20 నవం, 2014
మనోంతరమున నొవ్వు గల్గిన.. ??
లేబుళ్లు:
ఆడియో
,
చిత్ర కవితలు
,
చిత్ర కవితా గీతికలు
,
వీడియోలు
,
సరస్వతీపుత్రుని పాద్యము
19 నవం, 2014
పసితనపు చాపలము..వశముగా నేమైన..
లేబుళ్లు:
చిత్ర కవితలు
,
జీవన చిత్రాలు
16 నవం, 2014
ఓహో పావురమా
లేబుళ్లు:
చిత్ర కవితలు
,
జీవన చిత్రాలు
15 నవం, 2014
చల్ చల్ గుర్రం ..
లేబుళ్లు:
చిత్ర కవితలు
,
జీవన చిత్రాలు
9 నవం, 2014
వినోద పరిశ్రమలు
కేవలం ఒత్తిడి నుంచీ దూరం చేసేవి కాదు
ఒక్కోప్పుడు జీవితాన్ని వెలిగించేవి హాబీలు
చేసే వుద్యోగం నుంచీ కాక తమ హాబీలవలన పేరు ప్రఖ్యాతులనందిన వ్యక్తులున్నారు..
ప్రముఖులైన వారు కూడా
తమ సంతోషాన్నీ విషాదాన్నీ హాబీలతో పంచుకుంటారు
మంచు విష్ణు అనే సినీ నటుడికి
రక రకాల చాకులు సేకరించడం హాబీ అట
ఒకసారి విదేశంలోని ఏర్పోర్టులో చెకింగ్ వారు అనుమానించి అతన్ని రక రకాలుగా ప్రశ్నించారు
అవి మారణాయుధాల కిందకి వస్తాయి
సంజాయిషీ ఇచ్చుకొని బయటపడేసరికి
తల ప్రాణం తోకకు వచ్చిందట..
ఇలాంటివి విన్నప్పుడు
ఎటు పోతోంది యువత అనిపిస్తుంది..
నాలుగు రోజులు సెలవులు వచ్చాయంటే చాలు! మనసును దోచే సుందర ప్రదేశాలనో,
అద్భుత కట్టడాలనో,
పురాతన భవనాలనో చూడాలనుకోవడం సహజం.
అందుకోసం
ఎంత ఖర్చు పెట్టడానికి కూడా వెనకాడరు
మరీ ఇంత తరచుగా కాకపోయినా
మరీ ఇంత తరచుగా కాకపోయినా
కనీసం
ఏడాదికో మారు పర్యటనకు
ప్రణాళిక సిద్ధం చేసుకునేవారూ వుంటారు.
వీరంతా
సంతోషాన్ని, ఆనందాన్ని, విజ్ఞానాన్ని
అందించే ప్రదేశాలను చూడ్డానికే
నూటికి
నూరు శాతం ప్రాధాన్యతనిస్తారు.
అయితే ఇంగ్లండ్‌కు చెందిన మెకాబ్రె
మార్క్...
వీరికి పూర్తి భిన్నమైన అభిరుచిగలవాడు.
సాధారణ మానవులు
జీవితంలో
కనీసం ఒక్కసారి కూడా
కాలు మోపడానికి...
సందర్శించడానికి ఇష్టపడని
శ్మశానాలను, సమాధులను
సందర్శించడమంటే అతగాడికి
అంతులేని ఆసక్తి.
చరిత్రలో పేర్గాంచిన వారి సమాధులను చూడడం ద్వారా నేను జ్ఞానం సంపాదిస్తున్నాను.
నా దృష్టిలో ...
ఒక్కో సమాధి ఒక్కో మ్యూజియం లాంటిది.
అది ప్రముఖుల గురించిన
విలువైన, అరుదైన సమాచారాన్ని
మనకు అందిస్తుంటుంది.
ఈ పద్ధతిలో నన్ను నేను చైతన్యవంతుణ్ణి చేసుకుంటుంటాను.'' అంటాడు మార్క్
లోకో భిన్న రుచిఃఇక్కడ పుట్టపర్తి వారు వినోద పరిశ్రమలు
అనే వ్యాసం వ్రాసారు పిల్లలకోసం
అందులో వారు చెప్పిన విషయాలు పిల్లలకు మాత్రమే కాదు
పెద్దలకూఎంతో ఆసక్తి దాయకం
విన్ స్టల్ చర్చిల్ చిత్రలేఖనం సాధన చేసాడట
కొక్కిరి గీతలుగా ఆరంభమైన అతని సాధన చిక్కనై ప్రకృతిని ప్రేమించేంత వరకూ వెళ్ళింది
అంత పట్టుదల కలవాడు కనుకే
రెండో ప్రపంచ యుధ్ధ కాలంలో
సాధించేదాకా సాధన మానకండి
ప్రయత్నం వదలకండి
సైనికులను ఉత్తేజితులను చేసేవాడట..
అలా ప్రయత్నించాడు కాబట్టే
గొప్పవాడయ్యాడు
మొదట్లో తను గీసిన ఒంకర టింకర గీతలను చూసి
యెవరైనా నవ్వితే చలించివుంటే
అతని సాధన ముందుకు సాగేదా...
బొడ్డు చెర్ల తిమ్మన అతని సమ ఉజ్జీ..
తిమ్మన అంటే రాయలకు అమిత అభిమానం..
అతనికొక అగ్రహారమే ఇచ్చేశాడట రాయలు
అంతేకదా రాజులు తలుచుకుంటే దెబ్బలకు సారీ అగ్రహారాలకు కొదువా..
పుట్టపర్తి వ్యాసాలలో వారి జీవితానుభవాలు
వ్యక్తులు అప్పుడప్పుడూ దర్శనమిస్తారు.
తిరుమల కొండపై దశావతారాలను ముగ్గులు తీర్చే స్త్రీ మొదలు..
జ్యోతిషం తో ఖండాంతర ఖ్యాతి పొందిన
తహశీల్దారు వరకూ ఎందరో ..
సంగీతం గాత్రం సాధించలేక పోయానే
అన్న బాధతో
పక్క వాయిద్యాలపై చేయి వేశాను
ఫి డేలు కొంత గోకి వదిలాను ..
వీణ సాధనమూ చేసాను ..
మృదంగం కొట్టినాను..
అడపా దడపా ..
మేళం పీక కూడా నోట్లో పెట్టుకున్నట్లు జ్ఞాపకం
ఏమైతే యేం..
వచ్చే జన్మలో నైనా
మంచి సంగీతజ్ఞుడు కావలెనని నా ఆశ..
నేను ఊరికే ఉండే సమయం అంటూ ఎప్పుడూ వుండదు..
ఎప్పుడూ పరిశ్రమే నా ఊపిరి..
ఇవన్నీ ఎవరికీ చెప్పాలి..??
చెపితే వింటాడా .. ??
అన్న ప్రశ్నలు నాకు పట్టవు..
నేను తెలుసుకొవలె..
నా జీవ సంస్కారం అభివృధ్ధి కావలె అన్నదే నా ఆశ..
అంటారు తన గురించి పుట్టపర్తి..
అన్న బాధతో
పక్క వాయిద్యాలపై చేయి వేశాను
ఫి డేలు కొంత గోకి వదిలాను ..
వీణ సాధనమూ చేసాను ..
మృదంగం కొట్టినాను..
అడపా దడపా ..
మేళం పీక కూడా నోట్లో పెట్టుకున్నట్లు జ్ఞాపకం
ఏమైతే యేం..
వచ్చే జన్మలో నైనా
మంచి సంగీతజ్ఞుడు కావలెనని నా ఆశ..
నేను ఊరికే ఉండే సమయం అంటూ ఎప్పుడూ వుండదు..
ఎప్పుడూ పరిశ్రమే నా ఊపిరి..
ఇవన్నీ ఎవరికీ చెప్పాలి..??
చెపితే వింటాడా .. ??
అన్న ప్రశ్నలు నాకు పట్టవు..
నేను తెలుసుకొవలె..
నా జీవ సంస్కారం అభివృధ్ధి కావలె అన్నదే నా ఆశ..
అంటారు తన గురించి పుట్టపర్తి..
నిశ్శబ్ద దృశ్యం
లేబుళ్లు:
చిత్ర కవితలు
2 నవం, 2014
సరస్వతీపుత్రుని పాద్యము,పూవుల మాల లెవరికి బూనుతు ..
లేబుళ్లు:
ఆడియో
,
చిత్ర కవితలు
,
చిత్ర కవితా గీతికలు
,
వీడియోలు
,
సరస్వతీపుత్రుని పాద్యము
నీకు అంత్య దశలో కృష్ణ దర్శనమౌతుంది..
పుట్టపర్తికి కంచి పరమాచార్యతో సాన్నిహిత్యం చాలా లోతైనది..
సంప్రదాయానికి నిర్వచనం స్వామి
యే బంధాలకూ లొంగని పుట్టపర్తి
వీరి కలయికే విచిత్రంగా వుంది కాదూ
నిజమే ..
ఆరోజుల్లోనూ అలానే వుండేది
కంచి స్వామి ఒకప్పుడు పెనుగొండ వెళ్ళారు
అప్పుడు పుట్టపర్తి తొమ్మిదేళ్ళ పసివాడు
ఆ పసివానివంక చూసి
వాని నొసటి గీతలను చదివిన స్వామివారు
వీడు గొప్ప కీర్తిమంతుడౌతాడని చెప్పారు
తరువాత తల్లి వియోగం లో మసలే పుట్టపర్తికి కుటుంబమ్నుంచీ నిరాదరణ.. కుంగదీసింది..
రెండవపెళ్ళి చేసుకున్న తండ్రి..
ఆమెకు పిల్లలు
మరలిన తండ్రి దృష్టి
పుట్టపర్తిని తీవ్ర నిరాశకు గురిచేశాయి
తిరుపతిలో విద్వాన్ చదువుతున్నరోజుల్లో
కంచి స్వామి తిరిగి మళ్ళీ పుట్టపర్తి ని పలకరించారు
పుట్టపర్తి చదివే
సంస్కృత విద్యాలయానికి వెళ్ళారు స్వామి
అప్పుడు సంస్కృతంలో అష్టావధానం జరిగింది..
అప్పుడూ పుట్టపర్తి పాండిత్యం స్వామివారిని మురిపించింది..
తర్వాత సీను ప్రొద్దుటూరుకు చేరింది..
అప్పుడు పుట్టపర్తి వివాహితుడు
అక్కడి ఒక పాఠశాలలో పనిచేస్తున్నారు
అక్కడి పండితుల మధ్యా విపరీతమైన పోటీలు
కక్ష్యలు ఘర్షణ వాతావరణం..
ప్రొద్దుటూరుకీ పరమాచార్య విచ్చేశారు
స్వామివారికి ఆహ్వానం పలకడానికి ఎవరు అర్హులు..??
అందరూ వెనుకంజ వేశారు..
పుట్టపర్తి పొలిమేరలనుంచీ సంస్కృతంలో బ్రహ్మండమైన శ్లోకాలతో
స్వామివారిని ఆహ్వానించి కన్యకాపరమేశ్వరీ ఆలయానికి తీసుకురావటం జరిగింది..
అక్కడ కొద్ది రోజులు స్వామి బస చేశారు..
మన తెలుగు పండితులకు
అరకొరాసంస్కృతమే తప్ప
అన్య భాషా పరిచయమే లేకపాయె
కానీ నిజమైన శక్తి గలవారిని కిందకి లాగటం లోనూ
కుయుక్తులను ప్రదర్శించి తరిమేయడంలోనూ పాండిత్యమెక్కువ..
తమిళ సాహిత్యమూ
భక్తుల సాన్నిహిత్యమూ గల పుట్టపర్తి స్వఛ్చత స్వామిని తిరిగి దగ్గర చేసింది..
అప్పుడు పుట్టపర్తి అక్షర లక్షల గాయత్రి
కొన్ని కోట్ల అష్టాక్షరీ చేసి వున్నారు..
అంతే కాదు..
ఇంకో ముఖ్య విషయం
అందరూ స్వామివారి ముందు సాగిల పడేవారు
కోర్కెలు విన్నవించే వారు..
తాము చాలా సంప్రదాయబధ్ధులమని ప్రదర్శనకు దిగేవారు ఎక్కువ
కానీ
నేనిన్ని కోట్ల సాధన చేసాను నాకు ఎందుకు
ఏ ఆధ్యాత్మిక అనుభూతి కలుగలేదు..
అని పదే పదే అడిగే శిష్యులు ఎవరుంటారు..
నాకు కృష్ణ దర్శనమెప్పుడవుతుందని సర్వమూ ఒడ్డి హిమాలయాలకు పరిగెత్తే వారు ఎవరుంటారు..
అందుకే ప్రతిష్టాత్మక కంచి పీఠాధిపతి..
నడిచేదైవమని ప్రపంచమంతా పిలిచిన సన్యాసి..
శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖర పరమాచార్య
పుట్టపర్తికి వాగ్దానం చేసారు..
నీకు అంత్య దశలో కృష్ణ దర్శనమౌతుంది..
అని..
లేబుళ్లు:
చిత్ర కవితలు
,
జీవన చిత్రాలు
,
వ్యాసాలు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు
(
Atom
)












