19 మే, 2012



రామ కృష్ణ పరమ హంసని ఒకసారి..
వివేకానందుడు అడిగాడు..
మాంస నేత్రములతో ..
చూడటానికి కనబడతాడా.. 
ఈశ్వరుడు..??

నేను నిన్నెలా చూస్తున్నానో..
నీవు నన్నెలా చూస్తున్నావో..
అలా నీవు ఈశ్వరుడిని చూడగలవు..
పరమ హంస చేసిన 

హస్త మస్తక సం యోగం చేత.. 
వివేకానందుడు ఆ స్థితిని చేరుకోగలిగాడు..

కానీ..
వివేకానందుడు తట్టుకోలేక పోయాడు ..
ఆ శక్తి పాతాన్ని..

పరమ హంస ఒక ఉదాహరణ చెప్పారు..
ఒక మనిషిని ..
నీటి ఒడ్డుకు తీసుకు పోయి..
మెడ పై చేయి వేసి 
ముఖాన్ని నీటిలోకి బలవంతంగా అదిమి పడితే..
ముక్కుద్వారాగానీ నోటిద్వారా గానీ 
ప్రాణవాయువందక
ఊపిరి తీసుకోవటం సాధ్యపడక 
ఆవ్యక్తి ఎలా గాలికోసం పరితపించి పోతాడో..

భగవద్దర్శనానికి ..
సాకారంగా చూడటానికి నీవలా పరితపిస్తే..
భగవంతుడు ప్రత్యక్షమవడానికీ..
నీలోనే నీతోనే నీ పక్కనే సిధ్ధంగా ఉన్నాడు..!!



నిండు పున్నమి..
పండు వెన్నెల..
ఓం ఐం హ్రీం శ్రీం..
ఓం ఐం హ్రీం శ్రీం.
అది అర్థరాత్రి సమయం
ఒక చెరువు..
లోంచీ వస్తొందా శబ్ద శక్తి..
మొల లోతు నీటిలో చేతులు మోడ్చి..
ఆకాశంవేపు తదేకంగా చూస్తూ..
లలితా సహస్త్ర నామాన్ని జపిస్తున్నారిద్దరు..
 
ఒకరు పుట్టపర్తి ..
మరొకరు..??
అమ్మవారిని చేతనైతే చూపించమని 
సవాలు విసిరిన వాడు..
 
నేను అమ్మవారిని చూపించగలను..
నీవు తట్టుకొని నిలబడగలవా ..
పుట్టపర్తి  సూటి ప్రశ్న..
పుట్టపర్తి బహు మొండి వాడు..
మొండి వాడయి..
లండన్ మార్టన్ డిక్షనరీని మొత్తం బైహార్ట్ కొట్టాడు..
ఎందుకో తెలుసా..
ఎవరో నీకు ఇంగ్లీషు రాదన్నందుకు..
అదీ ..
ఇరవై యేళ్ళ లోపు వయసులో..
 
ఆ తరువాత ..
సంస్కృత విధ్యార్థి అయినా..
షెల్లీని ఆరాధించాడు..
మిల్టన్ షేక్స్ఫియర్ లను ..
అర్థం చేసుకోవటం కాదు..
ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలకాలని ..
రాక్షసంగా శ్రమించిన ఘన కీర్తి గలవాడు.. 
సరే..
నన్నాడు రెండవవాడు..
అతనికి పుట్టపర్తి మొండి ధైర్యం జూసి..
గుండెలు జారిపోయే వుంటాయ్..
 
రా..
మరయితే ..
చెరువులోకి ..
మొలలోతు నీటిలో నిలబడి ..
లలితా సహస్రాన్ని..
నూటా ఎనిమిది సార్లు నాతో చేయ్ ..
 
అమ్మవారొస్తుంది..తప్పక..
ఆ తరువాత పారిపోతానంటే కుదరదు..
అసలు ..
అతని లోతైన కన్నుల లోకి ..
సూటిగా చూసే ధైర్యం ఎవరికుంది..
పైగా సవాలు చేయటం కూడానా..
 
ఇంతలో..
ఆకాశం మబ్బులు కమ్మింది..
కీచురాళ్ళు అరుస్తున్న..
అర్థరాత్రి సమయంలో..
ఆ చలిలో..
అమ్మ వారిని చూడాలని..
చెరువులో మొలలోతు నీటిలో మునిగి..
లలితను చేయాలంటే ..
ఎంత గుండె ధైర్యం కావాలి..??
 
ఆకాశాన్ని తీక్ష్ణంగా చూస్తున్న..
పుట్టపర్తి చూపులో మార్పులేదు..
ఇంతలో ఆకాశం ఫెళ్ళుమంది..
అది కన్నార్పకుండా చూసిన ..
పుట్టపర్తి పెదవులపై ..
సంతృప్తితో కూడిన చిరునవ్వు..
పక్కవాడు..
కంటి చూపు కోల్పోయాడు..
అజ్ఞానమే  చూపును ..








కామెంట్‌లు లేవు :

కామెంట్‌ను పోస్ట్ చేయండి