13 మే, 2012

A K ఖాన్ పుట్టపర్తి వారి శిష్యుడే ..పుట్టపర్తి అనూరాధ.



ఇది 1960 నాటి సంగతి ..
కడపలోని ..
శ్రీరామకృష్ణ హయ్యర్ సెకండరీ స్కూల్లో ..
ఎనిమిదో తరగతి చదువుతున్నా..
పుట్టపర్తి నారాయణాచార్యులు ..
తెలుగు టీచర్ ..
నాకు తెలుగులో ..
మంచి ప్రవేశం ఉందని గుర్తించారు..

పద్యాలు సైతం రాయగలవు ..అంటూ వెన్ను తట్టారు.. 
నేను రాసిన ..
చిన్న చిన్న పద్యాలను..
యతి.. ప్రాస ..చందస్సు బధ్ధంగా సరిచెసేవారు..
ఆయన తోడ్పాటుతో..
 పదో తరగతి పరీక్షలో..
తెలుగులో ..రాష్ట్రస్థాయిలో..
అత్యధిక మార్కులు సాధించా..
పాఠ్యాంశాలకే పరిమితం కాకుండా 
ఇతిహాసాలు ..
పురాణాలు ..
సాహిత్యం ..
ఇతర విషయాలపై ఆసక్తి పెంచుకున్నా..
భారతం.. భాగవతం..తో పాటూ 
రాజశేఖర చరిత్ర ..
వంటి గ్రంధాలను ఆకళింపుచేసుకొన్నా..

 ఆయన స్ఫూర్తితో ..
ప్రస్తుతం ..
పోలీసు పత్రిక "సురక్ష"కు ..
ఎడిటర్ గా  కొనసాగుతూ ..
సంపాదకీయం.. ఆణిముత్యాలు ..
విభాగాన్ని స్వయంగా రాయగలుగుతున్నా..
కర్నూలు రేంజ్ DIG గా పనిచేస్తున్నప్పుడు..
మా గురువుగారి జ్ఞాపకార్థం..
 ప్రొద్దుటూరులో ..
ఆయన విగ్రహాన్ని ఏర్పాటుచేసాను..!!
 

నగర పోలీస్ కమీషనర్
A.K. ఖాన్
సాక్షి దినపత్రిక సెప్టెంబర్ 5,2010

కామెంట్‌లు లేవు :

కామెంట్‌ను పోస్ట్ చేయండి