4 ఆగ, 2012

"మహాభారత విమర్శనము.."


కొండంత దేవునకును బ్రయత్నమున
గొండంత పత్తిరి గూర్పగాగలమొ..!!
యఖిల స్వరూపున కఖిల శక్తికిని..
నఖిలనిదానున కఖిలైకకర్త..
కీ నీకు మా సాయమెంత..??మా శేము
షీ నిపుణతయెంత..!!చేసెడు భక్తి
యెంత..!!సూపెడు శ్రధ్ధ యెంత..! సన్నిష్ట
యెంత..!శక్తియదెంత..!యెంత మా కూర్మి..!
యౌపచారికముగా నడుగుటెగాక..!!
 బాపనివర్తి ..!సద్భావ ప్రపూర్తి..!! 
-పండరీ భాగవతం.





మహాభారతం ..వ్యాసుడు వ్రాసాడు 
గణేశుడు లేఖకుడు.
దీన్ని పంచమవేదమని కూడా అంటారు.
పద్దెనిమిది పర్వాలూ 

లక్ష శ్లోకాలూ కలిగిన అతి పెద్ద కావ్యం.
దీనిని నన్నయ్య తిక్కన్న ఎర్రన్న తెలుగు లోకి అనువదించారు.
 

రామాయణం వ్యక్తిని ..
కుటుంబ పరంగా నిర్దేశించి..
వ్యక్తిత్వ విలువలను బోధిస్తే..
 

మహ భారతం ..
సమాజానికి తగిన వ్యక్తిగా తీర్చి దిద్ది..
ఉత్తమ సాంఘీక జీవితానికి..
మార్గ దర్శకత్వమిస్తుంది..!!
 

యుగ యుగాల..
 భారతీయ సంస్కృతి ఉత్కృష్టతను చూపించేవి ..
ఈ మహేతిహాసాలు ..!!
 

కానీ ..
వీటిని విమర్శనాత్మకంగా..
ఈ విషయాన్ని ఇలా ఎందుకు చెప్పారు..?
దీని వెనుకనున్న అర్థమేమిటీ..?
కొన్ని విషయాలు మనకు తప్పుగా 

ఎందుకు కనిపిస్తున్నాయి..?
 

ఇలా విశ్లేషణలొస్తే ...
చదివే వారికి కలిగే సందేహాలు తీరి ..
చదవటంలో ..
ఉత్సాహమూ.. ఆనందమూ.. కలుగుతాయి.
అలా వచ్చినవీ ..విమర్శనా గ్రంధాలు
 

"భారతం ధర్మాద్వైతం"
డా. మోపిదేవి కృష్ణస్వామి.
"నన్నయ గారి ప్రసన్న కథా కలితార్థయుక్తి "

విశ్వనాథ.
"ఆంధ్ర మహా భారతమూ ద్రౌపది"

డా. వాడవల్లి చక్రపాణిరావు. 
వీటన్నిటిలో ..
భారతాన్ని కొత్త కోణంలో చూపుతూ..
అనేక కఠిన ప్రశ్నలకూ..
కుటిల ప్రశ్నలకూ ..
దీటుగా జవాబిచ్చిన గ్రంధరాజం..
పుట్టపర్తి వారు రచించిన"మహాభారత  విమర్శనము.."


అసలే నేటి మానవుడిని..
రక రకాల ఒత్తిడులు ..
ఊపిరి తిప్పుకోనివ్వకుండా చేస్తున్నాయి..
 

కలుషితమైన రాజకీయ సాంఘీక పరిస్థితులు 
నిరాశకు గురి చేస్తున్నాయి..
సినిమా ..

మానసిక సమతుల్యత దెబ్బతీస్తూ ..
మరింత అధోగతికి మనిషిని నెడుతూంది.
 

చొచ్చుకొస్తున్న విదేశీ సంస్కృతి....
తన వేపు బలంగా లాక్కుంటూ 
తన అస్థిత్వాన్ని సైతం మరచిపోయేలా చేస్తూంది..
 

ఈ పరిస్థితులలో ..
యేవో ఉద్యోగాల చదువులు చదివేసి..
ఘనమైన ఆర్జనల పరుగు పందెంలో  ..

పడిన యువత ..
అత్యంత సహజంగానే..
సంప్రదాయాలన్నీ ..

మూఢనమ్మకాలంటూంది..
దేవుడు అగుపడడు కాబట్టీ ..

బూటకమంటోంది..


ఇలా..
నడచి నడచి..
యేదో ఒక మలుపులో
ఇంతేనా జీవితం..??
యేమిటి దీని ప్రమోజనం..??
దీని గమ్యం యేమిటి ..??

అని తనలోకి తాను చూసుకుని ..
దిక్కుతోచక .
మార్గదర్శకత్వం చేసే పెద్దలు లేక ..
కళ్ళనీళ్ళతో నిలబడ్డరోజున..
కళ్ళు తుడిచి..
భుజంతట్టి..
ధైర్యం చెప్పి..
 
ఇదిరా నీ జాతి..
ఇదిరా దీని గొప్పతనము..
ఈ వారసత్వ సంపద నీ సొత్తు..
ఇప్పటికైనా దీనిని సరిగా వినియోగించుకో ..
అని చెప్పేవి ..
మహర్షులు మనకందించిన
రామాయణ భారత మహేతిహాసాలు.
"వ్యాస భగవానుడు 
మానవుని అసంపూర్ణతను 
అశక్తతను చక్కగ గమనించెను. 
జీవితమున మనుష్యునకు సంభవించు 
విషమ పరిస్తితులను 
లోతుగ నర్థము చేసుకొని 
యట్టి క్లిష్ట పరిస్థితులలో 
మానవుడు జంకక 
ధర్మ నిర్వహణ మొనర్చుకొని 
ముందునకు బోవు మార్గములను సూచించినాడు. "
అని చెపుతూ

రామాయణ మహాభారతాల ఔన్నత్యం 
ఈ విధంగా తెలియజేసారు. 
ఈ రెండు గ్రంధములును భారతీయులకు బ్రాణములవంటివి. 
ఈ రెంటినీ 
భద్రముగ రక్షించుకొనుచున్నంతవరకూ భారతీయుడాధ్యాత్మిక విషయములకై 
ఇతరులను యాచించనవసరములేదు.
అన్నారు పుట్టపర్తి వారు.


మహాభారత విమర్శనం 
యుగయుగాల భారతీయ సంస్కృతిని 
వివరించే విశిష్ట గ్రంధం.


మహాభారతం ....
కురుపాండవుల యుధ్ధగాధ మాత్రమే గాదు..
అది ఆర్యుల ..
తత్వజ్ఞాన ..
ధర్మశాస్త్ర ..
నీతిశాస్త్ర ..
రాజ్జ్యశాస్త్రముల పేటిక ..
వ్యవహార శాస్త్ర ..
కామశాస్త్రముల సమావేశము. 

మన సంస్కృతి యొక్క సర్వస్వము. 
మన జ్ఞానకోశము ..
అంటారు ఆచార్యులవారు.
 ఇందులోని విషయాలు గొప్పవి.
పుట్టపర్తి వారిని గొప్ప చారిత్రకునిగా
విమర్శకునిగా..
విశ్లేషకునిగా....
విశ్వరూపసందర్శనం గావించే ..

ఉత్తమోత్తమ గ్రంధం ఇది.
 

ఇది ..
యుగ యుగాల భారతీయ సంస్కృతిని వివరిస్తుంది.
ఆధునిక ప్రపంచంలోని ..

విప్లవ సిధ్ధాంతాలతో ..
మహా భారతతాత్విక దర్శనాన్ని ..
పోల్చి నిగ్గు తేలుస్తుంది..

 

సంస్కృత భారతం ..
చదవ సామర్థ్యం లేనివారికి..
 మహోపకారం చేసారు..
 ఆచార్యులవారీ గ్రంధాన్ని రచించి..
 

ముఖ్యంగా ..
మహాభారతం ..
కల్పితమనీ..
చారిత్రం కానే కాదనీ వారికి ..
విశ్వసనీయమైన ఉపపత్తులతో ఖండించినారు.. ఆచార్యులవారు.
 

అన్నిటినీ మించి..
హిందూ మతం ఉత్కృష్టతను గూర్చి తెలుసుకోదలచినవారు ..
ఈ గ్రంధాన్ని తప్పక చదవాలి.
 
మానవునికి..
రామాయణ మహాభారతాల ఔన్నత్యం
ఈ విధంగా తెలియజేసారు.

ఈ రెండు గ్రంధములును భారతీయులకు బ్రాణములవంటివి.

ఈ రెంటినీ
భద్రముగ రక్షించుకొనుచున్నంతవరకూ భారతీయుడాధ్యాత్మిక విషయములకై

ఇతరులను యాచించనవసరములేదు.
సమస్త ప్రపంచమునకును
శాంతిభద్రతలను బోధించు శక్తి  ఈ మహాగ్రంధములకున్నది.


ప్రధమంగా..
ఇందులో ..

ఆయన వివరించిన విషయాలు చదివితే ..
ఇంత విజ్ఞానాన్ని ..

అమాయకులమై ..
అయోగ్యులమై నిర్లక్ష్యం చేస్తున్నామే ..
అనే బాధ ప్రతి ఒక్కరికీ కలుగుతుంది.


1965నకు చాలా సంవత్సరాల ముందే ..
ఈ మహాభారత విమర్శనము ..

వ్రాయటము జరిగింది.
 

మూలన పడి పడి...
ఇక ..

దీని భవితవ్యమింతేయని నిర్ణయానికి 
వచ్చే సమయానికి
1965న వెలుగు చూసింది.
ఇదీ
మన దేశంలో
విజ్ఞానులకూ..
వేదాంతులకూ ..
పండితులకూ..
వున్న స్థితి..
 

నలభై సంవత్సరాల కాలం గడిచింది..
దీని ఉనికి చామందికి తెలియదు..
విశ్వవిద్యాలకు పట్టదు..
వ్యాపారాశ్రితమైన ..

పుస్తక ప్రచురణసంస్థలకు గిట్టదు.
 

వెరసి ..
తెలుగు వాడి వివేకం పూజ్యం..
అన్నారు 

అక్కిరాజు రమాపతిరాజు గారు 

          


         పుట్టపర్తివారి మహా భారత విమర్శనము.

డా .అక్కిరాజు రమాపతిరావు
తెలుగు అకడమీ
హైదరాబాదు.
ఈ గ్రంధం చదివితే 
శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు 
ఎంత గొప్ప విద్వాంసులో..
ఎంతటి మహా భావుకులో ..
యుగ యుగాల భారతీయ ..
పరమోజ్జ్వల సంస్కృతి భాష్యకారులో తెలుస్తుంది 

తెలుగులో 
మహా భారతంపై వచ్చిన 
వ్యాఖ్యా గ్రంధాలన్నిటా ఇది ప్రశస్తమైనది. 
ఈ  గ్రంధం ఒక లక్ష ప్రతులుగా ..
తెలుగునాడుని అల్లుకోకపోవటం..
తెలుగువారి అవిమృశ్యకారితకు నిదర్శనము. 

1965 లో ..
ఈ గ్రంధం మొదటిసారి ప్రచురితమైంది. 
సుమారు మూడు దశాబ్దాల కాలం గడిచింది. 

ఈ గ్రంధం పొలకువ గూర్చి 
చాలామందికి తెలియదు. 
విశ్వవిద్యాలయాలకు పట్టదు. 
వ్యాపారాశ్రయైక పుస్తక ప్రచురణ సంస్థలకు గిట్టదు. 
వెరసి తెలుగువాడి వివేకం పూజ్యం.


నేనీ గ్రంధమును రచించి ..
చాలా సంవత్సరములయినది..
అనేకకాల మీ రచన మూలబడి యుండెను. 
ఇది వెలుగు జూచునను నాశ గూడ నాకుండలేదు. 
అని పీఠికలో వారు చెప్పుకున్నారు.

ఇక ..
మలి ముద్రణల గురించి చెప్పాల్సిన పని యేముంది.
ఆచార్యులవారు పీఠికలో అంటున్నారు

"మహా భారతముపై కృషి యొనర్చిన 
మేధావులెందరో గలరు 
వారిలో నొక్కొక్క రొక్కొక్క మహా పర్వతము 
నా వంటి యల్పజ్ఞునకు 
వారితో సామ్యము లేదు. 
చాలావరకు వారి కృషినంతయు 
నేనీ గ్రంధమున వాడుకొన్నాననియే చెప్పవచ్చును.

మహారాష్ట్రులెందరో 
మహా భారతముపై విమర్శనము లొనర్చినారు 
వారిలో ముఖ్యముగ ..
హరిదాసు బాళాశాస్త్రి గారి పేరు 
చెప్పవలసి యున్నది. 
వారి నా ప్రత్యేక కృతజ్ఞత. 

ఈ విధంగా శ్రీ ఆచార్యులవారు 
సంస్కృతం ..ఇంగ్లీషు ..
ఇతర భారతీయ భాషలలో వచ్చిన ..
మహా భారత వ్యాఖ్యానాలు ..విమర్శలూ..
 అన్నీ అవలోకనం చేసి ..
ఈ గ్రంధాన్ని రచించినట్లు తెలియుచున్నది. 

మహా భారత కాలం నాటి 
రాజకీయ సాంఘీక మత నైతిక పరిస్థితులను ప్రతిభావంతముగా 
ఈ గ్రంధములో సమీక్షించారు ఆచార్యులవారు 

హిందూ మతం ఉత్కృష్టతను గూర్చి తెలుసుకోదలచినవారు 
ఈ గ్రంధాన్ని తప్పక చదవాలి. 
భారతీయ సమాజాన్ని అనుశాసించే ఉన్నతాదర్శాలెటువంటివో ..
వారు ఆశించిన జీవిత పరమార్థం ఎటువంటిదో ..
దాని ఉత్థాన పతనావస్థల చరిత్ర ఎటువంటిదో ..
మహా భారతం ఆధారంగా ..
ఈ విమర్శన గ్రంధంలో ..
ఆచార్యులవారు నిరూపించారు.
వారు పలు భారతీయ భాషలలో 
మహా పండితులు కాబట్టి ..
పరమ మనోజ్ఞమైన ..
భావుకతా పరసీమలకు ..
వారు చేరుకోగలిగారు. .
మహాభారతంపై ..
సుప్రసిధ్ధమైన నీలకంఠ దీక్షితులవారి వ్యాఖ్యనుంచీ.. సందర్భానుసారంగా ..
శ్రీ ఆచార్యులవారెన్నో విషయాలను ..
ఈ గ్రంధంలో తెలియజేసారు. .
నాలుగు వందల పుటల ఈ గ్రంధం ..
ఆచార్యులవారి ..
ప్రసన్నధారా మధురమైన శైలికి నిలయం ..
ఆధునిక తెలుగువచన శైలీ నిర్మాతలలో..
ఆచార్యులవారికి చెప్పుకోదగిన స్థానం ఉంది. 
వారి కాకువు ..
వారి అధిక్షేపణ ..
మృదుహాసోజ్జ్వలలైత పదవిన్యాస శైలి 
ఈ గ్రంధంలో హృదయంగమం.

మహాభారతం ..
కురుపాండవుల యుధ్ధగాధ మాత్రమే గాదు..
అది ఆర్యుల ..
తత్వజ్ఞాన ..
ధర్మశాస్త్ర ..
నీతిశాస్త్ర ..
రాజ్జ్యశాస్త్రముల పేటిక ..
వ్యవహార శాస్త్ర ..
కామశాస్త్రముల సమావేశము..!!

మన సంస్కృతి యొక్క సర్వస్వము..!!
మన జ్ఞానకోశము ..!!
అంటారు ఆచార్యులవారు..
ప్రపంచ సాహిత్యంలో ..
ఇటువంటి గ్రంధం ఇంకొకటి లేదు..!!
అంటారు వారు. 


భారతదేశలో ..
మధ్యయుగాలలో ..
విలసిల్లిన భక్తిపంధాకు ..
మహాభారత విజ్ఞానమే జన్మభూమి..
అని సిధ్ధాంతీకరించారు ఆచార్యులవారు ..

మహా యోగీశ్వరు లైన ..
జ్ఞానదేవుడు ..
భగవద్గీతకు తాను రచించిన ..
భార్వార్థ దీపిక వ్యాఖ్యానంలో ..
మహాభారతాన్ని 
తనివితీర ప్రశంసించిన వైనం ..
పరమ రమణీయంగా 
ఉధ్ధరించారు పుట్టపర్తివారు. 

జ్ఞానదేవుల భారత స్తుతి 
భారతీయులను పులకింపచెస్తుంది. 
"అది సకల కౌతుకములకు జన్మస్థానము ..
వివేక తరువులు పెరిగిన ఉద్యానవనము..
సర్వ సుఖములకును మూలము..
జ్ఞానమునకు సముద్రము ..
పరిపూర్ణమైన నవరస సుధాబ్ధి..
అది భూలోకమునకు దిగిన వైకుంఠము ..
సర్వ విద్యలకును మూలపీఠము..
సమస్తములైన శాస్త్రముల కును ఒరిపిడిరాయి.. ధర్మములకు పుట్టినిల్లు..
 సజ్జనుల జిహ్వకలంకారము..
శారదాదేవి యొక్క లావణ్యరత్నభాండారము .... 

వ్యాసుని మేధాశక్తి వికసించినంతనే ..
దాని కాంతితో లోకమే ప్రకాశింప నారంభించెను..
ఈ గ్రంధమద్వితీయమైనది..
సర్వ పవిత్రమైనది.. 
మాంగల్యధామను దీనినవధరింతురుగాక..!!"
అని జ్ఞానేశ్వరి ..
ప్రధమాధ్యాయంలో..
జ్ఞానదేవుడు మహాభారత ఉత్కృష్టతను..
 ప్రశంసించిన వైనం ఉదహరించారు..
ఆచార్యులవారు..
భారతం ..
భారతదేశంపై క్రీ.పూ.అయిదవ శతాబ్దం నుంచీ..
తన అమేయ ప్రభావాన్ని..
ప్రసరింపజేస్తున విషయాన్ని ..
తమ వ్యాఖ్యానంద్వారా 
నిరూపించారు ఆచార్యులవారు.

అప్పటినుంచీ..
భారతదేశాంలో ఉద్భవిల్లిన..
కావ్య నాటకాలకు ...
లలిత కళలకు ..
మహా భారతమే ఆకరమైనది..!!

విఖ్యాత మీమాంసకుడు..
కుమారిల భట్టు ..
పూజ్య పాదుడైన శంకరుడు ..
వేదంతో తుల్యమైన ప్రతిపత్తిని ..
మహా భారతానికిచ్చారు..!!


వారుధ్ధరించిన భారత శ్లోకాలకు లెక్కలేదు..
అని చెప్పారు ఆచార్యులవారు. 
ప్రపంచ సాహిత్యంలోనే ..
ఇంత పెద్ద గ్రంధం లేదని ..
పాశ్చాత్య వాఙ్మయంలో..
ప్రమాణంలో ..
చాలా గొప్ప గ్రంధాలుగా పరిగణించే ..
"ఇలియడ్,ఒడిస్సీ "లను రెంటినీ కలిపినా..
దాని కంటే ఎనిమిదిరెట్లు పెద్ద గ్రంధం ..
మహా భారతమనీ ..
ఆచార్యులవారు పేర్కొన్నారు. 

రామాయణం కన్నా నాలుగింతలు పెద్దది..
మహాభారతం అని చెప్పారు. 
డా.వింటర్ నిడ్జ్ అనే గొప్ప సాహిత్యవేత్త..
మహాభారతం ఒక గొప్ప సాహిత్య రాశి..
అని చెప్పారని ..
ఆచార్యుల వారా అభిప్రాయాన్ని ఉటంకించారు.

మహా భారతం నవరస సుధాబ్ధి ..
అన్న జ్ఞానదేవుడి వ్యాఖ్య ను ..
పరమ సుందరంగా వివరించి చూపారు..
తమ విమర్శనంలో ఆచార్యులవారు..

భారతమునకున్న..
స్వభావ వర్ణనలకు లెక్కలేదు..
ఆ పాత్రల స్వభావములు..
భారతీయుల కాదర్శములు ..
మహాభారతమునందలి యుపాఖ్యానములలో..
జనులకు గావలసిన ..
యెన్ని విషయములనో వ్యాస భగవానుడు.. సూచించెను..

ఉపాసనా సంప్రదాయములను గూడ ..
నాతడు నిర్వచించినాడు ..
సావిత్రీ సత్యవంతుల కథలో..
 వ్రత విధానమునెంతయో ముచ్చటగ ..
మహర్షి నిరూపించెను.. !!


విష్ణు సహస్రనామమును 
శివ సహస్రనామము 
వంటి స్తోత్రములు 
భారత కథలలో కుప్పలు తెప్పలు 
వానినన్నిటినీ 
భారతీయు
లాయా సంప్రదాయములననుసరించి 
దినమును బారాయణమొనర్చికొందురు. 
అన్నారు ఆచార్యులవారు.
 
 శ్రీకృష్ణ తత్వాన్ని 
పరమ మనోజ్ఞంగా ఆవిష్కరించారు. 
మహారాష్ట్ర భాషలో ఉన్న గీతా వ్యాఖ్యానాలనన్నిటినీ పరిచయం చేసారు. 
రామాయణ మహాభారత 
పుస్తకానుప్రసక్తంగా ప్రస్తావించారు. 

"వాస భగవానుడు 
మానవుని అసంపూర్ణతను 
అశక్తతను చక్కగ గమనించెను. 
జీవితమున మనుష్యునకు సంభవించు 
విషమ పరిస్తితులను 
లోతుగ నర్థము చేసుకొని 
యట్టి క్లిష్ట పరిస్తితులలో 
మానవుడు జంకక 
ధర్మ నిర్వహణ మొనర్చుకొని 
ముందునకు బోవు మార్గములను సూచించినాడు. "
అని చెపుతూ ..

రామాయణ మహాభారతాల ఔన్నత్యం 
ఈ విధంగా తెలియజేసారు. 
ఈ రెండు గ్రంధములును భారతీయులకు బ్రాణములవంటివి. 
ఈ రెంటినీ ..
భద్రముగ రక్షించుకొనుచున్నంతవరకూ భారతీయుడాధ్యాత్మిక విషయములకై 
ఇతరులను యాచించనవసరములేదు. 

సమస్త ప్రపంచమునకును
శాంతిభద్రతలను బోధించు శక్తి 
ఈ మహాగ్రంధములకున్నది.
 
వీని సాయమున 
భారత జాతి 
ధర్మ నిష్టమై 
శాక్తివంతమై 
యేకాలమునందైనను 
ముందున కేగవచ్చును. 

కాని 
మన దురదృష్టము కొలదియు 
నీ రెండు గ్రంధములకును 
మనః ఫలకములపై చిత్రించుకొనగల శక్తి 
భారతీయులలో నానాటికీ 
సన్నగిల్లిపోవుచున్నది. 
అని పరితపించారు ఆచార్యులవారు.
 
స్వామి వివేకానందుడు కూడ 
అమెరికాలో భారతాన్ని గూర్చి 
రామాయణాన్ని గూర్చి 
మహోజ్జ్వలంగా ప్రబోధం చేసాడు. 
ఆధ్యాత్మిక జ్ఞాన పిపాసార్తులై 
తన దరిజేరిన ఆదేశీయులకు 

సీత 
సావిత్రి 
దమయంతి 
కథల నాయన ప్రబోధించాడు.
 
మహాభారతానికి సంబంధించిన 
వివిధ విషయాల పరిశీలన 
ఆచార్యులవారి 
ఈ గ్రంధంలో నిస్తులంగా 
అమితాశ్చర్యజనకంగా కనిపిస్తుంది. 

పాశ్చాత్య సాహిత్యకులు 
విమర్శకులు 
తత్వవేత్తలు 
మహాభారతాన్ని గురించి చేసిన అపవ్యాఖ్యానాలు 
పడిన పొరబాట్లు 
వ్లిబుచ్చిన అసంగతాభిప్రాయాలు ప్రస్తావించి 
వాటికి మరి ప్రత్యాఖ్యానం చేయలేని 
సమాధానం చెప్పారు ఆచార్యులవారు. 

భారతంలో పొందిపొసగనట్లు కనిపించే అంశాలను 
శ్రీ ఆచార్యుల వారు 
ఎంతో సమర్థంగా సమన్వయించారు. 

ఇక విదేశీయులు లెదా స్వదేశీయుల 
దురర్థకమైన వ్రాతలను వారిట్లా ఖండించారు.
 
"మహాభారతమునందలి 
సులభములైన ధర్మ సూక్ష్మములకు గూడ 
పాశ్చాత్య్లు విపరీతములైన 
వ్యాఖ్యానము లొనర్తురు. 
మూలకారుని భావములనే 
చిందర వందర సేయుదురు. 
ఇది యేమన్నచో మాకిట్లు దోచినదందురు. 

ఇట్లు సేయుటలో వారి తలపేమి. 
వారి యభిప్రాయమొక్కటే 
దుష్టమైన యూహ. 
భారతదేశము యొక్క 
రాష్ట్రీయాభిమానము 
నాశనమొనర్చుటకై వారు యత్నించిరి.

మన ధర్మము సంస్కృతి అభిమానము 
వీనిని నిందించుటయే వారి పని. 
ఈ కార్యమునకై వారేవేవో 
నిరాధారములైన యూహలల్లుదురు."

ఇవ్వల్టికి కూడా 
భారత దేశంలో కూడా 
ఇటువంటి కుత్సిత ప్రయత్నాలు 
జరుగుతూనే ఉన్నాయి. 
ఆర్య ద్రావిడ భేద భావాలు కల్పించడం 
ఆర్యుల వలసవాద సిధ్ధాంతం 
అందులో చేరిన కుతంత్రమే. 

మహాభారతాన్ని ఆధారం చేసికొని 
మార్క్స్ సిధ్ధాంతంలోని లోపాలను 
ముఫ్ఫై ఏళ్ళ కిందటనే 
శ్రీ నారాయణాచార్యులవారు బట్టబయలు చేసారు. 

ఈ ముఫ్ఫైనలభై ఏళ్ళలో 
ప్రపంచ చరిత్రలో 
ఆచార్యులవారు 
భవిష్యద్దర్శనం చెసిన విషయాలు ఋజువైనాయి. 

అసంపూర్ణుడైన మానవుని 
పరిపూర్ణునొనర్చుటకే 
యార్య సంస్కృతి ఏర్పడినది. 
ఈ సంస్కృతికి సంకేతమిదియే 

మానవుడా స్థాయినందు కొననిది 
ఈ ప్రజాసత్తాక రాజ్జములు 
మీసాలపై తేనెలు 
ఉత్పత్తి విధానమెంత బెరిగినను 
లాభములేదు. 
కాక సామ్య వాదుల పధ్ధతి ననుసరించి 
యారిథికముగ నందరు బాగుపడినను 
లాభము సున్న. 

సంకుచితత్వము 
మాత్సర్యము 
క్రోధము 
లోభము 
మొదలగు వానిపై 
విజయము సంపాదించుకొననిది 
కర్తవ్యనిష్టత నలవరచుకొననిది 
మానవుని బ్రతుకు అర్థవంతము గానేరదు. 
అంతవరకును 
మన మొనర్చుయే యేర్పాటైనను 
విడంబన మాత్రమే."
 
భారత దేశంలో చిరకాల వ్యవస్తితమైనది 
ప్రజా సత్తాకమేనని 
అత్యంతాహ్లాదకరమైన ఆధారాలతో 
మహా భారతంలోని 
అనేక సన్నివేశాలను చూపుతూ 
నిరూపించారు ఆచార్యులవారు. 

అంతేకాదు. 
భారతీయ రజ్జవ్యవస్తపై 
పౌర జానపదులకున్న 
నియంత్రణను అధ్భుతంగా ఆవిష్కరించారు. 

ఇటువంటి వ్యవస్థ 
అశోకుడి కాలం వరకు అమలులో ఉన్నట్లు 
చారిత్రక ప్రమాణాలు చూపారు. 
ప్రజల సమ్మతితోనే పన్నులు పెంచవలసిందే 
కాని రాజు తనంతట తానుగా 
అధికంగా పన్నులు వసూలు 
చేయకూడదనటానికి నిదర్శనాలు
 భారతం శాంతి పర్వం ద్వారా వివరించారు.
 
మహా భారేతివృత్తం 
కల్పితమనీ 
చారిత్రం కాదనే 
వాదనలు 
ఆచార్యులవారు 
విశ్వసనీయమైన ఉప పత్తులతో ఖండించారు. 

మహాభారత యుధ్ధం జరగటానికి 
ఆనాటి సామాజిక రాజకీయ జీవనంలో 
పతనావస్థ కలగటానికీ 
అణ రాజ్జ్య వ్యవస్థ దెబ్బతినడమేనని 
సోపపత్తికంగా వ్యాఖ్యానించారు. 

పురాణ చరిత్ర కాలం నుంచీ 
భారత దేశాంలో 
గణ రాజ్జాలు 
అంటే రిపబ్లిక్ లు మాత్రమే ఉండేవనీ 
వీరంతా కలిసి 
ఒక సమ్రాట్టును ఎన్నుకొనే వారనీ 
సమాఖ్య వ్యవస్తగా 
దేశమంతా శాంతి భద్రతలతో 
ప్రజా సౌకర్యానికి ప్రముఖ స్థానం ఇచ్చి 
అలరారుతూ ఉండేదనీ 
నిదర్శనాలతో విశ్లేషించి చూపారు
 శ్రీ ఆచార్యులవారు.
 
ఈ ప్రజా సత్తాక గణ రాజ్జ్య వ్యవస్తకు 
జరాసంధుడు 
శిశుపాలుడు 
కంసుడు 
దుర్యోధనుడు 
విఘాతం కలిగించడం వల్లనే 
భారత్ యుధ్ధం అనివార్యమైందని 
ఆయా సంఘతనల ద్వారా నిరూపించి చూపారు. 
శ్రీ ఆచార్యులవారు. 

శాంతి పర్వంలో 
భీష్ముడు ధర్మరాజుకు 
రాజనీతిని బోధించే సందర్భంగా 
గణరాజ్జ్య విచ్చిత్తి 
దేశ విపద్దశకు కారణమవుతుందన్న సత్యాన్ని 
విపులంగా వ్యాఖ్యానించారు పుట్టపర్తివారు.
 
"సంఘ రాజ్జ్యములు 
కుల రాజ్జ్యములు 
వీనియందు ముఖ్యములైన దుర్గుణములు లోభామర్షములు . 
ఈ రెండే వైర సందీపనమునకు 
కారణములు. 
తొట్ట తొలుత 
లోభము జనించుచున్నది. 
దాని నాశ్రయించుకొని కోపము కల్గును. 
ఈ రెంటి చేత ప్రేరేపితులై 
గణ రాజ్జ్య నాయకులు 
తమలో తాము కలహమునకు జొత్తురు.
పరస్పరము వివాద మొనరించుకొనదలచి 
కడకిర్వురును నాశమగుదురు. 
ఒకానొకని మనస్సున లోభముత్పన్నమయ్యెననుకొందము. 
దాని నాశ్రయించియ మాత్సర్యము గూడ గలుగును 
వాడు రహస్య వృత్తి నవలంబించును 
తన సైనిక సంపదను రహస్యముగ 
నభివృధ్ధి పరచుకొనును 
సామదాన భేదములు ప్రదర్శించి 
ఇతరులను లొంగదీనిసికొన ప్రయత్నించును. 
వారిని భయ పెట్టి 
తన యధికారమునకు సమ్మతింపజేయును. 

గణ రాజ్జములలో నొక్కడైనను 
నీరీతి వర్తించుట కారంభించినచో
నిక నారాజ్జ్యము లన్నియుజెడినట్లే"
 
ఇదీ భీష్మాచార్యుల వారి బోధ. 
మహా భార్త యుధ్ధ కాలం నాటికి 
భారతదేశంలో స్రిగా 
ఇటువంటి దురవస్థసంప్రాప్తించింది.
పుట్టపర్తి వారి మహాభారత విమర్శనంలో 
మెచ్చుకోదగిన విషయం ఏమంటే 
ఆయా పాత్రల ఆంతరిక చిత్తవృత్తులను 
ఆయా సన్నివేశాల ఆధారంగా 
పారదర్శకంగా నిరూపించి 
ధర్మాధర్మాల పర్యవసానాన్ని 
కళ్ళకు కట్టినట్లు చూపించటం..

ఆధునికులలో కొందరు విమర్శకులు.. 
కౌరవుల పట్ల అమిత ఔదార్యాన్ని ప్రదర్శించటం 
ఆపధ్ధర్మ సన్నివేశాలను 
దుర్మేధావిలసనంతో వ్యాఖ్యానించడం 
పాండవులను దోషులుగా నిరూపించడానికి
 ద్రావిడ ప్రాణాయామానికి పూనుకోవటం 
పుట్టపర్తి వారు 
నిర్ద్వంద్వంగా 
వ్స్పష్టంగా 
ఘాటుగా 
సరళంగా 
పరాస్తం చేశారు.
 
 కర్ణుడి పాత్రోన్మీలనాన్ని 
అమిత సానుభూతితో రూపు కట్టించారు. 
ధృతరాష్ట్రుడి దుర్మార్గాన్ని 
కాదనడానికి వీలులేని ప్రమాణాలతో 
నిరూపించారు. 

ధృతరాష్ట్రుని వల్లనే 
భారత యుధ్ధమనే మహా సంక్షోభం 
అనివార్యం కాలేక పోవడాన్ని
 గొప్ప న్యాయాధిపతి తిరుగులేని తీర్పులాగా 
ప్రకటించారు.
 
"భారతీయ ఇతిహాసము నందు 
ధృతరాష్ట్రుని వంటి విచిత్ర వ్యక్తి 
మరి యొక్కడు లేడు. 
ఈతని హృదయ తత్వము అత్యంత నిగూఢమైనది. 
సంస్కృత కావ్యములలో 
యనేకులు బ్రతి నాయకులు వర్ణింపబడినారు. 
కాని ధృతరాష్ట్రుని వంతి ప్రతినాయకుడు 
వేరొక్కడు కన్ పింపడు. "
అంటారు ఆచార్యులవారు.
 
కణికుడి రాజనీతిని 
ధృతరాష్ట్రుడు ఏ విధంగా అమలు పరచాడో 
ఆయా ఘట్టాలద్వారా విశ్లేషించి చూపుతుంటే 
ధృతరాష్ట్రుది వంటి కపటికి 
విషాద పర్యవసానం అత్యంత సహజమని నిరూపితమవుతుంది. 
దుర్యోధనుడి కంటే కూడా 
పరమ దుర్మార్గుడు ధృతరాష్ట్రుడు.

అచార్యులవారీ 
మహాభారత విమర్శనంలో 
కర్ణుది దైవదుర్విపాకాన్ని 
విపులంగా పరమకారుణికంగా వర్ణించారు. 

ప్రధాన పాత్రలన్నిటిలో కర్ణుణ్ణి 
అత్యంత ప్రధాన పాత్రగా 
అతడి ఔదార్యాన్ని 
సత్య సంధతను 
దాన గుణాన్ని విశ్లేషించి చూపారు. 
 


భీష్మ ద్రోణుల పాత్రల విశ్లేషణ 
అద్భుతమనిపిస్తుంది.

సంస్కృత భారతం 
చదవడానికి సామర్థ్యం లేని వారికి 
మహోపకారం చేసారు ఆచార్యులవారు. 
అప్రధాన పాత్రల స్థానాన్ని కూడా 
ఎంతో ప్రతిభావంతంగా విశ్లేషించారు.

"రామచంద్రుని కాలమున గూడ 
గణ రాజ్జ్యము లుండినవి. 
కులస్త్రీ నవమానించిన వానికి 
మరణ దండనము విధించుట యానాటి నీతి. 
అట్టి గణ రాజ్జ్యములు 
ధర్మ నిష్ట భారత కాలము నాటి కెంత గా
నధః పతనమైపోయెనో 
శిశుపాలుని వృత్తాంతము తెలుపును. శిశుపాలుడిట్లయినాడనగా 
యానాటి గణ రాజ్జ్యముల స్థితి యట్లుండెనని యర్థము. 

పతితమైపోయిన రాజ్జ్య సత్త 
యొక్క స్థితికి బ్రతీకముగ 
వేదవ్యాసుడు దన ప్రతిభా దృష్టితో 
నొక వ్యక్తిని నిర్మించెను. 
వాని పేరు మీకు దెలిపినచో 
మీరెంతయో యాశ్చర్యపడుదురని దలతును. 
ఆ వ్యక్తియే రాజైన ధృతరాష్ట్రుడు" 
అంటారు ఆచార్యులవారు.
 
ప్రసక్తాను ప్రసక్తంగా 

ఆధునిక ప్రపంచంలోని 
అనేక  విప్లవ సిధ్ధాంతాలతో 
మహాభారత తాత్విక దర్శనాన్ని పోల్చి 
నిగ్గు తేల్చడం 
శ్రీ ఆచార్యులవారి మహా ప్రతిభకు 
గీటురాయిలా ఈ విమర్శ గ్రంధం కనపడుతుంది.
 
"మార్క్స్ లెనిన్ మహాశయులన్న 
రాష్ట్ర తంత్రము లేని స్థితి 
కృత యుగమునందే సిధ్ధించును. 

కాని 
ఇట్టి సమాజమును స్థాపించుటెట్లు? 
అను విషయమున మాత్రము 
సామ్యవాదులతో మనకు బొత్తు లేదు. 
ఆర్థికముగ మానవుడు బాగుపడినంతనే 
ప్రపంచమున సర్వ క్షేమములును 
సమకూరుననుట పాక్షిక మైన దృష్టి. 
దానిని సాధించుటకు
 విప్లవములు గావలెననుటయు 
సమంజసము గాదు. 
ఉఛ్చకోటికి చెందిన సమాజము లోకమునందు 
మాటి మాటికి నుత్పన్నము గావలెనన..
సువర్ణయుగము ప్రతిష్టింపబడవలెననియే .
రాజ్జ్య తంత్రము సృష్టింపబడెను. 
కృత యుగము నందరాజకత లేదు..
రాజ్జ్య తంత్ర విహీనమైన సమాజమున్నది..
అరాజకత వేరు ..
రాజతంత్రముతో బనిలేకపోవుటవేరు. 
రాజ్జ్యతంత్రము చేత ..
సాధింప దగిన ఫలములన్నియు..
సాధింపబడుటచే ..
కృత యుగమున దాని యావశ్యకత లేదు. 
అది సమాజమున విలీనమైపోవును "

అని 
కమ్యూనిజం ద్వారా ఆశించే 
సామ్యవాదానికి 
భారతీయేతిహాస దృష్టికీ గల 
తారతమ్యాన్ని వివరించారు.. 
ఆచార్యులవారు.
 
ఇక భీష్ముణ్ణి గూర్చి..
ఆచార్యులవారు చేసిన వ్యాఖ్యానం 
పరమ రమణీయం 

"భీష్ముడు జన్మించిన సమాజము 
పతనోన్ముఖమై యుండెను. 
అతడు తన యాదర్శముతో 
దానికి వెలుగుబాటలు జూపించినాడు. 
భారతములోని పదునెన్మిదిపర్వములును సూర్యప్రకాశము చేత జగత్తువలె 
భీష్ముని ప్రకాశముచే నావృతములైనవి" 
అని ఈ విమర్శన గ్రంధాన్ని ముగించారు. 
శ్రీ ఆచార్యులవారు.
 
శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యుల వారి 
మహాభారత విమర్శనం 
యుగయుగాల భారతీయ సంస్కృతిని 
వివరించే విశిష్ట గ్రంధం.

కామెంట్‌లు లేవు :

కామెంట్‌ను పోస్ట్ చేయండి