అతనిపేరు పెంచలయ్య నాయుడు..
టెలిఫోన్ ఆపరేటర్ పనిచేసేవాడు..
అవి పుట్టపర్తి 'భగవాన్ బుధ్ధ'
మరాఠీ నుంచీ తెలుగుకు అనువాదం చేసేరోజులు
వారు డిక్టేట్ చేస్తూంటే వ్రాసేదానికి
పుట్టపర్తిపై భక్తి తో వచ్చేవాడు
రాత్రి తొమ్మిది గంటలకు రోజూ
పోరాని వేళల్లో పోకూడని చోటికి పోవటమో
యేదో అతను చేశాడేమో
ఫలితంగా అతనికి మతి చలించింది
అతని అమ్మ నాన్న బాగు చేయమని
మా ఇంట్లో విడిచిపోయారట.. నిశ్చింతగా
ఇక అతని ఆలనా పాలనా పుట్టపర్తిదే
అంటే ..
మా అమ్మదీ ..
పిల్లలదీ..
అక్కడ పుట్టపర్తిని అంటిపెట్టుకున్న శిష్యులదీ..
అయ్య రంగంలోకి దిగారు
ప్రజలకు అయ్యపై అచంచల విశ్వాసం..
పైగా రాతగాడుగా వారికి అతనిపై అభిమానం
అతనికా మతిచలించింది ..
ఒక చోట స్థిరంగా వుండేవాడు కాదు
పిచ్చి నవ్వులు..
పిచ్చి చేష్టలు..
ప్రతిరోజూ వాణికి స్నానం పోయించి
తానూ తడిబట్టలతో వాణి యెదురుగా
కూర్చుని జపం చేసేవారు
మొదట కట్టు మంత్రం వేసి
అయ్య అతనిని కదలకుండా కూచోపెట్టారు
అతని యెదురుగా కూర్చుని జపం చేసారు
చివర ఆ మంత్ర తీర్థాన్ని అతనితో తాగించేవారు
ఇలా రెండు నెలలు గడిచింది..
అతను స్వస్థుడయ్యాడు..
యీ అనుభవాన్ని
మా రెండవ అక్కయ్య నాతో పంచుకుంది
అప్పటికి వాళ్ళు ఎనిమిదేళ్ళపిల్లలు
యేవరికైనా ఆరోగ్యం బాలేదు
ఆర్థికపరిస్థితి బాలేదు
యేదో కష్టం వచ్చింది
అయ్యను ఆశ్రయించేవాళ్ళు
అయ్యదసలే దయార్ద్ర హృదయం
వెంటనే సరేలేరా మీ అమ్మతో చేయిస్తాలే..
సరిపోతుందిలే అనేవారు
అంతే ..
అమ్మకు నిబంధనలు
ఒంటిపూటభోజనం
కటిక నేలపై నిద్ర
నలభై రోజుల దీక్ష..
వారికోసం..
డబ్బులకోసం అనుకుంటారేమో ..
ఉచితం..
పూర్తి ఉచితంగా
డబ్బంటే అయ్యకు ఒక అంటరాని వస్తువు..
ఇలాంటివన్నీ చేయాలంటే
మా అమ్మను ఆదేశించేవారు
'వారి పని జరిగేదా.. ?'
'అవును.. జరిగేది కాబట్టే వచ్చేవారు..'
అంటుంది అక్కయ్య ..
మా రెండవ అక్కయ్య పేరు తరులత..
ఇప్పుడామెకు డెభ్భై యేళ్ళు ..
కామెంట్‌లు లేవు :
కామెంట్‌ను పోస్ట్ చేయండి