అయ్య మరాఠీ సాయి చరిత్రను చదివి
తెలుగులో దాన్ని పురాణం చెప్పేవారు
పురాణమయ్యాక భజన..
హార్మోనియం వాయిస్తూ..
అప్పటికప్పుడు పదాలను సృష్టిస్తూ..
భక్తి భావనలో తలమునకలౌతూ
జరిగేదా నామ సంకీర్తన..
అలానే తులసీ రామాయణమన్నా
వారికి ప్రాణ సమానం
దాదాపు పదమూడు సంవత్సరాలు
తులసిని పారాయణ చేసి
తులసి ఆత్మ ను అర్థం చేసుకున్న
పుట్టపర్తి వారు..
తులసీ జీవితంలోని ప్రధాన ఘట్టం
తీసుకొని
సాక్షాత్కారమనే కావ్యానికి అక్షరరూపమిచ్చారు..
భార్యపై మమతతో
హోరువానలో అర్ధరాత్రి
ఆమె ఇంటి తలుపుతట్టిన తులసి
ఆమె బోధతో
తన ప్రేమను రామునివేపు తిప్పటమే
సాక్షాత్కరము..
ఆ కావ్యానికి తొలి పలుకులో
ఆచార్యులవారు ఇలా వ్రాసారు
ఇదెక్కడి ఋణానుబంధమో
నేటికి దాదాపు యెనిమిది సంవత్సరాలయింది
తులసీరామాయణాన్ని ఉపాసించబట్టి
అన్నం తినకుండా వుంటాను
కాని రామచరిత మానస్ ను
వల్లించకుండా వుండలేను
ఆయన కావ్యాలు
నా జీవితంలో బాగా అదుక్కున్నాయి
అన్నారు.
ఈ కావ్యాన్ని మనకు పరిచయం చేస్తూ
ప్రఖ్యాత రచయిత
డా.భీం సేన్ నిర్మల్ గారు
పుట్టపర్తి వారితో గల పరిచయాన్ని
కావ్యంలో గల ప్రత్యేకతలనూ
చెబుతున్నారు..
అయ్య మరాఠీ సాయి చరిత్రను చదివి
తెలుగులో దాన్ని పురాణం చెప్పేవారు
పురాణమయ్యాక భజన..
హార్మోనియం వాయిస్తూ..
అప్పటికప్పుడు పదాలను సృష్టిస్తూ..
భక్తి భావనలో తలమునకలౌతూ
జరిగేదా నామ సంకీర్తన..
అలానే తులసీ రామాయణమన్నా
వారికి ప్రాణ సమానం
దాదాపు పదమూడు సంవత్సరాలు
తులసిని పారాయణ చేసి
తులసి ఆత్మ ను అర్థం చేసుకున్న
పుట్టపర్తి వారు..
తులసీ జీవితంలోని ప్రధాన ఘట్టం
తీసుకొని
సాక్షాత్కారమనే కావ్యానికి అక్షరరూపమిచ్చారు..
భార్యపై మమతతో
హోరువానలో అర్ధరాత్రి
ఆమె ఇంటి తలుపుతట్టిన తులసి
ఆమె బోధతో
తన ప్రేమను రామునివేపు తిప్పటమే
సాక్షాత్కరము..
ఆ కావ్యానికి తొలి పలుకులో
ఆచార్యులవారు ఇలా వ్రాసారు
ఇదెక్కడి ఋణానుబంధమో
నేటికి దాదాపు యెనిమిది సంవత్సరాలయింది
తులసీరామాయణాన్ని ఉపాసించబట్టి
అన్నం తినకుండా వుంటాను
కాని రామచరిత మానస్ ను
వల్లించకుండా వుండలేను
ఆయన కావ్యాలు
నా జీవితంలో బాగా అదుక్కున్నాయి
అన్నారు.
ఈ కావ్యాన్ని మనకు పరిచయం చేస్తూ
ప్రఖ్యాత రచయిత
డా.భీం సేన్ నిర్మల్ గారు
పుట్టపర్తి వారితో గల పరిచయాన్ని
కావ్యంలో గల ప్రత్యేకతలనూ
చెబుతున్నారు..
విందామా..
సరస్వతీపుత్రుల హిందీ భాషాభిమానం
డా భీం సేన్ నిర్మల్
తెలుగు గ డ్డ జన్మ ఇచ్చిన
అసాధారణ ప్రతిభావంతులలో
సరస్వతీపుత్ర పుట్టపర్తి నారాయణాచార్యుల వారు
ప్రధమ పంక్తిలో గణ్యమానులు
శ్రీకృష్ణదేవరాయల గురువైన
శ్రీ తాతాచార్యుల వంశీయులై
పరమ వైష్ణవులై కూడా
శివతాండవం రచించిన పరమ శైవులు వారు
హరిద్వా రంలో
స్వామీ శివానందగారి సమక్షంలో
పలుభాషా పండితులతో
వారి వారి భాషలలో శాస్త్ర చర్చలు చేసి
వారిని ఓడించిన
సరస్వతీపుత్రులు నారాయణాచార్యులవారు
చతుర్దశ భాషలలో
సాహిత్యాన్ని ఆపోశన పట్టినవారు
నారాయణాచార్యులవారు
1962 లో
వరంగల్లులోని సాయం కళాశాలకు
డా కేతవరపు రామకోటి శాస్త్రిగారి
ఆహ్వానాన్ని పురస్కరించుకొని విచ్చేసారు
వారు వినిపించిన శివతాండవం
విని శ్రోతలు ముగ్ధులైపోయినారు.
ఆ తరువాత
పిచ్చాపాటిగా మాట్లాడుకుంటున్నప్పుడు
నేను ఆ రోజుల్లో
సాయం కళాశాలలో
హిందీ ఉపన్యాసకుడిగా పనిచేసేవాణ్ణి
బాల్యచేష్టగా వారితో
హిందీ భాషలో మాట్లాడసాగాను
వారు ఒక్క క్షణం నా వేపు చూసి అనర్గళంగా
హిందీ భాషీయునివలె సంభాషించారు
వారి హిందీ ఉచ్చారణ విని
జాతీయాలతో కూడిన
సహజ హిందీ వాక్య రచనను విని
విస్తుబోవటం నావంతయింది.
అలాంటి బహు భాషా కోవిదులు కాబట్టి
వారిని డా బెజవాడ గోపాల రెడ్డి గారు
ఢిల్లీ సాహిత్య అకాడమీ గ్రంధాలయానికి
అధ్యక్షులుగా నియమింపజేసారు
కాని
ఢిల్లీ లోని రాజకీయ దుర్గంధానికి
సాంఘీక వాతావరణంలోని కాలుష్యానికీ తట్టుకోలేక
మళ్ళీ స్వగ్రామమైన ప్రొద్దుటూరు చేరుకున్నారు.
నారాయణాచార్యుల వారికి
హిందీ లోని ప్రాచీన సాహిత్యమంటే
వల్లమాలిన అభిమానం
నేటి వ్యావహారిక భాష అయిన "ఖడీబోలి"
అంటే గౌరవభావం లేదు.
స్వాతి మాసపత్రిక
జూలై 1989 కి ఇచ్చిన ఇంటర్వ్యూలో
వారు హిందీ భాషా సాహిత్యాలపట్ల
తమకు గల అభిప్రాయాలను స్పష్టం చేసారు
వారు ఇలా అన్నారు
ఈ "ఖడీబోలీ" అనే శవాన్ని నెత్తిన వేసుకొని
ఎంతో ప్రాచీన సాహిత్యాన్ని
వారు పోగొట్టుకున్నారు.
నవీన హిందీలో సాకేత్ అని ఓ కా వ్యమొచ్చింది
మైధిలీ శరణగుప్త దాన్ని రచించాడు
మంచి కావ్యమే
కానీ దాన్నెవరూ పారాయణం చేయడంలేదు.
తులసీనే పారాయణం చేస్తారు
కారణం ఏమిటీ
చెప్పే కూతకూ
చేసే చేతకూ ఐక్యత లేకపోవటమే.
నవీన కవిత్వం పైన
గౌరవం కలగకపోవడానికి వుండే కారణాలలో
ఇది ఒకటి
వీళ్ళ రాతలూ బాగానే ఉన్నాయి
వీళ్ళజీవితాలూ తెలుస్తూనే వున్నాయి
ఏదో తమాషగా చదువుకుంటాం
అంతే కానీ
తులసీదాసు ..
సూరదాసులకిచ్చిన గౌరవం ఇవ్వం కదా..
పై అభిప్రాయాలవలన
వారికి తులసీదాసు పట్ల ఉండే
అపార గౌరవప్రపత్తులు విశదమవుతున్నాయి
తులసీదాసు జీవిత చరిత్రలో
ఒక ప్రధాన ఘట్టం ఆధారంగా
వారు సాక్షాత్కారం అనే కావ్యం రచించారు
ఆ కావ్యానికి తొలి పలుకులో
ఆచార్యులవారు ఇలా వ్రాసారు
ఇదెక్కడి ఋణానుబంధమో
నేటికి దాదాపు యెనిమిది సంవత్సరాలయింది
తులసీరామాయణాన్ని ఉపాసించబట్టి
అన్నం తినకుండా వుంటాను
కాని రామచరిత మానస్ ను
వల్లించకుండా వుండలేను
ఆయన కావ్యాలు
నా జీవితంలో బాగా అదుక్కున్నాయి
అతని జీవితం నా భావనలో తిరిగి తిరిగి
నేటికీ కావ్య స్వరూపం దాల్చింది
ఇది వారి సమగ్ర జీవితం కాదు
ఒక భాగం మాత్రమే.
గోస్వామీ తులసీదాసు పట్ల
ఈ గౌరవ భావమే సాక్షాత్కార కావ్యాన్ని
తులసీదాసుకే అంకితం చేసేటట్లు చేసింది
సమర్పణము చేస్తూ
ఆచార్యులవారు రచించిన పద్యాన్ని చూడండి
"రసమో వ్యంగ్యమో భావమో మరియతంద్రాలం కృతి విన్యాసమో
ఇసుమంతైననెఱుం గనోయి ప్రభువా యీ కొండలంజింత వె
క్కసమైనప్పుడు నేడ్చికొంటినదియే కావ్యాత్మగామాఱెనీ
యసమాన ప్రతిభాప్రభావము సమోహచ్చేదకౌక్షేయమై"
ఈ సాక్షాత్కారము అనే కావ్యంలో
14 ఖండికలున్నాయి
తులసీదాసు భార్య పేరు రత్నావళి
అని లోక ప్రచారంలో ఉన్నది
కాని ఆచార్యులవారు ఆమెకు
మమతాదేవి అని పేరు పెట్టారు
ఆమెది శరీరంతో సంబంధం లేని
జ్యోతిర్మయమైన ప్రేమ అని
తులసీదాసు ప్రేమ
శరీరానికి సంబంధించిన కామమనీ
ఈ ఖండికలో
ఈ రెండు ప్రేమ భావాల మధ్య సంఘర్షణను
మనస్సుకు హత్తుకొని పోయేట్లు చిత్రించారు ఆచార్యులవారు.
ఈ ఖండికలోని చివరి పద్యాన్ని
పరిశీలించండి..
"విషయ సుఖంబులన్ బడి వివేకము వీడి నశింతురేమీ మా
నుషామని మేలమాడుటకు నోయన దూరపుకొండ కొమ్ములం
దుషనడతెంచె పక్షులు సమాదితముంబొరరించెబూత మా
నసములు నా ప్రభాత లలనాహిత బోధలు రాగభంగులన్"
చీకటి కాటుకలో
భోరుమని
గుక్క తిప్పకుండా కురుస్తున్న వానలో
ఊరినుండి పరుగెత్తుకొని వచ్చి
తలుపుతట్టిన భర్తను చూచిన
మమతాదేవి హృదయంలో
అంతకుముందు దాగి
లజ్జాధఃకృతాలయిన భావాలన్నీ
వేడిగా వాడిగా తరుముకొని వచ్చాయట
ఎవరయ్యా వీరు శాస్త్ర
ప్రవణులో యొకదినపు విరహభరమునకే మే
మరవిడాచి పరుగిడినారట
శివశివ యనుకొన్న సిగ్గుచేటగునాకున్
మర్యాద నధఃకరించుచు వచ్చిన
తులసీదాసును చూచి
ఆమె ఇలా అన్నది
"రాముడు చిక్కునాయనుతలంకు మనస్సున కర్హమే దయా
రామము రామచంద్రుడు గరారుగవచ్చును బిల్చినంత నీ
ప్రేమము నెల్ల దచ్చరణ పీఠికినర్పణము సేసికొమ్ము సు
త్రాముడు పాడుకోగలడు ధన్యము త్వద్యశమించు వీణలన్"
తులసీదాసు ప్రేమిక మమతాదేవి అతనికి ధరణిజాహనుమన్మనోధామమునకు
ప్రణయమూర్తికి
రాఘవ బ్రహ్మమునకు
త్రోవచూపించినది
ఆ పతివ్రతా శిరోమణిచే ఆదేశించబడిన తులసీ దాసు
ఏకాంతవాసానికై చిత్రకూటం చేరాడు
సంపూర్ణ వైరాగ్యానికి సిధ్ధంగాలేని హృదయంతో
ప్రేమ వైరాగ్యాలకు ప్రవృత్తి వివృత్తులకు
ఏర్పడిన సంఘర్షణను
ద్వంద్వాన్ని
ఆచార్యులవారు మనోహరంగా వర్ణించారు.
వెతలకన్నింటికి మూలకారణమయిన స్వార్థాన్ని పోగొట్టి
స్వార్థరాహిత్యాన్ని ప్రసాదించమని
తులసీదాసు చిత్రకూటాన్ని వేడుకొంటాడు
తులసీ దాసు సాధన
దాస్యంతో ప్రారంభమై
క్రమక్రమంగా
మిత్ర
వాత్సల్య
మధుర భావాలుగా పరిణమించి
ఉన్మాదస్తితికి మారుతుంది
సాధన అన్న ఖండికలోని సీసాలు గేయాలు
సాహిత్య
సంగీత
సమీఅళనంతో
సహృదయులకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయనడంలో
ఎటువంటి సందేహమూ లేదు
తదేక దీక్షతో త్రయోదశాక్షరీ జపిస్తున్న తులసీదాసు
అలౌకిక ప్రేరణచే కన్నులు తెరిస్తే
కన్నుల ఎదుట
ఒక పాదుషా
ఆ వెనక ఒక మహమ్మదీయ రౌతు కనిపిస్తారు
భక్త రామదాసు పాఠకులకు స్ఫురిస్తాడు
ఈ మహమ్మదీయులతో మనకేం పని
అని మళ్ళీ ధ్యాన నిమగ్నుడవుతాడు
కాని ఆవేషంలో వచ్చినవారు
రామలక్ష్మణులే అని తెలుసుకొని
బాధపడతాడు
అందుచేతనే
తులసీదాసు తన రామచరిత మానస్ లో
రామచంద్రుణ్ణి పాదూషా వలెనే వర్ణిస్తాడని
ఆచార్యులవారు కల్పించుకున్నారు.
తన యాస్థానములో
కవిగా నుండరమ్మని చెప్పి పంపిన అక్బరు చక్రవర్తికి
తులసీదాసు ఇచ్చిన సమాధానం
తొమ్మిదవ ఖండికలో వర్ణించబడింది.
"రాముడె సర్వనేత యభిరామము వాని గుణ ప్రశస్తియే
కామిత దాయి స్వర్గ నరకంబులు దాటె డు త్రోవ భక్తియే
భీమభవాబ్దిపోత మవివేకులు శుష్కయశంబుగోరియా
శా మా లినీకృతాత్ములయి చత్తురు కర్మ ఫలాను భోక్తనై"
అదీకాక..
"నేను 'బిహారి' నేమి యవనీపతి మెప్పును గోరి కావ్యసం
తానములిచ్చి వైభవశతంబులనాసలు చూఱలాడ నీ
కాననమందు దుంపలును గాయలుమేసి మృగమ్ము వోలెస్వే
చ్చానియతిన్ జరించువనచారికి రాజుల కొల్వు లేటికిన్"
ఈ పద్యములో
పోతనామాత్యుడు గోచరించడంలేదా..?
తులసీ దాసు చిత్తములో ఉద్వేగం తగ్గి
భావం శాంత గంభీరమైంది
అప్పుడు శ్రీరామచంద్రుడు దర్శనమిస్తాడు
అప్పుడు రాముడే హృదయమంతను గన్నుల మ్రోల రాముడే
దప్పక నిల్చు నూతన సుధాన్నపితంబగు మేను దిక్కులన్
గప్పిన జంద్రు వెన్నెలల కన్నను శీతలమై యెడందలో
నప్పుడు మ్రోగుబో ముని మహార్థ తరంగిత సత్కవిత్వముల్
తన కర్తవ్యాన్ని గురించి యడిగిన మీరాబాయికి
తులసీ దాసు బదులు చెప్పడం
పదకొండవ ఖండికలో వర్ణితమైంది
సువర్ణమయములు
రత్న జటితములూ అయిన
అర్చావతార విగ్రహమలను
దొంగలించుటకి వచ్చిన చోరులను
ధనుర్ధారులై రామలక్ష్మణులు వెంబడించగా
వారు మూర్చిల్లుట
మరునాడుదయము వారు
తులసీదాసుకు తన గోడు వెళ్ళబోసుకొనుట
వారి అదృష్టమునకు తులసీదాసు అబ్బురపడుట
పదిరెండవ ఖండికలో వర్ణించబడింది.
చివరిదయిన పదమూడవ ఖండికలో
రామచరిత మానసమనే అమోఘకావ్యాన్ని
రామప్రభువు
తన దక్షిణ హస్త స్పర్శతో ఆదరించడం
తులసీదాసుతో బాటు
ఆ నందకావనంలోని తరువులు
గంగమ్మతల్లి పులకరించడం వర్ణించబడ్డాయి
'కవి మస్తమాల్య సుగుణోత్తరుడు'
కైతవలోకవృత్తి వాల్మీకి మహర్షి అయిన
గోస్వామి తులసీదాసు లౌకిక ప్రెమను
అలౌకికంగా తీర్చిదిద్దుకున్న విధానం
ఈకావ్యంలో పరమ రమణీయంగా వర్ణింపబడింది.
తులసీదాసు పట్ల
రామ చరిత మానస కావ్యం పట్ల
ఆచార్యుల వారికు న్న మక్కువ
ఈ కావ్యంలో అక్షరరూపం సంతరించుకుంది
స్వాంతఃసుఖాయ గా వ్రాసిన
సాక్షాత్కార కావ్యం
శ్రీమాన్ నారాయణాచార్యుల వారి
కావ్య సంపదలో
అనర్ఘ రత్నమనడంలో
ఎటువంటి అతిశయోక్తి లేదు
సాహిత్య అకాడమీ న్యూ ఢిల్లీ వారి
కోర్కె ననుసరించి ఆచార్యులవారు
మొదటి ఖండంలో
వివిధ ఉప శీర్షికల కింద
కబీరుదాసు రచించిన 781 దోహాలకూ
ద్వితీయ ఖండంలో
కబీరుదాసు రచించిన 228 పద్యాలకూ
కృతులు లేక గేయాలు
సరళమైన తెలుగు గద్యంలో అనువాదం చేసారు
ఆచార్యులవారు చివరిలో
కబీరు దోహాలలో ఓ పదింటిని
తెలుగు లిపిలో ఇవ్వడం జరిగింది.
దోహాలను పదాలను గద్యంలో అనువదించడం
సముచితంగా వుంది.
ఈ అనువాదంలో
ప్రాచీన హిందీ భాషపై ఆచార్యులవారికి గల పట్టు అధికారం
కొట్టవచ్చినట్లు కనిపిస్తున్నది.
వారు రచించిన జనప్రియ రామాయణం లో కూడా
అక్కడక్కడా తులసీ దాసు ప్రభావం కనిపిస్తుంది.
బహుభాషాకోవిదులయిన శ్రీమాన్ నారాయణా చార్యులవారు
ఆధునిక హిందీ భాషా సాహిత్యాలకంటె
ప్రాచీన హిందీ భాషా సాహిత్యాలవల్ల
అత్యధికంగా ప్రభావితులయినారు.
స్వతహాగా పరమ వైష్ణవులైన ఆచార్యులవారిని
హిందీ భక్తి సాహిత్యం ఆకట్టుకోవడంలో ఆశ్చర్యం లేదు..
సరస్వతీపుత్రుల హిందీ భాషాభిమానం
డా భీం సేన్ నిర్మల్
తెలుగు గ డ్డ జన్మ ఇచ్చిన
అసాధారణ ప్రతిభావంతులలో
సరస్వతీపుత్ర పుట్టపర్తి నారాయణాచార్యుల వారు
ప్రధమ పంక్తిలో గణ్యమానులు
శ్రీకృష్ణదేవరాయల గురువైన
శ్రీ తాతాచార్యుల వంశీయులై
పరమ వైష్ణవులై కూడా
శివతాండవం రచించిన పరమ శైవులు వారు
హరిద్వా రంలో
స్వామీ శివానందగారి సమక్షంలో
పలుభాషా పండితులతో
వారి వారి భాషలలో శాస్త్ర చర్చలు చేసి
వారిని ఓడించిన
సరస్వతీపుత్రులు నారాయణాచార్యులవారు
చతుర్దశ భాషలలో
సాహిత్యాన్ని ఆపోశన పట్టినవారు
నారాయణాచార్యులవారు
1962 లో
వరంగల్లులోని సాయం కళాశాలకు
డా కేతవరపు రామకోటి శాస్త్రిగారి
ఆహ్వానాన్ని పురస్కరించుకొని విచ్చేసారు
వారు వినిపించిన శివతాండవం
విని శ్రోతలు ముగ్ధులైపోయినారు.
ఆ తరువాత
పిచ్చాపాటిగా మాట్లాడుకుంటున్నప్పుడు
నేను ఆ రోజుల్లో
సాయం కళాశాలలో
హిందీ ఉపన్యాసకుడిగా పనిచేసేవాణ్ణి
బాల్యచేష్టగా వారితో
హిందీ భాషలో మాట్లాడసాగాను
వారు ఒక్క క్షణం నా వేపు చూసి అనర్గళంగా
హిందీ భాషీయునివలె సంభాషించారు
వారి హిందీ ఉచ్చారణ విని
జాతీయాలతో కూడిన
సహజ హిందీ వాక్య రచనను విని
విస్తుబోవటం నావంతయింది.
అలాంటి బహు భాషా కోవిదులు కాబట్టి
వారిని డా బెజవాడ గోపాల రెడ్డి గారు
ఢిల్లీ సాహిత్య అకాడమీ గ్రంధాలయానికి
అధ్యక్షులుగా నియమింపజేసారు
కాని
ఢిల్లీ లోని రాజకీయ దుర్గంధానికి
సాంఘీక వాతావరణంలోని కాలుష్యానికీ తట్టుకోలేక
మళ్ళీ స్వగ్రామమైన ప్రొద్దుటూరు చేరుకున్నారు.
నారాయణాచార్యుల వారికి
హిందీ లోని ప్రాచీన సాహిత్యమంటే
వల్లమాలిన అభిమానం
నేటి వ్యావహారిక భాష అయిన "ఖడీబోలి"
అంటే గౌరవభావం లేదు.
స్వాతి మాసపత్రిక
జూలై 1989 కి ఇచ్చిన ఇంటర్వ్యూలో
వారు హిందీ భాషా సాహిత్యాలపట్ల
తమకు గల అభిప్రాయాలను స్పష్టం చేసారు
వారు ఇలా అన్నారు
ఈ "ఖడీబోలీ" అనే శవాన్ని నెత్తిన వేసుకొని
ఎంతో ప్రాచీన సాహిత్యాన్ని
వారు పోగొట్టుకున్నారు.
నవీన హిందీలో సాకేత్ అని ఓ కా వ్యమొచ్చింది
మైధిలీ శరణగుప్త దాన్ని రచించాడు
మంచి కావ్యమే
కానీ దాన్నెవరూ పారాయణం చేయడంలేదు.
తులసీనే పారాయణం చేస్తారు
కారణం ఏమిటీ
చెప్పే కూతకూ
చేసే చేతకూ ఐక్యత లేకపోవటమే.
నవీన కవిత్వం పైన
గౌరవం కలగకపోవడానికి వుండే కారణాలలో
ఇది ఒకటి
వీళ్ళ రాతలూ బాగానే ఉన్నాయి
వీళ్ళజీవితాలూ తెలుస్తూనే వున్నాయి
ఏదో తమాషగా చదువుకుంటాం
అంతే కానీ
తులసీదాసు ..
సూరదాసులకిచ్చిన గౌరవం ఇవ్వం కదా..
పై అభిప్రాయాలవలన
వారికి తులసీదాసు పట్ల ఉండే
అపార గౌరవప్రపత్తులు విశదమవుతున్నాయి
తులసీదాసు జీవిత చరిత్రలో
ఒక ప్రధాన ఘట్టం ఆధారంగా
వారు సాక్షాత్కారం అనే కావ్యం రచించారు
ఆ కావ్యానికి తొలి పలుకులో
ఆచార్యులవారు ఇలా వ్రాసారు
ఇదెక్కడి ఋణానుబంధమో
నేటికి దాదాపు యెనిమిది సంవత్సరాలయింది
తులసీరామాయణాన్ని ఉపాసించబట్టి
అన్నం తినకుండా వుంటాను
కాని రామచరిత మానస్ ను
వల్లించకుండా వుండలేను
ఆయన కావ్యాలు
నా జీవితంలో బాగా అదుక్కున్నాయి
అతని జీవితం నా భావనలో తిరిగి తిరిగి
నేటికీ కావ్య స్వరూపం దాల్చింది
ఇది వారి సమగ్ర జీవితం కాదు
ఒక భాగం మాత్రమే.
గోస్వామీ తులసీదాసు పట్ల
ఈ గౌరవ భావమే సాక్షాత్కార కావ్యాన్ని
తులసీదాసుకే అంకితం చేసేటట్లు చేసింది
సమర్పణము చేస్తూ
ఆచార్యులవారు రచించిన పద్యాన్ని చూడండి
"రసమో వ్యంగ్యమో భావమో మరియతంద్రాలం కృతి విన్యాసమో
ఇసుమంతైననెఱుం గనోయి ప్రభువా యీ కొండలంజింత వె
క్కసమైనప్పుడు నేడ్చికొంటినదియే కావ్యాత్మగామాఱెనీ
యసమాన ప్రతిభాప్రభావము సమోహచ్చేదకౌక్షేయమై"
ఈ సాక్షాత్కారము అనే కావ్యంలో
14 ఖండికలున్నాయి
తులసీదాసు భార్య పేరు రత్నావళి
అని లోక ప్రచారంలో ఉన్నది
కాని ఆచార్యులవారు ఆమెకు
మమతాదేవి అని పేరు పెట్టారు
ఆమెది శరీరంతో సంబంధం లేని
జ్యోతిర్మయమైన ప్రేమ అని
తులసీదాసు ప్రేమ
శరీరానికి సంబంధించిన కామమనీ
ఈ ఖండికలో
ఈ రెండు ప్రేమ భావాల మధ్య సంఘర్షణను
మనస్సుకు హత్తుకొని పోయేట్లు చిత్రించారు ఆచార్యులవారు.
ఈ ఖండికలోని చివరి పద్యాన్ని
పరిశీలించండి..
"విషయ సుఖంబులన్ బడి వివేకము వీడి నశింతురేమీ మా
నుషామని మేలమాడుటకు నోయన దూరపుకొండ కొమ్ములం
దుషనడతెంచె పక్షులు సమాదితముంబొరరించెబూత మా
నసములు నా ప్రభాత లలనాహిత బోధలు రాగభంగులన్"
చీకటి కాటుకలో
భోరుమని
గుక్క తిప్పకుండా కురుస్తున్న వానలో
ఊరినుండి పరుగెత్తుకొని వచ్చి
తలుపుతట్టిన భర్తను చూచిన
మమతాదేవి హృదయంలో
అంతకుముందు దాగి
లజ్జాధఃకృతాలయిన భావాలన్నీ
వేడిగా వాడిగా తరుముకొని వచ్చాయట
ఎవరయ్యా వీరు శాస్త్ర
ప్రవణులో యొకదినపు విరహభరమునకే మే
మరవిడాచి పరుగిడినారట
శివశివ యనుకొన్న సిగ్గుచేటగునాకున్
మర్యాద నధఃకరించుచు వచ్చిన
తులసీదాసును చూచి
ఆమె ఇలా అన్నది
"రాముడు చిక్కునాయనుతలంకు మనస్సున కర్హమే దయా
రామము రామచంద్రుడు గరారుగవచ్చును బిల్చినంత నీ
ప్రేమము నెల్ల దచ్చరణ పీఠికినర్పణము సేసికొమ్ము సు
త్రాముడు పాడుకోగలడు ధన్యము త్వద్యశమించు వీణలన్"
తులసీదాసు ప్రేమిక మమతాదేవి అతనికి ధరణిజాహనుమన్మనోధామమునకు
ప్రణయమూర్తికి
రాఘవ బ్రహ్మమునకు
త్రోవచూపించినది
ఆ పతివ్రతా శిరోమణిచే ఆదేశించబడిన తులసీ దాసు
ఏకాంతవాసానికై చిత్రకూటం చేరాడు
సంపూర్ణ వైరాగ్యానికి సిధ్ధంగాలేని హృదయంతో
ప్రేమ వైరాగ్యాలకు ప్రవృత్తి వివృత్తులకు
ఏర్పడిన సంఘర్షణను
ద్వంద్వాన్ని
ఆచార్యులవారు మనోహరంగా వర్ణించారు.
వెతలకన్నింటికి మూలకారణమయిన స్వార్థాన్ని పోగొట్టి
స్వార్థరాహిత్యాన్ని ప్రసాదించమని
తులసీదాసు చిత్రకూటాన్ని వేడుకొంటాడు
తులసీ దాసు సాధన
దాస్యంతో ప్రారంభమై
క్రమక్రమంగా
మిత్ర
వాత్సల్య
మధుర భావాలుగా పరిణమించి
ఉన్మాదస్తితికి మారుతుంది
సాధన అన్న ఖండికలోని సీసాలు గేయాలు
సాహిత్య
సంగీత
సమీఅళనంతో
సహృదయులకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయనడంలో
ఎటువంటి సందేహమూ లేదు
తదేక దీక్షతో త్రయోదశాక్షరీ జపిస్తున్న తులసీదాసు
అలౌకిక ప్రేరణచే కన్నులు తెరిస్తే
కన్నుల ఎదుట
ఒక పాదుషా
ఆ వెనక ఒక మహమ్మదీయ రౌతు కనిపిస్తారు
భక్త రామదాసు పాఠకులకు స్ఫురిస్తాడు
ఈ మహమ్మదీయులతో మనకేం పని
అని మళ్ళీ ధ్యాన నిమగ్నుడవుతాడు
కాని ఆవేషంలో వచ్చినవారు
రామలక్ష్మణులే అని తెలుసుకొని
బాధపడతాడు
అందుచేతనే
తులసీదాసు తన రామచరిత మానస్ లో
రామచంద్రుణ్ణి పాదూషా వలెనే వర్ణిస్తాడని
ఆచార్యులవారు కల్పించుకున్నారు.
తన యాస్థానములో
కవిగా నుండరమ్మని చెప్పి పంపిన అక్బరు చక్రవర్తికి
తులసీదాసు ఇచ్చిన సమాధానం
తొమ్మిదవ ఖండికలో వర్ణించబడింది.
"రాముడె సర్వనేత యభిరామము వాని గుణ ప్రశస్తియే
కామిత దాయి స్వర్గ నరకంబులు దాటె డు త్రోవ భక్తియే
భీమభవాబ్దిపోత మవివేకులు శుష్కయశంబుగోరియా
శా మా లినీకృతాత్ములయి చత్తురు కర్మ ఫలాను భోక్తనై"
అదీకాక..
"నేను 'బిహారి' నేమి యవనీపతి మెప్పును గోరి కావ్యసం
తానములిచ్చి వైభవశతంబులనాసలు చూఱలాడ నీ
కాననమందు దుంపలును గాయలుమేసి మృగమ్ము వోలెస్వే
చ్చానియతిన్ జరించువనచారికి రాజుల కొల్వు లేటికిన్"
ఈ పద్యములో
పోతనామాత్యుడు గోచరించడంలేదా..?
తులసీ దాసు చిత్తములో ఉద్వేగం తగ్గి
భావం శాంత గంభీరమైంది
అప్పుడు శ్రీరామచంద్రుడు దర్శనమిస్తాడు
అప్పుడు రాముడే హృదయమంతను గన్నుల మ్రోల రాముడే
దప్పక నిల్చు నూతన సుధాన్నపితంబగు మేను దిక్కులన్
గప్పిన జంద్రు వెన్నెలల కన్నను శీతలమై యెడందలో
నప్పుడు మ్రోగుబో ముని మహార్థ తరంగిత సత్కవిత్వముల్
తన కర్తవ్యాన్ని గురించి యడిగిన మీరాబాయికి
తులసీ దాసు బదులు చెప్పడం
పదకొండవ ఖండికలో వర్ణితమైంది
సువర్ణమయములు
రత్న జటితములూ అయిన
అర్చావతార విగ్రహమలను
దొంగలించుటకి వచ్చిన చోరులను
ధనుర్ధారులై రామలక్ష్మణులు వెంబడించగా
వారు మూర్చిల్లుట
మరునాడుదయము వారు
తులసీదాసుకు తన గోడు వెళ్ళబోసుకొనుట
వారి అదృష్టమునకు తులసీదాసు అబ్బురపడుట
పదిరెండవ ఖండికలో వర్ణించబడింది.
చివరిదయిన పదమూడవ ఖండికలో
రామచరిత మానసమనే అమోఘకావ్యాన్ని
రామప్రభువు
తన దక్షిణ హస్త స్పర్శతో ఆదరించడం
తులసీదాసుతో బాటు
ఆ నందకావనంలోని తరువులు
గంగమ్మతల్లి పులకరించడం వర్ణించబడ్డాయి
'కవి మస్తమాల్య సుగుణోత్తరుడు'
కైతవలోకవృత్తి వాల్మీకి మహర్షి అయిన
గోస్వామి తులసీదాసు లౌకిక ప్రెమను
అలౌకికంగా తీర్చిదిద్దుకున్న విధానం
ఈకావ్యంలో పరమ రమణీయంగా వర్ణింపబడింది.
తులసీదాసు పట్ల
రామ చరిత మానస కావ్యం పట్ల
ఆచార్యుల వారికు న్న మక్కువ
ఈ కావ్యంలో అక్షరరూపం సంతరించుకుంది
స్వాంతఃసుఖాయ గా వ్రాసిన
సాక్షాత్కార కావ్యం
శ్రీమాన్ నారాయణాచార్యుల వారి
కావ్య సంపదలో
అనర్ఘ రత్నమనడంలో
ఎటువంటి అతిశయోక్తి లేదు
సాహిత్య అకాడమీ న్యూ ఢిల్లీ వారి
కోర్కె ననుసరించి ఆచార్యులవారు
మొదటి ఖండంలో
వివిధ ఉప శీర్షికల కింద
కబీరుదాసు రచించిన 781 దోహాలకూ
ద్వితీయ ఖండంలో
కబీరుదాసు రచించిన 228 పద్యాలకూ
కృతులు లేక గేయాలు
సరళమైన తెలుగు గద్యంలో అనువాదం చేసారు
ఆచార్యులవారు చివరిలో
కబీరు దోహాలలో ఓ పదింటిని
తెలుగు లిపిలో ఇవ్వడం జరిగింది.
దోహాలను పదాలను గద్యంలో అనువదించడం
సముచితంగా వుంది.
ఈ అనువాదంలో
ప్రాచీన హిందీ భాషపై ఆచార్యులవారికి గల పట్టు అధికారం
కొట్టవచ్చినట్లు కనిపిస్తున్నది.
వారు రచించిన జనప్రియ రామాయణం లో కూడా
అక్కడక్కడా తులసీ దాసు ప్రభావం కనిపిస్తుంది.
బహుభాషాకోవిదులయిన శ్రీమాన్ నారాయణా చార్యులవారు
ఆధునిక హిందీ భాషా సాహిత్యాలకంటె
ప్రాచీన హిందీ భాషా సాహిత్యాలవల్ల
అత్యధికంగా ప్రభావితులయినారు.
స్వతహాగా పరమ వైష్ణవులైన ఆచార్యులవారిని
హిందీ భక్తి సాహిత్యం ఆకట్టుకోవడంలో ఆశ్చర్యం లేదు..
కామెంట్‌లు లేవు :
కామెంట్‌ను పోస్ట్ చేయండి