24 జులై, 2014

చెప్పు తినెడు కుక్క చెరకు తీపెరుగునా?




బళ్ళారి రాఘవ గురించి జరుగుతున్న చర్చలు చూస్తుంటే
ఒక విషయం గుర్తొస్తోంది
 

రాఘవ గారి నాటకాల్ని 
పుట్టపర్తి ఎంత గొప్పగా వర్ణించే వారంటే..
హరిశ్చంద్ర నాటకం చూశారట..
ఆ నాటకాన్ని వెళ్ళిన ప్రతిచోటా ప్రదర్శిస్తారు కదా..
కానీ ప్రతి ప్రదర్శనలోనూ ఒక కొత్తదనం
ఒకసారి చూసిన వారు మళ్ళీ అదే నాటకాన్ని 

రెండోసారి మళ్ళీ మరో చోట చూస్తే
వారికి మళ్ళీ కొత్త అనుభూతి
ఒకచోట ప్రారంభసన్నివేశంలో తెరలేవగానే  

మహారాజుగా కనిపించిన హరిశ్చంద్రుడు..
మరొప్రదర్శనలో.. 

తెరలేవగానే కాటికాపరిగా ప్రత్యక్షమవుతాడు..
 

అంటే స్క్రిప్ట్ ను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ..
సందర్భానుసారంగా కొత్త కొత్తవి జోడిస్తూ.. ప్రదర్శించేవారట..
అందుకే పుట్టపర్తికి రాఘవ అంటే ప్రాణం
 

ఒ  కసారి మహాత్మా గాంధీ గారు విశ్రాంతి నిమిత్తం బెంగళూరు సమీపంలోని నందికొండలలో బస చేసారు
నాటక సమాజం వారు తమ నాటకాన్ని తిలకించవలసిందిగా.. విజ్ఞప్తి చేసారట
వారిని బాధపెట్టటం ఇష్టం లేని గాంధీ జీ 

ఒక పదినిమిషాలు చూస్తాను అన్నారు
కానీ..
చివరి వరకు కదలలేకపోయారు
పక్కనే వున్న రాజాజీ మీకు ప్రార్థన సమయం అవుతూంది అని గుర్తుచేయగా..
''ఈ నాటకాన్ని వీక్షించడం కన్న ప్రార్థన యేముంది అన్నారట గాంధీ.
ఇంతకూ ఆ నాటకమేమిటో తెలుసా..
దీన బంధు కబీర్
'రాఘవ నటన అద్భుతం ' అన్నారు చివరగా గాంధీ..


భక్త తుకారాం సినిమా చాలా బాగుంది 
అని అయ్యను ఎవరో తీసుకెళ్ళారు..
చూసి సినిమాను తిట్టుకుంటూ బయటికి వచ్చారు

పుట్టపర్తి
 రాఘవ నటన చూసిన నాకు మరేవీ నచ్చవు.. అన్నారు
 

శృతిలయలు వందరోజుల ఉత్సవం కడపలో జరిగింది 
 ఆ సభలో 

 తుకారాం సినిమా చూశాను 
మనసంతా చెడిపోయింది అని పుట్టపర్తి అంటే 
విశ్వనాధ నవ్వేశారు..
రాజశేఖర్ సుమలత లతో పుట్టపర్తికి పాదాభివందనం చేయించారు.



ఇప్పుడు ఎవరైనా విగ్రహాలు పెడుతున్నారంటేనే 
భయం వేస్తుంది
ఒకళ్ళు పెట్టిపోతే.. వేరొకళ్ళు వారిని  అవమానించడం తీసి పడేయటం
 ఈ రోజుల్లో
పెద్దవాళ్ళనిదూరంగా వుంచితేనే మంచిదేమో వాళ్ళకీ .. మనకూ..
మన అజ్ఞానం మనతోనే 

వారి గొప్పదనం వారితోనే
ఎలుకతోలు తెచ్చి ఏడాది ఉతికినా
అని హృదయ సంస్కారం లేని వారితో 

వాదించి ఫలితమేమి..?

కామెంట్‌లు లేవు :

కామెంట్‌ను పోస్ట్ చేయండి