పరమ హితుండగు భూత పంచకమునకున్..
బరహితమె పరమ ధర్మము
పరహితునకు ఎదురులేదు పర్వేందు ముఖీ..
పర హితము చేసే లక్షణమున్న వాడు
పంచ భూతాలకూ హితుడు..
అలాంటివాడు ఊరికొక్కడుంటే
వూరికి ఉపద్రవాలు రావు..
వాడి రక్షించుకోవడంకోసమైనా ఈశ్వరుడు
ఆ వూరిని చల్లగా చూస్తాడు..
దేవతలు .. రాక్షసులూ క్షీర సాగరాన్ని అమృతం కోసం మధించారు..
అమృతం కాదు హాలాహలం పుట్టింది..
అమృతం అందుకుందామనుకున్న వాళ్ళకు హాలాహలాన్ని ఎలా ఆపాలో తెలియదు..
పోలో మంటూ శివుని దగ్గరకు పరుగెత్తారు..
అయ్యా అమృతం తాగి దేవతల్లా శాశ్వతంగా వుండిపోదామని సాగరాన్ని అల్లకల్లోలం చేశాం
మా కీచులాటల మధ్య సరిగా చిలికామో లేదో
ఈశ్వరా అమృతం రాలేదు..
హాలాహలం పొంగుతోంది కాపాడు..
అని ప్రార్థించారు..
వెంటనే ఆయన హృదయం కరిగిపోయింది..
దాన్ని ఎలా ఆపాలని ఆలోచించి
భయపడకండిరా..
నేను తాగేస్తానులే..
అన్నాడు..
కానీ పార్వతిని ఎలా ఒప్పించడం..
వెళ్ళి కాస్త ఆ హాలాహలాన్ని తాగి వస్తానంటే పోనిస్తుందా..
అందుకే..
హరిమది ఆనందించిన సకల జగాలు ఆనందిస్తా యి
పరహితమే పరమ ధర్మము..
లాంటి మాట లన్నీ.
పాపమా పార్వతి ఏం చేస్తుంది ..
మంగ ళ సూత్రమ్ము నెంత మది నమ్మి న దో ..
వెళ్లి తాగమంది
వాళ్ళని రక్షిం చ మం ది.
ఆపినా అలాంటి వాళ్ళు ఆగరని సర్వ మంగళ కు తెలుసు..
కడప ..
జి. రామారావు వీధి..
కాస్త నడిస్తే ..
చిన్న గాంధీ బొమ్మ
దాన్ని దాటి ఎడం చేతి వేపు నాలుగడుగులు వెస్తే ..
లైబ్రరీ..
పుట్టపర్తి నడుస్తున్నారా రోడ్డు పై..
ఉదయం పదకొండు గంట లు
తిన్నగా లైబ్రరీ లోకిప్రవే సిం చా రు
ఒరే .. రమాపతి ఏడిరా ..
అని ఎవరినో అడిగారు ..
వెంటనే రమాపతి వచ్చాడు ..
రారా అని ముందుకు నడిచారు పుట్ట పర్తి..
మారు మాట్లాడకుండా అనుసరించాడు రమాపతి
కాస్త నడిచాక
మాటలు మొదలు పెట్టారు
ఆ రెవెన్యూ ఆఫీసులో సంతకం పెట్టాలంట
నా రిటైరైన డబ్బులేవో ఇస్తారంట రా
అన్నారు..
రెవెన్యూ ఆఫీసు వరకూ అవీ ఇవీ మాట్లాడు కుం టు
నడిచారు
రామాపతి కి అయ్యగారికి డబ్బులేవో వస్తాయని అర్థమైం ది
స్వామీ.. అని మొదలు పెట్టాడు ..
ఏమన్నట్టు చూసారు పుట్టపర్తి
మా ఇంట్లో గాస్ పొయ్యి లేదు..
నా భార్య కట్టెల పొయ్యితో బాధ పడుతూంది..
మీకు డబ్బులొస్తాయి కదా..
నాకు ఒక రెండున్నర వెయ్యి ఇవ్వండి స్వామీ..
గ్యాస్ కొనుక్కుంటాను..
అన్నాడు..
అవునా .. పాపం
నీ భార్య కట్టెల పొయ్యితో అవస్థ పడుతూందా..
సరేలేరా తీసుకో..
నెలకింత ఇచ్చేస్తా స్వామీ..
పర్వాలేదులేరా.. తీసుకో అన్నారు..
రెవెన్యూ అఫీసుకు వెళ్ళారు..
సంతకం పెట్టారు పుట్టపర్తి
డబ్బు రమాపతి పట్టుకున్నాడు..
మళ్ళీ వెనక్కు నడక సాగించారు..
అందులో రెండున్నర వెయ్యి తీసుకున్నాడు
రమాపతి
లైబ్రరీ చేరారు..
డబ్బు టేబుల్ పెట్టి పుస్తకాలలో మునిగిపోయారు పుట్టపర్తి
రమాపతి తనపనిలో..
కాసేపైంది..
వస్తానురా అని డబ్బుపట్టుకుని పుట్టపర్తి
ఇంటికి బయలుదేరారు..
దారిలో మళ్ళీ ఇంకో అర్థి..
వాణికీ డబ్బు ఇచ్చేయడం..
అలా ఇంటికి వచ్చేసరికి ఆ డబ్బు
ఎంత చిక్కిందో..ఏమో ..
ఆ రెవెన్యూ ఆఫీసు వాళ్ళు ఈ డబ్బిచ్చారు అని
మా అమ్మ చేతిలో పెట్టారు..
రెవెన్యూ ఆఫీసులో ఎంత ఇచ్చారో ..
చేతికి ఎంత వచ్చిందో తెలియని ఆ 'స్వాధీన వల్లభ' మౌనంగా ఆ డబ్బు అందుకుంది..
సంసార భారాన్ని మోయడానికి ..
'స్వాధీన వల్లభ'
అంటే భర్తను అదుపులో వుంచుకున్నది కాదు
భర్తను నీడలా అనుగమించేది.. అట..
రమాపతి అన్న పంచుకున్న అనుభవాల నుంచీ ..
కామెంట్‌లు లేవు :
కామెంట్‌ను పోస్ట్ చేయండి