27 ఏప్రి, 2013

అన్న రారా ...


ఇది పుట్టపర్తి బాల్యంలో  
వారి అమ్మ మురిపెం 
కానీ విషాదం..  
అయిదు సంవ త్స రాలకే 
పుట్టపర్తిఆ ప్రేమను కోల్పోయారు
కానీ .. 
ఆ విషాదాగ్నిలోంచి 
మహా పండితుడు పుట్టపర్తి ఆవిర్భవించాడు 

గంగ


26 ఏప్రి, 2013

ప్రణయానుభూతి







శ్రీనివాస ప్రబంధం




పుట్టపర్తి వారి శ్రీనివాస ప్రబంధం పై 
ఇటీవల రిసెర్చి చేస్తూన్న పద్మావతి గారు శివతాండవంపై ఒక వ్యాసం వ్రాసారు 
సిలికానాంధ్ర నుంచీ ఏదో సావనీర్ కోసం 
కూచిపూడి రామలింగేశ్వర శాస్త్రి గారు 
అడిగారట పంపానని చెప్పారు.

అక్కయ్యకు.., నాకు..
 ఒక కాపీ పంపారు
నేను 'నా బ్లాగు లో వేసుకోవచ్చా ..?'
అంటే తప్పకుండా అంటూ

నేను ఎం ఏ తెలుగు, సంస్కృతం 
జగ్గయ్య పేట  అమ్మణ్ణి కాలేజి లో 
లెక్చరర్ గా పనిచేస్తున్నాను .
రేడియో నాటక సాహిత్యం మీద ఎం ఫిల్ చేసాను

డిగ్రీ లో మేఘదూతం పాఠం చెప్పాను 
అప్పటినుంచీ పుట్టపర్తి వారిపై అభిమానం
వారిపై  రిసెర్చి చేద్దామనుకున్నాను.

శివతాండవం మీద చాలామంది చేసారు 
మీరు సంస్కృతం ఎం ఏ కాబట్టి 
 శ్రీనివాస ప్రబంధం పై చేయండి 
అని నాగపద్మిని గారు సలహా ఇచ్చారు

డా మన్నవ సత్యనారాయణ
నాగార్జున  యూనివర్సిటీ గారి 
అధ్వర్యంలో చేస్తున్నాను.

'అది చాలా గహన మైన పద్య కావ్యం కదా..?'
కానీ 
మీరు దానికి తగిన వ్యక్తి 


'ఇది నా శక్తికి ఒక రకంగా మించిందే 
అంతటి మహాకావ్యమిది..

ఇది చేస్తే  నాకు కూడా ఒక విలువ వస్తుంది 
అని అనుకుంటున్నాను' అని చెప్పారు.



'మీరు చేస్తే మాత్రం..  
ఇది మంచి ప్రయత్నం.. '

'పోతన గారన్నారు చూసారా 
నన్నయాదులు భారతం తెనిగించారు 
ఎందుకో .. 
ఈ భాగవతాన్ని నా అదృష్టం కొద్దీ  వదిలారు అని .. 
అలా నాకీ శ్రీనివాస ప్రబంధంపై 
రిసెర్చి చేసే అవకాశం వచ్చింది.

పుట్టపర్తి వారన్నారు ..

"ఎరిగితి నెంతయో , 
దిశణ కెవ్వరు నుబ్బర వోవ , 
దెసముల్ దిరిగితి , 
మల్లికాసుమ సదృక్షయశంబున , 
నింతయైన నన్నె రుంగనె లేదు ..! 
నేనెవడ .. ? 
నీ భువికేటికి రాక ; 
యంచు న న్నెరుగుటకై 
రచించెద  నహీన వచోగతి 
నాధ కావ్యమున్ ''

అని 
అలా నేను కూడా 
ఆ 'నేను' వెంట పడ్డానండీ 

ముందు నేను ఆధ్యాత్మిక పథం  లో 
పయనించి నా ఆత్మను శ్రీనివాస ప్రబంధ పరిశీలనకు అనువుగా చేసుకుంటున్నాను' 

'మంచిది .. 
ఆ వేదాంత పరమైన  భావనలో  పూర్తిగా 
మునిగి ఆ రాసిన వాడి మానసిక స్తాయికి 
మన మనసూ ఎదగాలి 
అప్పుడే 
ఆ కావ్యాన్ని ముట్టుకునే యోగ్యత మన కొస్తుంది '

 అవునండీ  మంచి  మాట  చె ప్పా రు 



 


23 ఏప్రి, 2013

షాజీ కిది పుట్టపర్తి ముందుమాట




పుట్టపర్తి లఘు కావ్యాలలో 
రెండవది షాజీ..
మొదటి కావ్యం 
పద్నాలుగు ఏళ్ల వయసున వ్రాయగా..
ఈ షాజీ పందొమ్మిదవ ఏట వ్రాసినది..

"పాత్ర చిత్రణ ...
కథా సంవిధాన పటిమ ...
స్పష్టత ..
మొదలైన కావ్య గుణాలు వెలయించడంలో ..
ఆనాటికి పుట్టపర్తికి పరిణతి సిద్ధించి ఉండలేదు 

కాని..
 గురుకుల వాసంలోని క్లిష్టత..
వాళ్ళ కలిగిన అనుభవం..
 బహుగ్రంధ పరిచయం ..
మొదలైన వాని వలన కలిగిన 
బలీయమైన సంస్కారం 
అహమహమికగా ముందుకు దూకుతున్న 
భావావేశ యుత  పదజాలం 
ఆయనను ఊరకుండనీయలేదు.. 

తత్ఫలితమే ..
షాజీ ఖండ కావ్యం ..
 ఇందులో ముగ్గురే ముగ్గురు.. 
షాజీ ..
జహంగీరు ..
నూర్జహాన్ ..

"నడచు చున్నాడు నల్ల జండాల నీడ .. 
సృష్టి సౌందర్య జీవి షాజీ తపస్వి.. "

అన్న మకుటంతో నడచిన 
పది పద్యాలు హృద్యమైనవి 

ఈ కావ్యం ద్వారా 
సహాజ పండితుడు 
తత్త్వవేత్త అయిన పుట్టపర్తి 
లోకానికి ఇచ్చే సందేశం ఒకటే ..

"అది ప్రకృతి సౌందర్యారాధన.. 
దానిని ఆస్వాదించమని.. "
అంటారు గోల్లాపిన్ని శేషాచలం గారు 

"పొదల చాటు పూవుల జూచి మురిసిపొమ్ము 
కోసి తలలోన జేరివెడు  కుమతి గాకు 
కొమలతమ సౌందర్యార్చకుడవు గమ్ము 
సిగ్గుచెడి నాకటంచు  నాసింప బోకు "


పుట్టపర్తి 
తన పద్నాలుగవ ఏట పెనుగొండ లక్ష్మి వ్రాస్తే 
అది తనకే పాఠ్య భాగమైంది 

పందొమ్మిదవ ఏట వ్రాసిన "షాజీ "
తోటి విద్యార్థులు మెచ్చి అచ్చు వేయగా 
వెంటనే ఇంటర్ మీడియట్ కు పాఠ్య గ్రంధమైంది 
వ్రాసిన వాడింకా విద్యార్థియే 

పుట్టపర్తి తనకు తానే ఆశ్చర్య పోతున్నారు చూడండి ..