29 సెప్టెం, 2014

మర్మము పరులకు దెలుపకు..



ఒక అత్త వూరెళుతూ కోడలికి 
కొన్ని విధులప్పగించింది..
వాటిలో

 ప్రతిరోజూ నైవేద్యం కృష్ణునికి పెట్టటం కూడా ఒకటి
వీటిల్లో యేది మర్చిపోయినా నీకు బడితె పూజ తప్పదని బెదిరించింది కూడా
 

ఆ కోడలికి విచారం పట్టుకుంది..
మిగిలిన పనులెలాగైనా చేయగలదు..

కా నీ కృష్ణునితో తినిపించటమెలాగూ..
అత్తేమో చండశాసనురాలు
 

మొదటిరోజు నైవేద్యం దేవుని ముందు పెట్టి 
''ఇదిగో మా అత్త నాకు కొన్ని పనులు చెప్పింది
వాటిలో నీకు నైవేద్యం పెట్టటం కూడా ఒకటి
మరి నైవేద్యం తెచ్చాను తిను'' అంది..
 

ఊహూ ..విగ్రహంలో చలనం లేదు
ఓహో ..యేవైనా స్తోత్రాలు పద్యాలూ చదివితే తింటాడేమో అనుకుంది..
హారతిచ్చింది గంటవాయించింది.. రాడే..
 

'యేమిటీయన మొండి పట్టు 'అనుకుంది.
 

''ఇదిగో కృష్ణయ్యా.. 
మా అత్త లేదనీ.. 
కోడల్ని నేను పెడుతున్నాననీ ..
రావటానికి ఇష్టపడటంలేదేమో..
ఎలాగోలా సర్దుకోవయ్యా.. నాలుగురోజులాగు.. అత్తవస్తుంది
నీ బాధ్యత అప్పుడామెదే....
ఈ నాల్రోజులూ  కాస్త బుధ్ధిగా వచ్చి తిను ..

నా బంగారు కొండవు కదూ..''
అని బతిమలాడింది..
అబ్బబ్బబ్బ.. రాడే..


ఒకరోజు..
రెండ్రోజులు..
కోడలికి భయం పెరిగింది ..

అత్త వచ్చి 'కృష్ణుడు తినటం లేద'ని తెలుసుకుంటుందేమో అని..
 

అంతే ఆమె ఓ నిర్ణయం తీసుకుంది..
 లోపలికెళ్ళింది..
పెద్ద కర్రొకటి పట్టుకొని 
రెండు దెబ్బలు నేలపై కొట్టి..
''ఏయ్ కృష్ణా .. 

రెండురోజులైంది నీవు తిని ..
తెలిస్తే మా అత్త నన్ను చంపేస్తుంది
నిన్నా మొన్నా బతిమాలాను
ఇక అవేవీ వుండవు 

మర్యాదగా వచ్చి తింటావా.. 
నాలుగు తగిలించమంటావా..''
అంటూ గుడ్లెర్రజేసి విగ్రహం వంక చూసిందంతే..
విగ్రహం గజ గజ లాడింది..
 

వెంటనే దాంట్లోంచీ చిన్ని కృష్ణుడు వచ్చాడు..
వాడి అందం చూసి కర్ర దూరం పడేసి.. 

ఆ కోడలు కబుర్లు చెబుతూ 
కృష్ణునికి పదార్థం తినిపించింది..
తర్వాత కృష్ణుడు వెళ్ళిపోయాడు..
'అమ్మయ్య 'అనుకుంది కోడలు పిల్ల
 

ఇలా నాల్రోజులు గడిచాయి..
అత్త వూరినుంచీ దిగి
  నాల్రోజులూ
జరిగింది విని తెల్లబోయింది..
ఆ తరువాత ఆమె కోడలి అదృష్టానికి  ఆమెకు పొంగులు ఆగలేదు ..

మరి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని కి కూడా
బెదిరించడాలు. ఆక్షేపించడాలూ వుంటాయా..
అది వారు ఆయనతో పెంచుకొనే చనువుని బట్టి వుంటుంది..

పుండరీకుడు చూడండీ..
తండ్రి పాదాలు వత్తుతున్నాడు
కృష్ణుడు కుటీరం వెలుపలినుంచీ 

''పుండరీకా..
 నేను కృష్ణుణ్ణి వచ్చాను ..
ఒకసారి రా ..''
 అంటే ..
''వుండవయ్యా.. నేనిప్పుడు చాలా బిజీ 

మా తండ్రి పాదాలు పడుతున్నాను..
కాస్సేపు వైట్ చేయ్యి
అక్కడ ఒక ఇటిక వుంది.. 

దానిపై నిలబడి వుండు ..''అన్నాడు

ఆవిడుంది ఆ శబరి.. 

రామునికి ఎంగిలి పండ్లు తినిపించింది..
పైగా దోరవేవో కాయలేవో చూశానంటుంది కూడా..
ఆ రాముడు పరమ ప్రీతితో తిన్నాడు..


యేమంటాం చెప్పండి..
 

రామదాసు రామునికి నగలు చేయించాడు..
ఆ ముస్లిం రాజు పట్టుకుని జైల్లో వేశాడు..

వున్న శిక్షలన్నీ వరసగా వేయించేస్తున్నాడు
నగలు పెట్టుకొని ఊరేగిన రాముడు వచ్చి 

''తానీషా తొందర పడకూ
ఈ రామదాసు నాకే ఆ డబ్బు ఖర్చు పెట్టాడు..
అతన్ని వదిలెయ్ ప్లీస్ ''అని చెప్పొద్దూ..
చల్లగా తప్పించుకున్నాడు..
 

రామదాసుకు ఒళ్ళు మండిపోయింది..
''ఎవడబ్బా సొమ్మని కులుకుచు తిరిగేవు రామచంద్రా..''
అంటూ గొల్లుమన్నాడు.. తర్వాత రామలక్ష్మణులిద్దరూ రామదాసు బాకీ తీర్చేశారనుకోండీ..

ఇలాంటి సందర్భం పుట్టపర్తి వారు చెబుతున్నారు..
ఇది భాగవతోపన్యాసములు లోది..

సమర్థ రామదాసస్వామి పండరి పొయ్యాడు
విఠలుణ్ణి చూశాడు..
ఆయనే మో నడుముపై చేతులుపెట్టుకుని నిలబడు
న్నాడు 
  దేశమంతా అధర్మ భుయి ష్టంగా వున్నప్పుడు..
నడుముపై చేతులేసి హొయలుగా ఆ నిలబడ్డమేంటి.. అనుకున్నాట్ట సమర్థ
వెంటనే చాపపాణియై దర్శనమిచ్చాడట విఠలుడు
పాపం దేవుని కష్టాలు దేవునివి..

కామెంట్‌లు లేవు :

కామెంట్‌ను పోస్ట్ చేయండి