పుట్టపర్తి సాహిత్య సర్వస్వం ముద్రణ పనులు
శరవేగంగా జరుగుతున్నాయి
ఒకవేపు
ప్రాచ్య లిఖిత గ్రంధాలయం తరఫున
ముద్రణ జరుగుతున్న కృతుల పనులలో
అక్కయ్య మునిగి వుంది
పర్యవేక్షణ బాధ్యతను
ప్రఖ్యాత సంగీత విద్వాంసులు
శ్రీ కొమండూరు శేషాద్రి గారికప్పగించారు
వారు పుట్టపర్తివారితో
యెన్నో యేళ్ళ పరిచయం కలిగినవారు
కానీ వారు ఇప్పుడు అమెరికాలో వుంటున్నారు
వారితో ప్రొద్దున అయిదుగంటలకు
తిరిగి సాయంత్రం అయిదు గంటలకు
రెండు రెండు గంటలు ఆన్ లైన్లో
జాక్ ద్వారా ప్రతిదినమూ సంభాషిస్తూ
ఆ కృతుల వ్యవహారాన్ని చూస్తూంది అక్కయ్య
ఎక్కువగా ప్రయోగంలో లేని రాగాలలో
ముత్తయ్య భాగవతార్ ముత్తుస్వామి దీక్షితులు మొదలైన వారు వానిలో ఒక్కొక్క కీర్తనలే వ్రాసారు
వానిలో కూడా పుట్టపర్తి అనేక కీర్తనలు వ్రాసారు
వాటికి కూడా యేమి ఎత్తుగడలు
యేమి పల్లవులు
యేమి వైవిధ్యం
పుట్టపర్తి సంగీతాత్మకమైన ఆకృతిని తెలుసుకోవలసిన వారు వీనిని తప్పక స్పృశించాల్సిన అవసరముంది
రాళ్ళపల్లి సంగీతాన్ని నమ్ముకొని
సాహిత్యాన్ని నిర్లక్ష్యం చేసారు
నేను సాహిత్యాన్ని నమ్ముకొని
సంగీతాన్ని పట్టించుకోలేదన్న
పుట్టపర్తి మాటలలోని ఆవేదన
కొంతవరకు తన కీర్తనలకు పొందుపరచిన
రాగాలతో కొంతవరకు తీర్చుకున్నారేమో..
యీ కృషిలో
పెద్దజమాలప్ప సహకారం తీసుకున్నారు
పుట్టపర్తి
నా కృతులను స్వరపరచాలి జమాలప్పా
పుట్టపర్తి
నా కృతులను స్వరపరచాలి జమాలప్పా
మా ఇంటికి రా అంటే
చెప్పిన సమయానికి
చెప్పిన సమయానికి
హార్మోనియం పెట్టె తీసుకొని వచ్చి
ఎన్ని గంటలైనా.. రోజులైనా ..రాత్రైనా.. పగలైనా..
తిండి తిన్నా.. తినకున్నా ..
ఎన్ని గంటలైనా.. రోజులైనా ..రాత్రైనా.. పగలైనా..
తిండి తిన్నా.. తినకున్నా ..
పుట్టపర్తి కెంత తపన ఉందో
అంతే తపనతో పనిచేసే వారిని చూస్తే యేమనగలం
భగవంతుని పని అలానే జరుగుతుంది
భగవంతుని పని అలానే జరుగుతుంది
అంటాం అంతే కదూ
పెద్ద జమాలప్పగారు గొప్ప విద్వాంసులు
ఆరోజుల్లో గండపెండేరం కూడా తొడిగించుకున్నారు
పుట్టపర్తి వారు అపూర్వ రాగాలలో ఆరోజుల్లో గండపెండేరం కూడా తొడిగించుకున్నారు
యెన్నో కీర్తనలను వ్రాసారు
చాలా వాటికి సంగీతం నోట్లు కూడా వ్రాసారు
ఎత్తుగడలు ఆకట్టుకొనే విధంగా వున్నా యి
కొన్నిటికి ఆరోహణలు అవరోహణలు వున్నాయి
కొన్నిటికి లేవు
కొన్నిటికి వుండి మరికొన్నిటికి వుండకపోతే బాగుండదు
కనుక
కొత్త కొత్త రాగాలకు
ప్రాచుర్యంలో లేని రాగాలకు ఆరోహణ అవరోహణల విషయంలో కొమండూరి గారు
రాధా పార్థసారధి అనే ప్రొఫెసర్ పేరు సూచించారు
ప్రతిరోజూ ఆమె తో సంప్రదింపులు
ఆమె వీలైన సమయంలోనే
అందుబాటులో ఉన్న సమయంలోనే ఆమె నడగాలి
యే రాగం చెప్పినా మరునిమిషంలో
ఆరోహణ అవరోహణలు చెప్పే కొమం డూరి గారి
ప్రజ్ఞ కు అక్కయ్య ఎంతో సంతోషపడుతూందిఅయ్య
శతజయంతి ఘనంగా జరగాలని
నా చిరకాల వాంఛ
సాహిత్య సర్వస్వం కృతులు ముద్రణ కావటం
మన అదృష్టం
అంటుంది అక్కయ్య.
నిజానికి అక్కయ్య అకుంఠిత దీక్ష వలననే
పుట్టపర్తి కార్యాలు నిర్విఘ్నంగా జరుగుతున్నాయి
ఒక కూతురు తన తండ్రికి ఇచ్చే ఘనమైన నివాళి ఇంతకన్నా యేముంటుంది
బాహ్యంలో బ్రతుకుతున్నా
ప్రతిక్షణం అయ్య అయ్య అని మనసులో జపించేదే నిజమైన తపస్సు
కాదంటారా..
దేవునికి తన వ్యక్తిగతమైన కోరికలు పక్కన పెట్టి
మా అయ్య సాహిత్య సర్వస్వం త్వరగా ముద్రింపబడాలని మొక్కుకునే బిడ్డలు యెవరికుంటారు..
అదేగాక
కృతుల సాహిత్యం
శిష్యులు వానిని వ్రాసారు
వ్రాత గాని పైత్యం కూడా అందులో కలిసింది
అన్వయం కుదరనివానిని సరిచూసుకోవాలి
నే నూ డి టి పి లో పాలు పంచుకుంటున్నాను
మే ఘదూతము లోనికవితా సౌరభాలను
సాక్షత్కారంలోని తులసీదాసును
సిపయిపితూ రీ లోని దే శ భ క్తిని
అనుభవిస్తూ చేస్తున్నాను
నిడుద కన్నుల దాని
నిండు చెక్కుల దాని
నడు ము వడ కెడు దాని
నగవు చిత్తడి దాని
బెడగు నడకల దాని
పేర్మి పొడవగు దాని
దానిమ్మ పూ వంటి తళుకు బెదవుల దాని
తన్వంగి దలపోసి దలపోసి నిట్టూర్చు ...
ఆహా ..
ఇక
సాక్షాత్కారము లో
తులసీ దాసును రామునికై తపసు చేయమని పంపుతుంది మమతాదేవి
అక్కడ తులసీ దాసుకు మనసు నిలువదు
ప్రతిక్షణం ప్రేయసి సాన్నిధ్యానికై తహ తహ లాడే మనసు
రాముడు రాముడంచని
విరామము లేని జపమ్మునెల్ల
నీ ప్రేమయె నాక్రమించినది ప్రేయసి !
దుర్గమమీ పరీక్షలో
రాముడె నిల్చునొ !
అనురాగ భరాలస ముగ్ధవైన
నా కామిత మూర్తి
నీవె కడగన్నుల నిల్తువొ
ధ్యాన లక్ష్యమై..
ఆమె ధ్యానంలో విలవిల లాడతాడు.. తులసి
యెన్ని యుగంబులయ్యె హృదయేశ్వరి
వింతగ బల్కరించు నీ కన్ను జూచి
కాటుక నిగారపు కాంతులు జూచి
యెంత లోగొన్నదే యీ యెడంద
నొడగూడని కూడగ రాని చెల్మి,
నేనన్న ప్రతిజ్ఞయే గరళమైనది
జీవితముల్ దహింపగన్..
ఒక్కో భావం గుండెల్లో గుచ్చేస్తుంది..
ఇది చూడండి
ప్రేమ బలంబులెంత విపరీతములే
నవ పుష్ప కోమల ప్రేమముతోనె
భోగి నవలీలగ యోగినొనర్చివైచి తింతీ..
మహనీయమీ తపము నిండగ గీలుగొల్పి
నా రాముని
రామచంద్రుని విరక్త హృదిన్వెలిగించి వేయవే..
ఆ కడసారి నిన్ను
సొగసంతయు పండిన నిన్ను వీడి
యుద్రేకము నూతగోలగొని
దీనత వచ్చిన యప్పుడీ యెదన్
బ్రాకిన వేయి సర్ప గరళంబుల జావనిదాని కొక్కడా
నాకొక వేయిరాములైన గనుపట్టవలెన్ రహస్సఖీ..
రహస్సఖీ.. ఓహ్..
ఎంత కఠినాత్మురాలు కదా ఆ మమతాదేవి
ఒక్కటేమిటి ప్రతి ఒక్క లైనూ హృదయంలో వజ్రవైఢూర్యాల్లా దాచుకోవలసినవే..
ఆ భావతీవ్రతలోంచీ బయటికి రావడం చాలా కష్టం
నా చిన్నప్పుడు..
మా అయ్య గీతాంజలి చెప్పేవారు
పాఠం అయిన తరువాత
పిచ్చిపట్టినట్లు అవే చదువుకుంటూ ఒకటే యేడవటం..
నాకప్పుడు పధ్నాలుగేళ్ళే..
ఇక గ్రంధాల విషయానికొస్తే
శ్రీశైలం గారు వారి తమ్ముడు కొండయ్య గారు
ప్రూఫ్స్ దిద్దుతున్నారు
ఎలా
అన్ని పనులూ పక్కన పెట్టి
ప్రతిరోజూ ఉదయం అయిదు గంటల నుంచీ రాత్రి వరకూ
దీక్ష గా
పండరీ భాగవతంలో 650 పేజీలు
ప్రతి అక్షరం చూస్తున్నారు
డి టి పి గురించి శ్రీశైలం గారేమంటునారో చూడండి
"ప్రక్కన వుందనుకోండీ
నాలుగు లైన్ల తరువాత మళ్ళీ ప్రక్కన వస్తుంది
యీయన యీ ప్రక్కననుంచీ
ఆ ప్రక్కన కెళ్ళిపోతాడు..
ద్విపదకు రెండవ అక్షరము ప్రాస
ఆ ప్రాస మిస్సయితే కష్టం కదా
పదిరోజులనుంచీ ఉదయం అయిదు గంటలకు లేచి బయటికి ఎక్కడికీ పోకుండా
ఇదే పని మీద వున్నారు కొండయ్యగారు
ఆ శైలికి ఎవరు సాటి రారు .. హై శైలి
పండరీ భాగవతం చూడడం నా అదృష్టం అన్నారు
ఆయన
ఇది నాకు లభించిన మంచి అవకాశం
పండరీ భాగవతం ధార అద్భుతమైన ధార
భక్తి తపస్సు చేసి యీ గ్రంధం వ్రాసినట్లు ఉంది
యెవరికీ సాటి రాదు యీ భాషాశైలి అంటారు
ఆచార్యుల సాహిత్య సర్వస్వం - నాకు ఒక్క కాపీ దయచేసి తీసి ఉంచండి. డబ్బులు మీకు పంపుతాను.
రిప్లయితొలగించండితప్పకుండా రవీ..
రిప్లయితొలగించండి