పోలాప్రగడ సత్యనారాయణ గారు
బాపట్ల నెల్లూరు ప్రాంతాలకి అయ్యతో కలిసి సన్మానాలకు వెళ్ళినప్పుడు
వాళ్ళింట్లో దిగటం గుర్తు
వారి భార్య రాజ్జలక్ష్మి గారూ గుర్తే
కానీ నా దురదృష్టం నా వయసు పదేళ్ళలోపే
లీలగా తప్ప ఏవీ గుర్తులేవు
ఈ పుస్తకాన్ని నాగక్కయ్య ఇచ్చింది.
పోలాప్రగడగారు మంచి కథకులు నవలలూ వ్రాసేవారు
వారి శ్రీమతీ పేరుపొందిన రచయిత్రి
ఇదిగో.. ఇదే ఆ రోజుల్లో ..
ఇది పోలాప్రగడ పరిచయం
పోలాప్రగడ సత్యనారాయణగారు
"ఆ రోజుల్లో"
అంటూ ప్రముఖులతో తన పరిచయం తో పాటూ
రక రకాల తమాషా సంగతులను వివరిస్తూ
మనని యాభైయ్యేళ్ళ వెనక్కు తీసికెళ్ళారు
ఇందులో పుట్టపర్తి వారి ప్రస్తావనా వుంది
"ఆ రోజుల్లో ..
ఎందుకు వ్రాసారో ఆయనే చెబుతారు వినండి..
ఆ రోజుల్లో ఎలా వుండేది..?
టీవీలు లేవు రేడియోలే..
ఫ్రిజ్జులు లేవు కుండలోనీళ్ళే..
సెల్ ఫోన్లు లేవు ల్యాండ్ ఫోనే
గ్యాసు పొయ్యిలు లేవు కుంపట్లే..
ఇలా ఎన్నో ..
మరి ఈనాడో ..?
ఎన్ని సౌకర్యాలో ..
వాటితో పాటూ
మంటగలిసిన మానవతా విలువలను సభ్యతా సంస్కారాలనూ మనకు గుర్తు చేస్తారు పోలాప్రగడ
ఇక పుట్టపర్తి గురించి ఆయనేం వ్రాసారంటే..
కామెంట్‌లు లేవు :
కామెంట్‌ను పోస్ట్ చేయండి