డా.సి.నా రా య ణ రె డ్డి
ప్రశస్త కవిగా
ప్రాచ్య పాశ్చాత్త బహుభషావేత్తగా
అత్యంత మౌలిక సాహిత్య విమర్శకుడుగా
తెలుగునాట గణుతికెక్కిన
డా.పుట్టపర్తి నిర్యాణం
భాషా సాహితీ రంగాలకు తీరని అఘాతం
1953 నుంచీ నన్ను నోరారా తమ్ముడూ అని లాలించిన అన్న
ఇవాళ లేడు..
ఎవని పదమ్ములు శివతాండవలయాధి రూపమ్ములు,
ఎవని భావమ్ములు సుందర శివాలాస్య రూపమ్ములు,
అతడు పుట్టపర్తి సూరి,
అభినవ కవితా మురారి,
అతని చతుర్ముఖతకు
విస్మితులు కాని విజ్ఞులు లేరి..
ఒకటి రెండు బాసలు నాలుకపై తిరుగుట గగనమ్ము,
ఒకటి రెండు కబ్బములు పెకలించుట అబ్బురమ్ము,
పదికి మించు బాసలలో పసిడి నిగ్గు లేరుకొన్న
పుట్టపర్తి ధిషణకు జేకొట్టగ మనసాయె నాకు..
-డా.సి.నా రా య ణ రె డ్డి
కామెంట్‌లు లేవు :
కామెంట్‌ను పోస్ట్ చేయండి