11 జన, 2015

ముదావహం



 ముదావహం
వేసవి వెన్నెల ఆరుద్ర అనువాదానికి పుట్టపర్తి అభిప్రాయం ..


భాగవతుల సదా శివ శంకర శాస్త్రి..
మరో రూపం ఆరుద్ర.
శ్రీ శ్రీ కి వేలువిడిచిన మేనల్లుడు..
శ్రీ శ్రీ తో కలిసి ఋక్కుటేశ్వర శతకం వ్రాసినవాడు
ఇదేమిటి శ్రీ శ్రీ అభ్యుదయ కవి కదా.. 
ఋక్కుటేస్వర శతక మంటారేమిటీ
అంటే..
ఒకప్పుడు యే అభ్యుదయ విప్లవ జానపద ఒకటేమిటి
యే కవిత్వానికైనా పునాదులు ప్రబంధాలలో పుట్టుకొస్తాయి..

యేదో తెలుగూ సంస్కృతమూ చదువుకొని 
ఇతర భాషల కవిత్వాలు చూడక 
మేమే కవులమని..జబ్బలు చరుచుకొనే వారీనాటి కవులు అని పుట్టపర్తి వాపోయారు

అసలు తెలుగే సరిగా రాకుండా ..
బాధను బాదగా .. రాధను రాదగా రాసేసి.. 
భావావేశాన్ని దింపుకుంటున్న కవులను చూస్తే
యేమౌతారో..

అసలు కవి దేశాటన చేయాలని.
 తద్వారా మనసు దృష్టి విశాలమౌతాయని..
అంటే..
నన్నయ్య తమిళ కర్నాటములలో కృషిచేసినాడంటే 
ఆంధ్ర భాషా ద్రోహిగా
పుట్టపర్తిని భావించిన వాళ్ళున్నారట..

అసలు తమిళ కర్నాటకాలు రాకపోతే 
తెలుగు అందాలు సరిగా తెలియవని కూడా 
అభిప్రాయ  పడతారు పుట్టపర్తి 

 శ్రీ శ్రీ తరువాత అంతటి అభ్యుదయ కవిగా ముద్రపడిన ఆరుద్ర .. 
సంప్రదాయానికి ఎదురు తిరిగే సాహసం గల వాడు 
భాష లోను భావంలోనూ కొత్తదనాన్ని చూపడానికి ఇష్టపడేవాడు 
ఇంగ్లీషు తెలుగులతో కొత్తపదాలను ప్రయోగించే వాడు 
అయిన ఆరుద్ర .. 
ఈ ప ర ణి కావ్యాన్ని అనువాదం చేయడం 
ఆశ్చర్యంగా వుందని పుట్టపర్తి అన్నారు.. 

దరిద్రం నీళ్ళను చూపిం చినా
సాహిత్యం తో కడుపు నింపు కున్నాడు ఆరుద్ర   
జీవిత ప్రారంభంలో .. 

అసలు సాహితీ  వేత్తలు అన్నిటి కంటే 
పుస్తకాలనే ఎక్కువ ప్రేమిస్తారు .. 
ఇల్లు వాకిళ్ళు కార్లు బంగాళా లకన్నా
 వారికి అక్షరాలే ఎక్కువ ఇష్టం ..


నెల కొక్కటి రాస్తానని ప్రతిజ్ఞ చేసాడట ఆరుద్ర.. 
వాటిలో డిటెక్టివ్ నవలల నుంచీ సమగ్ర ఆంధ్ర సాహిత్యం వరకూ 
 సినీ గీతాలు ..గేయాలు ..
గేయ నాటికలు.. కథలు.. నవలలు..
సాహిత్య పరిశోధక వ్యాసాలు.. వ్యంగ్య వ్యాసాలు. 
పీఠికలు.. విమర్శలు .. అనువాదాలు.. 
ఒకటేమిటి.. ఎన్నో .. ఎన్నో .. 

ఆ అనువాదాలలో ఈ వెన్నెల .. వేసవి ..  ఒకటి ..
ఇది తమిళ కవి జయగోండార్ రచన

చోళరాజైన మొదటి కులోత్తుంగ మహరాజు (1070-1122 క్రీ.శ.) ఆస్థానకవి జయంకొండర్. 
ఆయన రాసిన ‘కళింగత్తుప్పరణి’ 
1110వ సంవత్సరం కళింగ యుద్ధంలో 
విజయం సాధించి తెచ్చిన చోళ సేనాధిపతి 
కరుణాకర తొండమాన్‌ను కీర్తిస్తూ రాసిన కావ్యం. 

పదమూడు భాగాలుగా ఉన్న ఈ కావ్యంలో 
ఉపోద్ఘాతం తరువాత 
ద్వారోద్ఘాటన (తలుపు తెరవడం) విభాగంలో 
 విజేతలుగా వెనుదిరిగి వస్తున్న వీరులకు 
తలుపులు తెరవమని ఉద్ఘోషించే పద్యాలు 
50 దాకా ఉన్నాయి.
అవే ఈ వే సవి.. వెన్నెల

విశాలాంధ్ర ప్రచురణాలయం వారు ప్రచురించారు 
పుట్టపర్తి నారాయణాచార్యులు గారు 
‘ముదావహం’ అనే పేరుతో 
తొలిపలుకు రాసారు. 

అందులో పుట్టపర్తి 
 “కరునాడు” అంటే ఆంధ్రదేశమేనని ఉద్ఘాటిస్తూ 
అందుకు నిదర్శనంగా 
కళింగత్తుపరణిలోని ఒక పద్యం చూపించారు.

ఈ కరునాడు పై ''ఈమాట""  ఆన్ లైన్ మేగజైన్ లో 
పెద్ద చర్చే జరిగింది .. 

మరి.. 
ఆరుద్ర అనువాదం ఎలా చెసారు.. 
పుట్టపర్తి  అభిప్రాయాన్ని ఎలా చెప్పారు.. 
చూద్దాం రండి.. 


 


 

 


కామెంట్‌లు లేవు :

కామెంట్‌ను పోస్ట్ చేయండి