9 ఏప్రి, 2012

పుట్టపర్తి నారాయణాచార్యులు తిరుమల రామచంద్ర హంపీ నుంచీ లో


హంపీ నుంచీ హరప్పాదాకా..
తెలియని వారుండరు..
అది చదివితే ..
శ్రీ తిరుమల రామచంద్ర గారిని..
సాహిత్య అభిమానులు మరచిపోవటం కష్టం.

రామచంద్ర. కొన్ని వందల వ్యాసాలు, సమీక్షలు రాశారు. ‘హైదరాబాద్ నోట్‌బుక్’ 
వంటి దాదాపు 15 శీర్షికలు నిర్వహించారు. 
‘సత్యాగ్రహ విజయం’ నాటకం, 
రణన్నినాద గీతాన్ని సంస్కృతంలో రాశారు. 

ఆయనకు ఎనలేని కీర్తిని ఆర్జించిపెట్టిన పుస్తకాలు

‘మన లిపి: పుట్టుపూర్వోత్తరాలు’, 


మనకు భాషపై కన్నతల్లిపై ఉన్నంత ప్రేమే ఉంటే 
తప్పక చదవ వలసిన పుస్తకం .

కొన్ని వేల సంవత్సరాల సుదీర్ఘ సంఘర్షణ తరువాత బండలపై ..రాగి రేకులపై ..తాళ పత్రాలపై ..
నడచి నడచి వచ్చిన లిపి ..
ఈనాడు అందమైన చేతివ్రాతలా తళుకులీనినా..
దీనికి పూర్వం దీని రూపం  వంకర టింకర గీతలే..
తొలి పుస్తకం ఏది ..?
అన్న ప్రశ్న దగ్గరినుంచీ అసలు లిపికి మూల కారకులెవ్వరు ..?
అన్న మూలాలను చేదించుకుంటూ వెళ్ళి..
రామచంద్ర గారు తెలుగు వాడి సత్తాను ..
లోకానికి ఒంటరి గొంతుకతో చాటే ప్రయత్నమే..
ఈ తెలుగు లిపి పుట్టుపూర్వోత్తరాలు..

ఇంకో గొప్ప విషయం. 
ఈ రచన వ్యవహార భాషలో సాగటం. 
ఇలాంటి గ్రంథం వ్యవహార భాషలో 
అదీ అప్పటి కాలంలో రాయడం ఓ నేర్పు.


‘నుడి-నానుడి’, 

తెలుగులో కొన్ని పదాలను తీసుకుని ..
వాటి పుట్టుపూర్వోత్తరాలను వివరించారు..
పనస, ఉప్పు, పాలు, సీతాఫలప్పండు, మగువ, ఉల్లి, వేప, కోమటి,  టెంకాయ, కోటలోపాగా,
మొదలైనవి.

‘సాహితీ సుగతుని స్వగతం’,


మంచి మార్గంలో వెళ్ళేవాడు సుగతుడు ..బుధ్ధుడు కూడా..
ఇందులో కొన్ని అద్భుతమైన వ్యాసాలు
ఆంధ్రసాహిత్యంలో స్త్రీపర్యాయపదాలు
పద్యాలకు రాగనిర్దేశం
నూరు, నూటఎనిమిది, నూటపదహారు
దేశీనామాలలోని మరికొన్ని తెలుగుపదాలు
బుద్ధుని ముందునుంచే ఉన్న ధూమపానం
వేదంలో, ఆయుర్వేదంలో గర్భనిరోధం
దండి దశకుమార చరిత్ర
త్యాగయ్య గారి కృతులలో రాగ రచనా సమన్వయం
చేతబళ్ళూ, తలనీలాలూ.
తదితర వ్యాసాలు ఉన్నాయి
ఆ వ్యాసాల సంకలనం ఈ పుస్తకం. 

ప్రాకృత వాఙ్మయంలో రామకథ

తిరుమల రామచంద్ర గారు, భారతి పత్రికలోనూ, మరికొన్ని సందర్భాలలోనూ..
రాసిన వ్యాసాల సంకలనం ఈ పుస్తకం.
ఇందులో..
ప్రాకృత వాఙ్మయంలో రామకథ
వజ్జాలగ్గంలో తెలుగు పదాలు
ప్రాకృత ప్రకృతి  
తెలుగు ప్రాకృతాల సంబంధం 
అపభ్రంశ వాఙ్మయ పరిచయం  
తెలుగు దేశంలోని బౌద్ధ శాఖలు :
తెలుగు దేశంలోని బౌద్ధ శాఖలు :
బౌద్ధ సాహిత్యం : ఆంధ్ర బౌద్ధాచార్యులు
జిన వల్లభుడి మహావీర స్వామి స్తోత్రం
దేశీ నామమాలలోని తెలుగు పదాలు


‘గాథాసప్తశతిలో తెలుగు పదాలు’ 

భారతీయుల సాంఘిక జీవనాన్ని 
కమనీయంగా వ్యాఖ్యానించడమేగాక, 
గాథాసప్తశతిలో ఏయే సందర్భాల్లో, 
ఏయే అర్థాల్లో తెలుగు పదాలు కనబడతాయో వివరించారు. 
కాళిదాసుపై 
గాథాసప్తశతి ప్రభావం ఉందని తేల్చిచెప్పారు.

మరపురాని మనీషి

రామచంద్ర గారు ఆంధ్ర ప్రభ లో పని చేస్తున్నప్పుడు, ఎందరో ప్రముఖులను ముఖాముఖి జరిపారు, 
మరెందరి మీదో అద్భుతమైన వ్యాసాలు రాసారు. 
అప్పటి ప్రముఖుల మీద రాసిన 
వ్యాస సంకలనం ఇది. 
విశ్వకవి రవీంద్రుడు, ఎమ్. ఎస్. సుబ్బలక్ష్మి,
 దాలిపర్తి పిచ్చిహరి, విస్సా అప్పారావు గారు, 
చిలుకూరి నారాయణరావు గారు.. 
ఇలా ఎందరో గొప్ప వ్యక్తుల గురించి 
ఈ పుస్తకం మనకు పరిచయం చేస్తుంది.


ఇందులో ‘సాహితీ సుగతుని స్వగతం’ గ్రంథానికి 1970లోనూ రాష్ట్ర సాహిత్య అకాడమీ నుంచి ఉత్తమ సాహిత్య విమర్శ పురస్కారం,
‘గాథాసప్తశతిలో తెలుగుపదాలు’కు 
1986లో రాష్ట్ర సాహిత్య అకాడమీ నుంచే అవార్డు లభించాయి. 
రెండు వేల ఏళ్లనాటి 
భారతీయుల సాంఘిక జీవనాన్ని 
కమనీయంగా వ్యాఖ్యానించడమేగాక, 
గాథాసప్తశతిలో ఏయే సందర్భాల్లో, 
ఏయే అర్థాల్లో తెలుగు పదాలు కనబడతాయో వివరించారు. 
కాళిదాసుపై 
గాథాసప్తశతి ప్రభావం ఉందని తేల్చిచెప్పారు.

లాహోర్ విశ్వవిద్యాలయ గ్రంథాలయంలో 
ఏడాదిపాటు పనిచేసి 
తెలుగు, కన్నడ, తమిళ, మళయాళ
తాళపత్ర గ్రంథాలు వెయ్యింటికి 
వివరణ సూచీ తయారు చేశారు. 


తిరుమల రామచంద్ర పుస్తకానికి 
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.
ఆయన రాసిన 
ఆత్మకథ హంపీ నుంచి హరప్పా దాకా 
అనే పుస్తకానికి ఈ అవార్డు లభించింది.

ఆయన తన హంపీ నుంచి హరప్పా దాకా 
అనే పుస్తకాన్ని ..
కేవలం ఆత్మకథగానే రాయలేదు. 
ఈ పుస్తకంలో సాంఘిక పరిస్థితులకు, 
వందేళ్ల సాహితీ చరిత్రకు అద్దం పట్టారు.
అయ్యకూ తిరుమల రాంచంద్ర గారికీ 
మంచి అనుబంధం ఉండేది..
తిరుమల రామచంద్ర గారు తన హంపీనుంచీ హరప్పా దాకా లో సహాధ్యాయులూ సత్పురుషులూ శీర్షికలో ఆసక్తి కరమైన అంశాలను ముచ్చటించారు.
 
ఇది శ్రీ శ్రీశైలం గారి ద్వారా నాకు అందింది..
నాగక్కయ్యకు 
పుస్తక ముద్రణలోనూ 
తన వద్ద దాచిన అయ్యగారి విలువైన సమాచారాన్ని 
అతి పదిలంగా అందివ్వడంలోనూ 
తన బాధ్యతను మరచిపోని శ్రీశైలంగారికి 
నా బ్లాగు ముఖంగా హృదయ పూర్వక నమస్సులు.



2 కామెంట్‌లు :

  1. శ్రీ రామచంద్ర గారి చేవ్రాలు చూసే భాగ్యం కలిగించినందుకు శ్రీశైలం గారికి ధన్యవాదాలు. కానీ, ఈ పరిచయం హంపి నుండి హరప్పా మొదటి ముద్రణలో లేదు.

    మరో చిన్న విషయం. శ్రీ రామచంద్ర గారు అయ్యగారిపై వ్రాసిన సమగ్రమైన వ్యాసం ఒకటున్నది.ఆ వ్యాసం "అహం భో అభివాదయే" అన్న పుస్తకంలో దొరుకుతుంది. మీకు ఆ వ్యాసం కావాలంటే నాకు తెలుపండి. వీలువెంబడి స్కాన్ చేసి పంపగలను.

    రిప్లయితొలగించండి
  2. చాలా సంతోషం తప్పక పంపండి. అయ్య శివతాండవాన్ని రామారావ్ అనే వ్యక్తి కొంతభాగాన్ని ఇండియన్ పొయిట్రీ అనే పుస్తకానికి కృష్ణశాస్త్రి గారివి ఇలా అందరివీ కొంత భాగాన్ని ఆంగ్లీకరించి పెట్టారట.. అంతే గానీ పూర్తి పాఠం కాదు

    రిప్లయితొలగించండి