ఒక అబ్బాయి మా ఇంటికి వచ్చేవాడు..
మౌనంగా కూచునే వాడు..
పిలిస్తే పలికే వాడు
అయ్య ఎక్కడికి వెళ్ళినా తోడు
పట్టుకుని తీసుకు వెళ్ళటం
వెంటే వుండటం
తీసుకు రావటం.
అతనికి పుట్టపర్తి గురించి ఎంత తెలుసో తెలియదు
కాలేజీకి వెళ్ళి వచ్చేవరకూ మాత్రమే
కనబడేవాడు కాదు
అంతే..
అలా రోజులు గడిచాయి
క్రమక్రమంగా అయ్యకు అతను కుడిభుజమైపోయాడు..
అతని డిగ్రీ.. అయిపోయింది..
వెంటనే APPSC పరీక్షలు రాసాడు..
పరీక్ష పాసయ్యాడు..
ఇంటర్వ్యూ కడపలోనే..
ఎవరు ఇంటర్వ్యూ చేస్తున్నారో తెలుసుకున్నాడు
నన్ను రెకమెండ్ చేయమని ప్రాధేయపడ్డాడు..
సరే అన్నారు అయ్య..
రిక్షా ఎక్కించుకుని తీసుకు వెళ్ళాడు..
ఒరే వీడు నా వాడు వీణికి ఉద్యోగం ఇవ్వరా.. అని
అక్కడి సంబంధిత అధికారికి చెప్పారు పుట్టపర్తి..
సరే నన్నారు
ఆ సంబంధిత అధికారి అయ్యపై గౌరవంతో..
కొద్దిరోజులు గడిచాయి..
అతనికి కడప కలెక్టరాఫీసులో ఉద్యోగం వచ్చింది.. క్లర్క్ గా..
అతనికీ ఆనందం.
అయ్యకూ అనందం..
కొద్దిరోజులకు అక్కడే ఉద్యోగం చేసే పిల్లను
పెళ్ళి చేసుకున్నాడు..
అతని జీవితం కుదుటపడింది..
తర్వాత అతనికి అయ్య దగ్గరికి రావటానికి టైం లేదు..
అయ్య కనీసం బాధైనా పడలేదు..
మౌనంగా కూచునే వాడు..
పిలిస్తే పలికే వాడు
అయ్య ఎక్కడికి వెళ్ళినా తోడు
పట్టుకుని తీసుకు వెళ్ళటం
వెంటే వుండటం
తీసుకు రావటం.
అతనికి పుట్టపర్తి గురించి ఎంత తెలుసో తెలియదు
కాలేజీకి వెళ్ళి వచ్చేవరకూ మాత్రమే
కనబడేవాడు కాదు
అంతే..
అలా రోజులు గడిచాయి
క్రమక్రమంగా అయ్యకు అతను కుడిభుజమైపోయాడు..
అతని డిగ్రీ.. అయిపోయింది..
వెంటనే APPSC పరీక్షలు రాసాడు..
పరీక్ష పాసయ్యాడు..
ఇంటర్వ్యూ కడపలోనే..
ఎవరు ఇంటర్వ్యూ చేస్తున్నారో తెలుసుకున్నాడు
నన్ను రెకమెండ్ చేయమని ప్రాధేయపడ్డాడు..
సరే అన్నారు అయ్య..
రిక్షా ఎక్కించుకుని తీసుకు వెళ్ళాడు..
ఒరే వీడు నా వాడు వీణికి ఉద్యోగం ఇవ్వరా.. అని
అక్కడి సంబంధిత అధికారికి చెప్పారు పుట్టపర్తి..
సరే నన్నారు
ఆ సంబంధిత అధికారి అయ్యపై గౌరవంతో..
కొద్దిరోజులు గడిచాయి..
అతనికి కడప కలెక్టరాఫీసులో ఉద్యోగం వచ్చింది.. క్లర్క్ గా..
అతనికీ ఆనందం.
అయ్యకూ అనందం..
కొద్దిరోజులకు అక్కడే ఉద్యోగం చేసే పిల్లను
పెళ్ళి చేసుకున్నాడు..
అతని జీవితం కుదుటపడింది..
తర్వాత అతనికి అయ్య దగ్గరికి రావటానికి టైం లేదు..
అయ్య కనీసం బాధైనా పడలేదు..
మీ అయ్యవారు నూటికి నూరు పాళ్ళు కరెక్టు. మీరు మాత్రం బాధపడేకంటే వెళ్ళి కలవడమే మేలేమో! అయ్యవారి గురించి మనకి తెలియని విషయాలు ఎన్నెన్నో ఆ కుర్రవాడే చెబుతాడేమో! (ఇప్పుడు ఆ కుర్రవాడు పెద్దాయనేమో...కానీ కొందరు మనిషిల్లో బాల్యం పోదుగా! ఇలాంటి తప్పులు చేస్తూ వుంటారు...నా లాగా అన్నమాట)
రిప్లయితొలగించండి..జీవితంలో కొందరు అమాయకులుంటారు. వాళ్ళకి కొన్ని కొన్ని విషయాలు పట్టవు. పెద్దవాళ్ళ దగ్గరకి వచ్చి కలవాలి అన్న ధ్యాస ఉండదు. మనసులో మాత్రం గౌరవం ఉంటుంది.
మా గురువుగారిని కలవాలీ కలవాలీ కలవాలీ అంటూ మూడేళ్ళు కాలయాపన చేసాను. ఇలా జపం చేస్తూండగా నాకన్నా చాలా జూనియర్ అయిన ఓ కుర్రవాడు నా సేం ఓల్డ్ జపం విని వినీ విసిగిపోయి..."సార్ మీరు పదండి సార్... " అంటూ లిటరల్ గా నన్ను లాక్కెళ్ళాడు. ఆ కుర్రాడి పేరు కృష్ణ. అతని దయ వల్ల నా గురువుగారి దర్శనం చేసుకున్నాను...
కాళ్ళ మీద పడ్డాను...కౌగిలించుకున్నాను...ముద్దాడాను...కన్నీరు కార్చాను. నా మనసు ఎంత తేలికయ్యిందో చెప్పలేను. మా గురువుగారు పండు ముసలి. దాదాపూ తొంభై ఏళ్ళుంటాయి..అయినా ఆరోగ్యంగా ఉన్నారు. నన్ను చూసి ఆయన కూడా ఎంతో సంతోషించారు. ఇదంతా జస్ట్ రెండు నెలల క్రితం జరిగింది. నాకు కృష్ణ అంటే ఎక్కడలేని గౌరవ భావం కలిగింది. మా గురువుగారి పేరు శ్రీ వనమాలి జగన్నాధరావుగారు. 1948లో ఢిల్లీ నుంచి తెలుగు వార్తలు చెప్పేవారు. ఫిలిం డివిజన్ కామెంటరీ స్పీకరుగా చేసారు. వారి గొంతు ఒకప్పుడు తెలుగువారందరికీ సుపరిచితమే!...మిమిక్రీ ప్రోగ్రాముల్లో కూడా వారి వాయిస్ ని అనుకరించేవారు. ఆయన. స్క్రిప్టు చదువుతూంటే నాలాంటి చెవిటివాడిక్కూడా అర్ధమవుతుంది. బండ రాతి గుండెలుకూడా ఏనుగంత చెవులు చేసుకుని వింటాయి.
సారీ ఇక్కడ అనవసర విషయమేమో! మీ అయ్యవారు బాధపడలేదేమోకానీ మరచిపోయి ఉండరు. గురు శిష్యులంత మంచి మితృలు ఇంకెవరూ ఉండరు. కానీ జీవితం వారిని విడదీస్తుంది...భౌతికంగా మాత్రమే!
ఎక్కువ సుత్తి వేసానేమో!
ధన్యవాదములతో
అత్తిలి అనంతు
అనంత్ గారూ మీరా.. మీ కవిత ఇప్పుడే fb లో చదివి వస్తున్నా..
రిప్లయితొలగించండినేను వివరించిన అబ్బాయి అప్పుడప్పుడూ మా ఇంటికి వచ్చేవాడు తర్వాత..
నేను అన్నా అన్నా.. అనేదాన్ని..
మీరన్నది కరెక్టే.. కానీ నేను చెప్పడంలో ఉద్దేశం .. అలా ఎవరు వచ్చినా మేఘంలా కదిలిపోయి క్షణం ఆలోచించకుండా మేలు చేస్తారని ..
పైగా వాళ్ళకు నేనేదో మేలు చేశాననీ నావల్లే వాళ్ళ జీవితం బాగుపడిందనీ.. మరుసటి క్షణం నుంచే మరిచిపోతారనీ..
ఇలా ఎందరికో ఉద్యోగాలిప్పించారు..
గ్రామీణ బ్యాంకులో .. స్కూళ్ళల్లో..
కేవలం మా అయ్య ఒక్క మాటకు అవతలివారు విలువనిచ్చేవారు..
చివరిదశలో ..
నేను యేదైనా ఆశ్రమంలో ఉంటాను అనుకున్నప్పుడు..
ఆయన చేతిలో చిల్లిగవ్వలేదు ..
అడగకండి..
కడుపులో తెలీని వేదన సుళ్ళు తిరుగుతుంది..
ఆయన ద్వారా మేలు పొందిన వాళ్ళు యెవ్వరూ రాలేదు..
కానీ అయ్య ఆ పరమాత్ముని తప్ప యెవ్వరినీ ఆశించరుగా..