''దివిషద్వర్గము నీ ముఖంబునన తృప్తింగాంచు, నిన్నీశుగా
స్తవముల్ సేయు శృతుల్, సమస్త జగదంతర్యామివిన్ నీవ, యా
హవనీయంబును దక్షిణాగ్నియును నీయం దుద్భవించున్, గ్రతూ
త్సవ సంధాయక! నన్ను గావగదవే ! స్వాహా వధూ వల్లభా..''
.
ఈ లాలసత నాటి జనులకే కాదు వారేర్పాటుజేసుకొన్న దేవతలకుగుడగద్దు.
వరూధినీ కామమును నిరాకరించి యింటికి ద్రోవబట్టిన ప్రవరుడు ..
అగ్నిదేవునెన్నోరీతుల బొగడినాడు..
'' దివిషద్వర్గము నీ ముఖ్ముననే దృప్తిగాంచు '' నన్నాడు..
బదులు రాలేదు..
' నిన్నీశుగాశ్రుతులు బొగడునుగదా .. !! ''
యని యగ్ని గొప్పతాము నగ్గించినాడు..
నీవు '' సమస్తజగదంతర్యామి '' వని యాతని 'రాచరికమూ ను బొగడినాడు..
'' ఆహవనీయంబును, దక్షిణాగ్నియును '' నీయందేగదా యుద్భవించునని యాతని సర్వాధారత్వమును బలికినాడు..
కడకు..
'' గ్రతూత్సవసంధాయక.. !!'' యని యేమో యొయ్యారముగ బిలిచినాడు..
ఇదేదియు గార్యసాధకముగాదనుకొన్న ప్రవరుడు..
'' స్వాహావధూవల్లాభా..'' యని ముగించినంతనే..
యుత్సాహము రేగిన వహ్ని .. '' హా '' యని పైకిలేచి నిలచి నాడట..
కామెంట్‌లు లేవు :
కామెంట్‌ను పోస్ట్ చేయండి