తిక్కన మహాశయుడే
లేకున్నచో మన వాఙ్మయములో ఉండునదియే లేకుండునది
నేడు తెనుగు భాషలో
లేకుండునదియేలేదు
అతడు కీచక పాత్రను
జిత్రించుటలో
జూపించిన నేర్పు..
ద్రౌపదీ పాత్ర రచనమున
గావించిన కూర్పు
కృష్ణుని పాత్రమున
నిర్మించిన తీర్పు..
దుర్యోధనున కిచ్చిన
మార్పు..
మాతయగు కుంతికి గావించిన
చేర్పు..
కర్ణుని పాత్రమున
పొంగిపొర్లెడు స్వామిభక్తికి ధీరోదాత్తత కొసగిన తార్పు..
తలచి తలచి ధ్యానించదగినవి
తిక్కనను ముందు
నిలుపుకొని
మనమే వాజ్మ యముతో నైనను
పోటీ
చేయవచ్చును..
సంస్కృత సాహిత్యమును
గాలిచి వెదకినను తిక్కనను వెనుకవేయుమనీషి గలుగలేదని
చెప్పు ధైర్యము నాకున్నది
షేక్స్పియర్ సృష్టించిన
నాయికలు
మన ద్రౌపదిముందర బలాదూర్..
మిల్టన్ మహాకవి సైతాను
పాత్రను సృష్టించిన యసాధారణమగు ప్రజ్ఞకు తలనూపుదుము..
కాని..
అంతకన్న
నెన్నోరెట్లధికమగు నేర్పు
తిక్కనార్యుని కీచకపాత్రమున నున్నది
రసికులలో చక్రవర్తి..
పండితులకు ప్రధమాచార్యుడు..
వైజ్ఞానికులకు బ్రహ్మర్షి..
కర్మయోగులలో జనకుడు..
రాజనీతిజ్ఞులలో చాళుకుక్యునకు
కుడిచేయి
కవి బ్రహ్మ.
బ్రహ్మాండమగు భారతమును
బూరించునపుడు ఒకచోటనైన అలత శ్రమ వేసరిక యున్నదా..??
దోషైక దృష్టితో రాత్రి
బగలు మనజీవితమెల్ల
గష్టించి చూచిన నొక్కలోపము నెత్తి చూపగలమా..??
ఓ మహాకవీ.. నీవు తెనుగు
జాతి కారాధ్యుడవు..
మాపున్నెముల నోము పంటవు..
మా జీవితముల కమృతమయ
మూర్తివి..
మా శరీరముల చర్మమును
జీల్చి
నీకు పాదుకలుగా సమర్పింతుము..
కవితా ప్రపంచరవీ..
నీకు
మా వందనము
మాజీవితమునమిమ్మెన్నడును
మరువకుందుము గాక.
కామెంట్‌లు లేవు :
కామెంట్‌ను పోస్ట్ చేయండి