11 జూన్, 2012

ఉషశ్రీ ప్రవచనాలు - పుట్టపర్తి అనూరాధ



ఉషశ్రీ..
1973 లో రేడియోలో 
భారత ప్రవచనం ప్రారంభించారు
అప్పట్లో దూరదర్శన్ లేదు. 
ఉషశ్రీ పురాణ ప్రవచనాలు 
వారానికి ఒకసారి ..
ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు వచ్చేది. 
శ్రోతలు రేడియోల ముందు మూగేవారు. 
ఆ అరగంటసేపు ..
బయట ప్రపంచాన్ని మరచి ..
ఆ పురాణ గాధలలో మునిగి తేలేవారట.

ఈ విధంగా ప్రఖ్యాతి గాంచిన 
రేడియో వ్యాఖ్యాత 
మరియు సాహిత్య రచయిత 
ఉషశ్రీ గారు 
తన రామాయణ ..భారత ..
ప్రవచనాల ద్వారా 
తెలుగునాట అందరికీ సుపరిచితులు. 

ఆప్పట్లో ..
ఆయన గొంతుని, 
మాట సరళిని గుర్తు పట్టలేని ..
తెలుగు శ్రోత లేరంటె ..
అది అతిశయోక్తి కాబోదు.

 ఒకసారి ఏలూరులో ..
లక్ష్మణ యతీంద్రులవారు ..
(పెదమూత్తవే ఆశ్రమ పీఠాధిపతి) 
ఆదివారం మధ్యాన్నం ..
ఎక్కడికో వెళ్ళవలసి వచ్చింది. 
ఓ రిక్షా వాడిని పిలిచారట . 
అందుకు ఆ రిక్షా వాడు 
ఇప్పుడు టైమెంతయ్యింది సారూ..
అని అడిగాడట. 
బదులుగా పన్నెండయ్యిందని చెప్పారట. 
అయితే.. నేనురాను..
ఇప్పుడు పురాణం శాస్తుర్లు గోరు ..
బాగోతం కత సెప్తారు పూర్తయ్యాకే వత్తా.. 
అని రిక్షా సీట్ కిందినుంచీ ..
చిన్న ట్రాన్ సిస్టెర్ ఒకటి తీసాడట. 
అప్పట్లో 
ఆదివారం మధ్యాన్నం పన్నెండు గంటలు అయ్యిందంటే రోడ్లన్నీ కర్ఫ్యూయే.
ఏ ఇంట్లో చూసినా భాగవత కథ వినిపించేది.

శ్రీ గురుభ్యోన్నమః అని మొదలు పెట్టి 
శ్రోతలు అడిగే ప్రశ్నలకు చమత్కారంగా సమాధానాలిస్తూ..
 రేడియో కార్యక్రమాలలో కొత్త ఒరవడిని 
తీసుకు వచ్చారు ఉషశ్రీ 
ఈ ధర్మ సందేహాల కార్యక్రమం 
పండిత పామరులను సైతం విపరీతంగా ఆకర్షించేది. 
ధర్మ సందేహాల కార్యక్రమాన్ని 
ఉషశ్రీ లైవ్ గా నిర్వహించేవారు. 
సరిగ్గా  కాగానే ఎ.బి. ఆనంద్ శ్రీ గురుభ్యో న్నమః అని ప్రారంభించగానే 
ఉషశ్రీ తనదైన విరుపులతో 
సమస్త సన్మంగళాని భవంతు 
అని ప్రారంభించి 
నాయనా ఒకసారి వ్యాసభగవానుని స్మరించు 
అనగానే మల్లిక్ నారాయణం నమస్కృత్య 
అని శ్లోకం చదివే వారు. 
ఈ కార్యక్రమాన్ని శ్రధ్ధగా వినే 
పుట్టపర్తి నారాయణాచార్యులవారు 
లేఖ వ్రాయడంతో 
అంతవరకు 
స్క్రిప్త్ లేకుండా ఆశువుగా భారతం చెప్పిన ఉషశ్రీ జాగ్రత్త వహించడం మంచిదని
 స్క్రిప్ట్ పెట్టుకుని కథ చెప్పడం ప్రారంభించారట.
  


కామెంట్‌లు లేవు :

కామెంట్‌ను పోస్ట్ చేయండి