శ్రీశైలం గారి పేరునా 
పుస్తకాన్ని ముద్రించింది..

 
వాడ్రేవు చిన వీర భద్రుదు గారు ..
పుట్టపర్తి వారి గురించి..
ఎంతో ఉద్వేగ భరితంగా.. ప్రసంగించారు.
పుట్టపర్తి వారిని చూస్తే నాకు అభిమానం కాదు..
అసూయ..
ఆ అసూయ తోనే 
నేను వారి గ్రంధాలను ఒక్కొక్కటి పది సార్లకు పైగా చదివాను..
అన్నారు..
బుధ్ధ చరితమును చదివిన తరువాత..
అంతకు ముందు బుధ్ధుని గురించి ..
మన  అభిప్రాయాలు తుడుచుకు పోయి..
 ఒక కొత్త కోణంలో బుధ్ధుని మనం దర్శిస్తాం..
 
ఈ గ్రంధమునకు మూల లేఖకులు
 శ్రీ ధర్మానంద కోశాంబి గారు..
 పాళీ భాషలో వీరు గావించిన శ్రమ..
 అమోఘమైనది..
పాళీ గ్రంధములను..
త్రిపిటకములను..
నిష్కరుణగ నవలోకించి ..
ఋగ్వేదము..
మనుస్మృతి ..
విష్ణు శాస్త్రి చవళూణ్కర్ గారి బాణ భట్ట చరిత్ర ..
మొదలైన గ్రంధాలను అనుసరిస్తూ ..
మూలంలోని పరిమళాలను జారిపోనివ్వకుండా 
అంత తాజాదనంతోనే 
మనకందించారు పుట్టపర్తి వారు..
 
రుచీ పచీ లేని ఇంగ్లీషు అనువాదాలతో
 మనసు చెడిన .. .నన్ను
పుట్టపర్తి వారి అనువాద మధురిమ కట్టి పడేసింది..

వారి ఎన్నో కోట్లు జపం చేసారన్నారు..
 వారికి..
 పరమాత్మ సాక్షాత్కారం జరగక పోతే..
 సంతోషించే వారిలో నేనొకణ్ణి..
 
వారికి సాక్షాత్కారం కాలేదు కాబట్టే
 ఆ ఆవేదనా మధనం నుంచీ 
ఇలాంటి అమృత రాశులు పుట్టాయి..
అదే వారికి సాక్షాత్కారం జరిగుంటే
ఈ అమూల్య సంపద మనకందేది కాదు..
అన్నారు..
 
పుట్టపర్తి వారిని ..
ఎన్నో సంవత్సరాలుగా..
ప్రతి అడుగులోనూ...
పరిశీలించి.. పరిశోధించి..
ఆయన పై అభిమానాన్ని ..
పుట్టపర్తి నారాయణాచార్యులు..
 ప్రాంతీయకవి కాదు.. 
జాతీయ కవి కాదు 
విశ్వకవి..
కంప్యూటరు మెమొరీని తలదన్నే విధంగా
వారి మేధశ్శక్తి విరాజిల్లింది..
 దాన్ని అందుకోలేక పోవటం మన దురదృష్టం.. 
వారికి ఆ అవార్డు రాలేదు.. 
ఈ అవార్డు రాలేదు.. 
అని చింతిల్లనవసరం లేదు.. 
అవార్డులకు సైతం అందని ప్రతిభ ఆయనది.. 
అవ్వార్డు లన్నవి ..
ఆయన దృష్టిలో చాలా చిన్న విషయాలు  

అంటూ..
పుట్టపర్తి వారి గ్రంధాలను..
ఈ కాలంలో ఎవ్వరు చదువుతారు అనుకోకండి..
వాటిని మహా ప్రసాదాలుగా స్వీకరించి..
శిరస్సుపై పెట్టుకొనే ..
అభిమానులు ఎందరో ఉన్నారు..
అని ..
అక్కయ్యకు ..
ఎంతో మనోబలాన్ని వారు అందించారు..
పుట్టపర్తి వారికి ..
ఇటువంటి పుత్రిక ఉండటం ..
ఆయన అదృష్టం..
అంతటి తండ్రిని కలిగివుండటం..
ఈమె అదృష్టం ..
అని కె వి రమ గారు చత్కరించారు..
అయ్యకు జ్ఞానపీఠము రాలేదని ..
బాధపడిన అక్కయ్యను ఓదారుస్తూ..
రాళ్ళ బండి కవితా ప్రసాద్ గారు
జాతిపితకూ నోబెల్ రాలేదమ్మా..
అనగానే ..
సభలో నవ్వుల పువ్వులు విరిసాయి..
అక్కయ్య తడికళ్ళతో హాయిగా నవ్వింది..
 
సభలో..
మొదట్లో..
అక్కడక్కడా ..
కనిపించిన జనం..
 నెమ్మది నెమ్మదిగా పెరుగుతూ..
 చివరి వరకూ ఉండి..
 పుట్టపర్తి నారాయణా చార్యుల వంటి ..
మహనీయుని గురించి మైమరిచి విన్నారు..
 
వయసు మళ్ళిన వారు..
 ఆనాటి మధుర జ్ఞాపకాలను ..
గుర్తుకు తెచ్చుకున్నారు..
 
అక్కడక్కడా ..
తమకు నచ్చిన ..
విషయ ప్రస్థావన జరిగినప్పుడల్లా..
కరతాళ ధ్వనులతో తమ సంతోషాన్ని తెలిపారు.
 
చివరగా ..
కొసమెరుపు..
పక్కనే త్యాగరాయ గాన సభలో ..
డా సి నారాయణ రెడ్డి గారి సినీ గానం..
అక్కడికి డా సి నా రె వచ్చారట..
పక్కనే ధూం ధాం గా 
జరుగుతున్న సభను పరికించారు..
అయ్య పేరున కట్టిన బ్యానరును చూచారు..
ఏమిటీ సభ అన్నారు..
త్రిపుటి ఆవిష్కరణ..
లోనికి రాలేదు.. 

"త్రిపుటి"
ఒక పుస్తకం తెప్పించుకున్నారట..
ఎవరితోనో..






 

1 కామెంట్‌ :

  1. అనురాధగారు.. మీ భావేద్వేగం..మీ "అయ్య" గారి గురించి..

    వారి గొప్పదనమును ఈ బ్లాగ్ముఖంగా కాంచిన నాకు..కనుచెమరింతలు

    త్రిపుటి..లభించు స్థలాలు చెప్పగలరా ? .

    అంతటి మహనీయుని కుమార్తెలుగా మీరు ఎంతటి అదృష్టవంతులు ...

    అందరికి ఆహ్వానం అని ఆహ్వానం పలికినప్పుడు..కూడా రావడానికి నామోషితనం అనుకున్న వారి జ్ఞాన పీట్ లు విలువ అదండీ. ప్చ్..ఏం చేద్దాం :(:(

    రిప్లయితొలగించండి