10 జన, 2012

పుట్టపర్తి నారాయణాచార్యులు బిరుదు--పుట్టపర్తి అనూరాధ






బిరుదులలో  రక రకాలు..
ఇతరులు ఇచ్చినవి..
సొంతంగా పెట్టుకున్నవి.
నిజంగా సార్థకమైనవి ..
అషామాషీగా తగిలించుకున్నవి..



 
నిజానికి ప్రతిభా జీవులకు బిరుదులు అఖ్ఖర్లేదు..
ప్రజల అభిమానమే వారికి గొప్ప బిరుదు
కానీ కొందరు కొనుక్కుంటున్నారు..
అడుక్కుంటున్నారు..
బేరసారాలాడుకుంటున్నారు..

అలనాడు..

నన్నయను "ఆదికవి", "వాగనుశాసనుడు" అన్నారు.
శ్రీకృష్ణదేవరాయలును "ఆంధ్రభోజుడు" అన్నారు.
ఆదిభట్ల నారాయణదాసును "హరికధాపితామహుడు" అన్నారు.   





కొన్ని ప్రముఖుల బిరుదులు..చూడండి..
మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ 
జాతిపిత, బాపూజీ, మహాత్మాగాంధీ 
జవహర్‌లాల్ నెహ్రూ... 
చాచాజీ 
సుభాష్ చంద్రబోస్... 
నేతాజీ 
సి. రాజగోపాలాచారి...
 రాజాజీ 
లాల్ బహదూర్ శాస్త్రి.... 
శాస్త్రీజీ 
కందుకూరి వీరేశలింగం పంతులు... 
గద్య తిక్కన
బాలగంగాధర తిలక్... 
లోకమాన్య 
లాలా లజపతిరాయ్... 
పంజాబ్ కేసరి 
రవీంద్రనాథ్ ఠాగూర్... 
గురు దేవుడు
విశ్వకవి వల్లభాయ్ పటేల్... 
సర్దార్, ఉక్కు మనిషి 
సి.ఎన్. అన్నాదురై... 
అన్నా 
శ్రీమతి ఇందిరాగాంధీ... 
ప్రియదర్శిని 
అబ్దుల్ గఫార్ ఖాన్... 
సరిహద్దు గాంధీ
ప్రాంటియర్ గాంధీ ఆండ్రూస్... 
దీనబంధు 
సరోజినీ నాయుడు... 
నైటింగేల్ ఆఫ్ ఇండియా

ఇక రాజకీయ బిరుదులంటారా..


లగడపాటి.. జగడపాటి
ఆంధ్రా జోకర్
రాయపాటి... ఐరన్‌లెగ్‌పాటి
కావూరి... కయ్యాల కోరి
చంద్రబాబు... కంత్రీబాబు, ఆంధ్రాబాబు
మేకపాటి... జగన్ డాగ్
తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి..
డబ్బువరపు గజ్జి రామిరెడ్డి
పయ్యావుల కేశవ్... కయ్యాల కసబ్
దేవినేని ఉమ.. చేవలేని దోమ
సబ్బం హరి... పబ్బం జగన్
ఆనం వివేకా... ఆల్‌లైన్ డ్రింకర్
టీజీ వెంకటేష్... తెలంగాణ విలన్
జగన్.. జగత్ కిలాడీ
జగ్గారెడ్డి... టౌన్ టార్జాన్
శైలజానాథ్.. జలగనాథ్
దానం+ముఖేఫ్.. గోడమీది పిల్లులు





 నన్నయ్య గారు ఆది కవి. వీరు మహా భారతాన్ని తెలుగులో వ్రాయ ప్రారంబించి..
అందులో మొదటి రెండు పర్వాలు పూర్తి చేసి..
తరువాతి పర్వాన్ని(అరణ్య పర్వం) సగం వ్రాసి కీర్తి శేషులు అయ్యారు.
వీరు తెలుగు భాష కు ఒక మార్గాన్ని నిర్దేశించినారు. 
వీరి తరువాత కవులందరూ ఒకసారి కాకపోతే..
ఒక సారి అయినా నన్నయ్య గారి అడుగు జాడలను అనుసరించిన వారే.

నన్నయ్య గారు రాజమహేంద్రవరం లేదా రాజమండ్రి లో వుండి ఈ మహా భారతాన్ని తెలుగులో వ్రాసినారు.
తల్లి గోదావరి ఒడ్డున కూర్చోని..

తన రాజయిన రాజ రాజ నరేంద్ర మహా రాజు గారికి చెప్పినదే ఈ మహా భారతము.
నన్నయ గారు తెలుగు మాట్లాడేవారికి పూజనీయుడు.



శ్రీ కృష్ణదేవ రాయలు (Krishnadevaraya) (పా.1509-1529) అత్యంత ప్రసిద్ధ విజయనగర సామ్రాజ్య చక్రవర్తి.
ఈయన పాలనలో సామ్రాజ్యము అత్యున్నతస్థితికి చేరుకున్నది. 
కృష్ణరాయలను తెలుగు మరియు కన్నడ ప్రజలు భారతదేశాన్ని పాలించిన గొప్ప చక్రవర్తులలో ఒకడిగా అభిమానిస్తారు. 
సాహిత్యములో ఈయన ఆంధ్ర భోజుని గా మరియు కన్నడ రాజ్య రమా రమణ గా కీర్తించబడినాడు. 
యన పాలనను గురించిన సమాచారము పోర్చుగీసు సందర్శకులు డొమింగో పేస్ మరియు న్యూనిజ్‌ ల రచనల వలన తెలుస్తూంది. 



అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు (Ajjada Adibhatla Narayana Dasu) 
ప్రముఖ హరికథా కళాకారుడు.., 
సంస్కృతాంధ్రాలలో ..
అనేక రచనలు చేసిన రచయిత.., 
కవి.., బహుభాషా కోవిదుడు.., తాత్వికుడు... 
తెలుగునాటనే కాక ..
ఇతర రాష్ట్రాలలో కూడా ..
హరికథా ప్రదర్శనలిచ్చి.., 
ప్రజల మన్ననలను పొందిన కళాకారుడాయన. 
"శ్రీమత్" మరియు "అజ్జాడ" పదాలు కలిపి "శ్రీమదజ్జాడ నారాయణ దాసు" గురువునకు వందనములు చెప్పడం హరికథారంభంలో ఇప్పటికీ కళాకారులు పాటిస్తున్న సంప్రదాయం.


పేదరికం కారణంగా చిన్నతనంలో బడికి వెళ్ళలేకపోయినా.., 
పద్యాలు, శ్లోకాలు విని, కంఠతా పట్టి తిరిగి వల్లించేవాడు.
కేవలం ఐదేళ్ళ చిరు ప్రాయంలోనే.., 
భాగవతం లోని పద్యాలు ఎన్నో చెప్పేవాడట. 
ఒకసారి వారి అమ్మగారు పిల్లవాడిని ఏదో పుణ్యక్షేత్రానికి తీసుకువెళ్ళిందట. 

అక్కడ పుస్తకాల కొట్టులో..,
భాగవతం చూసి ..(బాల దాసు)
అది కావాలి ..
అని మారాం చేస్తుంటే.., 
ఆ కొట్టు యజమాని.. 
భాగవతం నీకేమి అర్థమవుతుంది..?
అన్నాడట.
అంతే ..
ఆ కుర్రవాడు ఆపకుండా భాగవతం లోని పద్యాలు గడగడా చెప్పేశాడట.

అది చూసి, ఆ కొట్టు యజమాని ఆనందంగా ..
పిల్లవానికి ఆ పుస్తకం తో పాటు.., 
కొంత దక్షిణ కూడ ఇచ్చి పంపించాడుట.

ఇది ఇలా ఉండగా, 
ఒకసారి..
దాసు వాళ్ళ తాతగారింటికి వెళ్ళడం జరిగింది.
అక్కడ అరుగు మీద కూర్చుని ..
రాగయుక్తంగా పద్యాలు పాడుతూ ఉంటే.., 

అది చూసి వాళ్ళ తాతగారు ముచ్చటపడి..,
తన దగ్గరే ఉంచుకుని సంగీతం నేర్పుతానని ..
వాళ్ళ అమ్మగారికి చెప్పాడట. 

దాంతో అప్పటిదాకా.. 
ఎటో సాగుతున్న నావకి చుక్కాని దొరికినట్లైంది. 

ఒకప్రక్క సంగీత సాధన.., 
ఇంకో ప్రక్క విద్యాభ్యాసం..
ఇలా రెంటినీ ..అతను ఎంతో నేర్పుగా 
సంబాళించగలిగాడు చిన్నవయసులోనే.

తన 14 వ ఏట ఒకటవ తరగతిలో చేరాడు.

ఇలా కొంతమంది మహానుభావుల బిరుదులు వారిని పొంది.. 
అవి సార్థకమయ్యాయి..

ఇలాంటి అనుభవాలు పుట్టపర్తి వారి జీవితంలో కోకొల్లలు..





ఎవరు బిరుదులిచ్చినా పెట్టుకొనే అలవాటు నాకు లేదు..
చాలా మంది బిరుదులిచ్చారు నాకు .. 
అభినవ కాళిదాసన్నారు..
ఇంకొకడు..అభినవ నాచన సోముడన్నాడు..
ఆ గద్వాలలో ..
చాలా చిన్నవయసులోనే ..
అభినవ పోతన్న అన్నాడొకడు..


ఒక రూపాయిస్తే అబధ్ధం చెబుతాను నేను..
ఇటువంటి వాణ్ణి..
అభినవ పోతన అని ఎందుకంటావు ..?
అని నమస్కారం పెట్టి వచ్చినాను..


తరువాత ..
బాపట్లలో నాకు కవి సార్వభౌమ బిరుదు ఇచ్చినారు..
వెనక్కే ఇచ్చేసినాను నేను..


అయ్యా నేను బీదవాణ్ణి ..
నాకు డబ్బులేక మీ ఊరికొచ్చినాను..
వెయ్యి రూపాలిచ్చినారు..
ఇంకో నూటపదహార్లు కలిపి ఇవ్వండి..
సంతోషపడతాను..
ఈ కవి సార్వభౌమ బిరుదు మీరే వెనక్కి తీసుకోండి..
అని వచ్చేసినాను ..
సాధారణంగా ఎక్కడ బిరుదులిచ్చినా ఒప్పుకునే మనస్తత్వం నాకు లేదు..
నాకెందుకయ్యా కొత్త బిరుదు..?
నేను పుట్టపర్తి నారాయణా చార్యులంతే..
నేను అభినవ కాళిదాసూ కాదు.. ఎవడూ కాదు..

కొందరి విషయంలో అయితే..
ఇచ్చే బిరుదు యొక్క అర్థం ..విలువా..
ఇచ్చే వానికీ తెలియదూ.. 
పుచ్చుకొనే వానికీ తెలియదూ..
ఇదీ పుట్టపర్తి వారి వరస..

ఒకప్పుడైతే వాడో.. వీడో ..
కాస్త సభలో నిలబడగలిగిన వానికి .. 
కాస్త ధాటీ గా వుండే బిరుదును అప్పజెప్పి సంతోషపడేవారు..
 
కానీ ఇప్పుడో..
మనకూ ఓ బిరుదు వుంటే పేరుకు మరింత హుందాతనం వస్తుందనుకున్నప్పుడు..
బిరుదుల బజార్లో కెళ్ళి చక్కటి బిరుదూ.. 
గ్యారంటీ ..వారంటీ ..
చూసుకుని కొని తెచ్చేసుకోవటమే..

 

కామెంట్‌లు లేవు :

కామెంట్‌ను పోస్ట్ చేయండి