29 సెప్టెం, 2014

మర్మము పరులకు దెలుపకు..



ఒక అత్త వూరెళుతూ కోడలికి 
కొన్ని విధులప్పగించింది..
వాటిలో

 ప్రతిరోజూ నైవేద్యం కృష్ణునికి పెట్టటం కూడా ఒకటి
వీటిల్లో యేది మర్చిపోయినా నీకు బడితె పూజ తప్పదని బెదిరించింది కూడా
 

ఆ కోడలికి విచారం పట్టుకుంది..
మిగిలిన పనులెలాగైనా చేయగలదు..

కా నీ కృష్ణునితో తినిపించటమెలాగూ..
అత్తేమో చండశాసనురాలు
 

మొదటిరోజు నైవేద్యం దేవుని ముందు పెట్టి 
''ఇదిగో మా అత్త నాకు కొన్ని పనులు చెప్పింది
వాటిలో నీకు నైవేద్యం పెట్టటం కూడా ఒకటి
మరి నైవేద్యం తెచ్చాను తిను'' అంది..
 

ఊహూ ..విగ్రహంలో చలనం లేదు
ఓహో ..యేవైనా స్తోత్రాలు పద్యాలూ చదివితే తింటాడేమో అనుకుంది..
హారతిచ్చింది గంటవాయించింది.. రాడే..
 

'యేమిటీయన మొండి పట్టు 'అనుకుంది.
 

''ఇదిగో కృష్ణయ్యా.. 
మా అత్త లేదనీ.. 
కోడల్ని నేను పెడుతున్నాననీ ..
రావటానికి ఇష్టపడటంలేదేమో..
ఎలాగోలా సర్దుకోవయ్యా.. నాలుగురోజులాగు.. అత్తవస్తుంది
నీ బాధ్యత అప్పుడామెదే....
ఈ నాల్రోజులూ  కాస్త బుధ్ధిగా వచ్చి తిను ..

నా బంగారు కొండవు కదూ..''
అని బతిమలాడింది..
అబ్బబ్బబ్బ.. రాడే..


ఒకరోజు..
రెండ్రోజులు..
కోడలికి భయం పెరిగింది ..

అత్త వచ్చి 'కృష్ణుడు తినటం లేద'ని తెలుసుకుంటుందేమో అని..
 

అంతే ఆమె ఓ నిర్ణయం తీసుకుంది..
 లోపలికెళ్ళింది..
పెద్ద కర్రొకటి పట్టుకొని 
రెండు దెబ్బలు నేలపై కొట్టి..
''ఏయ్ కృష్ణా .. 

రెండురోజులైంది నీవు తిని ..
తెలిస్తే మా అత్త నన్ను చంపేస్తుంది
నిన్నా మొన్నా బతిమాలాను
ఇక అవేవీ వుండవు 

మర్యాదగా వచ్చి తింటావా.. 
నాలుగు తగిలించమంటావా..''
అంటూ గుడ్లెర్రజేసి విగ్రహం వంక చూసిందంతే..
విగ్రహం గజ గజ లాడింది..
 

వెంటనే దాంట్లోంచీ చిన్ని కృష్ణుడు వచ్చాడు..
వాడి అందం చూసి కర్ర దూరం పడేసి.. 

ఆ కోడలు కబుర్లు చెబుతూ 
కృష్ణునికి పదార్థం తినిపించింది..
తర్వాత కృష్ణుడు వెళ్ళిపోయాడు..
'అమ్మయ్య 'అనుకుంది కోడలు పిల్ల
 

ఇలా నాల్రోజులు గడిచాయి..
అత్త వూరినుంచీ దిగి
  నాల్రోజులూ
జరిగింది విని తెల్లబోయింది..
ఆ తరువాత ఆమె కోడలి అదృష్టానికి  ఆమెకు పొంగులు ఆగలేదు ..

మరి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని కి కూడా
బెదిరించడాలు. ఆక్షేపించడాలూ వుంటాయా..
అది వారు ఆయనతో పెంచుకొనే చనువుని బట్టి వుంటుంది..

పుండరీకుడు చూడండీ..
తండ్రి పాదాలు వత్తుతున్నాడు
కృష్ణుడు కుటీరం వెలుపలినుంచీ 

''పుండరీకా..
 నేను కృష్ణుణ్ణి వచ్చాను ..
ఒకసారి రా ..''
 అంటే ..
''వుండవయ్యా.. నేనిప్పుడు చాలా బిజీ 

మా తండ్రి పాదాలు పడుతున్నాను..
కాస్సేపు వైట్ చేయ్యి
అక్కడ ఒక ఇటిక వుంది.. 

దానిపై నిలబడి వుండు ..''అన్నాడు

ఆవిడుంది ఆ శబరి.. 

రామునికి ఎంగిలి పండ్లు తినిపించింది..
పైగా దోరవేవో కాయలేవో చూశానంటుంది కూడా..
ఆ రాముడు పరమ ప్రీతితో తిన్నాడు..


యేమంటాం చెప్పండి..
 

రామదాసు రామునికి నగలు చేయించాడు..
ఆ ముస్లిం రాజు పట్టుకుని జైల్లో వేశాడు..

వున్న శిక్షలన్నీ వరసగా వేయించేస్తున్నాడు
నగలు పెట్టుకొని ఊరేగిన రాముడు వచ్చి 

''తానీషా తొందర పడకూ
ఈ రామదాసు నాకే ఆ డబ్బు ఖర్చు పెట్టాడు..
అతన్ని వదిలెయ్ ప్లీస్ ''అని చెప్పొద్దూ..
చల్లగా తప్పించుకున్నాడు..
 

రామదాసుకు ఒళ్ళు మండిపోయింది..
''ఎవడబ్బా సొమ్మని కులుకుచు తిరిగేవు రామచంద్రా..''
అంటూ గొల్లుమన్నాడు.. తర్వాత రామలక్ష్మణులిద్దరూ రామదాసు బాకీ తీర్చేశారనుకోండీ..

ఇలాంటి సందర్భం పుట్టపర్తి వారు చెబుతున్నారు..
ఇది భాగవతోపన్యాసములు లోది..

సమర్థ రామదాసస్వామి పండరి పొయ్యాడు
విఠలుణ్ణి చూశాడు..
ఆయనే మో నడుముపై చేతులుపెట్టుకుని నిలబడు
న్నాడు 
  దేశమంతా అధర్మ భుయి ష్టంగా వున్నప్పుడు..
నడుముపై చేతులేసి హొయలుగా ఆ నిలబడ్డమేంటి.. అనుకున్నాట్ట సమర్థ
వెంటనే చాపపాణియై దర్శనమిచ్చాడట విఠలుడు
పాపం దేవుని కష్టాలు దేవునివి..

25 సెప్టెం, 2014

ఏ పాద సీమ కాశీ ప్రయాగాది పవిత్ర భూముల కన్నవిమల తరము

కూర చిదంబరం గారు ఫోన్ చేసి 
అమ్మా సరస్వతీ సంహా రంలో 119 నుంచీ 129 వరకూ పది పేజీలు లేవు అన్నారు
నేను షాకయ్యా..
ఎంతో జాగ్రత్తగా చేశాననుకున్నా..
స్కానింగ్  చేసి word లో పేజీకి రంగులూ బార్డర్లూ.. వేసి నా కలాకారీ అంతా ఉపయోగించాను
హతవిధీ..
ఇంత పెద్ద తప్పిదమా..
ఇంకా తెలియని ఎన్ని తప్పులు జరిగాయో..
మళ్ళీ ఆ పేజీలు స్కాన్ తీసి జతచేసి scribd లో  పెట్టీ ఉఫ్ అనుకున్నాను..
రెండు రోజులాగిన తరువాత శ్రీశైలం గారి ఫోన్..
ఆయన ఒక మళయాళ రచయిత నంబరు సంపాదించారు..
ఆయన తెలుగు నుంచీ మళయాళానికీ.. మళయాళం నుంచీ తెలుగుకీ చాలా వర్క్స్ చేశారు..

పేరు LRS Swamy, విశాఖ వాస్తవ్యులు
 రెండు రోజులాగి ఫోన్ చేశా..
ఎంత బాగా మాట్లాడారనుకున్నారు..
ఏకవీర యే సంవత్సరం ప్రింట్ అయ్యిందో తెలపండి ప్రయత్నిస్తా అన్నారు..
1955 నుంచీ 1959  మధ్య 

చాలా థాంక్స్ అండీ..
అంటే మీకు నేను సంపాదించి ఇచ్చిన తరువాత థాంక్స్ చెప్పండమ్మా..
నాకు సాహిత్యమంటే అభిమానం..
పుట్టపర్తి వారంటే గౌరవం..
మీరు ఫోన్ చేశారు..
అంతకన్నా యేం కావాలి
మీ సిస్టర్ నాగ పద్మిని గారు నాకు పరిచయమే..
అన్నారు..
ఈ రోజంతా సంతోషంగా గడిచింది..


ఈ పద్యం నాకెంత ఇష్టమో ..
పాద సీమ కాశీ ప్రయాగాది 
పవిత్ర భూముల కన్న విమల తరము
ఏ పాద పూజ 
రమా పతి చరణాబ్జ  పూజల కన్నను పుణ్య తమము
ఏ పాద తీర్థము 
పాప సంతాపాగ్ని ఆర్పగా గాలినామృత ఝరమో 
ఏ పాద స్మరణ 
నాగేంద్ర శయుని ధ్యానమ్ము కన్నను 
మహానంద కరము
అట్టి పితరుల పద సేవ ఆత్మ మరచి 
ఇహ పరంబుల కెదమై తపించు వారి 
కావగల వారు లేరు 
ఈ జగాన వేరే 
నన్ను మన్నించి బ్రోవుమా అమ్మా నాన్నా

24 సెప్టెం, 2014

అజ్ఞాత వాగ్గేయ కారులు కార్యక్రమంలో

Ajyatha vaggeyakarulu-a SVBC prog on SARASWATHIPUTRA Dr.Puttaparthi Naarayanacharya

This prog is presented and conducted by Dr.Vyzarsu Balasubramanyam garu for SVBC channel and this series producer is sri Bharadwaj garu.In this programme. Dr.Puttaparthi Nagapadmini, describes about her revered father's (Dr.Puttaparthi Narayanacharya garu) life style and the nuances of his devotional songs written with Asthakshari mudra. The songs r composed and taught by Dr.Vyzarsugaru.(telecast on 24th june, 2012)


అజ్ఞాత వాగ్గేయ కారులు కార్యక్రమంలో


23 సెప్టెం, 2014

విశాఖ నుంచీ రామకృష్ణానంద

 అప్పుడప్పుడూ పుట్టపర్తి అభిమానులు ఫోన్ చేస్తూ వుంటారు..
వారిలో రామకృష్ణానంద ఈ మధ్యనే మాట్లాడారు..
మా అయ్య మంచి వక్త అయినా
నాకు మాట మాటకూ తడుముకోడం
చెప్పల్సింది లాగి లాగి చెప్పటం ఇబ్బందిగా వుంది..
అందుకే నా పార్టు తగ్గించి 
కేవలం వారి సంభాషణ కాస్త వుంచాను..

రామకృష్ణానంద విశాఖ లో వుంటారు
ప్రవచనాలు చెబుతుంటారట..
వృత్తి ప్రవృత్తి రెండూప్రవచనాలే 
ఆనాడు హిమాలయాలలో పుట్టపర్తిని 
సరస్వతీపుత్రా అని ప్రియమారా సంబోధించిన 
శివానంద సరస్వతి శిష్యులు 
యోగానంద సరస్వతి వీరి గురువులు..
అందుకేనేమో నా మనసు పుట్టపర్తి వారిపై లగ్నమైంది అంటారు రామ కృష్ణానంద ..

16 సెప్టెం, 2014

సరస్వతీ సం హారము శ్రీ కూర చిదంబరం గారి అభిమాన నవలా ..?




  


ఒక నాడు కథ నవలా రచయిత 
శ్రీ కూర చిదంబరం గారు ఫోన్ చేసారు..
వారికి పుట్టపర్తి కన్నడం నుంచీ అనువదించిన 
సరస్వతీ సం హా రం ప్రతి కావాలట

ఆయన రచన చేసే తొలి నాళ్ళలో 
ఈ అనువాద నవల విపరీతంగా ఆకర్షించిందట..
తరువాత ఆ ప్రతికై ప్రయత్నిస్తూనే వున్నారు..
ఆయనకిప్పుడు డెభ్భైయ్యేళ్ళు..
 వారి మాటల్లోనే వినండి..
  

'ఎవరీ కూర చిదంబరం'
 నా అల్ప బుధ్ధి ప్రశ్న వేసింది..
వెంటనే గూగుల్ ను వెతికితే..
కూర చిదంబరం గారి వివరాలు దొరికాయి


        
ఆయన రాసిన కథలు అప్పటి లీడింగ్ ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక, పొలికేక వార పత్రికల్లో వచ్చాయి.
 ఈ ప్రాంతంకు చెందిన సీనియర్లయిన కథా రచయితలు గర్ళకుర్తి సురమౌళి, 
రాములు, 
గూడూరిసీతారాంతోసహా,
డా.మలయశ్రీ, 
తత్వవేత్త బి.ఎస్.రాములు, 
తాడిగిరి పోతరాజులు 
వీరికి సమకాలికులుగా చెప్పవచ్చును. 

అప్పటి సమకాలీన సామాజిక జీవితాన్ని, 
అణగారిన బతుకుల్లోని జీవన పోరాటాల్ని,
 పేదరికాన్ని, 
వారి కడగండ్లను నిశితంగా పరిశీలించి 
కథలుగా మలిచి, 
ఆయన చేసిన రచనలు చూస్తే, 
మునిపల్లె రాజు, 
పెద్దిభట్ల సుబ్బరామయ్య, 
చాగంటి సోమయాజుల కథలు గుర్తుకు వస్తాయి. 

చిదంబరం తన కథారచనను కొనసాగించి వుంటే. ఆయనకు ఎన్నెన్నో పురస్కారాలు దక్కియుండేవి. 
అతి కష్టమైన సిఎ కోర్సు పూర్తి చేసి, 
హైదరాబాద్ లో చార్టర్ అకౌంటెంట్ గా 
బతుకు తెరువుకై జీవితంలో స్థిరపడ్డాక 
ఆయన చాలా కాలం పాటు 
సాహిత్య వ్యాసాంగాల జోలికి వెళ్ళినట్లు కనిపించలేదు. 

వీరు ఆర్థిక వేత్తగా కొనసాగి 
కేంద్ర,రాష్ట్ర బడ్జెట్ల పై సెమినార్లు చర్చావేదికలు నిర్వహించారు. 
వీరి భాషా శైలిని పరిశీలిస్తే 
ఈయన నిరంతర అధ్యయనం మాత్రం విడవనట్లుగా ప్రస్ఫుటమవుతుంది. 
రచనా వ్యాసాంగాలు కొనసాగించి వుంటే 
ఆయన పుస్తక రచనలు ఎన్నో వచ్చియుండేవి. 


http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/may13/pustakaparichyam.html


 మళ్ళీ నేను సరస్వతీ సం హారం లోనికెళ్ళాను..
ఎంతకూ ఈ అనువాద నవలలో యేం వుంది

'కథ చెప్పే వాళ్ళకు ఊకొట్టే వాళ్ళు కావాలి..'
అని పుట్టపర్తి వ్రాసిన వాక్యం జనాల్లోకి ఎంత చొచ్చుకుపోయిందో తెలిస్తే
ఆ కథనం ఎంత విజయం సాధించిందో అర్థమవుతుంది..
 

'పెళ్ళాన్నేం చేస్తావురా బాళప్పా..
గొంతుపిసికి బాయిలో యేస్తాను..'
నవల మొదలూ చివరా వచ్చే వాక్యమిది..
 

ప్రతి సమాజంలో మంచీ చెడూ రెండూ వుంటాయి 
ప్రతిసారి మంచి వ్యక్తిత్వాలు విజయం సాధిస్తాయనే నమ్మకం యేమీ వుండదు.
 

నీచ స్వభావాలే ముందడుగు వేసి విజయాన్ని కైవశం చేసుకోవడమూ కద్దు
ఈ నవలలో గౌరమ్మ బాళప్పలు నీచ పాత్రలు
సాత్విక పాత్రలలో బ్రహ్మానంద శాస్త్రి అచ్చమ్మ సరస్వతి గణపతి అందరూ అసహాయులే
 

బాళరాజు సత్య సంధుడు చేసిన ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నాడు
పుణ్యాత్ముడు
ఈ ముగింపు వాక్యాలతో 

బాళప్పను పుణ్యాత్మునిగా చిత్రించినా నవల మొత్తం అతని పాత్ర ఎంత దుందుడుకుదో ఎంత అనాగరికమైనదో ఎంత కఠినమైనదో చిత్రించిన వైనం బీచీ అసమాన రచనా శైలికి తార్కాణంగా నిలుస్తుంది..
అలానే పుట్టపర్తి సరళ సుందర అనువాదమూ పూవుకు తావి అబ్బినట్లుగా అమరింది
తెలుగు పలుకుబడులను సమయోచితంగా వాడటం వలన భాష అందగించింది
అంతేకాక రచనలో అప్పటిసాంఘీక చిత్రం కూడా సుస్పష్టంగా కనిపిస్తుంది..

'హంసరాజ్ రహబ్బర్ '

ఉర్దూభాషలో వ్రాసిన నవలను 
'సంఘర్షణ' పేరుతో తెలుగులో అనువదించారట పుట్టపర్తి
 

ఇందులోని ప్రతిపాత్రా 
బాహ్య జగత్తుతో ఆంతరిక జగత్తుతో పోటీ పడుతుంది
కొన్ని పాత్రలా సంఘర్షణలో నలిగిపో పరిస్థితిలో నరకమనుభవిస్తున్నాయ్
 

మూల రచయిత ధర్మధ్వజఛాయకు లొంగిపోయి కుముద పాత్రను బలవంతంగా చంపేశాడనీ..
ఒకవేళ తానే కనుక వ్రాసివుంటే 

అలా చేసేవాణ్ణి కాదని అనువాదకుడు 
ముందుమాటలో అన్నారు
అంటే అనువాదకుణ్ణి అంతగా కదిలించిన ఇతివృత్తం అనువాదంగా సైతం మరింతగా 

పఠితలకు నచ్చి వుండాలి..
మరి పుట్టపర్తి ఉర్దూ నుంచీ అనువదించిన 

ఈ సంఘర్షణ ఎలా దొరుకుతుందో..