పుట్టపర్తి వారి శ్రీనివాస ప్రబంధం పై
ఇటీవల రిసెర్చి చేస్తూన్న పద్మావతి గారు శివతాండవంపై ఒక వ్యాసం వ్రాసారు
సిలికానాంధ్ర నుంచీ ఏదో సావనీర్ కోసం
కూచిపూడి రామలింగేశ్వర శాస్త్రి గారు
అడిగారట పంపానని చెప్పారు.
అక్కయ్యకు.., నాకు..
ఒక కాపీ పంపారు
నేను 'నా బ్లాగు లో వేసుకోవచ్చా ..?'
అంటే తప్పకుండా అంటూ
నేను ఎం ఏ తెలుగు, సంస్కృతం
జగ్గయ్య పేట అమ్మణ్ణి కాలేజి లో
లెక్చరర్ గా పనిచేస్తున్నాను .
రేడియో నాటక సాహిత్యం మీద ఎం ఫిల్ చేసాను
డిగ్రీ లో మేఘదూతం పాఠం చెప్పాను
అప్పటినుంచీ పుట్టపర్తి వారిపై అభిమానం
వారిపై రిసెర్చి చేద్దామనుకున్నాను.
శివతాండవం మీద చాలామంది చేసారు
మీరు సంస్కృతం ఎం ఏ కాబట్టి
శ్రీనివాస ప్రబంధం పై చేయండి
అని నాగపద్మిని గారు సలహా ఇచ్చారు
డా మన్నవ సత్యనారాయణ
నాగార్జున యూనివర్సిటీ గారి
అధ్వర్యంలో చేస్తున్నాను.
'అది చాలా గహన మైన పద్య కావ్యం కదా..?'
కానీ
మీరు దానికి తగిన వ్యక్తి
'ఇది నా శక్తికి ఒక రకంగా మించిందే
అంతటి మహాకావ్యమిది..
ఇది చేస్తే నాకు కూడా ఒక విలువ వస్తుంది
అని అనుకుంటున్నాను' అని చెప్పారు.
'మీరు చేస్తే మాత్రం..
ఇది మంచి ప్రయత్నం.. '
'పోతన గారన్నారు చూసారా
నన్నయాదులు భారతం తెనిగించారు
ఎందుకో ..
ఈ భాగవతాన్ని నా అదృష్టం కొద్దీ వదిలారు అని ..
అలా నాకీ శ్రీనివాస ప్రబంధంపై
రిసెర్చి చేసే అవకాశం వచ్చింది.
పుట్టపర్తి వారన్నారు ..
"ఎరిగితి నెంతయో ,
దిశణ కెవ్వరు నుబ్బర వోవ ,
దెసముల్ దిరిగితి ,
మల్లికాసుమ సదృక్షయశంబున ,
నింతయైన నన్నె రుంగనె లేదు ..!
నేనెవడ .. ?
నీ భువికేటికి రాక ;
యంచు న న్నెరుగుటకై
రచించెద నహీన వచోగతి
నాధ కావ్యమున్ ''
అని
అలా నేను కూడా
ఆ 'నేను' వెంట పడ్డానండీ
ముందు నేను ఆధ్యాత్మిక పథం లో
పయనించి నా ఆత్మను శ్రీనివాస ప్రబంధ పరిశీలనకు అనువుగా చేసుకుంటున్నాను'
'మంచిది ..
ఆ వేదాంత పరమైన భావనలో పూర్తిగా
మునిగి ఆ రాసిన వాడి మానసిక స్తాయికి
మన మనసూ ఎదగాలి
అప్పుడే
ఆ కావ్యాన్ని ముట్టుకునే యోగ్యత మన కొస్తుంది '
అవునండీ మంచి మాట చె ప్పా రు
కామెంట్‌లు లేవు :
కామెంట్‌ను పోస్ట్ చేయండి