3 జూన్, 2012

అమ్మ సన్నిధిలో అయ్య శివతాండవ గానం..పుట్టపర్తి అనూరాధ.


ఒక బ్రాహ్మడు ఉండే వాడు..
బిక్షాటన చేసి జీవిస్తూ..
భగవద్గీతను అధ్యయనం చేస్తూ బ్రతికేవాడు.
ఒకరోజు..
అనన్యాశ్చింతయంతోమాం అన్న శ్లోకాన్ని చదివి..
అన్ని చింతలూ వదిలి నా ధ్యానం చేస్తే..
నేను వారి బాధ్యత వహిస్తాను..
అన్న శ్లోకం చదివాడు..
అన్ని కోట్లమందిని భగవంతుడు ఎలా చూడగలడు..?
అని ఆ శ్లోకాన్ని ఎర్ర సిరాతో కొట్టి వేసాడు..
మరుసటి రోజు ..
ఎవ్వరూ బిక్ష ఇవ్వలేదు..
ఆ బ్రాహ్మడు..
పరమాత్మా ఏంచేసేది..?
ఈ రోజు ఎవ్వరూ బిక్ష ఇవ్వలేదు..
ఏమి నీ లీలయ్యా ..?
నీ భక్తుని ఈ విధంగా పరీక్షిస్తున్నావూ..?
ఇంతమంది తల్లులున్న ఈ జగతిలో
 నాకు ఇంత బిక్ష వేయడానికి..
 ఒక తల్లికి కూడా మనసు పుట్టలేదా..?
అని బాధ పడుతున్నాడు.
ఒక బాలుడు..
మోయలేనన్ని సరుకులు తెచ్చి 
ఆ ఇంటి తలుపు తట్టాడు..
ఒక స్త్రీ వచ్చి తలుపు తీసింది..
నేను మీ ఆయన శిష్యుడిని..
నాకు తెలియని శిష్యులెవరూ అందామె..
మోయలేని బరువు నా వీపుపై పెట్టాడు 
చూడమ్మా ఆయన అన్నాడు..
బరువును ఇంట్లో దించుతూ..
పైగా త్వరగా నడవలేదని బెత్తంతో వడ్డింపులొకటీ.. అన్నాడు..
పాపం..
కూర్చో ..
నీవు తెచ్చిన పదార్థాలతో వండి పెడటాను
అందామె జాలిగా..
ఆమెకు భర్తపై క్షణకాలం కోపం వచ్చింది..
అంత చిన్నపిల్లవాడిని శిక్షించినందుకు
అంతలోనే సరుకులు వచ్చాయన్న ..
ఆనందమూ కలిగింది..
ఆ బ్రాహ్మడు..
ఆమె భర్త..
 నిరాశగా వచ్చాడు..
బిక్ష దొరకలేదన్న బాధ..
అతనిని అంత కఠినంగా శిక్షించారెందుకూ..?
అని అడిగిందామె
నేనా ..
ఎవరిని శిక్షించాను..?
బిక్ష దొరకక నేను దిగులు పడుతుంటే ..
అదే మీ శిష్యుడిని ..
అంత పసివాడు మీకు శిష్యుడెప్పుడయ్యాడు..
అతనితో సరుకులు పంపారు బాగానే వుంది..
త్వరగా నడవమని బెత్తం తో కొట్టారుట..
ఏ శిష్యుడే వాడూ..
సరుకులు తెచ్చాడా..
నేనెవరిని పంపానూ..
పిలుస్తానుండండి..బయటేగా వున్నాడూ.
అని ఆ అబ్బాయిని పిలవటానికెళ్ళింది..
చిత్రం
అక్కడ ఎవరూ లేరు..
అయోమయంగా లోనికి వచ్చింది
సరుకులు అలానే వున్నాయ్..
నాలగైదు శ్లోకాలు అధ్యయనం చేస్తే మనశ్శాంతి గా వుంటుందని పుస్తకం తెరిచాడా బ్రాహ్మడు..
ఇంకా చిత్రం..
అతను శ్లోకాలను కొట్టివేసిన 
రెడ్ ఇంక్ మార్క్ లేదు..
పరుగు.. పరుగున ..భార్య వద్దకు వెళ్ళి..
నీవు ఎంత అదృష్ట వంతురాలివే ..
భగవంతుని దర్శనం చేసావు..
సరుకులు తెచ్చిన వాడు దేవ దేవుడేనే..
నాకు విశ్వాసం లేని దానివలన ..
దర్శనం కలుగలేదు..
అంటూ వెక్కి వెక్కి ఏడ్చాడు..
 
నిజంగా భగవద్దర్శనం జరుగుతుందా..?
సాధన చేసినపుడు..
గురుకృప లభించి నప్పుడు..
భగవంతుని దర్శనం తప్పక కలుగుతుంది..
 రాయి ఎలా నడుస్తుంది..?
అది నా సందేహం.
నీ శరీరం ఎలా నడుస్తుంది ..?
అదీ జడమే కదా..!!
సిధ్ధ సాధకుని గుణముల వలన ..
మన్ను పాషాణములలో కూడా 
ఆత్మ చైతన్యములు సంచరిస్థాయి.
అది గురువుల జవాబు..
మీరు గమనించే ఉంటారు, 
మీరెంత ఆత్మ విశ్వాసంతో పనిచేసినా, 
కొన్ని సార్లు ఆ పని మీరనుకున్నట్లుగా కాదు. 
అటువంటప్పుడు, 
మీ గురించి మీకు అనుమానం కలిగి, 
అసహాయులయి, సహాయం కొరకు, 
మీరు దేవుని వైపు మళ్ళుతారు. 
మీరు పూర్తి విశ్వాసంతో మీ పనిని, 
మిమ్మల్ని దేవుని వద్ద ఉంచుతారు. 
కాని, వేచి చూసినా, ఏమీ కాదు. 
అప్పుడు మళ్ళీ ఆ పనులను మీ చేతుల్లోకి తీసుకంటారు. 
ఈ మొత్తం చక్ర భ్రమణాన్ని, 
సవ్యంగా ఎందుకు అర్థం చేసుకోరు? 
మీలో ఉన్న అంతరాత్మ మరియు భగవంతుడు 
ఒకే సూత్రానికి సంభందించిన రెండు ధ్రువాలని!!
-అమ్మ

 



















అది 1975 అనుకుంటా..
రామకృష్ణా హై స్కూల్ కరస్పాండెంట్ రంగనాధం..
ఇంట్లో జిల్లెళ్ళ మూడి అమ్మ దిగింది..
మేము వెళ్ళి దర్శించుకున్నాం..
అమ్మ ఆశ్చర్యంగా..  
పుట్టపర్తి నారాయణాచార్యుల ఇంటికి వెళ్ళాలి
అన్నారట..
రాత్రి పన్నెండింటికి 
అమ్మ కారులో మా ఇంటికి వచ్చింది..
ఆమె వెంట వంది మాగధులూ..
ఆచార్లూ ..
శివ తాండవం చదువు.. 
అంది అమ్మ..
అయ్య శివ పారవశ్యంలో మునిగి పోయారు..
రాత్రంతా ..
మొత్తం..రాత్రంతా ..
అమ్మ మొత్తం శివ తాండవం పూర్తిగా వింది..
అయ్య ..
శివ తాండవం ఆవేశంగా చదివారు..
అమ్మ ఆనందంగా వింది..
రాత్రంతా..

కామెంట్‌లు లేవు :

కామెంట్‌ను పోస్ట్ చేయండి