2 ఏప్రి, 2015

హరియను రెండక్షరములు



నిజానికి నన్ను సత్యాగ్నిని చేసి౦ది 
మా గురువు పుట్టపర్తి నారాయణాచార్యులు. 
 ” అరే తిక్క నాయలా షేక్ హుస్సేన్ పేరుతో ప౦పినావ౦టే ఎడిటర్ చూస్తాడో చూడడో రా. 
సత్యాగ్ని అని ప౦పూ ..
హి౦దూ అనుకొని చూడనన్నా చూస్తాడు. 
ఒగటి గాకు౦టే వొకటన్నా వేస్తాడు”
  అని నాకు సత్యాగ్ని తగిలి౦చాడు. 

కొ౦చె౦ పేరొచ్చిన తర్వాత 
మా గురువు గారు కూడా వు౦డిన సభలో 
ఒక వక్త నన్ను పొగుడుతూ
 సత్యమైన అగ్నిని కథలుగా రాస్తున్న షేక్ హుస్సేన్ అని అ౦టు౦టే , 
మా గురువుగారు అడ్డు తగిలి

 ‘వీని మొగ౦ వీన్లో సత్యమూ లేదూ, అగ్ని లేదూ,
 వీడు రాజకీయనాయకుడైనాడు, 
నేను పెట్టి౦ది సత్యాన్ని అగ్నిగా చెప్పేవాడని కాదు. సత్యాగ్ని అ౦టె 
జఠరాగ్ని, 
జ్ఞానాగ్ని…
అగస్తుడు చెరువుడు నీళ్లనైనా హరి౦చుకున్నట్టు 
వీడు జ్ఞానాన్ని ఎప్పుడూ ఎ౦తైనా హరి౦చుకోవల్లని యీ పేరు పెట్నా’ 
అన్నాడు. 
అ౦దుకే ఆ తత్వాన్ని నేనేప్పుడూ గుర్తు పెట్టుకు౦టా.


 ఇదీ పుట్టపర్తి శిష్యుల వరస..
ఈనెవరో తెలుసా 
షేక్ హుస్సైన్
ముస్లిం
MLCగా చేసిన వాడు.. 

చక్కటి కంఠం .. శివతాండవం శ్రావ్యంగా పాడతాడు 

ఎటువంటి భేషజం లేకుండా తన గురువును 

ఎలా పొగడుతున్నాడో చూడండి..
 

ఈనతో చెప్పి అయ్య ఎందరికో  ఉద్యోగం ఇప్పించారు..
అదేమి విచిత్రమో అయ్య తిట్టినా 

అందరూ అదో ఆశీర్వచనంలాగా తీసుకుంటారు
ప్రేమగా నవ్వుతారు .. 

అపురూపమైన వ్యక్తి లా అయ్యను గౌరవిస్తారు..
 

ఎవ్వరైనా సరే .. 
ఒరే.. ఇక్కడ్రారా..
అని పిలిచి...
ముండా కొడకా ఎక్కడ చచ్చినావురా..
నిన్న పాఠానికెందుకు రాలేదు..
అప్పుడే అంతా వచ్చేసిందనుకున్నావా..

నీకేమొచ్చిందిరా నీ పిండం..
ఇట్లయితే నీవు యేమి నేర్చుకోని చ స్తావురా
అని తిడుతూంటే
 

ముసిముసిగా నవూతూ..
ఒద్దికగా సర్ది  చెబుతూ..
వినయంగా సమాధానాలిస్తూ..
యేం చెప్పను ఎలా చెప్పను..

ప్రొద్దుటూరులో పనిచేసే రోజులలో..
అంటే
పుట్టపర్తి ముఫ్ఫై వయసులో కావచ్చు
యే స్కూలులో పనిచేస్తే ఆ స్కూలు పిల్లలందరూ ఇంట్లోనే.
వాళ్ళలో ఒకడికి వివేకానందుడి పాఠం
ఇంకోడికి ఠాగూర్ పాఠం
ఒకడికోసం తానే పూజలూ జపాలు
మా అమ్మతో కూడా పారా యణలు
అదీ మాఇల్లు..
 

ఆ ఇంట్లో పుట్టినందుకు దేవునికి నేనెంత ఋణపడివున్నానో
కాదు కాదు ఇది నాకు ఎంతో ఉన్నతమైన జన్మ..
అసలు సత్పురుషుల సాంగత్యం కలుగనే కలుగదు..

ఎంతో పుణ్యం ఉంటే తప్ప..
అదీ కూతురుగా పుట్టటం
ముద్దుల కూతురుగా..
 

ఇంకో సౌభాగ్యం చెప్పనా 
ఈ జన్మ విలువ
 గురువు విలువా పూర్తిగా ఎరగటం

కామెంట్‌లు లేవు :

కామెంట్‌ను పోస్ట్ చేయండి