కృష్ణాష్టమికి
అయ్య రాసిన మధురమైన కృష్ణగీతాలు
అలనాడు ఆకాశవాణిలో ప్రసారమయ్యేవి..
అవి ఇవే..
చదివి ఆనందించండి..
ఎవరు భూషించిరో
ఇందిరేశ కృష్ణా..
భువనావన ఎంతో
ముద్దు గురియగా..
ఎవరు భూషించిరో.. ఇందిరేశ కృష్ణా...
యాదవులో.. దేవతలో..అప్సరలో..గోపికలో..
ఆదమరచి భక్తాగ్రేసరులో..మోహనమగునిన్నూ..
ఎవరు భూషించిరో ఇందిరేశ కృష్ణా..
కటితటమున కరముతో ..
ఘటియించిన పించముతో..
చటుల నూపురములతో ..
సరిగ పీతాంబరముల నిన్ ..
ఎవరు భూషించిరో ఇందిరేశ కృష్ణా..
అష్టాక్షరిమంత్రాధిష్టానమ్మగు రూపముతో..
ఆర్త రక్షక భక్తులు అనురాగాంబుధినిండగ..
ఎవరు భూషించిరో ఇందిరేశ కృష్ణా..
ఇందిరేశ కృష్ణా..
భువనావన ఎంతో
ముద్దు గురియగా..
ఎవరు భూషించిరో.. ఇందిరేశ కృష్ణా...
యాదవులో.. దేవతలో..అప్సరలో..గోపికలో..
ఆదమరచి భక్తాగ్రేసరులో..మోహనమగునిన్నూ..
ఎవరు భూషించిరో ఇందిరేశ కృష్ణా..
కటితటమున కరముతో ..
ఘటియించిన పించముతో..
చటుల నూపురములతో ..
సరిగ పీతాంబరముల నిన్ ..
ఎవరు భూషించిరో ఇందిరేశ కృష్ణా..
అష్టాక్షరిమంత్రాధిష్టానమ్మగు రూపముతో..
ఆర్త రక్షక భక్తులు అనురాగాంబుధినిండగ..
ఎవరు భూషించిరో ఇందిరేశ కృష్ణా..
ఉత్తముల సంగతీ నాకిచ్చి మనుపుమా
చిత్త జనకా మురవైరి కృష్ణా..
మరి మరీ పుట్టలేను..
పరబాధ గనలేను..
పరిపరీ కష్టముల ..
అనుభవింపలేను..
జనన మరణములనూ..
పరిహరింపుమురా..
కరుణా సముద్రా..
మురవైరీ..కృష్ణా..
ఉత్తముల సంగతీ నాకిచ్చి...
నిన్ను నమ్మిన పిదప అన్యాశ్రయంబేల..
పన్నంగ శయనా.. పాలింప వయ్యా..
మున్ను భక్తులనెల్ల..చెన్నార గాచితివి..
కన్నయ్య నను బ్రోవ కాల హరణంబేల...
ఉత్తముల సంగతీ..
ప్రజానందుడదిగో..
అదిగో..
యమునా హృదయమ్మదిగో..
అదిగో..
ప్రజానందుడదిగో..
రణద్వేణువదిగో..
అదిగో..
రాధాధిక సుందరుడల్లదిగో..
ప్రజానందుడదిగో..
సుమాతల్పమదిగో..
అదిగో..
రమాకాంతుడదిగో..
స్ఫురన్నూపురములా ..
ఝణ ఝణ..విరావమ్ములదిగో..
ప్రజానందుడదిగో..
పరబ్రహ్మ మదిగో..
అదిగో..
అష్టాక్షరి రూపమ్మల్లదిగో..
సురానందమదిగో..
అదిగో..
నిరాధారులకు నిజమగు పెన్నిధి..
ప్రజానందుడదిగో..
ఒయ్యారముగ రారా శ్రీహరి..
ఒయ్యారముగ రారా..
వయ్యాళి చూపుల దియ్యంబుగొలుపుచు..
సయ్యాటలను మరునయ్యా దాసుండని..
వయ్యారముగ రా..రా..
కరానగల వేణు నాళముతో..
ఖగేంద్రవాహన గమనముతో..
నిరాదరణ సేయరాదు యదుపతి ..
సారంబుగా నష్టాక్షరి బట్టిరి..
ఒయ్యారముగ రా..రా..
యమునా తటిలో ..
తిరిగెడి వాడట..
చెలియా చూచితివా..
ఓ..చెలియా.. చూచితివా..
ఆ..అడగని అలకలతో..
ఆవుల క్రేవులతో..
ఆతడబడు నడకలతో..
యమునా తటిలో ..
తిరిగెడి వాడట..
చెలియా చూచితివా..
ఆ కన్నులలో పుట్టినవమ్మా..
అన్నీ అందాలూ..
అందుకె మరులున ..
వెంటబడిన మాకందని ..వాడమ్మా..
వాడూ...అల్లరీ వాడమ్మా..
యమునా తటిలో ..
మా మనసులలో..
మరులను రేపీ..
మరగిన వాడమ్మా..
ఎంత వెదకినా..
అగుపడడమ్మా..
కరుగని వాడమ్మా..
వాడు..కపటపు వాడమ్మా..
యమునా తటిలో..
మునులకు.. గినులకు ముసుగూ వేసి..
మురిసెడివాడమ్మా..
మొగిని అష్టాక్షరి మంత్రములోనే..
వెలసెడు వాడమ్మా..
మాకూ కొలిచెడు వాడమ్మా..
యమునా తటిలో..
ఉప్పొంగకువె .. యమునా....
ఉప్పెనగ నీవిపుడు..
ఉర్విపై శీవాసు..
డుద్భవంబైనాదు..
ఉప్పొంగకువె..యమునా....
తరువులన్నియు సుమకదంబములు..భూమిపై..
జల జలమటంచు..వెన్నెలవోలె రాల్చినవి..
హరిణంబులుల్లాస భరిత హృదయములతో..
గల గలని ఆకులతో కడు చౌకళించినవి..
ఉప్పొంగకువె యమునా....
విసనకర్రలబోలు పించములు విప్పుళుగ..
నెమళులన్నియు గలసి నాట్యంబులాడినవి..
ప్రతి తృణము సంతోష భరితమై తూగినది..
బ్రహ్మాండమంతటా..పట్టనీ ఆనంద..
ముప్పొగకువె యమునా..
పాడు కంసుడు తరిమి వచ్చునో యేమొయని..
వసుదేవుడీవైపు వచ్చుచున్నాడే..
అహ్టాక్షరీస్వామి ఆనందమయుడమ్మా..
ప్రేమామృతం వాని పెదవి కొసలనమ్మా..
ఉప్పొంగకువె యమున..ఉప్పొంగకువె .. యమున..
ఉప్పెనగ నీవిపుడు..
ఆకాశవాణి కడప భక్తి రంజని
చాలా అర్దవంతంగా ఎంతబాగున్నాయో...
రిప్లయితొలగించండికృష్ణాష్టమి శుభాకాంక్షలు..
అహా! కడుపు, మనసు నిండిపోయిందండీ.....ఆడియోలు ఉంటే ఎంత బాగుండేదో
రిప్లయితొలగించండికామెంటు పెద్దదైతే మీరు నన్ను క్షమించాలి.......నా వెబ్సైటులో పెట్టిన ఆకాశవాణి వారి ఆడియోల సంగతులు కొన్ని పంచుకోవాలనిపించి.....కొంతమంది ఉంటారు - బోల్డంత ఆడియో సరంజామా పోగేసుకుని - నా దగ్గర అవి ఉన్నాయి, నా దగ్గర ఇవి ఉన్నాయి అనుకుంటూ, మాటలు మటుకు కోకొల్లలు......ఇవ్వాలంటేనూ, పంచుకోవాలంటేనూ చేతులు రావు.....ఈసడింపు, చిన్నచూపు , ఇస్తే నాకేమిటి లాభం - ఇలా బోల్డు కారణాలు.........
ఇంకో రెండు ముక్కలు చెప్పి ముగిస్తా....
అదలాగైతే ఇచ్చినవారి సంగతులు మరింత తమాషా......బోల్డంత సాయం చేసాను అందువల్ల నీకు నేను చెప్పిందే వేదం అని ఒకాయన, ఈ పిచ్చి జనాలకు రెణ్ణెళ్ళకోసారి ఓ రెండు కుక్కబిస్కెట్లు పారేస్తే చాలు అన్నీ ఒకేసారి ఇవ్వటం ఎందుకు అని ఒకాయన, నేనిచ్చినవన్నీ సైటులో ప్రముఖంగా కనిపించాలి - మొదటి పేరు నాదే రావాలి అని ఒకాయన, ఈ కలక్షనంతా నేను పేరు కోసం చేస్తున్నానని వెధవ మాటలు మాట్లాడేవారు కొంతమంది - ఇలా నానారకాల చెత్త.....విసుగొచ్చేసిందనుకోండి.....ఈ దరిద్రపు గోలంతా ఎందుకు అని వీళ్ళందరితో మాట్లాడటం, ఆడియోల కోసం వీళ్లను దేబిరించడం - అన్నీ మానిపారేసా.....
అయినా ఎప్పుడో ఒకప్పుడు అయ్యగారి ఈ భక్తిరంజని ఆడియోలు ఎవరో ఒక మంచి మనిషి దగ్గర దొరకకపోవు, ఇక్కడ మీతో పంచుకోకపోను..
భక్తి రంజని సాహిత్యానికి బోలెడు ధన్యవాదాలతో
భవదీయుడు
మాగంటి వంశీ
మాగంటి గారూ మీ ఉత్తరం లాంటి వ్యాఖ్య చూసి ఎంతో సంతోషమయ్యిందండీ..
రిప్లయితొలగించండికడుపున పుట్టిన అన్నయ్యకు తన సంసారం తన పిల్లలూ తప్ప అంతటి మహనీయుని కడుపున పుట్టి తరించానన్న స్పృహ ఇసుమంతైనా లేదు.
మేము అయ్య ద్వారా జన్మ పొందామే కానీ పాండిత్యం పంచుకోలేదు.
దానికీ పూర్వ సుకృతం ఉండాలి కదా..
నాకెప్పుడు క్యాన్సర్.
మొదటి దశ లోనే ఉందనుకోండి
అయ్యంటే వల్లమాలిన ప్రేమ
అంతకు మించిన భక్తి.
పైగా మంత్రోపదేశం పొందిన అదృష్టం ఇచ్చి అయ్య నా చేతిని గట్టిగా పట్టుకున్నారు.
జన్మ జన్మాంతరాల వరకూ నన్ను ఉధ్ధరించేంత వరకూ వదలరని నా విశ్వాసం..
ఆ ప్రేమ భక్తీ కలగలిసిన కన్న్నీళ్ళతో ఆ భగవన్మూర్తులను తడపడం వలన కావచ్చు ఆ సర్వేశ్వరుడు..
అయ్య ఆధ్యాత్మిక సాహిత్య జీవిత విశేషాలను తేరిపార చూసేందుకు అవకాశమిచ్చాడు అందుకే సాహసించాను.
ఆ సాయి నాధుడు తన జీవితాన్ని వ్రాసే అవకాశం హేమాద్రి పంతుకిచ్చినట్లు నాకు అయ్య విశేషాలను తలుచుకుని ఆనందించే అదృష్టం నాకిచ్చాడు.
ఇది ఆ హయగ్రీవస్వామి వ్రాయిస్తున్నదని నేను భావిస్తున్నాను.
నా కెంత కాలం మిగిలి వుందో నాకు తెలియదు.
ఇంతలో అయ్యకు రామునికి సేవ చేసిన ఉడుత లాగా జటాయువులాగా సేవ చేసి తరించాలని ఆశ.
అయ్య కీర్తనలు లెక్క లేనన్ని ఉన్నాయి.
కొన్ని నా అపస్వరాలతో నేను పాడి you tube లో ఎక్కించాను.
మా అక్కయ్యలు బాగా పాడ గలరు.
వారిని అయ్య కీర్తనలకు రాగాలు కట్టమని బ్రతిమాలుతున్నాను.
సాధ్యమైనంతలో అయ్య కీర్తనలనూ వెలుగులోకి తీసుకురావాలి
ఇక పోతే
భక్తి రంజని కీర్తనలను కడప ఆకాశవాణిలో ప్రియంవద అనే ప్రొడ్యుసరు అద్భుత మైన రాగాలు కట్టింది.
ఆవిడ ఫోను అడ్రసు తెలియదు.
అవి తనవి కనుక ఆవిడ దగ్గర కనీసం క్యాసెట్ల రూపంలోనైనా ఉండవచ్చు.
ఆవిడ ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నాను..
మీరేం దిగులు పడకండి.
తన భక్తుని నామ జపం ప్రతి క్షణం చేసి తరించిన తన భక్తుని కోసం ఆ రామచంద్రుడే మనకు తెచ్చి ఇస్తాడు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసాయి గారు మంచి వ్యాఖ్యకు సంతోషం
రిప్లయితొలగించండిఅసలు మంచి పని చేయాలన్న ఉద్దేశం పుట్టటమే విశేషం..
రిప్లయితొలగించండిఈ బిజీ యాంత్రిక జీవితాలలో మన గురించి మనం ఆలోచించుకోవటానికే సమయం సరిపోదు.
అలాంటిది మీరొక ఉన్నతాశయంతో భావితరాలకు మీ చేతుల తో వెలుగులు చూపాలనుకోవటం నిజంగా అభినందించదగ్గ విషయం
లోకంలో విభిన్న మనస్తత్వాలు..
వాటితో మనం వేగాలి తప్పదు ఏం చేస్
అరెరె - మీ కాన్సరు మాట చూసి ఒక్కసారిగా నిర్ఘాంతపోయాను .......ఒక ఐదు నిముషాలు ఏమి రాయాలో అర్థం కాలా......మీకు మరింత ధైర్యాన్ని , ఆ కాన్సరును ఎదుర్కునే అనంతమైన శక్తిని ప్రసాదించాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ......
రిప్లయితొలగించండిఆ కాన్సరు మీద విజయం సాధించాక అయ్యవారి సాహితీ జీవితమే కాకుండా మానుష జీవనం గురించి ఇంకా బోలెడు వివరాలు మీరు అందించాలని ఆశిస్తూ.....
ప్రియంవద గారి అడ్రెసు ఫోను నంబరు కనుక్కోటానికి, నా వంతు నేను ప్రయత్నిస్తాను....
మీకే సాయం కావాలన్నా మొహమాట పడకుండా అడగండి, నా శక్తిమేరా సాయం చేస్తాను.....
భవదీయుడు
మాగంటి వంశీ