13 మే, 2013

A.S. రామన్


అవధాని సీతా రామన్ 
A.S. రామన్ పూర్తి నామం


పుట్టపర్తి వారు
 ప్రొద్దుటూరు హైస్కూల్ పండితునిగా ఉన్నప్పుడు 
ఫిప్త్ ఫారం కాబోలు చదువు కున్నాడు A.S. రామన్.. 
ఇంగ్లీషు సాహిత్యం లో 
జర్నలిజం లో బాగా కృషి చేసాడు.
వందసంవత్సరాల చరిత్ర కలిగిన భారతీయ ఇలస్ట్రేటెడ్ వీక్లీ కి 
తొలి భారతీయ ఎడిటర్ గా పనిచేసాడు..
సత్య సాయి బాబా గారి గురించి కానీ
దక్షిణాది సంగీత విద్వాంసుల గురించి కానీ
తొలిసారి ఉత్తరాది వారికి పరిచయం చేసిన వ్యక్తి 
ఆయన హయాంలో 

రెండు మూడేళ్ళపాటు ఇలస్ట్రేటెడ్ వీక్లీ సర్క్యులేషన్ బాగా పెరిగింది.
A.S. రామన్ 

పుట్టపర్తి వారి గురించి యేం చెబుతారో తెలుసుకుందాం..




నేనూ ..
పుట్టపర్తి నారాయణాచార్యులూ 
ముఫ్ఫయ్యవ దశకం మధ్యలో 
మా ఉమ్మడి సాహిత్య కృషిలో 
సన్నిహిత సహచరులమయ్యాము. 

కానీ 
మేమేదీ ఉమ్మడిగా ప్రకటించలేదు. 
మేము సాహిత్య విషయాల మీద గంటల కొద్దీ చర్చించుకొనేవాళ్ళం ఒక్కొక్కప్పుడు 
మేము తీవ్ర వాదోపవాదాల్లో చిక్కుకునే వాళ్ళం కూడా. 
కానె చివరికి ఏకాభిప్రాయానికి వచ్చేవాళ్ళం లేదా, 
ఎవరి అభిప్రాయం వారిది అన్న అంగీకారానికి వచ్చేవాళ్ళం 

మా అన్యోన్య ప్రతిస్పందన 
ఆత్మీయంగానూ 
పరస్పర ప్రేరకంగానూ ఉండేది. 

మా విడదీయరాని అన్యోన్యత 
నేను 1942 లో ఢిల్లీ వెళ్ళేవరకూ కొనసాగింది.
అప్పటినుంచీ నేను వెనుదిరగలేదు. 
భారతికి మాత్రం రాస్తూ ఉండేవాడిని 

ఇంగ్లీషు సాహిత్యం లోని 
సరికొత్త ధోరణులను ఎరుకపరచడంద్వారా 
నేను పుట్టపర్తి సాహిత్య దృష్టిని మరింత విశాలం చేయగలిగానని 
గర్వంగా చెప్పుకోగలను. 

నా తెలుగు రచనా వ్యాసంగంపై 
ఆయన ప్రభావం కృషి ఏకాంక నాటికలలో ఉండేది. 
నాకన్న పెద్దవాడు కానీ.. 
విజయం సాధించిన వాడు కానీ 
అయిన కవిని అనుసరించి నన్ను నేను తీర్చి దిద్దుకోవటానికి
 నా స్వంత ప్రపత్తి ఆత్మ గౌరవం అడ్డువచ్చేవి.. 

(శ్రీ A.S.రామన్ పుట్టపర్తి వారి వద్ద 
ప్రొద్దుటూరు హైస్కూల్ లో చదువుకున్నారు. 
తరువాత వారిద్దరూ సన్నిహితులైనట్లు 
పై వ్యాసం తెలియజేస్తూ ఉంది..
-ఆంధ్రప్రభ,సచిత్ర వార పత్రిక)



కామెంట్‌లు లేవు :

కామెంట్‌ను పోస్ట్ చేయండి