ప్రముఖుల అభిప్రాయాలు
- పుట్టపర్తి వారిలాగ బహుభాషల్లో, బహుశాస్త్రాల్లో పండితులైన వారు, కవిత్వంతో బాటు విమర్శనారంగంలో కూడా అనన్యమైన ప్రతిభ చూపిన వారు నేటితరంలో కనిపించరు. జ్ఞానపీఠం వంటి గౌరవానికి వారు నిజంగా అర్హులు. కానీ అది తెలుగువారి దురదృష్టం వల్ల వారికి లభించలేదు. -భద్రిరాజు కృష్ణమూర్తి
- శివతాండవం విన్నప్పుడు తుంగభద్రాప్రవాహంలో కొట్టుకు పోతున్నట్లనిపించింది. తర్వాత మేఘదూతం చదివాను. ఇది నా దృష్టిలో శివతాండవం కంటే గొప్ప రచన. -రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ
- ఆధునిక సారస్వతమున శివతాండవం వంటి గేయకృతి ఇంకొకటి లేదు. -తల్లావజ్ఝల శివశంకరశాస్త్రి
- కవిత్వాన్నీ, పాండిత్యాన్నీ కలగలిపి ఔపోశన పట్టిన అగస్త్యుడు. -సి. నారాయణ రెడ్డి
- ఎవని పదమ్ములు శివ తాండవ లయాధిరూపమ్ములు
- ఎవని భావమ్ములు సుందర శివాలాస్య రూపమ్ములు
- అతడు పుట్టపర్తి సూరి! అభినవ కవితా మురారి!!
- ...
- పుట్టపర్తి ధిషణకు జైకొట్టగ మనసాయె నాకు.
- కలితీ కనరాని క్షీరకళలు చిలుకు అతని పలుకు
- వెలితి ఎరుగలేని కడలి పొలుపు తెలుపు అతని తలపు
- వ్యవహారాజ్ఞత అంటని వైదిక జాతకుడాతడు
- రక్తికి భక్తికి సేతువు రచియించిన రసికుడతడు!!! -సి. నారాయణ రెడ్డి
కామెంట్‌లు లేవు :
కామెంట్‌ను పోస్ట్ చేయండి