12 జులై, 2012


మా అయ్య కొత్త ఫోటో దొరికిందోచ్..
ఎంత బాగున్నారు కదా మా అయ్య..
తెల్ల గడ్డం అయ్యనే నాకు తెలుసు ..
నల్ల గడ్డం ..
ఎంత అందమైన ముఖం..
ఆ కళ్ళల్లో నవ్వు చూడండీ..
 దొంగ ....
అబ్బ..
ఇంత అందమైన అయ్యకు
అంత గాఢభక్తి..
భజనలు చెసేవారు
భక్తి కృతులు రచించి 
హార్మోనియం వాయిస్తూ పాడేవారు..
ఎంత మేధస్సో..
తన పాండిత్యంతో 
అందరినీ గడగడలాడించిన అయ్య ఈయనే కదూ..
పెనుగొండలక్ష్మీ ..
శివతాండవం కూడా అప్పటికి వ్రాసేసారనుకుంటా..
అయ్య వడిలో 
మా అన్నయ్య అరవిందు వున్నాడట..
అంటే అప్పటికి కడప వచ్చేసాం..
ఆ..
శివతాండవం అయిపోయింది..
ఇరవయ్యేళ్ళ వయసులోనే 
ప్రాకృత వ్యాసాలు వ్రాసి 
మల్లంపల్లి సోమశేఖరశర్మ గారిని 
అబ్బురపరచింది ఈ అయ్యనే..
నన్ను అపురూపంగా గారం చేసిన అయ్య ఈయనేనా..??
అవునా..
1943 లో 
నవ్య సాహిత్య సమావేశాలకొచ్చినపుడు విశ్వనాధగారు అయ్యతో అన్నారట..
నేనెందుకొచ్చానో చెప్పనా..
భారతిలో నాపై 
అంత అద్భుత మైన వ్యాసం వ్రాసినందుకు 
నిన్ను అభినందిద్దామని అన్నారట..
అయ్య ఆ సంగతి 
మురిసిపోతూ చెప్పుకొనే వారట..
విశ్వనాధవారు అలా చెప్పింది ఈ అయ్యకేనా..
అబ్బ ..
అలా ఊహించుకుంటుంటే ఎంత బావుందో..
నేను ముందెందుకు పుట్టలేదో..
అయితేనేంలెండి..
జీవితానికి సరిపడా
ఎన్ని మధురానుభూతులు ఉన్నాయనుకున్నారూ..

కామెంట్‌లు లేవు :

కామెంట్‌ను పోస్ట్ చేయండి