పురస్కారాలు ఎలా ఇస్తారు ..?
వాని వెనుక యే యే శక్తులు పనిచేస్తాయి..?
ప్రతిభకన్నా పైరవీలు ముఖ్యమా..?
ఆగండాగండి..
మీరేదో రంగంలో బాగా కృషి చేసి ఏవైనా అవార్డుల కోసమో..
రివార్డులకోసమో..
ఎదురుచూస్తూ కూచున్నారో అయిపోయారే..
ఎంతసేపూ.. ఆ రంగంలో మరింత కృషిజేసి అందరితో శభాషనిపించుకోవటంతో పాటూ..
కాస్త చుట్టూ పరికించి..
పైకి పోతున్న వాళ్ళని
కిందకి లాగడానికీ..
కిందనున్న వాళ్ళని
కిందనున్న వాళ్ళని
వెకసెక్కమాడడానికీ..
రాజకీయ రంగంలోనో ..
రాజకీయ రంగంలోనో ..
మంచి పదవులలోనో..
ఉన్న వారి చిట్టా సంపాదించి ..
వారిని కాకా పట్టే కార్యక్రమానికీ శ్రీకారం చుట్టాలి.
వారిని కాకా పట్టే కార్యక్రమానికీ శ్రీకారం చుట్టాలి.
ఎవరికైనా ఏదైనా గౌరవమొస్తే
వాడు ఆ కులానికి చెందిన వాడు
కాబట్టీ వచ్చిందనీ..
వీడు పదవిలో కొచ్చాడంటే
వీడు పదవిలో కొచ్చాడంటే
ఈ రాజకీయగొడుగు కిందవాడు
కనుక వచ్చిందనీ..
బురదజల్లడానికి తగిన ప్రాక్టీసులూ ..
బురదజల్లడానికి తగిన ప్రాక్టీసులూ ..
అంతే చిత్తశుధ్ధిగా మొదలెట్టాలి..
దీనికి కావలసిన
మనోబలాన్నీ.. వాక్శక్తినీ ..ఇమ్మని
మొదటగా గణేశ పూజ సరస్వతీ పూజలూ
కావాలంటే చేసుకోండి మీ ఇష్టం..
ఇందులో మీ కృషి ఫలించి ..
మీకు పుసుక్కున ఏ గౌరవమో వరించనూ వరించచ్చు..
29 Mar 2010 న ఒక వ్యాసం వచ్చింది పురస్కారాలపై..
ఇది చదివితే తెల్లబోవటం మీవంతౌతుంది..
ఇది చదివితే తెల్లబోవటం మీవంతౌతుంది..
అవధరించండి.
పురస్కారాలకు నమస్కారాలు
పురస్కారము అంటే
అనేక నైఘంటికార్థాలున్నాయి.
ప్రధానంగా
ముందిడుకొను, పూజించు, సన్మానించు
అనే అర్థాలున్నాయి.
తక్కిన వారి కంటే
ఇతడు ఎక్కువ అని తాత్పర్యార్థం.
రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు
కొన్ని పురస్కారాలు ప్రకటిస్తూ వుంటాయి.
ముఖ్యంగా
జనవరి 26 వ తేదీకి ప్రకటించే
పద్మ పురస్కారాలు పద్మశ్రీ, పద్మభూషణ్,
పద్మ విభూషణ్, భారతరత్న వంటివి.
ఇవి రాజకీయ వేత్తలకు,
కవులకు,
కళాకారులకు,
సామాజిక శాస్త్ర వేత్తలకు,
సంఘ సేవకులకు లభిస్తూ వుంటాయి.
ఇవికాక
కేంద్ర రాష్ట్ర సాహిత్య అకాడమీలు
కొన్ని పురస్కారాలు ఇస్తుంటాయి.
అలాగే సంగీత నాటక అకాడమీ సన్మానాలు
కూడా ఉంటాయి.
ఇంకా ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని
రాష్ట్ర ప్రభుత్వం
కవులకు, పండితులకు వేద పండితులకు
సన్మానాలు చేస్తూ ఉంటుంది.
ఇంకా
వివిధ విశ్వ విద్యాలయాలవారు
ఇవన్నీ కొన్ని వర్గాలుగా విభజింపవచ్చు.
స్థూలంగా
ఇవి ప్రభుత్వ -ఉపప్రభుత్వ పురస్కారాల కిందికి వస్తాయి.
ఒక ప్రముఖుడు
తన పేరుతో లేదా
తన భార్య లేక
తల్లిదండ్రుల పేరుతో పురస్కారాలు ప్రకటిస్తాడు.
వీటికి చట్టబద్ధత ఉండదు
ఒక సాంస్కృతిక సంస్థ
హైదరాబాద్, ఢిల్లీ, చెన్నైలలో
ఉగాది పురస్కారాలు ప్రకటిస్తుంది.
ఉగాది పురస్కారాలు ప్రకటిస్తుంది.
మహాదేవి వర్మ |
దీనికీ ప్రభుత్వ చట్టబద్ధత ఉండదు.
ఆ విధంగా చూస్తే
జ్ఞానపీఠ పురస్కారం,
సరస్వతీ సన్మాన్ పురస్కారం
బిర్లాట్రస్ట్,
సి.పి బ్రౌన్ అకాడమీ
వంటి సంస్థల పురస్కారాలు
ప్రైవేటు వ్యక్తులు అనధికారికంగా
ఇచ్చిన పురస్కారాల క్రిందికే వస్తాయి.
ఇచ్చిన పురస్కారాల క్రిందికే వస్తాయి.
నోబెల్ బహుమతి ప్రపంచంలో
అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పురస్కారం.
అలాగే
సినీ రంగంలో ఆస్కార్ పురస్కారాలు కూడా
ఇవి కాక
జర్నలిస్టులకు ఇచ్చే పులట్జురో పురస్కారాలు
మెగాసెసే పురస్కారం,
గ్రామో
ఇలాంటివి కొన్ని ఉన్నాయి.
కొందరు వ్యక్తులు పురస్కారాల కోసం
పైరవీలు చేసుకోవటం సర్వసామాన్యాంశం.
ముఖ్యంగా రాష్ట్ర కేంద్ర మంత్రులలో
ఎవరి ప్రోద్బలమో లేకపోతే
ప్రభుత్వ పురస్కారం రాదుగాక రాదు.
ప్రతిభకూ పురస్కారాలకూ
చాలా సందర్భాలల్లో
తక్కువ సంబంధం ఉంటుంది.
తక్కువ సంబంధం ఉంటుంది.
శ్రీశ్రీకి
కేంద్ర పురస్కారం తీసుకోవాలనే కోరిక ఉండేది.
కాని
ఆయన విరసం అధ్యక్షుడు కావటం వల్ల
వారు ప్రభుత్వ పురస్కారాలు
తీసుకోనీయకుండా
తీసుకోనీయకుండా
అప్పుడు అడ్డుపడ్డారు.
అలాగే పుట్టపర్తి నారాయణాచార్యుల వారికి
రావలసిన జ్ఞానపీఠ పురస్కారం
సి.నారాయణరెడ్డికి లభించింది.
ఆ దు:ఖంతో పుట్టపర్తి వారు కన్నుమూశారు.
సినీరంగంలో రఘుపతి వెంకయ్య పురస్కారం దాదాసాహెబ్ పాల్కే పురస్కారం
ఇంకా
వార్షిక స్వర్ణ రజత కాంస్య నందులు
ఇటు రాష్ట్రం -స్వర్ణం, రజత, కమలాలు
అటు కేంద్రం ఇస్తూ ఉంటుంది.
వీటిని రికమెండ్ చేయటానికి
కొన్ని కమిటీలు వేస్తారు.
సామాన్యంగా కమిటీ సభ్యులు
ప్రభుత్వపు కనుసన్నలలోనే ఉంటారు.
మహానటి సావిత్రికి పద్మభూషణ్ వచ్చింది.
కారణాలు సుస్పష్టం.
ఎన్.టి.ఆర్ పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం పురస్కారం ఇస్తున్నది.
అలాగే
శ్రీమతి లక్ష్మీపార్వతి గారు
తమ ట్రస్టు పక్షాన పురస్కారం ఇస్తున్నారు.
ఇందులో
ఆమె ప్రమేయం ఏమీ ఉండదు.
ఆమె ప్రమేయం ఏమీ ఉండదు.
చేకూరి రామారావు,
అబ్బూరి ఛాయాదేవి
వంటి సభ్యులు కొందరుంటారు.
వంటి సభ్యులు కొందరుంటారు.
వారి రికమెండేషన్‌ను ఛైర్మన్ ట్రస్టు వారికి అందజేస్తారు. సభ్యులు సామ్యవాదులైతే
సౌమ్యవాదులకు పురస్కారాలు
రాకుండా అడ్డుపడటం సహజమే.
రాకుండా అడ్డుపడటం సహజమే.
గత సంవత్సరం
కన్నడ రచయిత బైరప్ప (2009)
ఈ సంవత్సరం బెంగాలీ రచయిత మహాశ్వేతాదేవి (2010) గార్లకు ఈ పురస్కారాలు ప్రకటించారు.
బైరప్ప సంప్రదాయద్వేషి.
మహాశ్వేతదేవి స్వయంగా ఉగ్రవాద రచయిత్రి.
కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షునిగా
కాన్వాస్ చేసింది.
ఐనా
ఆమె కోర్కె ఫలించలేదు.
బెంగాల్ ప్రభుత్వమూ ఉగ్రవాదులూ
ఆమె వెనుక ఉన్నారు.
అందుకని
జ్ఞానపీఠ్ పురస్కారం కూడా తెచ్చుకోగలిగింది.
నోబెల్ బహుమతి వచ్చినా
ఏమీ ఆశ్చర్య పడనక్కరలేదు.
అలాగే
బుకర్ వంటి
అంతర్జాతీయ పురస్కారాలు
అరుంధతీరాయ్ వంటి
సంప్రదాయ వ్యతిరేకులకు వస్తూ ఉంటాయి.
పురస్కారాల ద్వారా వారు
ఆ వ్యక్తిని ప్రొజెక్ట్ చేయటం
మొదటి ప్రయోజనం -
ధన సంపాదన
రెండవ లక్ష్యం.
వారు నమ్మిన సిద్ధాంతాలకు మాన్యత కల్పించటం మూడవ ప్రయోజనం!
ఆంధ్రప్రదేశ్ నుండి
కేంద్ర సాహిత్య పురస్కారాలు పొందిన వారిలో
కె.శివారెడ్డి,
రాచమల్లు రామచంద్రారెడ్డి,
అజంతా చేకూరి రామారావు,
కేతు విశ్వనాథరెడ్డి,
అబ్బూరి ఛాయాదేవి,
బైరాగి,
కాళీపట్నం రామారావు,
సి.నారె.
నక్కా గోపి ఇత్యాదులంతా లెఫ్టిస్టులే.
వీరికి పురస్కార లబ్ధికి సంబంధించి
మంచి నెట్‌వర్క్ ఉంది.
తమకు కావలసిన వారికే వచ్చేటట్లు చూసుకోవటం
ఆ సభ్యులు
చక్కని సమన్వయాత్మక వ్యూహంలో నిర్వహిస్తారు.
ఆ సభ్యులు
చక్కని సమన్వయాత్మక వ్యూహంలో నిర్వహిస్తారు.
-లేదా గ్రౌండ్ వర్క్ అంటారు.
ప్రొఫెసర్ భద్రిరాజు కృష్ణమూర్తి
కేంద్ర సాహిత్య అకాడమీ
రెజిడినల్ కన్వీనర్‌గా ఉన్నప్పుడు
ఈ పక్షపాతం బాగా ఉండేది.
మంజుశ్రీ కాలంలో
పక్షపాతం జరుగలేదు.
పక్షపాతం జరుగలేదు.
అయినా జాతీయ స్థాయిలో అల్లరికి గురిఅయినాడు.
ఆ వివరాలన్నీ మీకు తెలిసినవే కాబట్టి
వివరణ అక్కరలేదు.
గుంటూరు శేషేంద్ర శర్మ,
రావూరి భరద్వాజ పేర్లు
జ్ఞానపీఠ పురస్కారానికి రికమెండ్ చేయబడ్డాయి.
అలాగే
పద్మశ్రీకి కూడా శేషేంద్ర పేరును రికమెండ్ చేశారు.
వారే అసూయతో కొందరు అడ్డుకున్నారు
శేషేంద్ర పేరును వాజ్‌పేయి ప్రభుత్వం
సినారె పేరును పివి నరసింహారావుగారు
పుట్టప్ప పేరును కర్నాటక ప్రభుత్వం
నోబెల్ పురస్కారానికి రికమండ్ చేసిందని వార్త.
నోబెల్ శాంతి పురస్కారం కోసం
ఎబి వాజ్‌పేయి ఎంతో తహతహలాడాడు
కాని రాలేదు.
హిందీలో ''బాహుబలి'' అనే పదం ఉంది -
అంటే
రాజకీయ లబ్ధికోసం
బలప్రయోగం చేసే దాదాగిరి అని అర్థం.
పురస్కారాల విషయం
కామ..కాంచన ప్రయోగం చేయటం
బెదిరించటం
బెదిరించటం
వంటివీ జరుగుతూ ఉంటాయి.
బెంగాల్ రాష్ట్రానికి చెందినవన్నీ
రాజకీయ పురస్కారాలు కావటం వల్ల
తరచూ వివాదాలల్లో చిక్కుకుంటూ ఉన్నాయి.
ఋత్విక్ ఘటక్ అనే ప్రముఖుడు
గాంధీజీని అశ్లీల భాషలో తిట్టాడు.
అతనికి పద్మశ్రీ పురస్కారం లభించింది.
ఇదేమిటయ్యా
అని విలేఖరులు ప్రశ్నిస్తే
అప్పుడు నాకు మతి స్థిమితం లేక తిట్టాను
అని సమాధానం చెప్పి తప్పించుకున్నాడు.
కేంద్రంలో ఉన్నప్పుడు
విశ్వనాథ సత్యనారాయణ గారికి గుర్తింపునిప్పించారు. ఎ.ఆర్.కృష్ణ,
కాళోజీ,
సినారె వంటి కవిపండితులకు
జాతీయ స్థాయిలో గౌరవం లభించింది.
కాళోజీ,
సినారె వంటి కవిపండితులకు
జాతీయ స్థాయిలో గౌరవం లభించింది.
దీనిని బట్టి తేలేదేమంటే
ఒక కళాకారుడు కవి ఎంత గొప్ప వాడైనా
ఒక రాజకీయవేత్త సహాయ సహకారాలు లేకుండా స్వయం ప్రకాశం పొందజాలడు.
వైజయంతిమాల,
మంజుభార్గవి,
శోభానాయుడు,
స్వప్నసుందరి,
రాజారెడ్డి,
రాధారెడ్డి వంటి
జాతీయ అంతర్జాతీయ స్థాయిలో
గుర్తింపు పొందిన నర్తకీమణులకు
అవకాశాలు పురస్కారాలు రావటానికి కూడా
కొందరు ప్రముఖులు పట్టుదలతో చేసిన కృషియే కారణం.
అంటే
కళాకారుల కృషితో బాటు
వారి ప్రోత్సాహకుల కృషి కూడా అత్యంత అవసరం
అని నిరూపింపబడింది.
మహాశ్వేతాదేవి మావోయిస్టు రచయిత్రి కాకపోతే
ఆమెకు బెంగాల్‌లో
ఇంత గుర్తింపు వచ్చి ఉండేది కాదు.
ఇంత గుర్తింపు వచ్చి ఉండేది కాదు.
ఆమె ఏయే సందర్భాలల్లో
దేశ వ్యతిరేక ప్రకటనలు చేశారో
23 మార్చి 2010 దిన పత్రికలో
కృష్ణాపత్రిక సంపాదకులు శ్రీ పిరాట్ల వెంకటేశ్వర్లు
సోదాహరణంగా ఒక వ్యాసం వ్రాశారు.
ఎన్.టి.ఆర్ వంటి
దేశ భక్తుడు జాతీయవాది పేర
పురస్కారం వివాదాస్పదమైంది.
తస్లిమా నస్రీన్ అనే ముస్లిం రచయిత్రి
లజ్జ
అనే గ్రంథం రచించారు.
ఆ పుస్తకం పై
ముస్లిం మత పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అలాంటప్పుడు
ముస్లిం ఓటు బ్యాంకును కాపాడుకోవటం కోసం
కలకత్తా నస్రీన్‌కు ఆశ్రయం కల్పించటానికి
ప్రభుత్వం వెనుకాడింది.
కాని
హింసను సమర్థించే మహాశ్వేతాదేవిని నెత్తినెక్కించుకున్నారు -
ఇవే సాహిత్య రాజకీయాలంటే!
పురస్కారం యువతకు ప్రోత్సాహం -
పెద్దలకు సత్కారం
కాని రాజకీయ పురస్కారాలు ఇచ్చేవారు పుచ్చుకునేవారు కూడా
సిగ్గుతో తలవంచుకోవలసినవి -
ఇప్పుడు జరుగుతున్నది అదే!
భారత దేశంలో అంతులేని దరిద్రం ఉంది.
వాటిని వ్యాపారపుముడి సరుకులుగా
మార్చుకోవటం
కొందరు రచయితలకు, రచయిత్రులకు బాగా తెలుసు.
పేదకన్నీటి ప్రవాహాలలో
బోటు షికారు చేయటం
మాయావతులకూ మహా శ్వేతలకు సమాన ధర్మం.
అందుకే ..
రామమూర్తి రేణుగారు ..
అందుకే ..
రామమూర్తి రేణుగారు ..
"మిత్రుడు మిగిల్చిన జ్ఞాపకాలు.. అనుభవాలు "లో
ఇలా అని తృప్తి పడ్డారు..
"నేడు తన తీయని ..పవిత్ర స్మృతులను ..
మాత్రమే మనకు వదలి ..
నా నెచ్చెలి వెళ్ళి పోయాడు.
సంస్థలు తమ ఉనికిని స్థార్థకం చేసుకున్నాయి.
పైరవీలకు ..ప్రలోభాలకు ...మాత్రమే సంక్రమించే.. పెద్ద పెద్ద సమ్మానాలు.. అవార్డులూ ..
ఆయన నిష్కలంక చంద్రుడైనాడు.
ఆ సంస్థల పక్షపాత పంకం..
ఆయన నంటుకోక పోవటం..
ఆయన అదృష్టమే..
ఆయన అదృష్టమే..
శివతాండవం ఆయన అక్షర శరీరం.
నిస్సంశయంగా ..భర్తృహరి పలుకుల్లో .."
అమ్మా,
రిప్లయితొలగించండిఅయ్యగారు జ్ఞానపీఠం రాలేదనే బాధతో మరణించారంటే నమ్మబుద్ధి కావడం లేదు. దీనిని మీరయినా ఖండించకపోవడం లేదా వివరణ అయినా ఇవ్వక పోవడం సరి కాదని నా ఉద్దేశ్యం.
అయ్యకు అసలు యే గౌరవాలపైనా మక్కువ లేదు..
రిప్లయితొలగించండికానీ విశ్వనాధా తానూ సమ ఉజ్జీలుగా అయ్య చెప్పాలంటే అనేక భాషలలో పాండిత్యం ఉన్న వ్యక్తిగా అయ్య నిజంగానే అహంకరించేవారు. అందులోనూ న్యాయం ఉందని సమర్థించుకున్నారు..కూడా..
అలాంటప్పుడు విశ్వనాధకు వచ్చి తనకు రాకపోవటం కాస్త దెబ్బతినడమేకదా..
అయ్య మానసికంగా ఖచ్చితంగా దెబ్బతిన్నారు.
అయ్యనలా చూస్తూ ఉండటం మాకెంత మనసుకోతగా ఉండినదో తెలుసా..
అయ్యది ఎంత పసి మనస్తత్వమో అయ్యను చూచిన వాళ్ళకు తెలుసు..
నా అర్హతను చూసి అది నా దగ్గరికి రాక ఎక్కడికి పోతుందన్న ధీమా కూడా..
అటువేపు ప్రయత్నాలు చేయలేదు..
అలా చేయడం అయ్య మనస్తత్వానికి విరుధ్ధం కూడా..
ఒక వేపు జనప్రియ రామాయణం ప్రింట్ కాకపోవడం అయిన కాపీలు అమ్ముడవక పోవడం..
ఎలా అమ్మాలో తెలియక పోవటం..
పైపెచ్చు కుటుంబ పరిస్థితులూ..
తనకంటే అర్హత కలిగిన వానికి వచ్చివుంటే అయ్య నిజంగానే స్వాగతించే వారు.
తను ఇన్నాళ్ళు శ్రమించిన సాహిత్య రంగంలోనూ అయ్యకు నిరాశ ..
నిరాశ కాదు..అదను చూసి గుండెపై దెబ్బ కొట్టటం..
అయ్య మహా యోగి మహా వేదాంతి..
ఇలాంటివి అయ్యనేం చేస్తాయి..
విశ్వనాథకు, పుట్టపర్తికి ఇద్దరికీ అహంకారం ఉండవచ్చు గాక. అయితే పుట్టపర్తి వారి అహంకారం జాతి, కుల, ప్రాంతీయ, మత భేదాలను ఎత్తిచూపుతూ వ్యక్తులను లేకిగా తూలనాడే స్థాయికి ఎన్నడూ దిగజారలేదు.తనొక గొప్ప పండితుడని ఈయన చెప్పుకున్నాడు. నిజం కూడా. ఇలా చెప్పుకోవలసి వలసిన దౌర్భాగ్యం ఎందుకంటే - సాహిత్యంలో ప్రాంతీయతా వాదం. కేవలం రాయలసీమలో పుట్టిన కారణంగా ఒక పండితుడికి దొరికినది నిర్లక్ష్యం, ఈసడింపులు కాగా సామాజికంగా బలమైన ప్రాంతంలో ఉన్న కవికి - ఆయన రచన గురించి మాట్లాడ్డమే ఉత్తమాభిరుచి అన్నంత మేరకు గుర్తింపు, ఏది రాసినా కొమ్ము కాయడానికి, విపరీతంగా విశ్లేషించడానికి, పొగడడానికి తగిన అనుచరవర్గం తయారు! సాహిత్యం కన్నా, ఇలాంటివి తెలుసుకుని, నిజానిజాలు గ్రహించవలసి రావడం ఒక దౌర్భాగ్యం. అంతే.
రిప్లయితొలగించండిఅసలు అయ్య జీవితమే ఒక ప్రయోగశాల
రిప్లయితొలగించండితన జీవితాన్ని అనేక విషయాలపైన ప్రయోగించి చూసుకున్నారు అయ్య.
ఆ ప్రయత్నంలో తనది అనేది యేదీ ఉంచుకోలేదు..
తన భార్య తన పిల్లలూ ఇలా యే ఒక్కటీ
అయ్య ఆలోచనా స్థాయికి చేరుకోవాలంటే దానికీ ఓ అర్హత కావాలి.
అందుకే
తనను ఎవ్వరూ అర్థం చేసుకోలేని ఏకాంతంలో ఉండిపోయారు
ఇక జ్ఞానపీఠానికొస్తే..
అక్కయ్య మాటల్లో..
అంతవరకూ ఊరించిన ‘జ్ఞానపీఠం’ కాస్తా కడప-గడప దాకా వచ్చి గిర్రున వెనుదిరిగి పోయిన వైనం అయ్యగారిని మరింతగా కృంగదీసింది.
జాల రచయిత చంద్రమోహన్ తో జ్ఞానపీఠం వల్ల నాకేమీ కొత్త కిరీటం రాకపోయినా
ఆ లక్ష రూపాయలతో నా ‘జనప్రియ రామాయణం’ అరణ్య కాండ వెలుగులోకి వచ్చేదిరా అన్నారట
అయ్య వడలిన శరీరంతో, వణుకుతున్న గొంతుతో!
అలా కృంగినవరు యిక మరి కోలుకోలేదు.
ఆరోగ్యం క్షీణిస్తున్నా జ్ఞానార్తి మాత్రం తీరలేదు.
హైద్రాబాద్ ఆనంద్ బాగ్ లో 1990 ఆగస్టు 2వ తేదీ నుండి 18 వరకు మా ఇంట్లో ఉన్న సమయంలో
తన అనుంగు శిష్యుడు రఘోత్తమరావుకు భాగవత రహస్యాలను విడమరిచి చెప్పేరు.
చెక్కర వ్యాధి మిషతో ఆరోగ్యాన్ని దెబ్బతీసిన దైవాన్నీ, తన సహజ ధోరణిలోనే తప్పుపట్టారొకనాడు.
నాయాలా! నిన్ను వదుల్తాననుకున్నావా! అని పైవాడు వెంటపడినాడురా.
మూడు నెలలు మలేరియా, మళ్ళీ యిదిగో యీ కాలిపుండూ,
ఈలోగా ఈ షుగరూ..
నేనేం తక్కువ తిన్నానా!
నీకంటే నేను మహా మొండి వాడిని తెలుసా!
చూద్దాం ఏం చేస్తావో! అని అనేశాను అని ఒకటే నవ్వు.
రమణ మహర్షి గుర్తొస్తున్నారు..
రిప్లయితొలగించండివారు తాను ఆత్మగా వుండి శరీరాన్ని చూసేవారు..
ఈ శరీరానికి జబ్బు చేసినది..అనేవారు..
ఆ సమయంలో నేను దగ్గర లేకపోవటం నా దురదృష్టం..
అయినా అయ్య కరుణతో చివరి చూపులకు నన్ను అనుగ్రహించగోరి నన్ను పిలిపించుకున్నారు
తన మానసిక బలంతో..
అయ్య వద్ద మంత్రోపదేశం పొందిన అదృష్టవంతురాలిని నేను..
అటువంటి సద్గురువు ఎంతో పూర్వ జన్మ పుణ్యం వుంటేనే దొరుకుతారు.
ఆ రోజు నుంచీ మీరు నమ్మరు..
అయ్యను తలుచుకుంటేనే ఉప్పెనలా దుఃఖం ..
దేవుని ముందు కూర్చుంటే
తెలియని తన్మయత్వం నాకు కలుగుతున్నాయి