ఇది కుడా ఆగ్నివీణ లోనిదే
రచన మా అమ్మ కనకవల్లి
అమ్మ రచనలలో యశోధర ,సీత ,కస్తూరి బా వంటి త్యాగ వనితలు తమ అంతరంగం తెలిపారు. అమ్మా వారివంటిదే కనుక వారి వాణిని తన కలాన వినిపించింది.
లోకాపవాదానికి లోగి
సీతాదేవిని
..
గర్భవతిని..
అడవుల్లో
విడిచినాడు ..
ఆమె
విషాద గానం
గంగానదీ
గర్భంలో
ఇలా
ప్రతిధ్వనించింది .. !!!
ఉ . నీవొర్మ నిష్టు డని ..
ఉ . నీవొర్మ నిష్టు డని ..
నీ చిరకీర్తి జగంబు..,పాడికో
బోవును.. ,భక్తీ భావ పరి
మూర్చితమై.. మరి..?? ధర్మ నిష్టలో
ప్రోవులు గాగ రాలిపడి
పోయిన.. మామక దగ్ధ జీవితా
శావిల భస్మ రాసుల వి
చారము లేరికిబట్టురా ప్రభూ..???
ఉ . చాకలివాని మాట కయి
ఉ . చాకలివాని మాట కయి
సాధ్వి ననిందిత శీల నైన న
న్నా.. కఠినో గ్ర కాననము
లందు దొలంచుట ..! ధర్మ దృష్టి రా
జా ..! కృప ణ ము గాదు జన
కాత్మజ శీలము పృచ్చ సెయరా..!!
నీకొక యాత్మయున్న గమ
నింపుము రా .. బదులేమీ వచ్చునొ..?
ఉ. రాముని ధర్మ పత్నికి , న
ఉ. రాముని ధర్మ పత్నికి , న
రణ్య ములన్ బడునాలుగేండ్లు సా
ద్వీ మహితానువృ త్తి గడి
దేరిన దానికి..,లంక
నున్న నీ
ప్రేమకు.. నేక వేణి క
ధరించిన దానికి.. , నేటికిన్
నిరా
శామిళి తంబు లూరుపులు..
చాలునులే ..ఇక నేమి గావలెన్.. !!
క . నన్ను విదిచినావు గాని ..
క . నన్ను విదిచినావు గాని ..
నిను విడువ గ లేదు నేను.. , నిర్మల
గంగా
వని ని ప్రతి కుసుమంబున..
కనుగొంduదు సుమ్ము..!!భావ కల్పితు గాగన్ ..!!
గీ. హృదయమే లేని రాముండు.. ప్రేమ మయిని
గీ. హృదయమే లేని రాముండు.. ప్రేమ మయిని
విడచి నాడు ..చాకలి వాని నుడుల కొగ్గి..
హృదయ ముండిన సీత జీర్ణించు కొన్న
దాత్మ దుఃఖంబు , దయితుని
యశము కొరకు......
కామెంట్‌లు లేవు :
కామెంట్‌ను పోస్ట్ చేయండి