9 మే, 2013
''యశోధర''
లేబుళ్లు:
అగ్నివీణ
,
చిత్ర కవితలు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి
(
Atom
)
అగ్నివీణలో శ్రీ కనకమ్మ గారు యశోధరపై వ్రాసిన పద్యాలు చాలా ఆర్తిగా ఉన్నాయి. సీతపై వ్రాసిన పద్యాలూ అంతే ఆర్తిగా ఉన్నాయి. కనకమ్మ గారు మరిన్ని పద్యాలు, కథలూ వ్రాసి ఉంటే ఓ గొప్ప రచయిత్రి అయి ఉండే వారేమో, బహుశా నారాయణాచార్యులకంటే కూడాను. ఎందుకంటే కావ్యద్వయిలోని ఆమె పద్యాలలో మిరుమిట్లు గొలిపే పాండిత్య ప్రతిభకనా, స్త్రీ సహజమైన ఆర్తి ఎక్కువగా ప్రతిఫలించింది.
రిప్లయితొలగించండిఅంతమాట అనవద్దు..
రిప్లయితొలగించండిమా అయ్య కంటే ముందుండాలని మా అమ్మ ఏనాడూ అనుకోలేదు
కానీ ఒక స్త్రీగా భద్రత గల భవితవ్యం ఆశించిందేమో
నా చిన్నప్పుడు దాదాపు ఎనిమిది పదేళ్ళ వయసులో అనుకుంటా
మా అయ్యను ఎవరో పెద్దవాళ్ళన్నమాటవిని
నేనూ అదే అంటే వాళ్ళను కొట్టలేక
నా చెంపలు ఛెళ్ళు ఛెళ్ళు మనిపించింది మా అమ్మ..
నిఖార్సయిన పతివ్రతామతల్లికి ప్రతిరూపం మా అమ్మ
కొన్ని చెప్పుకోలేనివీ వున్నాయి..
మహాత్ముల జీవితాలన్నీ త్యాగమయములే కదా..
కానీ
మా అయ్య అంటే మాకు ప్రాణం
ఆయన ఎంత పసివాడో ఎంత ప్రతిభావంతుడో
ఎంత నిజమైన భక్తుడో
ఏం చెప్పను..
ఇది మొదలు పెట్టానే కానీ
ఆయన్ని అందివ్వడానికి నా శక్తి సరిపోదు..
ప్రతిభా లేదు
కానీ యేదో ఆర్తి..
ఇంకో విషయం రవీ..
మీకు అయ్య శివతాండవం CD నా తరుఫునుంచీ ఇవ్వాలనుకున్నాను..
త్రివిక్రం గారికి కూడా..
అక్కయ్యను అడిగి తీసుకున్నాను కూడా
మీరు మీ అడ్రసు తెలియజేస్తే బాగుంటుంది..
మీ అమ్మగారి గురించి మీరు అన్నది నాకు అర్థం అవుతా ఉంది. నారాయణాచార్యులు, తిరుమల రామచంద్రయ్య, దాశరథి కృష్ణమాచార్యులు ఇట్లాంటి వాళ్ళను తలుచుకుంటే ఒక శ్లోకం గుర్తొస్తుంది.
తొలగించండి"కుసుమస్తబకస్యేవ ద్వయీవృత్తిర్మనస్వినః
మూర్ధ్నివా సర్వలోకస్య, శీర్యతే వన ఏవ వా"
పూలగుత్తిలాగా ఒక మనస్వి లోకుల తలలో శోభిస్తాడు లేదా ఎక్కడో అడవిలో రాలిపోతాడు. (అంతే కానీ దేనికోసమూ పాకులాడడు). మీ అమ్మ గారూ అలాంటి ఒక మనస్వి.
ఆచార్యుల గురించి తలుచుకుంటే చాలా బాధగానే ఉంటుంది. బయటపెట్టుకుంటే 'ప్రాంతీయవాదం ' అనే ముద్ర వస్తుంది. ప్రజ ఆయననెటూ పట్టించుకోవడం మానేశారు, కనీసం ఆయన రచనలకైనా ప్రాచుర్యం దొరకాలి. దురదృష్టవశాత్తూ అది కూడా లుప్తమవుతూంది. బహుశా ఇంక రెండు తరాల తర్వాత ఆచార్యుల వారి పేరు తెలుగు వాళ్ళు మర్చిపోవచ్చు. ఇది బాధ పెట్టే విషయం.
మా అమ్మమ్మ
రిప్లయితొలగించండిఏం నారాయణాచార్యులూ నా బిడ్డను బాగ చూసుకుంటావని ఇస్తే
ఇంత ఏడిపిస్తావా అని గట్టిగా అడిగితే..
మా అయ్య ఆమె ముందు ఏమీ మాట్లాడేవాడు కాదు..
ఆయనకు అమ్మ లేదు కదా అది భయమో గౌరవమో ..
మా అమ్మ యేమీ మాట్లాడేది కాదుట..
సన్నగా అమ్మా ఇంక నీవు వెళ్ళిపోమ్మా..
అమ్మా నీవు పోమ్మా..
అనేదట..
మొన్న కనకాల దేవదాసు వాళ్ళమ్మ మా అక్కయ్య వాళ్ళింట్లో కలిస్తే చెప్పింది
ఆమే మా అక్కయ్యలు కలిసి ఆడుకునే వాళ్ళట..
శివతాండవం వ్రాసినన్ని రోజులూ..
శివాలయంలోనే వుండటమట
అమ్మ వంట అందరూ పడుకోవటాం అన్నీ అక్కడే..నట..
అయ్య శివతాండవం నాట్యమాడటం మేము చూశమని ఆమె చెప్పింది
రికార్డ్ చేసాను...
ఆ శివాలయం (ప్రొద్దుటూరు అగస్త్యేశ్వరాలయం) మీరు చూశారా?
తొలగించండియీ ఆదివారం ఈనాడు చూసారా..
రిప్లయితొలగించండిడాక్టర్ రేమెళ్ళ అవధానులు అనే ఆయన మన వేదాలను కంప్యూటర్ లో పెట్టేశాట్ట..
గణిత శాస్త్రంలో మనం వాడే ఇంఫినిటీ ని పూర్ణమదః పూర్ణమిదం .. పూర్ణాత్ పూర్ణముదచ్యతే.. గా మన పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పేశారు
మైడ్రోజన్ ఐసోటోపుల ప్రస్తావన యజుర్వేదంలో కనిపిస్తుంది
గురుత్వాకర్షణ శక్తిని న్యూటన్ కంటే ముందే పన్నెండవ శతాబ్దానికి చెందిన భాస్కరాచార్యుడు తన సిధ్ధాంత శిరోమణిలో చెప్పాడు..
ఇలా భౌతిక రసాయన వైద్య వైమానిక అనేక శాస్త్రాల రహస్యాలు వేదాలలో వున్నాయి
అందుకే ..వాటి పరిరక్షణకు పూనుకున్నారాయన
ఆ ప్రయత్నంలో
ఆయనకు వేదాల్లో
సైన్సూ లెక్కలూ వైద్యం అంతరిక్ష శాస్త్రం అన్నీ వేదాల్లో కనిపించటం ప్రారంభించాయట..
దాదాపు ముఫ్ఫయ్యేళ్ళుగా సాగుతున్న ఆయన ప్రయత్నం
ఇందుకు ఎందరో సహకరించారు సహకరిస్తున్నారు..
ఇంకొకాయన ..
భాగవతాన్ని కంప్యూటరులో పెడుతున్నానండీ అన్నాడు
మొన్న ఒక సభలో కలిసినప్పుడు
అదే bhagavatam.com
ఇలా
ఒక్కొక్కరూ
ఒక్కోలా ఆలో చిస్తారు..
ఎవరో మహనీయుడు మళ్ళీ పుడతాడు..
గతించిన పెద్దలను తిరగేస్తాడు..
ఆ ఒక్కనికోసం
నేను పుట్టపర్తి వివరాలను దాస్తున్నాను..
విచిత్రం ఏంటో తెలుసా..
నా ప్రయత్నానికి దైవం కూడా తోడవుతున్నాడు..
ఎక్కడెక్కడి పేపర్ కటింగ్సూ నా వద్దకు వచ్చి చేరుతున్నాయి..
శ్రీశైలం గారు యాభై సంవత్సరాలనుంచీ దాచిన ఆయన రహస్యనిధి తాళం చెవులు నాకిచ్చారు..
అక్కయ్య ఎంతో శ్రమించి
సేకరించిన పుస్తకాల జిరాక్స్ కాపీలను ఇచ్చింది..
అయ్య శిష్యులు ..
వివరాలనిస్తున్నారు..
నేనొక నిర్గంధ కుసుమాన్ని..
నా సొగసు ఆ పరమాత్మ మెచ్చుతున్నాడు..
వింత కదూ..
సారీ ..
రిప్లయితొలగించండికనకాల దేవదాసు గారి అమ్మ కాదు
వారి భార్య లక్ష్మీ దేవి గారు