జమ్మలమడక మాధవరాయ శర్మ
నారాయణాచార్యుడు
కవితాసృష్టిలో
సామగ్రీ పూర్ణత్వమును సంపాదించిన వ్యక్తి. నారాయణచార్యుని అర్ధాంగి
శ్రీమతి సౌభాగ్యవతి శ్రీ కనకమ్మ
పూర్ణతా సిధ్ధి ధాత్రి.
శ్రీమతీ శబ్దము ..
నారాయణాచర్యుడు అర్థము..
ఇద్దరు శబ్దార్థములు..
వారు వాని ఆత్మలను ఏకీకరించుకుని
శబ్దార్థశ రీరమైన ఈ కావ్యమునకు
(అగ్నివీణ )ఆత్మ సంపత్తిని ఇచ్చినారు..
స్త్రీల కవితా శ్రధ్ధ ప్రశంసాపాత్రము..
శ్రీ రాజశేఖరుని వామార్థము
అవంతీ సుందరి..
సాహిత్య వాదములలో
స్వసంవాదమిచ్చి
సాహితికి సౌరభము సంపాదించినట్లు
కావ్య మీమాంస మనకు చెప్పినది..
అటు తర్వాత ఇట్టివారు లేరు..
ఇప్పుడు వీరు తాదృశులు ..
ఈ మధుర దంపతులు
ఈ విధముగా
నిత్య సాహిత్య నిర్మాణ చతురమతులు కావడము శుభము.
రూపు కట్టిన ఈ శబ్దార్థములకు శుభమస్తు..
జమ్మలమడక మాధవరాయ శర్మ
అగ్నివీణ వాకోవాక్యము..
కామెంట్‌లు లేవు :
కామెంట్‌ను పోస్ట్ చేయండి