2 ఏప్రి, 2015

హరియను రెండక్షరములు



నిజానికి నన్ను సత్యాగ్నిని చేసి౦ది 
మా గురువు పుట్టపర్తి నారాయణాచార్యులు. 
 ” అరే తిక్క నాయలా షేక్ హుస్సేన్ పేరుతో ప౦పినావ౦టే ఎడిటర్ చూస్తాడో చూడడో రా. 
సత్యాగ్ని అని ప౦పూ ..
హి౦దూ అనుకొని చూడనన్నా చూస్తాడు. 
ఒగటి గాకు౦టే వొకటన్నా వేస్తాడు”
  అని నాకు సత్యాగ్ని తగిలి౦చాడు. 

కొ౦చె౦ పేరొచ్చిన తర్వాత 
మా గురువు గారు కూడా వు౦డిన సభలో 
ఒక వక్త నన్ను పొగుడుతూ
 సత్యమైన అగ్నిని కథలుగా రాస్తున్న షేక్ హుస్సేన్ అని అ౦టు౦టే , 
మా గురువుగారు అడ్డు తగిలి

 ‘వీని మొగ౦ వీన్లో సత్యమూ లేదూ, అగ్ని లేదూ,
 వీడు రాజకీయనాయకుడైనాడు, 
నేను పెట్టి౦ది సత్యాన్ని అగ్నిగా చెప్పేవాడని కాదు. సత్యాగ్ని అ౦టె 
జఠరాగ్ని, 
జ్ఞానాగ్ని…
అగస్తుడు చెరువుడు నీళ్లనైనా హరి౦చుకున్నట్టు 
వీడు జ్ఞానాన్ని ఎప్పుడూ ఎ౦తైనా హరి౦చుకోవల్లని యీ పేరు పెట్నా’ 
అన్నాడు. 
అ౦దుకే ఆ తత్వాన్ని నేనేప్పుడూ గుర్తు పెట్టుకు౦టా.


 ఇదీ పుట్టపర్తి శిష్యుల వరస..
ఈనెవరో తెలుసా 
షేక్ హుస్సైన్
ముస్లిం
MLCగా చేసిన వాడు.. 

చక్కటి కంఠం .. శివతాండవం శ్రావ్యంగా పాడతాడు 

ఎటువంటి భేషజం లేకుండా తన గురువును 

ఎలా పొగడుతున్నాడో చూడండి..
 

ఈనతో చెప్పి అయ్య ఎందరికో  ఉద్యోగం ఇప్పించారు..
అదేమి విచిత్రమో అయ్య తిట్టినా 

అందరూ అదో ఆశీర్వచనంలాగా తీసుకుంటారు
ప్రేమగా నవ్వుతారు .. 

అపురూపమైన వ్యక్తి లా అయ్యను గౌరవిస్తారు..
 

ఎవ్వరైనా సరే .. 
ఒరే.. ఇక్కడ్రారా..
అని పిలిచి...
ముండా కొడకా ఎక్కడ చచ్చినావురా..
నిన్న పాఠానికెందుకు రాలేదు..
అప్పుడే అంతా వచ్చేసిందనుకున్నావా..

నీకేమొచ్చిందిరా నీ పిండం..
ఇట్లయితే నీవు యేమి నేర్చుకోని చ స్తావురా
అని తిడుతూంటే
 

ముసిముసిగా నవూతూ..
ఒద్దికగా సర్ది  చెబుతూ..
వినయంగా సమాధానాలిస్తూ..
యేం చెప్పను ఎలా చెప్పను..

ప్రొద్దుటూరులో పనిచేసే రోజులలో..
అంటే
పుట్టపర్తి ముఫ్ఫై వయసులో కావచ్చు
యే స్కూలులో పనిచేస్తే ఆ స్కూలు పిల్లలందరూ ఇంట్లోనే.
వాళ్ళలో ఒకడికి వివేకానందుడి పాఠం
ఇంకోడికి ఠాగూర్ పాఠం
ఒకడికోసం తానే పూజలూ జపాలు
మా అమ్మతో కూడా పారా యణలు
అదీ మాఇల్లు..
 

ఆ ఇంట్లో పుట్టినందుకు దేవునికి నేనెంత ఋణపడివున్నానో
కాదు కాదు ఇది నాకు ఎంతో ఉన్నతమైన జన్మ..
అసలు సత్పురుషుల సాంగత్యం కలుగనే కలుగదు..

ఎంతో పుణ్యం ఉంటే తప్ప..
అదీ కూతురుగా పుట్టటం
ముద్దుల కూతురుగా..
 

ఇంకో సౌభాగ్యం చెప్పనా 
ఈ జన్మ విలువ
 గురువు విలువా పూర్తిగా ఎరగటం

25 మార్చి, 2015

పుట్టపర్తి వారి పక్కన కూర్చునే భాగ్యం

సరస్వతీపుత్ర పుట్టపర్తి నారాయణాచార్యులు ఒక సభావేదికమీద 
తన పక్కనే కూర్చొన్న కథా రచయితతో 
”ఏమప్పా! ఇన్నాళ్లుగా కథలు రాస్తున్నావుగదా? 
ఎంత సంపాదించావు?” అని ప్రశ్నిస్తే 
దానికి ఆ కథా రచయిత 
”పుట్టపర్తి వారి పక్కన కూర్చునే భాగ్యం” 
అన్న సమాధానం ఇచ్చినట్లు చదువుతుంటాం. 

ఆ కథా రచయతని ”చిత్తూరు అయ్యవారు” అని కూడా అంటారు. ఎవరాయన

 సమాధానం మధురాంతకం రాజారాం
?http://piratla.blog.com/

రస నిష్ఠ

http://patrika.kinige.com/?p=3758


కనక ప్రసద్ గారికి క్షమాపణలతో తమరి వాక్యాలు ఉపయోగించుకున్నందుకు
మా అయ్య మీకర్థమైనంతగా మాకెప్పుడు అర్థమౌతారో అన్న దిగులుతో..
 http://patrika.kinige.com/?p=3758

24 మార్చి, 2015

He was a legend..


రాళ్ళ సీమ లో ఏముంది

1955 లో రాజమండ్రిలో  
మహాకవి శ్రీ పాద కృష్ణమూర్తి శాస్త్రిగారి దర్శనం కోసం 
వారి ఇంటికి వెళ్ళారు పుట్టపర్తి
శాస్త్రి గారి శిష్యులు కొందరు.. 

రాయల సీమ రాళ్ళ సీమ అని
సంస్కృతి మృగ్యమని కించపరుస్తూ మాట్లాడారు..
 

శ్రీపాద వారు 
అబ్బాయ్ కవిత్వమేమైనా వ్రాశావా.. అన్నారు.
అంతటితో వినయానికి స్వస్తి చెప్పి
మహోధ్ధతితో క్రింది చాటువు చెప్పారు

"హేరాళం బిదె నాదు భాగ్యమని నీ
వెంతెంతో ఘోషింతు, నీ వారినిన్
జూచితిలెమ్ము.. చెప్పకుము
గొప్పల్.. విప్పుగా గౌతమీ
ధారావర్ధిత గోస్తనీ రస
సముద్యత్తుంగ భద్రానదీ
స్వారస్యంబుల ముందు తావక
పయః పానంబు శోభించునా.."


అంటూ ఆశుకవితను వినిపించిన తర్వాత
సంస్కృతంలో మరో రెండు శ్లోకాలు ఆశువుగా చెప్పారు
శ్రీపాద వారి శిష్యులు విస్తు పోయారు
శ్రీపాద కృష్ణమూర్తిగారు జరిగిన దానికి 

విచారం వ్యక్తం చేసి
అత్యంతానందంతో సత్కరించారు పుట్టపర్తి వారిని..