1 అక్టో, 2013

సహగామి







సత్యాహింసలు గాంధీజీ వ్రతాలు
సహాయ నిరాకరణ సత్యాగ్రహము ఆయన బలాలు
ఎంత దయాశీలి అయినా 
తనపై హత్యా ప్రయత్నం చేసిన వాని గురించి
చాలా ధైర్యం గల కుర్రాడని మెచ్చుకోగలడా
అనగలడా 
అదే గాంధీ తత్త్వం
మరోసారి తనపై జరిగిన హత్యాప్రయత్నంలో 
హేరాం అంటూ నేలకొరిగాడు మన జాతిపిత
ఈనాటికీ గాంధీజీని మనం స్మరించుకుంటున్నామంటే
ఆ రోజుల్లో గాంధీ ప్రభావం ప్రజపై ఎలాఉండేది 
ప్రతి ఒక్కడూ గాంధీజీ భావాలను మనసులోకి తీసుకునేవాడు
అంత కాకపోయినా
 అందులో పావు వంతైనా ఆచరించాలని భావించేవాడు
అలాంటి కాలంలో
పుట్టపర్తి నవయువకుడు
అనంతపురం కాలేజీలో అధ్యాపకుడు
అప్పటికింకా స్వాతంత్ర్యం రాలేదు
ఆ కాలేజ్ ప్రిన్స్పల్ పేరు మీనన్
ఆయనగారికి ఆంగ్లాధికారులన్నా 
ఇంగ్లండ్ పేరు చెప్పినా అపారగౌరవం 
బహుశా గాడ్సే వంటి వాడేమో
గౌరవం ఉంటే ఉండవచ్చు
కీనీ సమయం దొరికినప్పుడల్లా 
ఆంగ్లేయులని తనివితీరా పొగటటం
గాంధీ మొదలైన నేతల్ని నోరారా తిట్టటం ఆయనకు పరిపాటి
అక్కడ ఉద్యోగం చేస్తున్న పుట్టపర్తి కది బాధాకరం
గాంధీ సత్యపాలన అహింస లు పుట్టపర్తిని వివశుణ్ణి చేస్తుంటాయి
మరి మీనన్ వాచాలత్వాన్ని ఎలా సహించటం
కానీ ఆయనను ఎదిరిస్తే ఉద్యోగానికి రాం రాం చెప్పాలి 
ఒక వైపు ఉద్యోగం మరోవైపు నలిగిపోతున్న మనసు 
కొన్నాళ్ళు ఓపిక పట్టిన పుట్టపర్తికి ఇక చాలు ననిపించింది
విసిగి విసిగి 
ఒకనాడు మీనన్ పై వాగ్యుధ్ధానికి దిగారు
మంచి జవాబు చెప్పారు
మీనన్ కోపంతో 
పై అధికారులకు చెప్పి నిన్ను డిస్మిస్ చేయిస్తాను అన్నాడు 
అంత వ్యవధి ఎందుకూ 
ఇదిగో నా రాజీనామా
ఆత్మను చంపుకొని నీతో 
బ్రతకటం కన్నా ఆకలితో చావటం మేలు అని
రాజీనామా కాగితాన్ని 
మీనన్ ముఖాన కొట్టి వచ్చేశారు
అదీ దేశ భక్తి
గాంధీజీ బాటలో నడవాలనే సంకల్పం
జీవితాన్ని అమరత్వం వైపు నడిపించే ధైర్యం..
శభాష్ పుట్టపర్తీ 
నీలాంటి వాళ్ళు కొందరైనా గాంధీజీ సహవర్తులైనందుకు 
గాంధీ నిజంగా సంతోషపడతాడు..  






కామెంట్‌లు లేవు :

కామెంట్‌ను పోస్ట్ చేయండి