భువనంబులేవియు బొదలకమున్న..
భవు కాలి గజ్జెలు పలుకకమున్న ..
జలధులు సర్వంబు నెలయక మున్న..
గలయంత జగతి జీకటి మున్న..
గమలోదరుడు శ్రుతుల్గరవకమున్న..
నటమున్న.. నటమున్న.. నటమున్నమున్న..
వటపత్రశాయియై బొటవ్రేలి నోట..
జివుకుచు దానొక్క శిశువు పోలికను
భువనంబులను బండి నవ నవ రీతి..
దనలోనె దానవ్వి ..దానికి నవ్వి..
తనచూపె దాజూచి దానికి నవ్వి.
తనపల్కె దావిని దా నికి నవ్వి..
నవ్వుపుట్టుక జూచినవ్వి క్రీడించు
నవ్విశ్వకారణు .. నఖిలాభిగమ్యు..
వేదాంత వేద్యు .. సంవిన్మూర్తి .. భేద
వాదా విషయు .. భవభేదన ప్రవణు..
విశ్వేశు.. విశ్వాత్ము.. విశ్వైకనిలయు..
శాశ్వతానంద సంశ్రయు.. గుణాతీతు..
నగుణు.. నిరంజను .. నిగడితభక్తు..
నిగమాగమాధీను .. నగణిత శక్తి..
నవ్విష్ణు దేవుని నసలార గాంచి..
- పండరీ భాగవతము
ఒకనాడు మార్కాండేయ మహర్షికి
ఆ మాయాస్వరూపుని లీలలను చూచి అనుభవించాలని కోరిక పుట్టిందట..
'అట్లేకానీ లేప్పా ..'
అంటూ నారాయణుడు బదరికాశ్రమమువేపుకి పోయినాడు ..
అప్పటినుంచీ మార్కాండేయ మహర్షికి
'ఎప్పుడెప్పుడు మాయను దర్శిస్తానా..'
అని వ్యాకులం మొదలైంది.
'' గన్ను చూడాలనుకో..
కాని బుల్లెట్ చూడాలనుకోకు తట్టుకోలేవ్ ''
అని ఓ సినిమా డైలాగ్.
అలా ..
ఈ ప్రపంచమంతా మాయే అని తెలిసిన సర్వ సంగ పరిత్యాగి తపస్వి అయిన ఆ మార్కాండేయుడు ఆ మాయను చూడాలనుకోవడం విచిత్రం.
ఒక రోజు
హటాత్తుగా కారుమబ్బులు..పెనుగాలులు
కుండపోత ..
ప్రపంచమే అంతమౌతుందా అన్నట్టు
భయంకరమైన తుఫాను..
అలా కొన్ని దినాలు గడిచాయ్
ఒకనాడు .. ఒక ఎత్తైన ప్రదేశం మర్రి చెట్టు కానవచ్చాయి..
అక్కడికి పోయి చూడగా..
ఒక తేలియాడుతున్న మర్రి ఆకుపై పడుకుని వున్న శిశువు.. బొటనవేలిని నోటితో చప్పరిస్తూ..
ఆనందంగా తనలో తానే నవ్వుకుంటు న్నాడు..
ఆ పసివాని చూసి భ్రమ చెంది ..
దగ్గరికి పోయాడు మహర్షి
అంతే..
శిశువు కడుపులోకి లాగబడ్డాడు
లోపల యేముంది..
ఆకాశం.. అంతరిక్షం..
నక్షత్ర మండలం.. పర్వతాలు
సముద్రాలు, వనములు,దేశాలు
ద్వీపాలు, దిక్కులు, సురాసురులు ,
సమస్తం ఆ ఉదరంలో ఉన్నాయ్
మహర్షి దిగ్భ్రాంతుడయ్యాడు
ఆ దిగ్భ్రాంతిలోనే బయటికి నెట్టబడ్డాడు
మళ్ళీ బయట ప్రళయం ఎటుచూసినా జలమే.. ఎదురుగా ఎత్తైన కొండ మర్రిచెట్టు
దగ్గరకు పోయి చూస్తే
మర్రి ఆకుపై తేలుతున్న శిశువు..
ఏది మాయ.. ఏది నిజం..
చిరునవ్వులు చిందిస్తున్న ఆ బాలుని మనసులో ప్రతిష్టించుకుని నమస్కరించుకున్నాడు
కళ్ళు తెరిచేసరికి ప్రళయంలేదు వాన బీభత్సం లేదు.. ప్రశాంతంగా ఉంది సమస్తం
తనకు అనుభవమైన ఆ యోగమాయా వైభవాన్ని తలచి విచలితుడై
స్వామి నీ మాయకు మోహితులు కానిదెవ్వరు. మాయని నిజంగా ఆ నిజాన్ని శాశ్వతంగా భ్రమించి..
పండితులు .. విద్వాంసులు ..
ఆఖరికి జ్ఞానులు సైతం
ఈ ప్రాపంచిక బంధాలచే బంధింపబడుతున్నారు
ఎవ్వరైతే నీ శరణు జొచ్చుతారో వారినీ మాయ తాకనైనా లేదు.
అని నమస్కరించాడు
ఆ మర్రి ఆకుపై పవళించిన ..
చిన్ని కృష్ణుడెలా ఉన్నాడు ??
చిన్ని కృష్ణుడెలా ఉన్నాడు ??
చూడండి ..
పండరిభాగవతంలో
పుట్టపర్తి వర్ణన నచ్చిందా..
కామెంట్‌లు లేవు :
కామెంట్‌ను పోస్ట్ చేయండి