19 ఫిబ్ర, 2012

పుట్టపర్తి నారాయణాచార్యుల గాంధీజీ మహా ప్రస్థానం..


ఉన్నప్పుడు ప్రపంచం పలుకరించదు..
పోయినాక ..
ఆ పాద ముద్రలకు గుళ్ళు కడుతుంది..
ఇదే ప్రపంచ రీతి ....
అని నిర్వేదంలో మునిగి పోతారు అయ్య..

నా బాల్యంలో..
గాంధీజీ పెనుగొండ్ వచ్చారు...
షాకత్ అలీ ..
మహమ్మద్ అలీ వచ్చారు..
కొందరు పిల్లలతో నేనా సభకు వెళ్ళాను.పోలీసులు కొందరిపై లాఠీ ఛార్జ్ చేసారు.
భయపడ్డాను.

నా బంధువులొకరు సత్యాగ్రహం చేసి 
ఆస్పత్రిలో చేరారు. 
తర్వాత పొలమిచ్చారు.
గాంధీజీ ప్రసంగాలు హిందూ పత్రికలో చదివి..
ఆవేశ పడే వాళ్ళం.


ఒక సామాన్యునిగా ..
గాంధీజీ మరణాన్ని  జీర్ణం చేసుకోలేని..
మహమ్మద్ అలీ
వివశత ..వేదన ..
 
ఆ వార్త రేడియో లో విని..
అయ్య నేలపై పడి ..పొర్లిపోయి..
 విలపించారట అయ్య..
 
ఆయన జీవించి వున్నప్పుడు ..
పలుకరించక పోయిన లోకంపై..
 ఘౄణాత్మక మైన భావంతో..
"గాంధీజీ మహాప్రస్థానం" వ్రాసాను అన్నారు 
అయ్య

శిలలకు పూజలు చేసిన దేశమిది ..
చెట్లకు చుట్లు చుట్టిన మనుషులము మేము..
వేద పురాణేతిహాసములు..
మా సొత్తని పొంగిపోయాము..
చివరికి చేసినదేమిటి ..??
నీ వంటి మహాత్ముని పొట్టన బెట్టుకొన్నాము.. 

ఇవే కాక వీరేశలింగం పంతులు..
బాల గంగాధర తిలక్
విజయాంధ్రులు
వంటి వచన రచనలు తనదైన  జాతీయ స్ఫూర్తిని సరళ వ్యాఖ్యలతో చేసారు.
 
అయ్య ఏమంటారంటే..
ఈ అనేక భాషా ప్రభావాల వలన ..
రచనలో నేను పడ్డ బాధలు కొన్నున్నాయ్..

వళ్ళత్తోళ్
నేను ఏది వ్రాసినా ..
అంతకంటే బాగుండేది ఏదో..
 మనసులో మెదులుతుంది.
మళయాళంలో..
వళ్ళత్తోళ్ మహాకవి..
గాంధీజీని "ఏండ్రెగురునాధన్ "  అనే ఓ ఖండిక వ్రాసారు. 

అలాంటి ఒకదాన్ని ..
నా జీవితంలో వ్రాయలేక పోయానే..
అనుకుంటూ వుంటాను అని

పొద్దుటూరు చేరిన తరువాత ..
నేను జానపద శైలిలో..
 కాంగ్రెస్ చరిత్ర ఇరవై నోటు బుక్కుల నిండా రాసాను. 
కొన్ని చోట్ల రీడింగ్ ఇచ్చాను. 
షాకత్ అలీ ..
ముఖ్యంగా డయ్యర్ సేనాని దురాగతాలు. 
ఆ బుక్కులు అనంతపురం కాంగ్రెస్ ఆఫీస్ లో వుండేవి. వ్యక్తిగత ద్వేషాలు ఎక్కువగా వుండినందున..
అది బయటికి రాలేదు. 
నేను పట్టాభి గారిని అనుకరించి రాసాను. 

కల్లూరు సుబ్బారావ్ గారు..
 ప్రింట్ చేయిస్తామన్నారు...
1942 తర్వాత కాంగ్రెస్ కలుషితమైంది. 

తరువాత ఆ వ్రాత ప్రతులను చించేసాను. 
నా చేతులారా చించేసినవి..
 కాంగ్రెస్ చరిత్ర..
 అస్త సామ్రాజ్యం..
 హిందు ముస్లిం గలాటా ఇష్టం లేక..
 నేనే చించేసాను.
 
ప్రాజ్యములైన సంపదలు.. 
పర్వులు వెట్టిన చోటు లోక సం
పూజ్యములైన ధర్మ రణముల్ 
చెలరేగిన గడ్డ సాహితీ
రాజ్యములేలుకొన్న కవి రాజులు మెట్టిన భూమి; అస్త సా
మ్రాజ్యము దానికై కనుల రాల్తు నఖంపచ భాష్ప పూరముల్...
కాయము కాయమానమున 
కమ్మని కీర్తి కరాల మాలికా
క్షాయిక రక్తముల్ గడిగి 
చీకటి చిట్లిన తళ్ళి కోటలో
దాయల గెల్చి, భాగ్యముల్ గ్రావగ బూని
 అభాగ్యదష్టుడై పోయిన ,
 రామరాజు మన పూర్యుడు 
కోష్ణములా కథాంశమున్..

ఇలాంటి వ్యక్తీ కరణలున్న కావ్యం ..
అస్త సామ్రాజ్యం..
 జాతీయ ప్రేరణతో చాలా రచనలే చేసాను.
 
సాహిత్య ప్రభ ఆంధ్ర ప్రభ దినపత్రిక 16.12.1977


 

2 కామెంట్‌లు :

  1. ఏల్చూరి మురళీ ధర రావ్ గారికి ,
    నేను పుట్టపర్తి అనూరాధను నమస్కరిస్తున్నాను.
    పుట్టపర్తి సాహిత్యానికిది అక్షర నివాళి ని నేను నిర్వహిస్తున్నాను.
    అక్కయ్య నాగపద్మిని కి మీ అభినందనలు అందజేస్తాను.
    పొద్దు లోని నా వ్యాసం నచ్చినందుకు కృతజ్ఞతలు.
    అయ్య ఎడబాటును భరించలేక అయ్య స్మృతులను జ్ఞాపకం మళ్ళీ మళ్ళీ తెచ్చుకొనేందుకే ఈ ప్రయత్నం .
    మీరు అక్కయ్యతో ఉన్నట్లు గానే నాతోనూ మీ పరిచయ భాగ్యాన్నీ అవసరమైన సూచనలనూ అందిస్తారని ఆశిస్తూ..
    వుంటాను..
    పుట్టపర్తి అనూరాధ.

    రిప్లయితొలగించండి