26 జూన్, 2012

తెనాలి రామలింగని హా స్యానికి పుట్టపర్తి వారి భాష్యం పుట్టపర్తి అనూరాధ.


ఒకసారి 
తల్లావఝ్ఝుల శివశాస్త్రి గారు 
మునిమాణిక్యం గారింటికి వచ్చారు.
మునిమాణిక్యం గారి అబ్బాయి
బయట అరటిచెట్టుదగ్గర ఆడుకుంటున్నాడు.
ఏం చేస్తున్నావ్ ..?
అని అడిగారు చేస్తున్నది చూస్తూనే
గుడికి వెళ్ళి 
అక్కడ తెలిసిన వారు తారసపడితే 
గుడికి వచ్చారా 
అని అడిగినట్లు.. 
ఆడుకుంటున్నాను ..
 అని సమాధానమిచ్చాడా బుడతడు..
రంభతో క్రీడిస్తున్నావురా ..అబ్బాయ్..
నాటకీయంగా అని లోపలికెళ్ళారు.
 
 హాస్యం..
ఆ పేరు వినగానే 
అందరి పెదవులూ విచ్చుకుంటాయి..
మనసు ప్రసన్నమవుతుంది.
సర్వ దుఃఖాలనుంచీ 
మనసును మరపించేది నవ్వు.
హాస్యాన్ని 
మనం నిత్య జీవితంలో
సన్ని వేశాలద్వారా.. సంభాషణలద్వారా ..
 కొంతవరకూ ఆస్వాదిస్తాం
మరి..
సాహిత్యంలో హాస్యం ఎలా వుంది ..
 హాస్యంలో సాహిత్యం ..
సారీ ..
సాహిత్యంలో హాస్యం అనగానే.. 
 మనకు 
ఒక గురజాడ ..
ఇంకా వెనక్కు వెళితే..
తెనాలి రామలింగయ్య ..
తదితరులు ఠక్కున గుర్తుకు వస్తారు..

ఓసారి ..
పెద్దనామాత్యుడు
ప్రాసకోసం "అమవసనిసి" అని వాడాడు.
రామలింగకవి ఊరుకుంటాడా..

“ఏమితిని సెప్పితివి కపితము
బెమపడి నెరి పుచ్చకాయ నడితిని సెపితో
ఉమెతక్కయ తినిసెపితో
అమవసనిసికి యనుమాడి అలసనిపెదనా!”
అంటూ హాస్యమూ వ్యంగ్యమూ కలిపి కొట్టాడు.

పుట్టపర్తి వారు వ్రాసిన 
" రామక్రుష్ణుని రచనావైఖరి .."
తెనాలి వాని హాస్య చతురతకు అద్దం పడుతుంది.
మనకు 
తెనాలి రామకృష్ణ కవి 
హాస్య కథలు తెలుసు
రచనలో ఆయన హాస్యం 
ఎలా పరిఢవిల్లిందో తెలుసుకోవాలంటే
పుట్టపర్తి వారి 
రామకృష్ణుని రచనా వైఖరిని తెరవాల్సిందే..
ఇందులో మూడు ఉపన్యాస పాఠాలున్నాయ్
అందులో ఒకటి ఇది
మరింకెందుకాలస్యం ..?
చదవండి..




























































































కామెంట్‌లు లేవు :

కామెంట్‌ను పోస్ట్ చేయండి